*`స్త్రీ మూర్తి...!!`*
*తెలిసి తెలియని వయసులో అమ్మ తలవెంట్రుక.. తినే వాటిలో వస్తే.. తల వెంట్రుక వచ్చిందని… అమ్మపై గట్టిగా అరిచే వాడిని, చిరాకు పడేవాడిని!*
*కొంతకాలానికి నా వయసుతో పాటు ఆలోచన కూడా మారింది.*
*తన రక్తం పంచుకుని పుట్టిన నేను నా పుట్టుకకి కారణం అయిన తనని, చిన్న తల వెంట్రుక .. తినే వాటిలో వచ్చిందని "కోప్పడటం" సరైనది కాదు అనుకున్నాను.*
*అప్పటినుండి ఇప్పటి వరకూ ఎన్ని సార్లు తినే వాటిలో "తల వెంట్రుక" కనిపించినా తీసి పక్కన పడేసి తింటాను.*
*కారణం :*
*వాళ్ళు అలా అయిపోవడానికి కారణమే మనం,*
*వాళ్ళ ఆరోగ్య సమస్యలకి కారణం మనం,*
*వాళ్ల నడుం నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, ఆయాసానికి, తలపోట్లకు, కారణం మనం.*
*అలాంటప్పుడు.... తల వెంట్రుక వచ్చిందని, కూరలో ఉప్పు లేదని, కారం లేదని, రుచిగా లేదని, సరిగా ఉడకలేదని, ఇలాంటి మాటలు అనడం కరక్ట్ కాదు.*
*ఎందుకంటే వాళ్ళు మనకి చేసిన వాటితో పోలిస్తే మనం వాళ్ళకి చేస్తున్నది చాలా తక్కువ.*
*వాళ్ళ జీవితకాలం మొత్తం మనకోసం మాత్రమే కష్టపడ్డారు. కష్టపడుతూనే ఉన్నారు.*
*వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, పొగడకపోయినా పర్వాలేదు, కానీ చిరాకు పడకండి, కోపడకండి, విసుక్కోకండి, అసహ్యంగా మాట్లాడకండి.*
*తిన్నావా అని అడగకపోయినా పర్వాలేదు గానీ.... మనకోసం వండి పెట్టిన వాటికి పేర్లు పెట్టకండి. భగవంతుడు మిమ్మల్ని క్షమించడు.*
*పైన చెప్పినవన్నీ కూడా మనకోసం రోజంతా కష్టపడే తల్లికి, భార్యకు ప్రతి స్త్రీ మూర్తికి వర్తిస్తుంది.*
*తల్లి నడక నేర్పిస్తే , భార్య ఆ నడకను జీవితాంతం నడిపిస్తుంది.*
*ఒకరు ఎక్కువ కాదు. ఇంకొకరు తక్కువా కాదు.*
*మగాడి జీవితంలో "తల్లి" "భార్య" ఇద్దరూ రెండు కళ్ళతో సమానం.*
*బంధాలు దూరం అయ్యాక అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని బాధ పడేకంటే ఉన్నప్పుడే జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోవడం మంచిది.*
No comments:
Post a Comment