🙏🏻 *రమణోదయం* 🙏🏻
*ఆత్మ అద్వితీయం కాబట్టి అన్యమును చూడటమనే భేదదృష్టి దానికి పొసగదు. కనుక అన్యవస్తువుని చూసే జీవుడు "తానెవరు?" అని దృష్టిని తనలోకి సారిస్తే హృదయ గ్రంథి ఛేదించబడి, చూడబడే త్రిపుటి దృశ్యాలన్నీ అదృశ్యమై నాశమైపోతాయి.*
నా గురువు' అని నేను అన్నప్పుడు
'గురువు' అనే అద్దంలో
నేను దర్శించిన నా స్వరూపమే!
నేలమీద కనిపించే మన నీడవంటిది అహంకారం.
ఎవరైనా ఆ నీడను ఊడ్చడానికి ప్రయత్నించడం
అవివేకం కాదా?? ఆత్మ ఒక్కటే సత్యమైనది.
పరిమితి కలదైతే అది అహంకారం.
పరిమితి లేనిదైతే అనంతం, నిత్యసత్యం!
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.577)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment