Saturday, February 8, 2025

 Rama Devi

చిన్నప్పుడు వూర్లో పెళ్ళిళ్ళకు, ఫంక్షనులకు చాలా అంటే చాలా రేర్ గా వెళ్ళేవాళ్ళం....వెళ్ళినా భోజనం మాత్రం చేయను‌. ఇంటికొచ్చాకే తినేదాన్ని...మా అమ్మమ్మ తిట్టేది...
కారణం ఏంటంటే....
అప్పట్లో...అంటే....లడ్డూ, బూందీ కారాలకంటే ముందు కాలం అన్నమాట....
బెల్లం పాయసం...అంటే శనగపప్పు, సగ్గుబియ్యం, సేమ్యా, బెల్లంతో చేసిన నేతి పోపుతో ఘుమాలిచ్చే పాయసం మాత్రమే స్వీట్ అంటే...యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం...
అప్పట్లో బంతి భోజనాలు...టేబుళ్లు వాడకం కూడా తక్కువే...నేలమీదే కూర్చునేవారు ఎక్కువగా....నేలేమో ఎగుడుదిగుడు...
అందరూ బంతిలో కూర్చున్నాక ఇలాంటి ఆకులు కుట్టిన విస్తర్లు పెడతారు మనముందు (వాటి ఆడాడ చిన్న బొక్కలు కూడా వుండేవి)...
వాటిని కొన్ని నీళ్ళు పోసి అట్టట్ట రుద్ది ఆ నీళ్ళు ఆన్నే పోస్తారు....
ఇంకా ఆకును రెడీ చేసుకుని ఆవురావురుమని ఎదురుచూస్తుంటారు జనాలు....
బక్కెట్ పట్టుకుని వస్తారింక....ఫస్ట్ బకేట్ పాయసం...
పెద్దగంటె అందులో....వేడి వేడి పాయసం పెద్ద గరిటె నిండా తీసి విస్తరాకులో పోస్తే సర్ర్ మని పారిపోతా వుంటది అది....వీళ్ళేమో ఆ వేడి వేడి పాయసాన్ని బయటికి పారిపోనీకుండా ఒడుపుగా చేతినిండా గుంజుకుని రెండు నాకుళ్ళల్లో అవగొట్టేసి వుట్టి ఆకును, చేతిని నాకుతూ కూర్చుంటారు (ఆ తీపిని ఆస్వాదిస్తూ).
సెకండ్ రౌండ్ కూడ పాయసమే....ఆరారగా, ఆనందంగా ఆరగిస్తారు...
ఇదంతా ఒక ఎత్తయితే ....next episode ఇంకో ఎత్తు...(అంటే నేను తినకపోవడానికి అదో కారణం, ఇదో కారణం అంటున్నా....తప్పుగా అనుకోవద్దు ఎవరూ)
మొత్తం ఆకంతా తీపి తీపిగా వుంటుంది....దాన్లోనే అన్నం, కూరలు, పప్పు, పచ్చడి, ఆలుగడ్డ ఫ్రై, అప్పడం, అన్నీ వడ్డిస్తారు.....ఆ పాయసం తీపి తగిలి ఈ కూరలు రుచి కూడా మారిపోతుందనుకుంటా.....
ఎగుడు దిగుడు నేలమీద పాయసాన్ని జాగ్రత్తగా తినడం ఒక ఎత్తైతే, ఆ తీపిమీద కారం తినడం ఇంకో ఎత్తు...
తర్వాతి కాలంలో టేబుల్ లు, ఛెయిర్లు వచ్చినా ఇదే ప్రాసెస్......
ఆ తర్వాత వాళ్ళకే విసుగొచ్చిందేమో పాయసం ఆపేసి లడ్డు, బూంది కారాలు పెట్టేవాళ్ళు.....పెళ్ళికొచ్చిన వాళ్ళు (చాలామంది) పెద్దపెద్ద కర్చీపులు తెచ్చుకునేవారు....వీళ్ళ కుటుంబం అంతా వరుసగా కూర్చుంటారు కదా....
అందరి లడ్లు, బూందీ ఆ కర్చీఫ్ లో మూటకట్టి చాటుగా దాచుకుని ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు....
అదేం పెద్ద విషయం కాదు...
కానీ....
బంతిలో ఛెయిర్లో కూర్చుంటారు కదా.... నెక్స్ట్ బంతిలో కూర్చోవడానికి రెడీగా ఛెయిర్ పట్టుకుని మరీ నిల్చునవాళ్ళు సీట్ కోసం ఎర్ర బస్సులో కర్చీఫ్ వేసినట్టు .....కూర్చున్న వాళ్ళకి కొందరికేమో మొహమాటం,  తొందరగా లేద్దాం తీ, వాళ్ళు అలా చూస్తుంటే ఎలా తింటాం అని సిగ్గు పడేవాళ్ళు కొందరు...మరి కొందరేమో ఎవడు చూస్తుంటే నాకేంటి, నేను ముందొచ్చినా, నాదయ్యేదాకా ఆగాల్సిందే అనుకుంటారేమో, ఇంకో నాలుగు సార్లు ఎక్కువ పెట్టించుకుని నిమ్మళంగా తింటారు....బంతి అంతా ఒకేసారి లేవాలి...అడ్డదిడ్డంగా లేవడానికి లేక మిగిలిన వాళ్ళు తిట్టుకుంటుంటారు వీళ్ళని.....

ఇప్పుడంటే  స్వీట్లు గానీ, పులిహోర, బిర్యానీ, మాంసం కూరలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి గానీ....
ఆ కాలంలో మాత్రం పండగో, పబ్బమో...లేక రాకరాక చుట్టాలు వస్తేనో వండుకునే వారు....
ఇంక పెళ్లి భోజనం అంటే చాలా ఆశపడేవారు.....

ఆ విస్తట్లో భోజనం ఫోటో చూసి నాకొచ్చిన జ్ఞాపకాలు ఇవి...

మీక్కూడా ఇలాంటి అనుభవాలుంటే చెప్పండి....

@highlight

No comments:

Post a Comment