పెట్టని అమ్మ ఎలాగూ లేదు, రోజూ పెట్టే…..కూడా !
ఒక వ్యక్తి ప్రతినెలా ఒక భిక్షగాడికి రూ . 100 ఇస్తుండేవాడు.
ఇలా కొంత కాలం కొనసాగిన తర్వాత, ఒకరోజు అతను కేవలం 50 మాత్రమే ఇచ్చాడు. భిక్షగాడు ఆశ్చర్యపోయినా, “సరే, 50 అయినా మంచిదే” అని అనుకుని వెళ్లిపోయాడు.
కొన్ని నెలల తరువాత, ఆయన కేవలం 20
రూపాయలు మాత్రమే ఇచ్చాడు.
భిక్షగాడు విస్మయంతో “మీరు మొదట 100 , ఆ తరువాత 50. ఇప్పుడు 20 మాత్రమే… ఎందుకు?” అని అడిగాడు.
అతను నవ్వుతూ “అంతకు ముందు నా పిల్లలు చిన్నవాళ్లు. నేను ఆర్థికంగా బాగుండేవాడిని, అందుకే నీకు 100 ఇచ్చే వాడిని. కానీ ఇప్పుడు నా కూతురు యూనివర్సిటీలో చేరింది. ఖర్చులు పెరిగాయి, అందుకే 50 మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు నా రెండో కొడుకు కూడా యూనివర్సిటీలో చేరాడు, ఖర్చులు మరింత పెరిగాయి, అందుకే ఇప్పుడు 20 ఇచ్చాను” అని చెప్పాడు.
దానికోసం భిక్షగాడు ఆశ్చర్యంగా “మీకు మొత్తం ఎంత మంది పిల్లలున్నారు?” అని అడిగాడు.
ఆయన “నాలుగు” అని చెప్పాడు.
భిక్షగాడు పట్టరాని కోపంతో “మీరు వాళ్లందరినీ నా ఖర్చుపై చదివిస్తారా?” అని నానా బూతులు తిట్టాడు
నీతి:
కొందరు మన ఉపకారాన్ని వారి హక్కుగా భావిస్తారు. అది మన పెద్ద మనసుకి నిదర్శనం అంతేకానీ, వారి హక్కు కాదు. మన సహాయాన్ని ఎప్పుడూ అవతలి వాడి అభివృద్ధికి ఉపయోగించాలి, మనపై ఆధారపడే అలవాటు పెంచకూడదు!
#ఉపకారంహక్కుకాదు
No comments:
Post a Comment