Sunday, April 13, 2025

 *శంభో శివ శంభో స్వయంభో ఓం నమః శివాయ*

*కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అని అనుకుంటాం. కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు...  ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తుంటాం. కర్మ ప్రకారం ఫలితం. కనుక ముందు ఆలోచనలను మంచివిగా ఉండేలా చూసుకోవాలి.* 

*మనం ఇతరుల మంచిని కోరుకున్నపుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధముగా మనకు మేలే జరుగుతుంది. అలాకాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్పలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్పదు.*
 
*మనం అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే కనుక మనసులో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి...*

*ప్రతిరోజు పది నిమిషాలు శుభ సంకల్పంతో, శుభ భావనతో, శివ పరమాత్ముని మీద ప్రేమతో ఓంకారం చేద్దాం.! ఆరోగ్యంగా ఆనందంగా, శక్తివంతంగా ఉందాం.!*

*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🏵️🦚 🙏🕉️🙏 🦚🏵️🦚
 *🌾🌤️సంధ్యావందనం ఎందుకు చేయాలి.?*

*🌾🌤️సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది.*

*🌾🌤️సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.*

*🌾🌤️"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.*

*🌾🌤️సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు.*

*🌾🌤️త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.*

*🌾🌤️త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.*

*🌤️ఆయా శక్తులను*

*🌾🌤️"గాయత్రీం ఆవాహయామి*
*సావిత్రీం ఆవాహయామి*
*సరస్వతీం ఆవాహయామి"*
*అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం.*

*🌾🌤️ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రిసంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.*

*🌾🌤️సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం, అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.*

*🌾🌤️మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి.*

*🌾🌤️ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం.*

*🌤️🌾కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.*

 *┅━❀꧁శ్రీమద్భగవద్గీత ꧂❀━┅*
                      *{గ్రూప్}*
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🔥🌈🔥 🙏🕉️🙏 🔥🌈🔥
*నాలుక, కోపం, కోరిక !!!*

*ఈ మూడింటినీ అదుపులో ఉంచుకోవాలి.*

*భగవంతుణ్ణి, గురువు, తల్లిదండ్రులు,*
*ఈ ముగ్గురిని గౌరవించాలి.*

*పవిత్రత, నిజాయితీ, కఠోరశ్రమ* 
*ఈ మూడింటిని అలవర్చుకోవాలి.*

*సోమరితనం, అబద్ధం, పరనింద,* 
*ఈ మూడింటిని విడిచిపెట్టాలి.*

*దైర్యం, కీర్తి, ప్రశాంతత*
*ఈ మూడింటి కోసం పాటుపడాలి.*

*నమ్మకం, స్నేహం, ప్రేమ* 
*ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి.*

 *మాట, నడవడిక, పని* 
*ఈ మూడింటినీ నిరంతరం నేర్చుకోవాలి.*

*సత్ప్రవర్తన, దానగుణం, సేవ*
*ఈ మూడింటిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి.*

*ఈర్ష్య, అహంకారం, ద్వేషం* 
*ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి.*

*కాబట్టి ప్రతీ ఒక్కరు మూడు అనే మాటను, ఈ మూడింటిని, ఈ మూడు విషయాలను మనసా, వాచా, కర్మేణా... తూ.చా తప్పకుండా, త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, అందమైన, ఆరోగ్యకరమైన, మనశ్శాంతి పూర్వకమైన... జీవితాన్ని గడపాలని మనసారా ఆకాంక్షిస్తూ.*

 *┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🌻🌹 🙏🕉️🙏 🌹🌻🌹
 🌺☘ *శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️          భక్తుడు: భగవాన్! లోకంలో దుఃఖాన్ని తప్పించుకునే మార్గం లేదా?             మహర్షి: ఆత్మస్థితిలో ఉండిపోయి దాని "ఎరుక"(చైతన్యం) ను పోగొట్టుకోకుండా ఉండటమే దుఃఖ నివారణకు మార్గం. అంతే!భగవాన్ రమణ మహర్షి.*🪷✍️
 :<>:<>:<>:<>:<<•>>:<>:<>:<>:<>:
  🍂🍃🌸 మంచి మాట 🌸🍃🍂
:•:•:•:•:•:•:•;•:•:•:•:•:•:•:•:•:•:•:•;•:•:
     చెవులతో శబ్దాన్ని, కంటితో రూపాన్ని ,      
               ముక్కుతో పరిమళాన్ని , 
      నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శని 
     దేవుడు మనకు  ఎలా ఐతే ఇచ్చాడో 
       అలాగే మనస్సుతో మానవత్వాన్ని     
            చూడమనికుడా ఇచ్చాడు
         కాబట్టి అన్ని ఇచ్చిన ఆ దేవుడికి 
            మన కృతజ్ఞలతో ప్రక్కవారు 
         కష్టాలలో  వుంటే ఆదుకోవాలని, 
          ఆ పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరు 
               నడవాలని కోరుకుందాం.
   🎈🌟🎈🌟🎈🌟🎈🌟🎈🌟🎈
         🌹🙏*శుభోదయంతో*🙏🌹
   🎈✨🎈✨🎈✨🎈✨🎈✨🎈
 🐂🐂🐂🐂🐂
జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :

 *ప్ర : శివాలయంలో నంది ఎందుకుంటుంది? నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*

 *జ:* ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయంలోని స్వామివారి వాహనం స్వామి ముందు ఉండాలి. శివుని వాహనం కనుక నంది ఉంటుంది.

అంతేకాక శివగణాలకు అతి ముఖ్య నాయకుడు నంది - *వృషభం. ఇది ధర్మానికి సంకేతం. సత్యం, అహింస, అస్తేయం (అక్రమార్చన లేకపోవడం), శౌచం (శుచి) - ఈ నాలుగు పాదాలతో ఉండే ధర్మమే వృషభం.* 

దైవం ధర్మాన్నే అధిష్ఠించి ఉంటాడు. *ధర్మం ద్వారానే భగవంతుని చూడగలం.* ధర్మహీనుని దైవం అనుగ్రహించడు. ధర్మమే భగవత్సాక్షాత్కారానికి మూలం అని తెలియజేసేందుకే, నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారు.

అంతేకాక ప్రతివారూ భ్రూమధ్యంలో (కనుబొమ్మల నడుమ) జ్యోతిర్లింగ స్వరూపునిగా శివుని ధ్యానించడం ఉత్తమ మార్గమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కొమ్ముల మధ్య నుండి చూడడం ఈ విధానాన్నే ఉపదేశిస్తుంది.

 *('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ)*
🐂🐂🐂🐂🐂
 


*ఒక్కసారి ఆలోచించండి, వీరప్పన్ కుమార్తెను చర్చి దత్తత తీసుకుని ఉంటే, ఆమెను సన్యాసిని చేసి ఉండేది!* *ఒక గిరిజనుడు ఆమెను దత్తత తీసుకుని ఉంటే, ఆమెను 12 మంది పిల్లలకు తల్లి చేసి ఉండేది!* *ఒక వామపక్ష ముఠా ఆమెను దత్తత తీసుకుని ఉంటే, ఆమెను వీధుల్లో లైంగిక దాడిలో చేర్చేది!* *కానీ ఈ కుమార్తె అదృష్టవంతురాలు, ఆమెను "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" దత్తత తీసుకుంది మరియు నేడు ఈ కుమార్తె దేశంలోనే పెద్ద న్యాయవాదిగా మారింది.* *రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అపఖ్యాతి పాలైన గంధపు చెక్క స్మగ్లర్ "వీరప్పన్" అనాథ కుమార్తెను తన సొంత కుమార్తెలాగా పట్టుకుని, అపఖ్యాతి పాలైన గంధపు చెక్క స్మగ్లర్ కుమార్తెను ప్రసిద్ధ న్యాయవాదిగా చేసింది.* *స్నేహితులారా!* *చర్చి, గిరిజనులు, వామపక్షవాదులు అందరూ నాశనం చేస్తారు, కానీ "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" నిర్మిస్తుంది. *సంఘ్ ను అప్రతిష్టపాలు చేసిన వారు క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయారు! సంఘ్‌ను నిర్మూలించాలని కలలు కన్న వారు కూడా కొద్దిసేపటిలోనే తుడిచిపెట్టుకుపోయారు!*🙏🙏🙏
 *_నేటి బంధాలు, బంధుత్వాలు, స్నేహ సంబంధాలు ఇవన్నీ నిలబడాలంటే నీవు ఆర్థికంగానైనా ఉండాలి. లేదా ఏదైనా ఒక ఉన్నతమైన స్థానంలోనైనా ఉండాలి. అప్పుడే ఆ బంధాలు బలపడుతున్నాయి. నేటి సమాజంలో..._*

*_అంతెందుకు ఒక్కసారి మనం గమనిద్దాం! ఒక ఉన్నతమైనటువంటి పై అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరే... అతను మనవాడే... మావోడే అని సంబోధిస్తూ ఉంటారు..._*

*_అదే... ఒక పేదవాడు, చిన్న జీతంపై ఒకరికి పనివాడిగా కష్టిస్తూ ఉంటాడు... అతను నీకు సొంత దగ్గర వాడైనా... వాడు నా వాడు అనడానికి కాస్త... నీ స్టేటస్ అడ్డుపడుతుంది._*

*_ఇతడు మావోడు అంటే... నా గౌరవం తగ్గుతుందేమోనని... మరియు నన్ను సహాయం అడుగుతాడేమోననే... భయం ఆవరిస్తుంది... అందుకే చూసి చూడనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు... ప్రేమగా మందలించినా       పై... పైన మాట్లాడుతారు..._*

*_నిజం చెప్పాలంటే నేటి బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే... ధనమును చూసి బంధాలను కలుపుకున్న వారు ఒకరైతే... ప్రస్తుతం తను ఉన్న ఉన్నత స్థానాన్ని చూసి వారితో సంబంధాలు కలుపుకున్న వాళ్లు మరొకరు..._*

*_ఇంతకూ ... ధనాన్ని ప్రేమిస్తున్నారా.? లేక ఉన్నతమైన ఉద్యోగ స్థానాన్ని ప్రేమిస్తున్నారా.? ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా నేడు డబ్బు, అధికారం, హోదాతో ముడిపడి ఉన్నాయి. ఇదే కదా నేటి సమాజంలో జరుగుతున్నది._*

*_ప్రేమ, ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ  ఒకప్పటి మాట. కానీ ఇప్పటి మాట ఏంటో తెలుసా.?_*

*_నీ క్యారెక్టర్ ఎలా ఉంటే ఏంటి.?  నీవు ధనాన్ని ఎలా సంపాదిస్తా ఉన్నావు అనేది ముఖ్యం కాదు..._*

*_నీ వద్ద ఎంత ధనం ఉంది, నీకు సమాజంలో ఎంత పలుకుబడి ఉంది, నీవు ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానంలో ఉన్నావు... వీటిని బట్టే నీతో సంబంధాలను, బంధాలను కొనసాగిస్తారు..._*

*_మిత్రమా. నాతో చిన్న మాట..._*

*_నేడు సమాజంలో... క్యారెక్టర్ కంటే... కరెన్సీ ముఖ్యం... ఇదే నేటి లోకం పోకడ... ఇదే కదా లోకం తీరు... ఇది కాదంటారా.?☝️_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🏵️🏵️🏵️ 🌷🙇🌷 🏵️🏵️🏵️

ప్రతి రోజు కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మన శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.

 **✍️ ముందుమాట | Introduction**  

ప్రతి రోజు కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మన శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. చప్పట్లు కొట్టడం, నడక, నృత్యం, మసాజ్ వంటి చర్యలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, వ్యాధులను దూరం చేస్తాయి. ఈ వ్యాసంలో “ఆరోగ్యంగా ఉండటానికి 9 దశలు” ను వివరంగా తెలుసుకుంటాం. ప్రతి దశను 5 వాక్యాలలో వివరించి, మీరు దాన్ని రోజువారీ జీవితంలో అనుసరించడానికి సహాయపడతాం. ఇప్పుడు, ఆరోగ్యపరిరక్షణకు మొదటి అడుగు వేయడానికి సిద్ధమవుదాం!

