Tuesday, February 4, 2025

 *_కృతజ్ఞత మనిషికి గొప్ప ఆభరణం. పొందిన సహాయం, అస్మిత లేని వ్యక్తి జీవితంలో రాణించలేడు._*

*_అవసరం, అవకాశం లేనప్పుడు నీవు ఎలా ఉన్నవో... అవసరం, అవకాశం వచ్చినప్పుడు కూడా ఆలా మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం.!!_*

*_మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరు చేతులు కలుపుతారు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో చేయూత నిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో..._*

*_అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు "పొగడ్తల"తో ఉంటాయి, అవసరం లేనప్పుడు వచ్చే మాటలు "పొగరు"తో ఉంటాయి.!_*

*_ప్రేమ, మంచితనం, మనలో ఎంత అభివృద్ధి చెందితే... బయట ప్రపంచంలో అంతకు రెట్టింపుగా ప్రేమ, మంచితనం మనకు లభిస్తాయి ._*

*_ప్రతీ సమస్యలో పరిస్కారాన్ని ఓపికతో  సమాధానాన్ని వెతుక్కోవాలి. ప్రశ్నకు, ప్రశ్న సమాధానం కారాదు._*

*_సమస్యలు రాని, సమస్యలు లేని, జీవితమంటూ ఉంటుందా.?_*

*_కష్టాలు, బాధలు, విఘ్నాలు మనుసును బలహీనపరుస్తాయి. శాశ్వతంగా ఉండవు అవి ఆకాశంలో మేఘాలు లాంటివి. కొంతసేపు సూర్యుణ్ణి అడ్డుకొని కారుచీకటిని ఇవ్వొచ్చు మబ్బులు కదిలి తొలగి పోగానే యధావిధంగా వెలుగు ప్రసరిస్తుంది._*

*_అదేవిధంగా జీవితంలో కష్టాలు, బాధలు శాశ్వతంగా ఉండవు. నీవు చేయాల్సింది... కాస్త ఓపికతో  ప్రయత్నం చేస్తూ పోవడమే...☝_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷 🌷🙇🌷 🪷🪷🪷

No comments:

Post a Comment