Wednesday, March 5, 2025

 *`ఇది చదవండి చాలా బాగుంది.`*

*మన చుట్టూ అద్భుతాలతో..పయనిస్తూ...*  
*ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి..*
**ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!*

*మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు.*

*`1. తల్లి.`*
*మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి...*
*మనకు జననం ఇవ్వడానికి* *మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి* 
*మొదటి అద్భుతం!*

*`2. తండ్రి.`*

*మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని*
*తన కన్నీళ్లను దాచేస్తాడు.*
*మన పెదవులపై  చిరునవ్వును చూడాలని*
*తన కష్టాలను దాచేస్తాడు.*
*దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..*
*సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి*
*రెండో అద్భుతం!*

*`3. తోడబుట్టిన వాళ్ళు.`*

*మన తప్పులను వెనకేసుకురావాడానికి...*
*మనతో పోట్లాడడానికి...*
*మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి*
*వచ్చే బంధమే వీళ్ళు...*
*తోడబుట్టినవాళ్లు..మూడో అద్భుతం!*

*`4..స్నేహితులు.`*

*మన భావాలను పంచుకోడానికి..* 
*మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...*
*ఏది ఆశించకుండా..*
*మనకు దొరికిన స్నేహితులు..*
*నాలుగో  అద్భుతం!*

*`5. భార్య / భర్త.`*

*ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను...*
*ఎదిరించేలా  చేస్తుంది.*
*కలకాలం తోడు ఉంటూ...*
*ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...*
*ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.*
*భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే*
*ఐదో అద్భుతం మన సొంతం!*

*`6. పిల్లలు.`*

*మనలో స్వార్థం మొదలవుతుంది..* 
*మన పిల్లలు బావుండాలని పదే పదే*
*మనసు ఆరాటపడుతుంది...* 
*వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..*  
*వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ ఉంటుంది..*
*వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని...*
*తల్లి తండ్రులు  అసలు ఉండరు...*
*పిల్లలు..ఆరో అద్భుతం!*

*అన్ని అయిపోయాయి..*
*ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*

*`7.మనవళ్ళు మనవరాళ్లు.`*

*వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే ఆశపుడుతుంది..*
*వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి,*
*అద్భుతంగా మళ్ళీ పసిపిల్లలం..అయిపోతాం.*
*వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం!*

*ఇన్ని అద్భుతాలమధ్య తిరుగుతూ..*
*వీటి విలువలు మరిచి బ్రతుకుతున్న మనం..*
*మహా అద్భుతం..!*

*కాసింత ప్రేమ చాలు...*
*ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి.*
*చిన్న పలకరింపు  చాలు...*
*మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.*
*అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి*
*మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం...*

No comments:

Post a Comment