Thursday, February 13, 2025

 Vedantha panchadasi:
ప్రశ్నోత్తరాభ్యామేవైతద్గమ్యతేఽ
ర్జున కృష్ణయోః ౹
అనిచ్ఛాపూర్వకం చాస్తి ప్రారబ్ధమితి తచ్ఛృణు 
౹౹158౹౹
అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః ౹
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః 
౹౹159౹౹
అనిచ్ఛా పూర్వకమైన ప్రారబ్ధం కూడా కలదని గీత ద్వారా తెలుస్తొంది.మరి ఇచ్ఛ లేక దేనితో ప్రేరితుడవును?

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః ౹
మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణమ్ 
౹౹160౹౹
స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా ౹
కర్తుం నేచ్ఛసి యన్మోహత్కరిష్యస్యవశోఽ పి తత్ 
౹౹161౹౹
స్వభావ జనితమైన ప్రారబ్ధముచే రజోగణము జనించి కామక్రోధ పాపకర్మకు కారణము.

వ్యాఖ్య :- ప్రారబ్ద విశేషముచే జీవన్ముక్తుల భోగము అనేక విధములై యున్నది.
అనిచ్ఛా పూర్వకమైన ప్రారబ్ధం ఉంటుందని భగవద్గీతలో
 శ్రీ కృష్టార్జునుల సంవాదం చేతనే  మనకు తెలుస్తోంది.
దానిని వినుము ! 
అర్జునుని ప్రశ్న -

ఓ , కృష్ణా ! పురుషుడు బలవంతం చేయబడిన వానిలాగా,ఇచ్ఛ లేకున్నను తాను కోరకుండానే దేనిచేత ప్రేరేపింపబడినవాడై పాపాల్ని ఆచరిస్తున్నాడు ? అని.
భగవద్గీత 3.36

అందులకు శ్రీకృష్ణుని సమాధానం -
ఓ , అర్జునా ! ప్రారబ్ద కర్మవశాన రజోగుణంవల్ల పుట్టినట్టి కామము దాని వికారమగు క్రోధము సకల పాపకర్మలకు కారణము.ఇవి తృప్తిని ఎఱుగక వున్నవి.అవే శత్రువులని తెలిసికొనుము. ఇవే పురుషుని పాపాచరణంలో ప్రవృత్తుణ్ణిగా చేస్తుంది.ఆ కామమే క్రోధంగా మారినప్పుడు విషయాల యెడల అతని ప్రవృత్తి  ఇంకా ఎక్కువౌతుంది.అది మహాశనం.

అంటే, కామానికి శబ్దస్పర్శాది విషయాలన్నీ భోజనం అన్నమాట ! అది గొప్ప పాపాలకు కారణమైనది. అటువంటి కామాన్నే నీవు గొప్ప శత్రువు అని తెలుసుకో !

జ్ఞానులు కామాదులు నశించినప్పటికి తీవ్రప్రారబ్ధబలిమిచే ఇచ్ఛారహితులై యుండియు కర్మలు చేయుచున్నారు. దీనినిబట్టి తత్త్వవేత్తలగు జీవన్ముక్తులకు రాగద్వేషాదులు ,కామక్రోధాదులు తత్కాను గుణ్యముగా జనించి ఇచ్ఛలేనప్పటికి కర్మలయందు నియోగించుచున్నవి.

అంటే - నీవు స్వయంగా చేసుకొన్నట్టి ప్రారబ్ధం చేత బంధింపబడిన నీవు , ఒక పనిని చేయకూడదు అని అనుకున్నా అవివేకానికి లోనై ఆ పనిని తప్పకుండా చేయనే చేస్తావు.అంటే , అనిచ్ఛా ప్రారబ్ధం నీచేత ఆ పనిని చేయిస్తోందని భావం.

అయినను ఈ కామాదులు జ్ఞాని దృష్టియందు ఆభాసమాత్రమై యుండి దగ్ధబీజములవలె పునర్భావమునకు కారణము కాజాలక పోవుటచే తత్త్వవేత్త యొక్క ముక్తికి భంగము లేదు.
ఇది అనిచ్ఛా ప్రారబ్ధమనబడును.

ఈ విధంగా పవృత్తికి మూలకారణంగా ఇచ్ఛలేదుకాబట్టి ఈ అనిచ్ఛా ప్రారబ్ధవశాన రజోగుణం దానినుండి కామం,క్రోధం పుడతాయని వాటి కారణంగా 
పురుషుడు పాపకర్మలు చేస్తున్నాడనీ భావం.

స్వభావ జనితమైన నీ ప్రారబ్ధముచే బంధిపబడిన వాడవై , ఏది భ్రాంతిచే చేయనిచ్ఛగింపవో దానినే అవశుడవై చేసెదవు. 
భగవద్గీత: 18.60

తమ అనుభూతి ప్రకాశిక యందు శ్రీ విద్యారణ్యులు జ్ఞానులకు గల ప్రారబ్ధమునకు సుప్త , మంద,
మధ్యమ, తీవ్రములని  -నాలుగు రకముల తీవ్రతలను వర్ణింతురు.