**1. చప్పట్లు కొట్టండి – వ్యాధిని తరిమికొట్టండి | Clap Your Hands – Drive Away Illness**  

▫️చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది.  
▫️ఇది ఇమ్యూన్ సిస్టమ్ బలపడటానికి సహాయపడుతుంది.  
▫️రోజు 1–2 నిమిషాలు చప్పట్లు కొట్టడం శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది.  
▫️ఈ సాధనంతో మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది.  
▫️పరిమిత శ్రద్ధతో చేయడం కడుపు ఉబ్బరం నివారిస్తుంది.

**2. అరికాలిని రుద్దండి – ముఖాన్ని ప్రకాశవంతం చేయండి | Rub Your Cheeks – Brighten Your Face**  

▫️గోరువెచ్చటి నీటిలో చేతులను తడిపి అరికాలిని రుద్దండి.  
▫️రక్తప్రసరణ మెరుగై ముఖంపై గ్లో వస్తుంది.  
▫️ఫేస్ మసాజ్ లాగా పనిచేస్తుంది, యవ్వనత్వం నిలుపుతుంది.  
▫️రోజుకు రెండు సార్లు రుద్దడం ముఖంలోని పిండాలను టోన్ చేస్తుంది.  
▫️ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

**3. అరచేతులను మసాజ్ చేయండి – శక్తిని మేల్కొల్పండి | Massage Your Palms – Awaken Energy**  

▫️అరచేతుల ప్రెస్ పాయింట్లు ఎనర్జీ చానల్‌లను ప్రేరేపిస్తాయి.  
▫️ప్రతి ఉదయం 2–3 నిమిషాలు అరచేతులను మసాజ్ చేయండి.  
▫️శరీరంలో శక్తి ప్రవాహం సజీవంగా ఉంటుంది.  
▫️డిజిటల్ అలసట తగ్గి మెదడు ఉల్లాసంగా ఉంటుంది.  
▫️పనుల్లో ఫోకస్ పెరుగుతుంది.

**4. గోళ్లను రుద్దండి – వృద్ధాప్యాన్ని తరిమికొట్టండి | Rub Your Knees – Beat Aging**  

▫️గోళ్ల చుట్టూ ప్రెస్ పాయింట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.  
▫️రుద్దడం వల్ల జాయింట్‌లలో ల్యుబ్రికేషన్ మెరుగవుతుంది.  
▫️మోకాళ్ళ నొప్పులు, స్టిఫ్‌నెస్ తగ్గుతాయి.  
▫️రోజు 1–2 నిమిషాలు రుద్దడం మొబిలిటీ పెంచుతుంది.  
▫️వృద్ధాప్యాన్ని ఆలస్యంగా తీసుకువస్తుంది.

**5. బిగ్గరగా నవ్వండి – సోమరితనాన్ని దూరం చేసుకోండి | Laugh Out Loud – Chase Away Laziness**  

▫️నవ్వడం శరీరంలో ఎన్డోర్ఫిన్లు విడుదల చేస్తుంది.  
▫️మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసం పెరుగుతుంది.  
▫️కేలరీలు ఖర్చవుతూ శరీరం ఫిట్‌గా ఉంటుంది.  
▫️రోజు కనీసం 5 నిమిషాలు గట్టిగా నవ్వండి.  
▫️ల్యాజీనెస్ పోయి ఉత్సాహంగా ఉంటారు.

**6. ప్రతి ఉదయం నడకకు వెళ్ళండి – రోజంతా ఛార్జ్లో ఉండండి | Morning Walk – Stay Charged All Day**  

▫️ఉదయం పచ్చగాలి, సూర్యకాంతి శరీరానికి అవసరం.  
▫️నడక 20–30 నిమిషాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.  
▫️మెదడు & శరీరం రెండు ఉల్లాసంగా ఉంటాయి.  
▫️రోజంతా శక్తివంతంగా ఉండటానికి ఇది ఉత్తమ మార్గం.  
▫️అదనపు వ్యాయామానికి ముందు వేచి వాతావరణం సజీవం చేస్తుంది.

**7. పది నిమిషాలు పరుగెత్తండి – అనారోగ్యానికి దూరంగా ఉండండి | 10-Minute Jog – Keep Illness Away**  

▫️పరుగెత్తడం వల్ల శరీర వ్యాయామం & కార్డియో రెండూ కలుస్తాయి.  
▫️ఫిట్‌నెస్ మెరుగై, శక్తి నిల్వ పెరుగుతుంది.  
▫️రోగ నిరోధక శక్తి బలపడుతుంది.  
▫️రోజు మూడుసార్లు 10 నిమిషాలు జాగ్ చేయండి.  
▫️అనారోగ్యాల పట్ల శరీరం రెసిలియంట్ అవుతుంది.

**8. ప్రతిరోజూ నృత్యం చేయండి – వ్యాధులకు అవకాశం ఉండదు | Daily Dance – No Room for Disease**  

▫️నృత్యం ఒక సమగ్ర ఎక్సర్‌సైజ్.  
▫️శరీరంలోని అన్ని కండరాలు పని చేస్తాయి.  
▫️రక్తప్రసరణ, శ్వాసనాళ శక్తి పెరుగుతాయి.  
▫️మెదడు & హృదయం సుఖంగా ఉంటాయి.  
▫️రోజు 15 నిమిషాల డాన్స్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

**9. సంగీతం వినండి – మీ మనసు ఆనందంతో నిండిపోతుంది | Listen to Music – Fill Your Mind with Joy**  

▫️సంగీతం మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది.  
▫️ఎండోర్ఫిన్లు విడుదల చేసి ఉల్లాసం పెంచుతుంది.  
▫️నిద్రలో మెరుగైన నాణ్యత వస్తుంది.  
▫️క్రియేటివ్ ఆలోచనలు ప్రేరేపిస్తాయి.  
▫️రోజు కనీసం 10 నిమిషాలు సంగీతం వినండి.

**✅ ముగింపు | Conclusion**  

ఈ 9 దశలను పాటించడం ద్వారా శరీర, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బలోపేతం అవుతుంది. ప్రతి దశను నియమితంగా చేయడం అలవాటు అయితే వ్యాధులు దూరమవుతాయి. ఈ పద్ధతులు మీ జీవిత శైలిలో మార్పును తీసుకువస్తాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ దశలను అనుసరించండి. ఆరోగ్యమే మహాభాగ్యం!
 :<•>:<•>:<•>:<••••>:<•>:<•>:<•>:
 🍂🍃🍁*మంచి మాటలు*🍁🍃🍂
:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
  మన ఉన్నతిని కోరేవారు అప్పుడప్పుడు 
        కఠినంగా ఉన్నా బాధ పడరాదు 
     ఎందుకంటే, వాళ్ళు అలా ఉండడం 
            వెనుక మనం బాగుండాలి 
       అనే తపన దాగి ఉండవచ్చు కదా
       మనకు వచ్చే కష్టం కన్నీళ్లనే కాదు, 
   కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది
    దాపరికాల ముసుగును తొలగిస్తుంది
  వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది
        కష్టం మంచి నేస్తమే, మనలోని     
         ధైర్యాన్ని, సామార్థ్యాన్ని మనకు 
                    తెలిసేలా చేస్తుంది.
    ఇంకా చెప్పాలంటే మన భవిష్యత్తుకు 
           మార్గాన్ని వెతికేలా చేస్తుంది.
    అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా 
                      ఆహ్వానించాలి.!
  🌺💦🌺💦🌺💦🌺💦🌺💦🌺
        🌹🙏*శుభోదయంతో*🙏🌹
    🌸✨🌸✨🌸✨🌸✨🌸✨🌸
 🦚🌹🌻💎🦢💜🌈

*🍁"మనమందరం తెలివైన వారమే. ఇంకా తెలివిగా ఉండడానికి ప్రయత్నించడం కంటే కాస్త దయగా ఉండడం మేలు.."* 

 *1) తెలివిగా ఉండడం మరియు దయగా ఉండడం రెండూ మన జీవితానికి చాలా ముఖ్యమైనవి. అయితే, దయగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి:* 

 *2) దయగా ఉండటం వల్ల మన సంబంధాలు బలపడతాయి. ఇతరులు మనపై నమ్మకం పెంచుకుంటారు..* 

 *3) ఒత్తిడి తగ్గుతుంది: దయగా ఉండటం వల్ల మన మనసు శాంతంగా ఉంటుంది. ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి..* 

 *4) సమాజంలో గౌరవం: దయగా ఉండే వారిని సమాజం గౌరవిస్తుంది. వారికి మంచి పేరు వస్తుంది..* 

 *5) ఆరోగ్యం మెరుగుపడుతుంది: దయగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది..* 

 *6) జీవితంలో సంతృప్తి: దయగా ఉండటం వల్ల జీవితంలో సంతృప్తి పెరుగుతుంది. మనం ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది..* 

 *7) కాబట్టి, తెలివిగా ఉండడం కంటే దయగా ఉండడం మన జీవితాన్ని మరింత సంతోషంగా మరియు సంతృప్తిగా మార్చగలదు..* 

🦚🌹🌻💎🦢💜🌈
 *_✨ శ్రీరమణుల బోధ ✨_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 బంధాలపై ప్రేమ పెంచుకుంటే బాధపడతావు. భగవంతుని మీద భక్తి పెంచుకుంటే ఆయనలో లీనమౌతావు. భగవంతుడు మనసును ప్రకాశింపచేస్తూ లోపల వెలుగుతుంటాడు. మనస్సుతో ఎవ్వరూ దైవాన్ని తెల్సుకోలేరు. మనస్సును అంతర్ముఖం చేసిన వారే దైవంలో లీనమవగలరు !!_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍⚜️
 భారతదేశంలో నివసిస్తున్న 400 మిలియన్ల ముస్లింలు "చట్టబద్ధంగా" భారత పౌరులు కాదు.

నమ్మడంలేదా..?
నేను నిజమే చెబుతున్నాను... మరియు నేను దానిని నిరూపిస్తాను కూడా.

భారతదేశం ఎవరి తండ్రికీ చెందదని ఎవరు చెప్పారు.
ఈ పోస్టుని అతని ముఖం మీద విసిరి, 
"భారతదేశం నా తండ్రికి చెందినది" అని చెప్పండి
✊ ✊ 

ఎందుకంటే ఇది ఊహాత్మక భావన కాదు చారిత్రక సత్యం. దాని వివరాలను చూడండి.
👇👇

1).
1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు దేశ స్వాతంత్ర్యం మరియు విభజన ప్రకటించబడిన వెంటనే, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ పాకిస్తాన్ పౌరులుగా మారారు.

మత ప్రాతిపదికన దేశం విభజించబడింది. పాకిస్తాన్ ముస్లింల కోసం సృష్టించబడింది మరియు మిగిలిన భారతదేశం హిందువుల కోసం పరిగణించబడింది.

భూమిలో మూడింట ఒక వంతు మరియు ఖజానాలో మూడింట ఒక వంతు ముస్లింలకు వారి జనాభా ఆధారంగా పాకిస్తాన్ కోసం ఇవ్వబడింది మరియు పైన పేర్కొన్న భూమి మరియు ఖజానాను పొందటానికి, మొహమ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష చర్య ద్వారా 20 లక్షల మంది హిందువులను ఊచకోతకు ఆదేశించాడు.

ఏర్పడిన పాకిస్తాన్ తప్ప, కేవలం 72 లక్షల మంది ముస్లింలు మాత్రమే భారత భూభాగాన్ని విడిచిపెట్టారు మరియు దాదాపు 3 కోట్ల మంది ముస్లింలు తమ భూమి, ఇళ్ళు మొదలైనవి అమ్మి పాకిస్తాన్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మహాత్మా గాంధీకి ముస్లింల పట్ల ఉన్న ప్రేమ కారణంగా, పాకిస్తాన్‌కు వెళ్లాలనుకునే ముస్లింలు వెళ్లవచ్చని మరియు భారతదేశంలో ఉండాలనుకునే వారు భారతదేశంలోనే ఉండవచ్చని ప్రచారం చేశారు.

మహాత్మా గాంధీ చేసిన ఈ ప్రకటనకు అధికారిక లేదా చట్టపరమైన ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే గాంధీ ఏ ప్రభుత్వ పదవిని చేపట్టలేదు.

