*_శ్రీరమణీయం _*
🕉🌞🌎🌙🌟🚩
*_ప్రశ్న : శ్రద్ధ - విశ్వాసం అంటే ఏమిటి !?"_*
*_భగవాన్ శ్రీరమణమహర్షి : ఒక ఆచార్యునివద్ద కొంతమంది శిష్యులుండేవారు. ఆయన ప్రబోధములు చేసేప్పుడు వారు పుస్తకాలలో వ్రాసుకునేవారు. మరునాడు తాము వ్రాసిన దానిని వారికి చూపి సరిచేయించుకొనేవారు. వారిలో ఒకడు బద్ధకించి తాను స్వయంగా వ్రాయలేక తోటివాడికి కొంత డబ్బిచ్చి తనవంతు కూడా వాడిచేత వ్రాయించుకునేవాడు. కొంత కాలానికి గురువు ఈ విషయం పసిగట్టారు. రెండు పుస్తకాలను ఒకరే వ్రాసినట్లు చేతివ్రాతను బట్టి తేలింది. గురువు వివరణ కోరగా వారు గతిలేక జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. మీరు నిజాన్ని చెప్పటం ప్రశంసించతగ్గదే కానీ ఆత్మసాక్ష్యాత్కారానికి శ్రద్ధచాలా అవసరం.*
*'శ్రద్దవాన్ లభతే జ్ఞానం' అని గీతావాచకం. ఈ విషయాన్ని చెప్పి సోమరిపోతులు ఆత్మవిద్యకు తగరంటూ ఆశ్రమం నుండి పంపివేశారు.*
*ఆధ్యాత్మిక సాధనలో శ్రద్ధకు, విశ్వాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది !_*
_*భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణో ౹*_
_*"యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరమ్ ౹౹"*_
*_శ్రద్ధావిశ్వాస రూపములుగావున్న భావానిభవులకు నమస్సులు.. అవి లేకుండా తమ స్వాంతంలోనే నెలకొన్న ఆత్మేశ్వరుని సిద్ధులు కూడా దర్శింపలేరు.*
*విశ్వాసం అంటే ప్రగాఢ నమ్మకం. శ్రద్ధాయనగా ప్రేమ, ఆర్తి కలబోసిన నిశ్చయం, అని సెలవిచ్చారు !_*
*_{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"_*
*_"గ్రహింపు సమయంలోనూ మనసు శుద్ధంగానే ఉంది..!"_* *_[అధ్యాయం -104]_*
No comments:
Post a Comment