Thursday, February 20, 2025

 కవి పలుకు 
**********
ఇవి 'రాజకీయ కవితలు'
గతంలో 'భావ కవిత్వం' చది 
వారు. 'అభ్యుదయ' కవిత్వం 
చదివారు.'విప్లవ కవిత్వం'
చదివారు. ఇంకా 'దిగంబర 
కవిత్వం' చదివారు.ఆ క్రమం 
లో వచ్చిందే 'రాజకీయ కవిత్వం '!

      ప్రకృతిసౌందర్యం అందు
లోని అనుభూతి,సామాజిక 
సమస్యలు వాటి పరిష్కారా 
లు, వినకపోతే నాలుగు తిట్లు తిట్టి ఐనా చెప్పాలని రాసిన కవులు, కవిత్వాలు 
.. సమాజాన్ని ఎంత కళ్ళు 
తెరిపించాయో ఆ నేపథ్యం లో చేసిన ప్రయత్నమే ఈ 
రాజకీయ కవిత్వం.

      కవిత్వం ద్వారా భక్తిని 
స్వర్గ నరకాలను, అధ్యా త్మిక భావాలను, దేవుణ్ణి...
సాధారణ ప్రజల అంత రాంతరాలలోకి ఎక్కించిన 
భక్తిసాహిత్యం తన లక్ష్యాన్ని సాధించింది.

దైవభక్తి సరే!దేశభక్తి సంగతి?
ఆనాటి చక్రవర్తులకు కాని,
నేటి నాయకులకుకాని ఇక్కడ చాలా సామ్యం ఉంది
దైవం ప్రజలకి, దేశం వాళ్లకి!

ఆప్రకారంగానేప్రజలుదైవాన్ని వాళ్ళ చిత్తంలో నిలుపు కొని దేశాన్ని నాయ కుల చిత్తానికి వదిలేసారు.

ఈ లోపాన్ని పూరించటానికే 
ఈ రాజకీయకవితలు.లేకపో
తే జనం నష్టపోతారుకదా!
ఇప్పటికేచాలానష్టపోయారు.

    నా విద్యార్థిదశలోస్కూల్లో 
"విద్యార్థులకు రాజకీయాలు 
అవసరమా?"అనే అంశం 
మీద డిబేట్ నడిచేది. ఉపా ధ్యాయులు అవసరంలేదనే 
చెప్పేవారు. ఇంట్లో అమ్మ,
నాన్న కూడా "బడికి వెళ్ళింది 
చదువుకోవటానికి మీకు 
రాజకీయాలెందుకు?"అని 
గదమాయించి మమ్మల్ని 
ఉద్యమాలవైపు, నినాదాల 
వైపు, గోడలమీద రాతల
జోలికి పోనిచ్చేవారుకాదు.

    రానురాను వయసు పెరిగే 
కొద్దీ దేశమంటే మనుషులే కాని వీళ్లంతా ఒక రాజకీయ బంధంతో ముడి వేయ బడ్డారని తెలుస్తూ వచ్చింది. ఆర్థిక, సామా జిక, సాంస్కృ తిక బంధా లన్నీ రాజకీయ అనుబంధాలే!

    విద్యార్థులకు రాజకీయా 
లొద్దు, ఉద్యోగులకు కూడా 
రాజకీయపార్టీలతో బంధం 
ఉండకూడదు... ఈ భావజా 
లం వెనకాల ఏదోరాజకీయం 
ఉందని చాలా కాలానికి కాని 
తెలియలేదు.

      77సం. రాల స్వతంత్రం 
తర్వాత మన రాజకీయాలు 
ముదిరిపోయాయి. వెనక 
బడుతున్న కులమతాలను 
ఇప్పటినాయకులు సింహా సనం ఎక్కిస్తున్నారు. మతం స్థానం లో సైన్స్ వచ్చి చాలా కాలమైంది. సైన్స్ ను పక్కన పెట్టి మత రాజకీయాలు చేసే మనువాద ఫాసిస్టు నాయకులు సమాజాన్ని చాతుర్వర్ణ దశకు తీసుకు పోవాలన్న ప్రయత్నం జోరుగా చేస్తున్నా రు.