కానీ ముస్లింలు గాంధీ జాతిపిత అని అంగీకరించారు, అందువల్ల ఆయన మాటలు రాజ్యాంగం కంటే ముఖ్యమైనవి. అందుకే మూడు కోట్ల మంది ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోయారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, స్వాతంత్ర్య చట్టంలో గానీ, విభజన పత్రంలో గానీ, విభజన నియమాలలో గానీ ఎక్కడా ఒక ముస్లిం పాకిస్తాన్‌కు వెళ్లాలనుకున్నా లేదా భారతదేశంలో ఉండాలనుకున్నా, అతను భారతదేశంలో ఉండటానికి అనుమతి ఉంటుందని వ్రాయబడలేదు!

2).
ఈ విభజన మత ప్రాతిపదికన జరిగింది మరియు 20 లక్షల మంది హిందువుల త్యాగం తర్వాత జరిగింది. అందువల్ల ఏ ముస్లింకూ భారతదేశంలో ఉండే హక్కు లేదు.

శ్రీ బి.ఆర్.అంబేద్కర్ తన ప్రసిద్ధ పుస్తకం Pakistan Or partition of India లో కూడా, మతపరమైన ప్రాతిపదికన దేశ విభజన తర్వాత, ఏ ముస్లిం అయినా పాకిస్తాన్‌కు వెళ్లడానికి లేదా భారతదేశంలో ఉండటానికి ఇష్టపడితే అక్కడే ఉండటానికి హక్కు ఉంటుందని ఎక్కడా వ్రాయలేదు.

భారతదేశంలో ఒక్క ముస్లిం అయినా నివసిస్తుంటే అది పార్టీ నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని శ్రీ అంబేద్కర్ అన్నారు.

ఆ సమయంలో నెహ్రూ ప్రజాదరణ సున్నాకి చేరుకుంది మరియు సర్దార్ పటేల్ ప్రధానమంత్రి పదవి హక్కును... గాంధీతో కలిసి నెహ్రూ చాకచక్యంగా లాక్కున్నాడు.

అందువల్ల, హిందువులు తనకు ఓటు వేయరని మరియు ప్రధానమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కష్టమని ఆయన భావించారు. అందువల్ల, ముస్లింలను మన ఓటు బ్యాంకుగా చేసుకోవడం ద్వారా వారిని దేశంలోనే ఉంచుకోవడం సరైన దౌత్యంగా పరిగణించబడింది.

సర్దార్ పటేల్ ముస్లింలను పాకిస్తాన్ కు వెళ్ళమని పదే పదే కోరారు, జిన్నా కూడా ముస్లింలందరినీ పాకిస్తాన్ కు పంపమని చాలాసార్లు సందేశాలు పంపారు, కానీ నెహ్రూ తన స్వార్థ ప్రయోజనాల కారణంగా ఎవరినీ పట్టించుకోలేదు మరియు మూడు కోట్ల మంది ముస్లింలను భారతదేశంలోనే ఉంచారు.

3).
రాజ్యాంగ రచన పూర్తయి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, తన ముస్లిం ఓటర్లు ఇకపై భారత పౌరులు కారని నెహ్రూ గ్రహించారు, మరి వారు ఓటు ఎలా వేయగలరు?

ఏదైనా ప్రతిపక్ష పార్టీ లేదా ఎన్నికల కమిషన్ ముస్లింల ఓటింగ్‌లో అడ్డంకులు సృష్టించగలిగితే ఏమి జరుగుతుంది?

కాబట్టి అతను దౌత్యాన్ని ఆశ్రయించాడు. ఆ సమయానికి సర్దార్ పటేల్ మరియు జిన్నా మరణించారు. అందువల్ల అతని దౌత్యం విజయవంతం కావడానికి ఎటువంటి అడ్డంకి లేదు.

ఆయన పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్‌ను ఫోన్‌లో సంప్రదించి ఢిల్లీకి పిలిపించారు.

1950 ఏప్రిల్ 8న వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు, అది చరిత్రలో "నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం"గా నమోదు చేయబడింది.

ఆ ఒప్పందంలోని మొదటి పదం ఏమిటంటే, విభజన తర్వాత వెనుకబడిన మైనారిటీలకు రెండు దేశాలు పౌరసత్వం మంజూరు చేస్తాయి మరియు వారి వారి దేశాలలో వారి జీవితాలను మరియు ఆస్తులను కాపాడుతాయి.

ఖచ్చితమైన పదాలు ఏమిటో చూడండి....👇

4).

"The governments of India and Pakistan solmanly agree that each shall ensure, to the minorities throughout it's territory compelet equality of citizenship irrespective of religion, a full sense of security in respective of life culture..."

"భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు తమ భూభాగం అంతటా ఉన్న మైనారిటీలకు మతంతో సంబంధం లేకుండా సమాన పౌరసత్వం, వారి జీవన సంస్కృతిలో పూర్తి భద్రతా భావాన్ని నిర్ధారించాలని దృఢంగా అంగీకరిస్తున్నాయి..."
ఈ మొదటి పదం నుండి విభజన తర్వాత 08-04-1950 వరకు ముస్లింలు భారత పౌరులు కాదని స్పష్టమవుతుంది, 

మరియు అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ఈ ఒప్పందం తర్వాత ముస్లింలకు భారత ప్రభుత్వం అధికారికంగా పౌరసత్వం మంజూరు చేసినట్లుగానీ లేదా ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలకు సామూహిక పౌరసత్వం/వ్యక్తిగతంగా పౌరసత్వం మంజూరు చేసినట్లుగానీ ఎటువంటి చారిత్రక రికార్డు లేదా రుజువు లేదు.

వాస్తవానికి చేయలేదు అంటే ముస్లింలు భారత పౌరులు కాదు.
 కాంగ్రెస్ నాయకులు తరచుగా నెహ్రూ దార్శనికత గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు నెహ్రూకు దార్శనికత లేదని చెప్పే చరిత్రలోని ఒక సంఘటనను వినండి. భారతదేశాన్ని నాశనం చేయడానికి అతను ఏ రాయిని వదిలిపెట్టలేదు. 👇👇👇

భారతదేశం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, ఆనాటి రాయల్ ఎయిర్ ఫోర్స్ కూడా రెండు భాగాలుగా విభజించబడింది. 

మౌంట్ బాటన్ భారతదేశం పట్ల సానుభూతిపరుడు కాబట్టి, అతను 90% విమానాలు మరియు ఇతర పరికరాలను భారతదేశానికి ఇచ్చాడు. పాకిస్తాన్ కు కేవలం 10% విమానాలు మాత్రమే ఇచ్చారు. వాటిలో ఎక్కువ భాగం డకోటా విమానాలు. 

స్వాతంత్ర్యం తర్వాత, నెహ్రూ భారతదేశాన్ని కమ్యూనిజం మార్గంలోకి తీసుకెళ్లాడు, దీనిలో సైన్యాన్ని భారంగా భావిస్తారు. మరియు నెహ్రూ హిందీ మరియు చైనీస్ సోదరులని నమ్మాడు. చైనా నుండి భారతదేశానికి ఎటువంటి ముప్పు లేదు. పాకిస్తాన్ నుండి భారతదేశానికి ఎటువంటి ప్రమాదం లేదు. అందువల్ల, నెహ్రూ భారత సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అతను సైన్యానికి ఎలాంటి పరికరాలు కొనలేదు లేదా ఎలాంటి దార్శనికతను ఇవ్వలేదు.

జిన్నా తన దేశానికి శక్తివంతమైన సైన్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. సైన్యాలలో కూడా వైమానిక దళం బలంగా ఉంటే, అది దేశానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జిన్నా నమ్మాడు. ఆ తరువాత, రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన 50 మంది యుద్ధ విమాన పైలట్లు తనకు అవసరమని మొహమ్మద్ అలీ జిన్నా లండన్ వార్తాపత్రికలలో ఒక ప్రకటన ఇచ్చాడు. జిన్నా ఈ ప్రకటనను పోలాండ్ వార్తాపత్రికలలో పోలిష్ భాషలో కూడా ఇచ్చారు.

నిజానికి జిన్నాకు రెండవ ప్రపంచ యుద్ధంలో పోలిష్ మూలానికి చెందిన చాలా మంది ప్రజలు తమ దేశం కోసం పోరాడారని మరియు వారందరూ ఇప్పుడు కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నారని తెలుసు మరియు ఈ విధంగా జిన్నా పోలాండ్ నుండి 50 మంది ఉత్తమ యుద్ధ పైలట్లను కనుగొని జిన్నా వారిని తన పాకిస్తాన్ వైమానిక దళంలో నియమించుకున్నాడు. వారిలో ఒకరు వ్లాడిస్లావ్ జోజెఫ్ మరియన్ టురోవిచ్ చాలా దృష్టిని కలిగి ఉన్నారు. 

ఈ పోలిష్ వైమానిక దళ అధికారులందరికీ జిన్నా మంచి జీతాలు మరియు సౌకర్యాలు ఇచ్చి, పాకిస్తాన్ వైమానిక దళాన్ని బలమైన వైమానిక దళంగా మార్చమని కోరాడు.

వ్లాడిస్లా జోజెఫ్ మరియన్ టురోవిచ్ పాకిస్తాన్‌లో ఒక గొప్ప వైమానిక దళ అకాడమీని ప్రారంభించాడు, ఫైటర్ పైలట్ శిక్షణ కోసం కొత్త మాన్యువల్‌ను రూపొందించాడు మరియు రెండవ ప్రపంచ యుద్ధం నుండి తన అనుభవాలను ఉపయోగించి పాకిస్తాన్ వైమానిక దళ సిబ్బందికి శిక్షణ ఇచ్చాడు. 

1965 యుద్ధంలో, పాకిస్తాన్ వైమానిక దళం ఈ నైపుణ్యాన్ని ఉపయోగించి భారతదేశానికి చాలా నష్టం కలిగించింది. వారు అనేక భారతీయ యుద్ధనౌకలు మరియు అనేక భారతీయ వైమానిక దళ స్టేషన్లపై దాడి చేశారు, కానీ భారత సైన్యం మరియు భారత ట్యాంక్ యూనిట్ వారి పరాక్రమంతో పాకిస్తాన్ వైమానిక దళానికి చాలా నష్టం కలిగించాయి. 

తరువాత నెహ్రూ మరణం తరువాత, లాల్ బహదూర్ శాస్త్రి అధికారంలోకి వచ్చినప్పుడు, భారత సైన్యాన్ని బలోపేతం చేయాలని మరియు సోవియట్ యూనియన్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని మరియు ఇతర దేశాల నుండి పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా బలమైన భారత సైన్యాన్ని నిర్మించాలని ఆయన సూచించారు.

మరోవైపు, స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాలలోనే పాకిస్తాన్‌లో అధికార పోరాటాలు ప్రారంభమవడం పాకిస్తాన్ దురదృష్టం. 

సైన్యం కూడా అధికారంలో భాగం కావడం ప్రారంభమైంది, అవినీతి పరాకాష్టకు చేరుకుంది, దోపిడీ ప్రారంభమైంది మరియు కాశ్మీర్, ఇస్లాం మొదలైన వాటి పేరుతో పాకిస్తాన్ ప్రజలను మోసం చేయడం ద్వారా మరియు భారతదేశంతో వారిని భయపెట్టడం ద్వారా ఒకరి రాజకీయ దుకాణాన్ని నడపడం ప్రారంభమైంది మరియు ఇది క్రమంగా పాకిస్తాన్‌ను లోపలి నుండి బయటకు నెట్టివేసింది.
 ••••••••••••••••••••••••••••••••••
     🍂🍃🩸 మంచి మాట🩸🍃🍂
•••••••••••••••••••••••••••••••••  మనిషి జీవితం 
                 మేడిపండు లాంటిది
      చూడ్డానికి అందంగానే కనిపిస్తుంది
       మేడిపండులో పురుగులు ఉన్నట్లు      
            జీవితంలో అన్ని సమస్యలే 
         ఉంటాయి కానీ ఒకరి జీవితం 
          మరొకరికి మాత్రం అందంగా      
                      కనిపిస్తుంది. 
                అందులో దాగి ఉన్న 
                   కష్టాలు, కన్నీళ్ళు 
             చూసే వారికి కనపడవు.
 🍂💦🍂💦🍂💦🍂💦🍂💦🍂
     
       🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
 జ్ఞాపకాల గనిలో 
మనసుకు ఉత్సాహన్నిచ్చిన
సంతోషాల నిక్షేపాలు 
బ్రతుకు గమనంలో  జీవమిచ్చే క్షణాలు!