నానిచ్ఛన్తో న చేచ్ఛన్తః పరదాక్షిణ్య సంయుతాః ౹
సుఖదుఃఖే భజన్త్యే తత్పరేచ్ఛాపూర్వకర్మ హి ౹౹162౹౹
ఇతరుల కొరకు కర్మ నిర్వర్తించేది పరేచ్ఛా ప్రారబ్ధము.

కథం తర్హి కిమిచ్ఛన్ని త్యేవమిచ్ఛా నిషిధ్యతే ౹
నేచ్ఛా నిషేధః కిన్త్విచ్ఛాబాధో భర్జిత బీజవత్ 
౹౹163౹౹
భర్జితాని తు బీజాని సన్త్యకార్య కరాణి చ ౹
విద్వదిచ్ఛా తథేష్టవ్యాఽ సత్యబోధాన్న కార్యకృత్ 
౹౹164౹౹
మూడు కోరికలు జ్ఞానికున్నచో
"దేనిని కోరి"అని శ్రుతి జ్ఞానిలో కోరికలను నిషేధించుట ఏల?
సమాధానం:నిషేదము కాదు బాధ.

వ్యాఖ్య :-
 అనిచ్ఛవల్ల కాకుండా, ఇచ్ఛవల్లనూ కాకుండా,
కేవలం ఇతరులను సంతోష పెట్టాలనే ఉద్దేశ్యంతో దుఃఖాలను గాని, సుఖాలను గాని అనుభవిస్తాము.
అంటే,తనకు కోరిక ఉన్నా లేకున్నా,ఇతరుల కొరకై కర్మ నిర్వర్తించి సుఖదుఃఖములనుభవించుట
ఇటువంటివన్నీ పరేచ్ఛా ప్రారబ్ధం క్రిందకు వస్తాయి.

అందుచేతనే దోషదృష్టి ఉన్నప్పటికీ,అపరిహార్యమైన ప్రారబ్ధం నశించదు.ఆ ప్రారబ్ధంలో ఉండే ఇచ్ఛను పుట్టించే శక్తిని నివారించలేము.

తత్త్వవేత్తలకు కూడా ఇచ్ఛ అనేది తప్పదు అంటే,శ్రుతిలో చెప్పిన"కిమిచ్ఛన్"అనే దానికి వ్యతిరేకం కాదా ? అంటే -

అయితే, "కిమిచ్ఛన్..." 
'ఏ మిథ్యావస్తువును కోరుతూ'
అంటూ చెప్పిన శ్రుతివాక్యంలో ఇచ్ఛను ఎందుకు నిషేధించారు ? అంటే - ఈ శ్రుతివాక్యంలో ఇచ్ఛకు నిషేదం లేదు.ఇచ్ఛ అనేది బాధితమవటం లేదా ఇచ్ఛకు హానిని చెప్పారు.

దగ్ధమైన బీజం స్వరూపంలో ఉన్నా,అంకురించే శక్తిని కోల్పోయినట్లుగా,ఇచ్ఛకు కూడా ప్రవృత్తిని కలిగించే సామర్థ్యం ఉండదని అన్నారు.

అంటే - స్వరూపం విషయంలో మామూలుగానే ఉన్నా, వేయించబడిన 
బీజం - దగ్ధబీజం ఉత్పాదన శక్తిని కోల్పోయినట్లుగా, జ్ఞాని యైన వానియందలి ఇచ్ఛ మామూలుగా ఉన్నా విషయభూతమైన పదార్థాల యెడల మిథ్యత్వజ్ఞానం ఉన్నందువల్ల,ఆ ఇచ్ఛా మిథ్యాజ్ఞానాన్ని కోల్పోయినందువల్ల,
వ్యసనాదుల్ని కలిగించలేదు.

వేపిన గింజలుకూడా గింజలే.అయినా అవి నిష్పలములు అంకురించవు, వాటికా శక్తి ఉండదు.
జ్ఞానుల కోరికలును అట్టివే.

జీవన్ముక్తులగు మహాను భావులకు ఇచ్ఛలేక యుండినను ప్రారబ్ధము వలన ప్రవృత్తి గల్గును.ప్రవృత్తి పరమైన ఈ ఇచ్ఛ వ్యసనంబురకు కారణ మగుటలేదు.ఏలనగా విషయమగు పదార్థము మిథ్యయని తెలియబడి యుండుటచే ఇచ్చ వ్యసనరూపములో బంధింపజాలదు.

అనగా, పదార్థము మిథ్యగా తెరియబడుటచే 
ఇష్టానిష్టవస్తు ప్రాప్తి యందు సముడై యుండును.
రాగ ద్వేషములు ఉన్నట్లు తొయ్యడమే గానీ పదార్థములను సమముగా జూడడమే "జీవన్ముక్తస్య" లక్షణము.         

No comments:

Post a Comment