     ఇంతకంటే తిరోగమనం 
ఇంకేం ఉంటుంది!మనుస్మృతిని రాజ్యాంగం గా తెచ్చి బి సి కాలం లోకి ప్రజల్ని తీసుకుపోయి 
సూద్రులతో 'పాదసేవలు' 
చేయించుకోవాలన్న కుతూ హలం పెరిగిపోయింది.

  ప్రజల్లో భక్తిపిచ్చిని, మూఢ 
నమ్మకాలను, కులభేదాలను అశాస్త్రీయతను పెంచితాను పట్టాభిషిక్తుడై అఖండభార త్ ను ఏలాలని చూస్తుంటే 
రాజకీయంతెలిసిన,నిజాయితీ పరుల,దేశభక్తుల కర్తవ్యం 
ఏంటి?

     గర్భగుడిలోనే తన కళ్ళముందే అత్యాచారాలు 
హత్యలు జరుగుతున్నా ఆపలేని దేవుడు, తన 'ధర్మ 
డిబ్బీ'ని దొంగిలించుకు పోతున్న దొంగల నుండి రక్షించుకోలేని దేవుడు....

   దేవుడిపేరుతో అజ్ఞానాన్ని 
మూఢత్వాన్ని పెంచుతూ, 
మఠాలు పీఠాలు ప్రజలకు 
అర్ధంకాని నాలుగు సంస్కృతం ముక్కలు 
వల్లిస్తూ తామేదో ఆకాశం 
నుంచి వచ్చామన్నట్టు 
భ్రమింపజేసే బాబాలు,
స్వాములు...

     కులాలపేరుతో ప్రజల్లో 
ఎక్కువతక్కువలను       కొనసాగిస్తూ సమర్థులకు 
సమానావకాసాలు ఇవ్వని 
రాజకీయం....

      కాళ్ళు చేతులు తప్ప 
ఏ ఆస్తిలేని శ్రమజీవులంతా 
కులాలతో పనిలేదని అందరం శ్రామిక'వర్గ'మని 
భావించి కలిసి జీవన సమస్యలపై ఉద్యమించ 
నంతకాలం...
   ఈ దేశం ఇలాగే ఉంటుంది
   ఈ నాయకులు ఇలాగే 
దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేసి తమ సింహాసనాన్ని 
కాపాడుకుంటూ ఉంటారు.

     బుద్ధుడు (సంస్కృతి) అంబేద్కర్ (కులం )... వీళ్ళ 
తర్వాతే మార్క్స్ (వర్గం )...
వీళ్ళను ఆదర్శంగా తీసు 
కొని దేశంలోని ప్రగతిశీల 
సంఘాలు, కమ్యూనిస్టులు 
అందరు కలిసినిచేస్తేనే మన 
ప్రజలకు నిజమైన విముక్తి.

   ఈ నేపథ్యంతో వచ్చినవే 
ఈ 'రాజకీయకవితలు'
   ఆదరిస్తారని అర్ధం చేసు కుంటారని సామాన్యుల్లో 
రాజకీయ చైతన్యం తెచ్చే 
ఉద్యమకారులు వస్తారని 
భావిస్తూ...!      మీ 

             తమ్మినేనిఅక్కిరాజు
                    19-2-2025

(మే నెల మొదటివారంలో మీరు అందుకోబోయే నా 
"రాజకీయకవితలు"వచన 
కవితా గ్రంధానికి ఇదినేను 
వ్రాసిన ముందుమాట (కవి 
పలుకు)
       చదవండి.. మీ అభిప్రాయం చెప్పండి )

No comments:

Post a Comment