రోజులు గడిచినా 
తాజాగా ఉండే ఆనందాలు 
గతం తాలూకు అనుబంధాల 
స్నేహ మధురిమలు!

కలతల నీడల సాగిన 
గడచిన వేదనలు 
కనుమరుగైన ఆత్మ బంధాల
వీడని మమకారాలు!

అంతరంగపు సుడిలో తిరుగుతూ
ఏది పైకి వస్తుందో ఏది కిందికో
ఏది కంటిని చెలమ చేస్తుందో
నిత్య జీవన యాత్రలో!

మనసొక మమతల నిధి
మాట వినని పద్ధతి దానిది
పూటకొక తలపును తెచ్చి
ఊటగా మురిపిస్తుంది!

పొంగే తరగల కదలికలు 
పొందే భావ ప్రకంపనలు 
పంచిన ప్రేమాభిమానాలే 
పెంచును జీవన ప్రమాణాలు!

మనిషిని ముందుకు నడిపే 
మనసే  విరిసే పూవనం
కలుపులకు చోటివ్వక
కాచుకోడమే జీవితం!

మరో మంచి ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

బృంద 🙏
 *_బంధం బలంగా ఉండాలంటే... నమ్మకంతో, బాధ్యతగా ప్రవర్తించండి._*

*_నమ్మకం లేని బంధాలు... పది కాలాలపాటు నిలబడవు._*

*_జీవితంలో నమ్మకం అనేది అత్యంత విలువైనది. బంధాలైనా, స్నేహ సంబంధాలైన  పదికాలాలపాటు నిలవాలంటే నమ్మకంగా, నిజాయితీగా ఉండండి._*

*_రెండు హృదయల స్పందనే ప్రేమ. ప్రేమ అంటేనే నమ్మకం. నమ్మకం లేని చోట ప్రేమ చిగురించదు, నమ్మకం ప్రేమ ఇద్దరు వ్యక్తులను విడిపోకుండా కడదాక నడిపే అత్యంత విలువైన సాధనాలు._*

*_నమ్మకం అంటే, మనిషి ఉన్నప్పుడు ఒకలా. మనిషి లేనప్పుడు ఒకలా ప్రవర్తించే తీరు కాదు. ఎలాంటి సందర్భంలోనైనా నమ్మకంగా, బాధ్యతయుతంగా  ప్రవర్తించడం. నమ్మకం లేని బంధాలు విచ్ఛిన్నమవుతాయి._*

*_1. ప్రేమగా కడవరకు కలిసి ఉండడం వేరు..._*

*_2. తప్పనిసరిగా గత్యంతరం లేక కలిసి ఉండటం వేరు..._*

*_మొదటి దానిలో తనకు తానుగా ప్రేమతో సృజియించే సమర్పిత భావం ఉంటుంది. రెండవ దాంట్లో అయీష్టత, బాధ్యత రాహిత్యం, కోపం ఉంటుంది._*

*_నమ్మకంలోనే ప్రేమ ఉంటుంది, ప్రేమలోనే మనసు ఉంటుంది. ఇవి లేని చోట రెండు శరీరాల కలయిక, శారీరక సుఖము మాత్రమే ఉంటుంది. ఇలాంటి దాన్ని బంధం అనగలమా.? కేవలం శారీరక అవసరం అని మాత్రమే అనగలము._*

*_జీవితం లో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు... ఎందుకంటే, నమ్మకం ప్రాణంలాంటిది ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదు._* 

*_జీవితం అంటే మనం చనిపోయేంతవరకు బ్రతికి ఉండటం కాదు. పది మంది మనసులలో పది కాలాల పాటు జీవించి ఉండటమే జీవితం._*

*_జీవితంలో డబ్బును  కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు కానీ, నమ్మకం అనేది పోతే జీవితంలో తిరిగి ఎంత ప్రయత్నించినా, ఫలితం శూన్యమే. దీన్నే అంటారేమో.! చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు._* 

*_పరిస్థితి తారు మారైన, పరిస్థితి ఆసాజనకంగా లేకున్నా, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న సరే, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది._*

*_నమ్మకం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ఓ వారధి లాంటిది దానిని నిలబెట్టుకోవడమె గొప్పతనం. నమ్మకం నిలబెట్టుకోవడానికి  జీవితకాలం పట్టిన... పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం చాలు..._*

*_అత్యంత ఖరీదైన అరుదైన గౌరవం, నమ్మకం వలనే కలుగుతుంది. ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ రాదు. క్షణిక సుఖం నీ జీవితాన్ని తారు మారు చేస్తుంది..._*

*_నమ్మకం దారుణంగా గాయపడిన చోట క్షమాపణ అర్ధరహితం. నమ్మకం అనేది బంధానికి బలమైన పునాది లాంటిది. నమ్మకమే లేనప్పుడు ప్రేమ, ఆప్యాయత, బాధ్యతలు అనేవి కూలిపోయిన గూడు వంటివి._*

*_బంధం భారం కాకూడదు, ప్రేమ విరక్తి కలిగించొద్దు... నీ తీరు మారనిదే ఈ తీరు మారదు... గతి తప్పిన మనసును గాడిలో పెట్టు. అబద్దాలతో నిజాన్ని ఎన్నాళ్లు దాస్తావు.? వెలికి తీసిన తరువాత దుఃఖించేది నీవే..._*

*_మనిషి మాట, నడవడి  అంటేనే 'నమ్మకం'... నమ్మకం లేని ప్రేమ, స్నేహం, బంధుత్వం ఎప్పటికైనా ప్రమాదకరమే._*

*_అవి మనశ్శాంతిని దూరం చేసే ఆయుధాలే. అందుకే నమ్మకంగా ఉండండి. బాధ్యతతో ప్రవర్తించండి. రాబోవు తరాలకు ఆదర్శంగా నిలవండి._*

     *- సదా మీ శ్రేయోభిలాషి...👏*
🌺🌺🌺 🦚🙇🦚 🌺🌺🌺
 ఒక నదికి వరదలు వచ్చి చిన్న ద్వీపం ఒకటి నీటితో నిండిపోతుంది.  

అక్కడ నివసిస్తున్న ఒక సాధారణ ఎలుక ఒక తాబేలుతో అన్నది, మిత్రమా....! మీరు నన్ను నది దాటించగలరా...? 

నా బిలం నీళ్లతో నిండిపోయింది! తాబేలు అంగీకరిస్తుంది, మరియు ఎలుకను తన వీపుపై కూర్చోబెట్టింది, అప్పుడు ఒక తేలు కూడా రంధ్రం నుండి బయటకు వచ్చి, నేను కూడా దాటాలనుకుంటున్నాను అని చెప్పింది. నన్ను కూడా తీసుకెళ్లండి. ఎలుక అంది, కూర్చోవద్దు, ఇది విషపూరితమైనది, నన్ను కాటేస్తుంది. 

అప్పుడే, సమయ తీవ్రతను పసిగట్టి,  తేలు చాలా మర్యాదగా పలుకుతూ, బ్రదర్ ! నేను కాటు వేయనని ప్రమాణం చేస్తున్నాను, నన్ను వెంట తీసుకెళ్లండి.  తాబేలు... ఎలుక మరియు తేలును ఎక్కించుకొని నదిలో ఈత ప్రారంభిస్తుంది. అకస్మాత్తుగా మధ్యలో తేలు ఎలుకను కాటేస్తుంది.   ఎలుక తాబేలతో  మిత్రమా ! తేలు నన్ను కరిచింది, ఇక నేను బ్రతకను.         

కొంత సమయం తరువాత తేలు        తాబేలును కూడా కుట్టింది.            తాబేలు నిస్సహాయంగా ఉంది.          

అది ఒడ్డుకు చేరుకునే సమయానికి..               ఎలుక చచ్చిపోయింది.       తాబేలు చెప్పింది       నేను మానవత్వంతో నిర్బంధించబడ్డాను,     అందుకే నిన్ను మధ్యలో ముంచలేదు,             

కానీ నువ్వు... నన్నెందుకు కాటేశావు...?  తేలు         వెళ్ళేటప్పుడు తాపీగా అంది ~ మూర్ఖుడా...!                      

నీకు తెలియదు,   కుట్టడం మాత్రమే నా మతం. ఆశ్రయం ఇచ్చేవారి ఇళ్లు, దుకాణాలను తగలబెట్టడం. మా చరిత్ర చూడండి... మాకు ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని ముక్కలు చేసి శిథిలావస్థకు చేర్చాం.      

ఇది మీ తప్పు, మీరు నన్ను మరియు నా విష కుట్రను నమ్మారు.  జాగ్రత్త పడాల్సింది మీరు, మేము కాదు. మా జాతి, పెంపకం, మతం, చదువు అన్నీ విషపూరితమైనవే.... 

*చాలా చాలామంది ఆలోచనలు, పనులు ఇలానే ఉంటాయి, మనం మంచి చేద్దామని ఆలోచించినా వాళ్ళు ఎప్పుడూ చెడు కోసమే ఆలోచిస్తారు, అలాంటి వాళ్ళ పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి... కానీ ఒక్కటి మాత్రం నిజం భగవంతుడు అనే వాడు ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేస్తున్నామనేది పరిశీలిస్తూ ఉంటాడు, చిన్న సీసీ కెమెరాకి మనం భయపడతాం. అటువంటిది భగవంతుడనే కెమెరా మనల్ని అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది, దయచేసి గమనించి జాగ్రత్తగా ఉండండి...* 🫵

*జ్ఞానులకు సూచన చాలు....?*

 *సదా సర్వదా మీ శ్రేయోభిలాషి వి ఎస్ బి సురేష్...*
 *శత్రువుకైనా సరే ఎల్లపుడూ మంచి జరగాలనే కోరుకోవాలి...దీని వలన మనిషిలోని ఈర్ష్యాఅసూయలు తొలగిపోయి ప్రేమతత్వం అలవడుతుంది...ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైనా సరే తప్పక మంచే జరుగుతుంది...కానీ ఇతరులకు చెడు జరగాలని కోరుకున్నా చెడు జరుగనే జరుగదు...కారణం దేవుడనే వాడు సదా మంచినే చేస్తాడు...ఒకవేళ ఎవరికైనా చెడు సంభవిస్తే అది వారి కర్మ ఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వలన కానేకాదు...ఊరికే పాపము మూట కట్టుకోవడం ఎందుకు...ఇతరుల మంచిని కోరుకున్నవాడి బాగోగులు స్వయంగా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు...కనుక మంచినే చేయాలి...మంచినే కోరాలి... సదా సర్వదా మీ శ్రేయోభిలాషి VSB సురేష్...*
 *_ఉన్నదే ఒక్క జీవితం... ఆ జీవితం చాలా చిన్నది. రేపు ఉంటామో లేదో తెలియని సందిగ్ధం. అందుకే  బ్రతికున్నన్నాళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపేయండి._* 

*_అసలు జీవితమే శాశ్వతం కానప్పుడు, నీ కున్న సమస్యలు శాశ్వతంగా ఉంటాయా.?  కష్టాలు, కన్నీళ్లు, భావోద్వేగాలు, సమస్యలు, సుఖాలు, దుఖాలు , ఆనందాల సమన్వయమే కదా! జీవితమంటే..._*

*_సమస్యకు లొంగకు, కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకోకు, అవమానాలను అనుభవించి ఆవేదన చెందకు. సమస్యల నుండి, కష్టాల నుండి, అవమానల నుండి గుణపాఠం నేర్చుకొని నీవు దృఢంగా, స్థితప్రజ్ఞత అలవర్చుకో..._*

*_అంతేకానీ ధీనుడిగా, హీనుడిగా, లాచారిగా, ఒకరికి బానిసగా బ్రతుకు వెళ్లదీయకు. కాలే కడుపుకు  తిండి లేకుంటే ఆ పూట నీటిని తాగి సర్దుకో... అంతేగాని... నీ ఆత్మ గౌరవాన్ని ఒకరి కాళ్ళ వద్ద  తాకట్టు పెట్టకు._*

*_మిత్రమా... నాదో చిన్న మాట!_*

*_ఓడిపోవడం వేరు, లొంగిపోవడం వేరు. చిరుత పులులు జింకలను వేటాడే దృశ్యాలను మనం తెరపై ఎన్నోసార్లు చూస్తుంటాం. పులి చాలా బలమైన జంతువు. అయినా దాని పంజాకు చిక్కరాదన్న పట్టుదలతో జింక శక్తికి మించిన వేగంతో పరుగెడుతుంది. అది ఓడిపోతుందేమో తప్ప లొంగిపోదు.!_*

