Wednesday, March 5, 2025

 **చాణక్య నీతి : ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకూడదట..!!*


చాణక్య నీతి ప్రకారం మనిషి జీవితంలో సహాయం చేసే గుణం ఉండడం మంచిదే అని అంటాడు. కానీ ఆ ముగ్గురికి మాత్రం అస్సలు సాయం చేయొద్దని ఆయన తెలియజేశారు..


🌿వ్యక్తిత్వం లేని స్త్రీ :

ఆచార్య చాణుక్యుడి ప్రకారం మీరు జీవితంలో వ్యక్తిత్వ రహిత,చెడు స్వభావం కలిగిన, ఎప్పుడూ ఇతరులను అవమానించే స్త్రీ కనిపిస్తే మాత్రం వారికి దూరంగా ఉండాలని అంటున్నాడు.

ఇలాంటి స్త్రీకి సాయం చేస్తే కూడా అది దుర్వినియోగం అవుతుందని ఆయన తెలియజేశాడు. 

ఇలాంటి స్త్రీలు భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకరమని, ఇలాంటి వారికి కేవలం డబ్బుపై తప్ప వేరే విషయాలపై ఆసక్తి ఉండదని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

🌿అహం కలిగిన వ్యక్తి:

కొంతమంది ఎన్ని మంచి విషయాలు చెప్పినా మూర్ఖుడు మాత్రం అహం గానే తీసుకుంటాడని అలాంటి మూర్ఖులతో మాట్లాడితే మానసిక ఒత్తిడి అనుభవించక తప్పదని అంటున్నాడు చాణక్యుడు.

🌿అసంతృప్తి:

ఎప్పుడు అసంతృప్తితో ఉండేవారికి దూరంగా ఉండటం మంచిదని , వీరికి సాయం చేసినా కానీ వారు అలాగే అసంతృప్తితో ఉంటారని ఆయన తెలియజేస్తున్నాడు. 

ఇలాంటివారు ప్రతి విషయాన్ని నెగిటివ్ గానే చూస్తారని, వారు ఆనందంగా ఉండకుండా మరొకరిని కూడా ఆనందంగా ఉంచరని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.🍁

No comments:

Post a Comment