Wednesday, March 5, 2025

 *ఇల్లూ పిల్లలూ ..వంటలూ వార్పులూ ..రాని* *పనమ్మాయి ..వచ్చిపోయే బంధువులూ ..*
*రాలుతున్న జుట్టూ ..పెరుగుతున్న వెయిటూ ..*
*ఇంట్రెస్ట్ చూపించని ఇంటాయన ..*
*ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ లా పెంచుకుంటూ పోయే పక్కింటాయనా ..*
*ఫేస్బుక్కులో పొగిడే జెంట్సూ ..*
*జెలసీకి పేటెంట్ తీసుకున్న లేడీసూ ..*

*ఇన్ని గొడవల మధ్య టైం తీసుకుని చూసిన జాను సినిమాతో జలజలమని జ్ఞాపకాలన్నీ కదిలి కళ్లవెంట రాలి ...*
*పదోతరగతి క్లాస్ మేట్ శీనూ*
*ఇంజినీరింగ్ లో సోల్ మేట్ రాఘవనూ*
*గుర్తొచ్చి ..ఎన్నికలలు కందో అవన్నీ నోటిఫై చేసుకుని .. ఏడుపొస్తున్నా పంటిబిగువున ఆపుకుని పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ..*

*కార్* *లోనూ ..ఇంటిరెంటూ ..కరెంటూ గురించి వర్రీ అవుతూ ..*
*భర్తకి ముందుకొచ్చేస్తున్న పొట్టగురించి*
*ఆయన వెనుక గట్టిగానే ఫీలవుతూ ..** *నాలుగుమాటలని తీవ్రంగా ఝాడించి ..*
*ఆనక తడికళ్లతో సారీ చెప్పి ఏడుస్తూ ..*
*అన్నిపన్లూ చేస్కుంటూ కూడా తామేం చేయట్లేదనే* *ఆత్మన్యుానతలో కుంగిపోయే అనేకానేక గృహిణుల లైఫుల్లో పెద్ద మిరాకిల్సేం జరగవు ..*

*ఎప్పుడో ఆకాశంలో అష్టగ్రహ కూటమి సంభవించిననాడు భర్తతో జరక్కుండా తప్పిపోయే ఓ పెద్దకార్గిల్ వారూ ..*
*అనుకోకుండా దొరికేసే ఓ చిన్ని కాంప్లిమెంటూ తప్ప !!*
*లైఫ్ గడుస్తుంటుందంతే !!*

*మిగిలేదల్లా ..*
*చూసేలోపు గమనించుకునేలోపే చేతిలోంచి జారిపోయే యవ్వనం ..*
*దాదాపు తమ సేమ్ ఏజ్ వాళ్లతోనే ఆంటీ అని పిలిపించుకున్న అవమానం...*

*Life కదా*...

No comments:

Post a Comment