*_అదేవిధంగా ఏ సమస్యకి లొంగకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అసలు నీ మనసులో ఓడిపోతానేమో అనే ఆలోచన రాకుండా నిత్యం ప్రయత్నించు.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🦚🙇🦚 🌹🌹🌹
 *ఈ లోకంలో నీది అనేది ఏదీ లేదు అంతా నీ బ్రమనే...నిజానిజాలు గ్రహించు మాయ నుండి బయటపడు...మాయల వలలో చిక్కి సతమతం అవ్వకముందే జ్ఞానాన్ని గ్రహించు ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకో వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దైవాన్ని తెలుసుకోవడమే...కేవలం నీ వనుకున్నదే నిజం అనుకుంటే...ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తులేరి...సర్వమనుకున్నా నీ ఆత్మీయులేరీ...నీ తాత ముత్తాత లేరి...ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారే కదా అలాంటప్పుడు ఏదీ శాశ్వతం తెలుసుకుంటే అంతా ఆశాశ్వతం...అందుకే గర్వము,అహంకారము,చిన్న పెద్ద అనే బెదాన్ని వదిలి ఉన్నంత వరకు అందరికి ప్రేమను పంచు ప్రేమతో పలకరించు ఇదే నీవు మనిషిగా పుట్టినందుకు అంతిమకర్తవ్యం... సదా సర్వదా మీ శ్రేయోభిలాషి... VSB సురేష్....*
 బ్రాహ్మణ్యం పోతే హిందూ ధర్మం కూడా పోతుంది అని నేను నమ్మడానికి, నాకు ప్రత్యేకించి బ్రాహ్మణుల పట్ల అభిమానం ఉండటం కారణం మాత్రమే కాదు. నాకు హిందువులు అందరూ ఒక్కటే. ఈ నమ్మకం కేవలం నేను వాస్తవం అని నమ్మిన కొన్ని విషయాల మీద ఆధారపడింది మాత్రమే. 

నా కారణాలు

1. హిందూ ధర్మానికి మూలం అయిన వేద అధ్యయనం, పౌరోహిత్యం, యజ్ఞ/యాగాల నిర్వహణ, హైంధవ ధర్మ ప్రవచనం ఇలా దాదాపు అన్నీ నేటికీ ఎక్కువ శాతం బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నాయి. అలా ఎందుకు ఉండాలి, అది వివక్ష అనే చర్చలోకి నేను వెళ్లదలుచుకోవడం లేదు. కారణం ఏమైనా అదే నిజం. బ్రాహ్మణ్యం పోతే ఇవన్నీ పోతాయు, ఇవి పోతే హిందూ ధర్మమూ పోతుంది. 

2. గత వెయ్యి సంవత్సరాలుగా హిందువుల మీద జరిగిన దాడిలో ఎడారి మతోన్మాదులది వారి మతానిది చాలా కీలకమైన పాత్ర. ఇంతకాలం పాటు హిందూ ధర్మానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాల మీదా దాడి జరిగినా, బ్రాహ్మణ వృత్తుల వలన ఆర్ధికంగా కూడా పెద్దగా లాభం లేకపోయినా హైంధవ ధర్మం పైన అభిమానం గౌరవంతో ఎందరో బ్రాహ్మణులు వాటిని కాపాడుకుంటూ వచ్చారు. వాటి బాధ్యత అందరిదీ అంటే బహుశా బ్రాహ్మణ వృత్తులు, వాటితో పాటు హిందూ ధర్మం నాశనం అయిపోయేది..... 

3. ఈ బ్రాహ్మణ విద్యలను అందరికీ నేర్పడం కూడా అంత సులభం కాదు. కారణం ఇవి సరిగ్గా నిర్వహించాలి అంటే కేవలం ఆ వ్యక్తి మాత్రం నియమంగా ఉంటే సరిపోదు, పూర్తి కుటుంబం నియమంగా ఉండాలి. భర్త గుడిలో అర్చకత్వం చేస్తాడు, భార్య మాత్రం పది గంటలకి లేచి స్నానం కూడా చెయ్యకుండా వంట చేసి, చికెన్లు, మటన్లు తింటాను అంటే కుదరదు. అయితే అది అసాధ్యం కూడా కాదు. దేశంలో బ్రాహ్మణులు కానీ వారు వేలు లక్షల మంది చాలా దేవాలయాలలో పూజారులుగా ఉన్నారు. అయితే వారి కుటుంబం మొత్తం నియమాలు పాటిస్తారు. దానిని మన పూర్వీకులు ఎలా సాధించారో తెలియదు. తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. మన తెలుగు రాష్ట్రాలలోని ఒక స్వామీజీ SC వర్గీయులకు కొన్ని వేల మందికి ప్రవచనం మీద శిక్షణ ఇస్తున్నారు. విశ్వకర్మీయులు పద్మశాలి కులస్థులు చాలా మంది వేద విధ్య అభ్యసించి పూజారులుగా స్ధిర పడుతున్నారు, మాల మాదిగ కులాల వారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం మరియు చిన జియర్ స్వామి సంస్థల ఆధ్వర్యంలో అర్చక విధ్య నేర్చుకుని పూజారులుగా కొనసాగుతున్నారు..... 

4. మోనియర్ విలియమ్స్, రాబర్ట్ క్లాడ్వెల్ వంటి క్రైస్తవ మిషనరీలు, వారికి సహకరించేవారు ఎందరో హిందువులను మతం మార్చడానికి ప్రధాన అడ్డంకి బ్రాహ్మణులే అని అభిప్రాయపడ్డారు. ఆ కారణం వల్లనే మిషనరీలు సృష్టించిన ఆర్యన్ సిద్ధాంతంలో బ్రాహ్మణ ద్వేషాన్ని చాలా కీలకం చేశారు..... 

5. క్రైస్తవం/ఇస్లాంలు అడుగుపెట్టిన చాలా దేశాలలో స్థానిక నాగరికతలూ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతాయి. ఒక భారత/హిందూ నాగరికత మాత్రమే ఎడారి మతోన్మాదుల దాడుల నుంచి తట్టుకుని ఇప్పటికీ మిగిలింది అంటే దానికి కారణం బ్రహ్మానుల కృషి మరియు హైంధవ ధర్మ పరిరక్షణ కోసం బ్రహ్మాన కుటుంబాలు వంశపారంపర్యంగా నిరంతరం పనిచేయడం మాత్రమే. బ్రాహ్మణ వ్యవస్థ వంటి వ్యవస్థ మనదేశంలో తప్పా ఎక్కడా లేకపోవడం గమనార్హం. పైన చెప్పిన ఇతర కారణాలు కూడా ఉన్నాయి కనుక, ఇది కేవలం యాదృచ్చికం అనలేము..... 

6. నిజంగా బ్రాహ్మణ్యం హిందూ ధర్మానికి బలం కనుక హైంధవ ధర్మాన్ని నాశనం చేసేందుకు హిందూ ధర్మ ద్వేషులు ముస్లిం కృిస్టియన్ మతోన్మాదులు కమ్యూనిస్టు ఉన్మాదులు సెక్యులర్ రాజకీయులు వందల సంవత్సరాలుగా బ్రాహ్మణ్యాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు.....

Sekarana

Saturday, April 12, 2025

*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 41*

*నాటకాల్లో పురుష పాత్రలు సినిమాల్లో హాస్య పాత్రలు*
*టి.కనకం*

1949 వ సంవత్సరంలో బాక్సాఫీసు రికార్డులు బద్దలు గొట్టిన సినిమా *'కీలు గుఱ్ఱం'.* 

అంజలీదేవి, కనకం రాక్షస స్త్రీలుగా నటించారు. అంజలికి చెలికత్తె అయిన కేకిని పాత్ర కనకానిది. రాక్షస స్త్రీలు కామరూపం ధరించ గలరు గనుక ఒక రాజును వశపరచుకుని ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. 

ఈ చిత్రంలో  *'చెంప చేసినా కంపు చేసితివి చెడ్డ దానివే*' అనే పాట రేలంగితో కలిసి కనకం స్వంతంగా పాడింది. ఆమెకు ప్లేబేక్ లేదు. ఈ చిత్రం విజయోత్సవ వేడుకల్లో చిత్ర నిర్మాత మీర్జాపురం రాజావారు ఈమెకు కూడా పది కాసుల బంగారం కానుకగా ఇచ్చారట. 

కీలు గుఱ్ఱం తర్వాత అంజలి, కనకంలకి అలాంటి వేషాలే వస్తాయని ప్రచారం జరిగింది కాని అంజలికి *'శ్రీలక్ష్మమ్మ కథ*' లో సాత్వికమైన కథానాయిక పాత్ర లభించింది. కనకం మాత్రం కథానాయిక అవుదామని ఎంత ప్రయత్నించినా కాలేకపోయింది. నాటకాల నుంచి సినిమాలకు, తర్వాత మళ్లీ నాటకాలకు ప్రస్థానం కనకం జీవితం.

కనకం పశ్చిమ బెంగాల్లోని ఖర్గపూర్లో 1930 నవంబర్ 12న జన్మించింది. తండ్రి అప్పలస్వామి రైల్వేలో డ్రైవరు. తల్లి షోలాపురమ్మ.

ఇది ఖర్గపూర్ గ్రామ దేవత పేరు. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్లు తిరిగి విజయవాడలో స్థిరపడ్డారు. 

కనకం అసలు పేరు కనక దుర్గ. సినిమాల్లో కనకంగా ప్రసిద్దు రాలైంది. విజయవాడలో చదువుకున్న కనకం తెలుగు భాషపై మంచి పట్టు సంపాదించింది. *విజయ విలాసం* లాంటి ప్రబంధాల్లోని పద్యాలు ఆమెకు కంఠోపాఠం. 

ఈమె బంధువులు నాటక రంగంలో ఉండేవారు వారి దగ్గర శిక్షణ పొంది కనకం నాటకాల్లో నటించింది. 12 ఏళ్ల వయసులో కె.వి. గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో *'ప్రతిమ'* నాటకంలో ప్రతిమ సుందరిగా మొదటిసారి నటించి పెద్దల మెప్పు పొందింది. 

ఆ తర్వాత ఎక్కడ నాటకం జరిగినా *ప్రహ్లాదుడు, బాలకృష్ణుడు, లోహితాస్యుడు* వంటి బాల పాత్రలన్నీ ఈమె ధరించేది. రెండో భార్యగా వెళ్లడానికి ఇష్టం లేక పెళ్లి తప్పించుకోడానికి మద్రాసు వెళ్లి తాపీ ధర్మారావు గారి సహాయంతో రేడియోలో జానపద గేయాలు పాడి శ్రోతలను రజింప జేసింది.

1946లో సారధి వారి *గృహ ప్రవేశం'* చిత్రంలో ఆమె మొదటి సినిమా వేషం వేసింది. ఈ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ దర్శకులు. ఇందులో ఈమెది బాలవితంతువు పాత్ర. కీలు గుర్రం తర్వాత ఆమెకు వచ్చిన వేషాలన్నీ హాస్య పాత్రలు, శృంగార పాత్రలే. *'గుణ సుందరి'* కథలో మకర కన్యగా నటించింది. ఈ పాత్రతో ఈమెకు 'సెక్స్ స్టార్' అనే పేరు ప్రచారంలోకి వచ్చేసింది. 

కనకం తన పాటలు తానే పాడుకున్నారు. *'రక్ష రేఖ*' లో ప్రసిద్ధ హాస్య నటులు కస్తూరి శివరావు సరసన నటించింది. 
*'సేయి సేయి కల్పుకో రామావా*... పాటపాడారు. *'మానవతి'* చిత్రంలోనూ *పెళ్లాం పెళ్లాం*' పాట పాడారు. 

టింగ్ రంగా చిత్రంలో నల్ల రామ్మూర్తితో కలిసి *'ఓ టింగారమా ఓ సింగారమా*' పాట పాడారు. 

*సౌదామిని, సతీసక్కుబాయి* చిత్రాల్లో రేలంగితో కలిసి నటించారు. విజయా వారి షావుకారు చిత్రంలో *చాకలి రామి* పాత్ర ఈమెకు పేరు తెచ్చింది. అందులో చీర మోకాళ్లపైకి ఎత్తి కట్టి, పైట చెంగు జారవిడుస్తూ, అమాయకంగా తేగలు నముల్తూ తళుకుల బెళుకుల శృంగార చేష్టలతో రౌడీ రంగడిని (ఎస్వీ రంగారావు) వల్లో వేసుకునే పాత్ర. ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్.టి.రామారావు ఈమెను రామక్క అని పిలవడంతో అందరూ రామి, రామక్క అనేవారు. ఈమె *'దాసి*' చిత్రంలో ఎన్.టి.ఆర్కు రెండో భార్యగా నటించారు. గోపీచంద్ గారి ' *ప్రియురాలు*' చిత్రంలో వేశ్య మాత పాత్రలో సరసమైన జావళీపాడింది.

కనకం మరి కొన్ని చిత్రాల్లో కూడా నటించినా సినిమా రంగంలో నిలదొక్కుకో లేకపోయింది. మంచి పాత్రలే రాలేదు. చిత్రాల్లో నటిస్తున్నా ఆమె నాటక రంగాన్ని విడిచిపెట్ట లేదు. సినిమాల్లో హాస్య పాత్రలను రసవత్తరంగా
బాషించిన కనకం నాటకాల్లో పురుష పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు.

ఆమె *కృష్ణుడు, రాముడు, నారదుడు, అర్జునుడు* పాత్రలు ధరించింది. ప్రసిద్ధ నటులు పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ, అబ్బూరి కమలాదేవి వంటి వారితో కలిసి నటించింది. 

చింతామణి నాటకంలో ఈమె *చింతామణిగా* నటించగా నల్ల రామ్మూర్తి శ్రీహరిగా, రఘు రామయ్య భవానీశంకరుడుగా, రేలంగి సుబ్బ శెట్టిగా, మాధవపెద్ది సత్యం బిల్వమంగళుడుగా నటించారు.

1956లో  *దేశ దిమ్మరి*' అనే చిత్రం నిర్మించాలని సన్నాహాలు చేసుకుంది. ఈ చిత్రానికి శ్రీ శ్రీ, ఆరుద్ర రచయితలు. పెండ్యాల సంగీత దర్శకులు జిక్కి, రావు బాల సరస్వతి, ఘంటసాల పాటలు పాడారు. కానీ చిత్రం ఆగిపోయింది. నాటక రంగంలో ఉండగానే మళ్లీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరుసగా ఎ.వి.ఎం వారి *లేత మనసులు, భక్త ప్రహ్లాద, అవే కళ్లు* చిత్రాల్లో నటించారు. భక్త ప్రహ్లాదలోని *'పాములోళ్లమండి* ... ఆమె చివరి పాట. 1970లో రామానాయుడు గారి *'ద్రోహి'* ఆమె చివరి చిత్రం. ఈ తర్వాత ఆమె 1982 వరకు నాటకాల్లో వేషాలు వేస్తూనే ఉంది. 

మద్రాసులో సినీరంగంలో శ్రీశ్రీ, ఆరుద్ర ఆమెకు ఆప్తులు. ఆరుద్ర ఈమె ఇంట్లోనే కూర్చుని సినిమా రచనలు చేసుకునేవారు. 

ఒకప్పుడు విలాసంగా మద్రాసులో జీవించిన కనకం నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ వారిస్తున్న కొద్దిపాటి ఆర్ధిక సాయంతో విజయవాడలో బ్రతుకు సాగించారు. కనకం గారిని మద్రాస్ తెలుగు అకాడమీ, *అజో - విభో*, *మా*' మొదలైన సంస్థలు పురస్కారాలతో సత్కరించాయి.

*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)

 *_ఎన్నటికీ వీడనిది తల్లిదండ్రుల ఋణానుబంధం_*

🍃🍃🏵️🍃🍃🏵️🍃🍃


*"పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది.* 


*పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.*


*శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు కాసాగాడు.* 


*అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, _"ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను"_ అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.*


*కంసుని చెరసాలనుండి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని ఇలా వ్యక్తపరిచారు:*


_తేటగీతి_

*_మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు_*

*_నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న_*

*_మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె_*

*_యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు_* _(దశమస్కంధం - పోతన భాగవతం)._

*’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు.’*


*బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.*

*-----స్వస్తి*

🙏🙏🙏🙏

_(శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)_

*_-•{Suguna Rupanagudi గారి ఫేస్బుక్ వాల్ నుంచి సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}•-_*

 *_మార్కులు, ర్యాంకులు తేవడం వేరు - తెలివితేటలు వేరు_*
*!!!!!!!!!!!🤪😜!!!!!!!!!!!*

*ఇంటర్ లో 99% మార్కులు తెచ్చుకుని, ఐ.ఐ.టి ఢిల్లీలో సీట్ కొట్టి.....,*
*ఆ జిల్లాలోనే తెలివైన కుర్రోడిగా పేరు తెచ్చుకున్నాడు సుందరం కొడుకు. ఆ తర్వాత ఎక్కడికన్నా టూర్ తీసుకెళ్లమని వాళ్ళ నాన్నతో ఒకటే గోల.*

*కొడుకు బాధ పడలేక ఎక్కడకి తీసుకెళ్ళాలో  చెప్పమన్నాడు సుందరం.* 

*"మంచి చలికాలం.. ఒక రాత్రిపూట లంబసింగిలో టెంట్ వేసుకుని పడుకుంటే, ఎంతో బాగుంటుందట" అన్నాడా అబ్బాయి.* 

*అనుకున్న విధంగానే టెంట్ ఒకటి కొన్నారు. శనివారం ఉదయం బయలుదేరి సాయంత్రానికి లంబసింగి చేరుకున్నారు. అక్కడ వెతికి వెతికి మంచి ప్లేస్ ఒకటి పట్టుకుని, టెంటు వేసుకుని పడుకున్నారు ఆ తండ్రీ కొడుకులు.* 
*
*
*మంచి నిద్రలో ఉండగా మధ్య రాత్రిలో   కొడుకుని లేపి ఆకాశంలోకి చూడమన్నాడు సుందరం.* 

*కప్పుకున్న రగ్గు ముఖంమీద వరకూ తొలగించి, పైకి చూశాడు కొడుకు......* 

*"ఏమి  కనపడుతుందిరా?" అడిగాడు సుందరం.* 

*"నక్షత్రాలు!" అన్నాడు కొడుకు.*

*"అవి చూస్తూంటే... నీకేం అర్ధం అయింది" అనడిగాడు సుందరం.* 
*"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే శుక్రుడు మకరరాశిలోకి వెళ్తున్నాడు.* 

*జీవ శాస్త్రం ప్రకారం చూస్తే జీవం ఉన్న ఏకైక గ్రహం మీద మనమున్నాం.* 

*అంతరిక్ష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ విశ్వము అనంతమైనది.* 

*భౌతిక శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమిని, దాని మీద ఉన్న మనల్ని తిప్పుకుంటున్నాడు.* 

*రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే, ఈ విశ్వములో ఉదజని 99 శాతం ఉంది" అన్నాడా కొడుకు.*

*ఇంతలా అడుగుతున్నావు, _"ఇంతకీ నీకేమర్థమయింది నాన్నా?"_ అనడిగాడా అబ్బాయి,*
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
*"మన టెంట్ ఎవడో దొబ్బుకెళ్ళాడ్రా నిద్రమోహమోడా-"* 
*అని తిట్టాడాయన ఐ.ఐ.టి లో సీట్ తెచ్చుకున్న కొడుకుని.* 😌

*అందుకే చెప్పేది....*
*కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, లోకజ్ఞానం కూడా నేర్పండి అని...*
*పాత కథే అయినా మళ్లీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి కథనం.*
*^^^^^^^^^^^^^^^^^^^^^*
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు 🙏}_*
_______🌹🪷🌹_______
 🌺కాఫీ తాగందే రోజు మొదలు కాదు..అలాంటి కాఫీ వెనక  కథని గొల్లపూడిగారు ఎంత అద్బుతంగా చెప్పారో చూడండి. 🌺

🌺రచన - గొల్లపూడి మారుతీరావు గారు🌺

🌺ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. దాదాపు 55 సంవత్సరాల కిందట- నేను చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓ వ్యాసాన్ని రాశాను. దాని పేరు ‘కాఫ్యాంతం కావ్యం’. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత... 

7వ శతాబ్దంలో ఇథియోపియాలో ఓ గొఱ్ఱెల కాపరి పొలంలో పచ్చగడ్డిని తింటున్న గొఱ్ఱెలు ఉన్నట్టుండి మత్తుగా ఉండటాన్ని గమనించాడట. కారణం- ఒకంతకిగాని అర్థం కాలేదు. చెట్లకి కాసిన ఏవో వింత పళ్లు తినడం కారణంగా వాటిలో ఈ మార్పు వచ్చిందని కని పెట్టాడట. తనూ తిన్నాడు. తనకీ మత్తుగా అనిపించింది. ఆ విధంగా మొదటి కాఫీ గింజల రుచి మనిషికి అందింది.

క్రమంగా సంపన్న కుటుంబాల వారికి ఈ మత్తు అందింది. ఇస్లాం దేశాలలో ఈ గింజలతో ‘గావా’ అనే వైన్‌ని తయారు చేసేవారట. ఈ వైన్‌ని ‘వైన్ ఆఫ్ అరేబియా’, ‘డెవిల్స్ డ్రింక్’ అనేవారట. అయితే మత్తు రుచిగా, సుఖంగా ఉంది కదా? ఈ కారణానికే క్రైస్తవ దేశాలలో ఈ గింజల ద్రావకాన్ని వింతగా చూశారు. మరి దీన్ని నిషేధించాలా వద్దా? ఎవరు నిర్ణయించాలి? పోప్‌గారి దగ్గరికి ఈ ధర్మ సందేహం చేరింది. ఆయనా కాఫీని రుచి చూశారు. చూసి తన్మయుడయిపోయాడు. నిషేధించడానికి మనసు రాలేదు. కాగా, తమ సొంతం చేసుకోవాలని మనసు ఉవ్విళ్లూరింది. దాన్ని నిషేధిం చకపోగా ఈ ద్రావకానికి మతాన్ని ఇచ్చి ‘పెద్దల ద్రావకం’గా అంగీకరించారు. అప్పటి నుంచీ వాటికన్‌లో ఈ కాఫీ జొరబడింది. 🌺

🌺టర్కీలో ఈ కాఫీ ఇంకా ప్రాధాన్యం సంపాదించుకుంది. సమాజ ధర్మంలో భాగమయిపోయింది. పెళ్లికి ఫలానా అమ్మాయి వరుడుకి తగిన భార్య అవునా కాదా ఎలా నిర్ణయించాలి? ఆ పిల్ల కాఫీ తయారు చేయాలి. ఆ కాఫీ రుచిని బట్టి ఆ అమ్మాయిని ఎంపిక చేసేవారట. అది ఆ అమ్మాయి మొదటి అర్హత. ఇంకా విడ్డూరం ఏమిటంటే ఏ కారణం చేతయినా అమ్మాయి కాపురం చేస్తూ కాఫీ తయారు చేసే ఒడుపుని నష్టపోతే- భర్త కోర్టుకి వెళ్లి విడాకులకి అర్జీ పెట్టుకోవచ్చు. టర్కీ ఆడపిల్ల ఏదయినా నష్టపోవచ్చుకానీ, కాఫీ తయారు చేసే పనివాడితనాన్ని పోగొట్టుకోకూడదు.

భారతదేశంలో కాఫీ కథ ఇంకా విచిత్రమైనది. బాబూ బూడాన్ అనే సూఫీ ముస్లిం మత ప్రవక్త 16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకి వెళ్లి తిరిగి వస్తూ యెమన్ నుంచి ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి తీసుకువచ్చాడు. ఏడు గింజలే ఎందుకు? ఇస్లాంకి 7 చాలా పవిత్రమైన అంకె కనుక. వాటిని కర్ణాటకలో చిక్ మగుళూర్ కొండల్లో నాటాడు. అప్పట్లో ఆ కొండల్ని దత్తాత్రేయ కొండలు అనేవారట. దరిమిలాను కర్ణాటక, నాగినహళ్లి ప్రాంతంలో కొండల్ని ఇప్పటికీ బాబూ బుదం గిరి - అని అంటారు. 7 గింజలతో దిగుమతి అయిన కాఫీని ప్రస్తుతం 107 దేశాలకు భారతదేశం ఎగుమతులు చేస్తోంది.
ఈ కాఫీ పంటకీ అరకు లోయకీ బంధుత్వముంది. 

1890 ప్రాంతంలో అరకు లోయ పొలాల్లో 3 సంవత్సరాల దిగుబడి ఇచ్చే పంటల తర్వాత పోడు వ్యవసాయానికి  ప్రత్యామ్నాయంగా ఈ కాఫీ పంటని అప్పటి జయపూర్ మహారాజు, బ్రిటిష్ రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో వేశారట. ఇప్పటికీ యూరోపు ‘మార్నింగ్ కాఫీ’కి అరకులో పండిన కాఫీ గింజలనే శ్రేష్ఠంగా చెప్పుకుంటారు. 
అసలు వినడానికే ఇబ్బందిగా, కాస్త వెగటుగా, కాని వాస్తవమయిన విచిత్రమైన కాఫీ ఒకటుంది. అది ఇండోనేసియాలో తయారవుతుంది. చాలా ఖరీదయిన, ఎంతో రుచికరమైన కాఫీ అది. ఇండోనేిసియాలో ‘సివిట్’ అనే పిల్లికి కాఫీ పళ్లు తినిపిస్తారట. 🌺

🌺కాఫీ గింజలమీద ఉన్న పొట్టుకోసం పిల్లి తింటుంది. పొట్టు ఊడి, గింజలు పిల్లి శరీరంలో ప్రయాణం చేసి, దాని పేగులలోంచి వెళ్తూ కొన్ని రసాయనికమైన మార్పులకు లోనవుతాయి. తర్వాత పిల్లి ఆ గింజల్ని విస ర్జిస్తుంది. వాటిని ఏరి, శుభ్రం చేసి, వేయించి కాఫీ చేస్తారు. ఈ కాఫీ చాలా విలువైనది, రుచికరమైనది, ఖరీదైనది. ఒక కప్పు 5 డాలర్ల నుంచి వంద డాలర్లు ఉంటుంది. దీని పేరు ‘సివిట్ షిట్ కాఫీ’ (తెలుగులో ‘సివిట్ పెంట కాఫీ’).

మా ఆవిడ చెప్పిన కథ - దాదాపు 65 సంవత్సరాల కిందట రాజమండ్రిలో ఆమె నాయనమ్మ - అంటే శ్రీపాద కామేశ్వరరావుగారి సతీమణి రూలు ప్రకారం కాఫీని చిన్న పిల్లలు తాగకూడదు. ఎందుకని? మత్తు రుచులు మరిగి చెడిపోతారని. మా అత్తగారు - అంటే ఆవిడ పెద్ద కోడలు - తన అత్తగారికి తెలియకుండా పిల్లలకి చిన్న గ్లాసుల్లో కాఫీ అందించేదట. వీళ్లు తలుపు చాటున నక్కి - దొంగతనంగా కాఫీ తాగి ఆనందించేవారట. ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ‘.... జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని వాపోయాడు శ్రీనాథుడు. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. అలాగే ఆలోచనలోకయినా రాని ఒకప్పటి ద్రావకం ఇవాళ నిత్యావసరమైపోయింది. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. 🌺
 ఇక్కడ డబ్బుతో కొనలేనివి – అందరికీ అవసరమైనవి అనే ముఖ్యమైన విషయాలపై ఒక స్పూర్తిదాయకమైన జాబితా ఉంది. ఇది WhatsApp కోసం అనుకూలంగా రూపొందించబడింది, బైలింగ్వల్ ఫార్మాట్లో, కాపీ కోడ్ స్టైల్‌తో.


---

✦ *డబ్బుతో కొనలేనివి – అందరికీ అవసరమైనవి* ✦
✦ *60 Things Money Can’t Buy – Everyone Needs*✦


ఇవాళ మనం ఎదుగుదల, సంపాదనపై మాత్రమే దృష్టి పెట్టి, నిజంగా జీవితం సార్థకమయ్యే విలువలను మర్చిపోతున్నాం. డబ్బుతో ఇల్లు కొనొచ్చు, కానీ ఇంటి వాతావరణాన్ని కాదు. మనిషి డబ్బుతో వస్తువులు పొందొచ్చు, కానీ ప్రేమ, గౌరవం, నమ్మకాన్ని మాత్రం కాదు. ఈ 60 విషయాలు మన జీవితం సంపూర్ణంగా ఉండాలంటే అవసరం, కానీ ఇవి డబ్బుతో రాకపోవడమే వీటి గొప్పతనం.

1. Love – ప్రేమ  
2. Trust – నమ్మకం  
3. Peace of mind – మానసిక శాంతి  
4. True friendship – నిజమైన స్నేహం  
5. Family bonding – కుటుంబ అనుబంధం  
6. Respect – గౌరవం  
7. Health – ఆరోగ్యం  
8. Happiness – ఆనందం  
9. Sleep – నిద్ర  
10. Kindness – దయ  
11. Honesty – నిజాయితీ  
12. Time – సమయం  
13. Good memories – మంచి జ్ఞాపకాలు  
14. Gratitude – కృతజ్ఞత  
15. Inner strength – అంతఃశక్తి  
16. Wisdom – జ్ఞానం  
17. Empathy – మనస్పూర్తి  
18. Innocent laughter – అమాయకపు నవ్వు  
19. Moral values – నైతిక విలువలు  
20. Self-respect – ఆత్మగౌరవం  
21. Courage – ధైర్యం  
22. Good intentions – మంచి ఉద్దేశాలు  
23. Pure heart – నిర్మలమైన హృదయం  
24. Forgiveness – క్షమా గుణం  
25. Self-love – స్వయాన్ని ప్రేమించడం  
26. Inner peace – అంతరంగిక శాంతి  
27. Trustworthiness – విశ్వసనీయత  
28. Supportive people – తోడ్పాటు కలిగించే వ్యక్తులు  
29. Open mind – ఓపెన్ మైండ్  
30. Purpose in life – జీవిత ఉద్దేశ్యం  
31. Spirituality – ఆధ్యాత్మికత  
32. Inspiration – ప్రేరణ  
33. Smile from the heart – హృదయపు చిరునవ్వు  
34. Discipline – క్రమశిక్షణ  
35. Personal growth – వ్యక్తిగత అభివృద్ధి  
36. Loyalty – విశ్వాసం  
37. Good habits – మంచి అలవాట్లు  
38. Sincerity – హృదయపూర్వకత  
39. Freedom – స్వేచ్ఛ  
40. Being present – ప్రస్తుతాన్ని ఆస్వాదించడం  
41. Fairness – న్యాయం  
42. Life lessons – జీవిత పాఠాలు  
43. Mindfulness – జాగ్రత్తగా జీవించడం  
44. Self-awareness – ఆత్మజ్ఞానం  
45. Compassion – కరుణ  
46. Acceptance – అంగీకారం  
47. True character – నిజమైన స్వభావం  
48. Respect for others – ఇతరుల పట్ల గౌరవం  
49. Humility – వినయము  
50. Real experiences – నిజమైన అనుభవాలు  
51. Legacy – మన తరువాత తరాలకు మిగిల్చే విలువ  
52. Blessings – ఆశీర్వాదాలు  
53. Faith – విశ్వాసం  
54. The power of silence – మౌన శక్తి  
55. Nature’s beauty – ప్రకృతి సౌందర్యం  
56. Self-control – ఆత్మ నియంత్రణ  
57. Contentment – సంతృప్తి  
58. Good will – మంచి మనసు  
59. Clean conscience – నిర్మలమైన మనస్సు  
60. A life well-lived – బాగా బ్రతికిన జీవితం

**ముగింపు:**  
జీవితం అంటే డబ్బు మాత్రమే కాదు. మనసుకు తృప్తిని ఇచ్చే నిజమైన సంపదలు ఇవే. ఇవి నిత్యం సాధించాలి, పోషించాలి. డబ్బు నశించొచ్చు, కానీ మంచి మనుషుల మధ్య నమ్మకం, ప్రేమ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ 60 విలువల జాబితా ప్రతి మనిషి హృదయంలో ఉండాలి. ఇవే నిజమైన జీవన సంపద.
 *🌹నేటి మంచి మాట 🌹*
*🌷విజయ రహస్యమంతా ఓర్పు, సహనంలోనే దాగి ఉంది. ఇవి రెండు లేనివారి కృషి ఫలప్రదం కాదు.*

*🌷లభించిన గుర్తింపు, ప్రశంసలు అహంకారానికి మూలం కాకుండా జాగ్రత్త పడాలి.*

*🌷జీవితంలో అన్ని కోల్పోయినా...  ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు.*
*మనల్ని బలవంతులుగా మార్చే... ప్రతీ అంశాన్ని తీసుకుందాం..!! బలహీనులుగా మార్చే... ప్రతీ ఆలోచనలను తిరస్కరిద్దాం..!!*                            🌷🌷🌷🌷🌷🌷🌷🌷
 *విశ్వ సూక్తి దర్శనం అక్షరాలు* Dt.12-04-2025.

       *ఎండ్ బర్క్* :

* మూర్ఖత్వానికీ, అమాయకత్వానికీ నడుమ వివేకానికి గొంతు పూడుకు పోతుంది.

* ఎంతటి కాళరాత్రిలోనైనా గంటకి వుండేది అరవై నిముషాలే. కనుక మనసు చతికిలబడకూడదు.

* ప్రపంచంలో నాయకులు రెండురకాలుగా వుంటుంటారు. మొదటి రకం నాయకులు నిజమైన నాయకులు. రెండవరకం నాయకులు నాయకుల్లా నటించి చెలామణీ అయ్యేవారు. నిజమైన నాయకులు భవిష్యత్తుని గూర్చిన ప్రణాళిక తయారుచేస్తుంటే, నకిలీనాయకులు వర్తమానాన్ని కొలుస్తుంటారు. ఆ నకిలీ నాయకులు ఏరోజు కారోజు జీవిస్తూ, సిద్ధాంతాలకోసం కాక చెలామణీ అవడం కోసం పాకులాడుతుంటారు. అయితే, అసలు నాయకులు మాత్రం సిద్ధాంతాలకి జీవం పోయడానికి, చరిత్రపుటల్లో శాశ్వతమైన స్థానాన్ని సముపార్జించుకోవడానికీ నిండుమనసుతో కృషి చేస్తుంటారు.
 తెలివితో కొట్టాలి దెబ్బ (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరి కిషన్-9441032212
*******
     ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు వుండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు. ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు.

పల్లవుడు చానా చెడ్డోడు. చుట్టుపక్కల వున్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు. ఏవైనా వినకపోతే దాడి చేసేవాడు. దాంతో వానికి భయపడి అన్నీ అలాగే చేసేవి.

మనోహరుడు చానా మంచివాడు. తన గుంపులోని ఎలుకలను సొంత బిడ్డలలాగా చూసుకునేవాడు. వాటికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు. తోడునీడగా వుండేవాడు. దాంతో ఎలుకలన్నీ మనోహరాన్ని ఎంతగానో అభిమానించేవి.

మనోహరునికి మంచి పేరు రావడం చూసి పల్లవుని కన్ను కుట్టింది. ఎలాగైనా సరే ఆ గుంపును దెబ్బ తీయాలని రకరకాల ఆయుధాలు తయారు చేయించినాడు. ఒకసారి మనోహరునితో ''నాకు లొంగిపోయి ఈ అడవి వదలి పారిపోతావా లేక యుద్ధానికి సిద్ధపడతావా'' అంటూ సవాల్‌ విసిరినాడు.

మనోహరుడు ఆలోచనలో పడినాడు. పల్లవుని దగ్గర చానా ఆయుధాలు వున్నాయి. యుద్ధం వల్ల అనవసరంగా ఇరువైపులా చానామంది చనిపోతారు. పిల్లలకు నాన్నలు, పెళ్ళాలకు మొగుళ్ళు దూరమైపోతారు. అనేక మంది వికలాంగులు అవుతారు. సంపదంతా నాశనం అవుతుంది. యుద్ధం ఎలా చూచినా మంచిది కాదు. తనవల్ల పదిమందికి మేలు జరగాలే గానీ కీడు జరగకూడదు అనుకోని అడవి వదలి వెళ్ళడానికి సిద్ధపడినాడు.

అది చూసి ఆ గుంపులోని ఎలుకలన్నీ కన్నీరు పెట్టుకున్నాయి. అప్పుడు ఆ గుంపులోని ఒక చిన్న ఎలుక ''రాజా... ఎవరికీ ఎటువంటి ఆపద కలగకుండా... ఆ పల్లవుడే అడవిని వదలి పారిపోయేలా నేనొక ఉపాయం చెబుతా వింటానంటే'' అనింది.

''మంచిమాట చెప్పడానికి వయసుతో పనిలేదు. తెలివితేటలు ఎవరి సొంతమూ కాదు. చెప్పు'' అన్నాడు మనోహరుడు.

''రాజా... మన ఎలులు అన్నింటికీ పిల్లి అంటే భయం. అందుకే మనం అచ్చం పిల్లిలాగా ఒక పెద్ద నడిచే బొమ్మ తయారు చేద్దాం. యుద్ధంలో దాన్ని ముందు పెట్టి బైలుదేరుదాం'' అంటా ఏం చేయాలో చెప్పింది.

అందరికీ ఆ ఉపాయం నచ్చింది.

వారం లోపల ఒక పెద్ద పిల్లి తయారయిపోయింది. దాని మెడలో ఒక పెద్ద గంట కట్టినారు. వెంటనే అడవిలో ఒక పుకారు లేవదీసినారు. మనోహరుని మంచితనం చూసి సాయంగా యుద్ధం చేయడానికి పక్క వూరు నుంచి ఒక పెద్ద పిల్లి వచ్చింది. అది మామూలు పిల్లుల కంటే పదింతలు పెద్దగా వుంది. దెబ్బకు వంద ఎలుకలని చంపుతుంది'' అని. ఆ మాటలు అడవంతా పాకిపోయినాయి. పల్లవుని వైపు వున్న ఎలుకలన్నీ భయంతో వణికి పోసాగినాయి.

తరువాత రోజు... యుద్ధంలో ముందు పిల్లి అడుగులో అడుగు వేసుకుంటా భయంకరంగా మియావు అని అరుచుకుంటా  రాసాగింది. దాని మెడలో వున్న గంట గుండెలు అదిరిపోయేలా గణగణమని మోగసాగింది. దాని వెనుకే మనోహరుని సైనికులు. దూరం నుంచి దాన్ని చూసిన పల్లవుని సైనికులు అదిరిపడినారు. ''అమ్మో ... నిజమే... ఎంత పెద్దగుంది. ఇది కొడితే దెబ్బకు పదిమంది పచ్చడి పచ్చడి అయిపోతారు'' అనుకుంటా వెనక్కి తిరిగి ఆగకుండా పారిపోయినారు. అంతే ఒక్క నిమిషంలో పల్లవుడు తప్ప అక్కడ ఎవరూ లేరు. పల్లవుడు అదిరిపడినాడు. ''ఇంక ఇక్కడ ఒక్క క్షణం వున్నా నాకు చావు తప్పదు. బుద్ది పొరపాటై అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాను. ఇంగెప్పుడూ మంచివాళ్ళతో గొడవ పెట్టుకోగూడదు'' అనుకుంటా వెనక్కి తిరిగి అడవి వదలి పారిపోయినాడు.
*********
 *📖 మన ఇతిహాసాలు 📓*


*హిడింబి*


హిడింబి మహాభారతంలో భీముని భార్య. ఘటోత్కచుడు ఆమె కుమారుడు. ఆదిపర్వంలోని 18 వ ఆశ్వాసంలో హిడింబి భీముని కలుసుకుంటుంది. ఈమెకే పల్లవి అనే పేరు కూడా ఉంది.

పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు. అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు. వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు. తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు. కానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది. భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది. భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు. ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు.

సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు. ధర్మరాజు అడ్డుకుంటాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది. ఆమె కుమారుణ్ణి హిడింబిని పెళ్ళాడమని ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు. హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
*✅తెలుసు కుందాం✅*


*🟥ఓల్టేజి విలువలు తక్కువైనపుడు, విద్యుత్‌ పరికరాల్లో కరెంటు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఎందుకు?*

🟢మనం ఇళ్లలో వాడే విద్యుత్‌ పరికరాలను రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒక రకం విద్యుచ్ఛక్తిని ఉష్ణశక్తిగా మార్చే ఎలక్ట్రిక్‌ ఐరన్‌, ఎలక్ట్రికల్‌ హీటర్‌. ఎలక్ట్రిక్‌ బల్బులయితే, మరోరకం విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే ఎలక్ట్రిక్‌ మోటార్లు లాంటివి.

మొదటి రకం పరికరాల్లో వాటి గుండా ప్రవహించే విద్యుత్‌ ప్రవాహం (ఎలక్ట్రిక్‌ కరెంటు) ఓల్టేజి వర్గమూలానికి (square root) అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్ల సప్లయి అయ్యే విద్యుత్‌ ఓల్టేజి తక్కువగా ఉంటే, కరెంటు విలువలు కూడా తక్కువగా ఉంటాయి.

రెండవ రకం ఎలక్ట్రిక్‌ మోటార్ల విషయంలో అవి పనిచేయడానికి కావలసిన విద్యుత్‌ సామర్థ్యం (ఎలక్ట్రిక్‌ పవర్‌) ఆ పరికరాలపై, (మామూలుగా వాటు (watts)లేక కిలోవాట్ల (kw)లో) బిగించబడిన ప్లేట్లపై మార్కు చేసి ఉంటుంది. అలాంటి పరికరాల్లో ప్రవహించే ఎలక్ట్రిక్‌ కరెంటు, వాటికి అప్లయి చేసిన ఓల్టేజికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే, అప్లయి చేసిన ఓల్టేజి విలువలు తక్కువగా ఉంటే వాటిపై పనిచేసే ఎలక్ట్రిక్‌ మోటార్లు చెడిపోతాయి. కారణం, అవి ఎక్కువ ఎలక్ట్రిక్‌ కరెంటును రాబట్టడంతో వాటిలో ఉండే విద్యుత్‌ ప్రవహించే తీగ చుట్టలు అతిగా వేడెక్కి కాలిపోతాయి.
 *🌷శుభోదయం🌷*

🌻 *మహనీయుని మాట*🍁
        
*🌷మనం మంచి చేసినా పరిస్థితులు చెడుగా ఋజువు చేయవచ్చు.*
*అంత మాత్రం చేత చేసిన మంచి చెడ్డది కాదు. కాలమే తరువాత ఆ మంచి విలువను చూపిస్తుంది. ఓర్పుతో ఉండడమే ఉత్తమ లక్షణం.*
 
🌹 *నేటి మంచి మాట* 🌼
      
*🌷విలువ లేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
 సూచన....,.

సమయం ఉంటేనే
చదవండి....



*చార్లీ చాప్లిన్ 88 ఏళ్ల వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు ఇచ్చాడు.*

*(1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు.*

*(2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు.*

*(3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు.*

*(4) ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు...*
*1. సూర్యకాంతి,*
*2. విశ్రాంతి,*
*3. వ్యాయామం,*
*4. డైట్,*
*5. ఆత్మ గౌరవం*
*6. ఫ్రెండ్స్.*
*వాటిని మీ జీవితంలో అన్ని దశల్లో ఉంచుకోండి మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించండి...*

*చంద్రుడిని చూస్తే దేవుడి అందం కనిపిస్తుంది... సూర్యుడిని చూస్తే దేవుని శక్తి కనిపిస్తుంది... అద్దంలో చూస్తే దేవుని అత్యుత్తమ సృష్టి కనిపిస్తుంది అప్పుడు నమ్మండి. మనమంతా టూరిస్టులమని. ఇప్పటివరకు మన యాత్రలు, బుకింగ్ లు, గమ్యస్థానాలను తయారు చేసిన మన ట్రావెల్ ఏజెంట్ దేవుడు మాత్రమే. అతడిని నమ్మండి మరియు జీవితాన్ని ఆనందించండి.*


*జీవితం ఒక ప్రయాణం మాత్రమే!*
 *భవిష్యత్తులో రాబోయే రాజకీయ పార్టీల ఉచిత హామీ పథకాలు...🤦‍♂️*

01. *'గొంతులోకే గోరుముద్ద పథకం' తో...                  ప్రతి ఇంటికీ వండిన వంటకాలు.*

02. *'చేతిలో చత్వారం' పేరుతో అందరికీ స్మార్టు ఫోన్లు ఇచ్చి ఫ్రీ ఇంటర్నెట్టు, ఫ్రీ ఓటీటీ ఛానెల్సు.*

03. *'లివరులోకే లిక్కరు' పథకంతో ఇంటింటికీ బ్రాందీ పైపులు.*

04. *'మస్తిష్కానికే మత్తు' పేరుతో ప్రజలందరికీ మత్తు పదార్ధాల సప్లై.*

05. *'ఇంటికీ ఒంటికీ పథకం' పేరుతో ఉచిత ఇల్లు, ఉచిత ఫర్నీచరు, ఉచిత పవరు సప్లై.*

06. *'బద్దకస్తులకి బట్టలు' పేరుతో ఆర్నెల్లెకో రెండు జతల ఉచిత బట్టలు.*

07. *'నీడ బతుకులకి ఎండ తోడు' పథకంతో ఇంట్లో ఉండి బోరుకొట్టేసిన బతుకులకి ఉచిత విదేశీ పర్యటన.*

08. *'పాదాల వద్దకే పుణ్యం' పేరుతో భగవంతుడ్నే గుమ్మం దగ్గరకి తెచ్చే పథకం.*

09. *'చదువెందుకు చంకనాకను' పథకం పేరుతో చదవకపోయినా 99% మార్కులతో మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు.*

10. *'చెప్పినవి చేయం అసలేం చెప్పం' పథకం క్రింద మీ నమ్మశక్యానికి వీలులేని భయానక పథకాల్ని అమలు పరచడం*

11. *'వృద్ధ యువతకి బద్దకరత్న' బిరుదులు ప్రధానం చేయబడును.*                 

12. *'పిడకలపై పడకలు' పేరుతో వైభవోపేతంగా ఉచిత అంతిమ యాత్ర వేడుకలు.*

*కాబట్టి మీ ఖరీధైన ఓటుని మా పార్టీకే అమ్ముకోవాలని ప్రార్ధన.*

*ఇట్లు...                                                                                     మిమ్మల్ని అక్కున చేర్చుకొని, ఆదరించే పార్టీ నాయకుడు.😁🫣*
 *ఒక్క బాత్రూమ్ కోసం రూ.1.65 లక్షలు, ఒకే దెబ్బకు దేశం లోని అన్ని పెట్రోల్ బంకులకు గుణపాఠం నేర్పిన మహిళ*:- భారతదేశం లో పెట్రోల్ బంకులు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభించే ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా పొందవచ్చు. దూర ప్రయాణాలు చేసే వారు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రెస్ట్‌రూమ్ సదుపాయం లాంటి వాటిని వాడుకోవచ్చు. ప్రభుత్వం దేశంలోని పెట్రోల్ బంకుల్లో బాత్రూమ్ వాడకాన్ని ఉచితంగా అందుబాటు లో ఉంచాలని సూచనలు చేసింది. మీరు అక్కడ పెట్రోల్ నింపినా, నింపకపోయినా, టాయిలెట్‌ ను ఉపయోగించేందుకు ఎలాంటి షరతలు ఉండకూడదు. అయితే, వాస్తవానికి కొన్ని పెట్రోల్ బంకులు ఈ నియమాన్ని పాటించకపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా, కొన్నిచోట్ల టాయిలెట్‌లను లాక్ చేసి ఉంచడం, తాళం వేసి ఉంచడం వంటి మనకు చాలా చోట్లనే కనిపిస్తుంది. ఇలాంటి ఓ సంఘటన కూడా ఇటీవల తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడి ఓ పెట్రోల్ పంపు నిర్వాహకులు దాని ఆవరణ లో టాయిలెట్‌ను సాధారణ ప్రజలకు అందుబాటు లో ఉంచక పోవడంతో, ఒక మహిళ ఈ వ్యవహారాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కమిషన్, పెట్రోల్ పంపు యజమానులకు గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంది. ఈ వివరాల గురించి కింది కథనంలో పూర్తిగా తెలుసుకుందాం. కేరళ లో రాష్ట్రం లోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన జయకుమారి అనే మహిళ మే 8, 2024 న ఆమె తన కారులో ప్రయాణిస్తూ కోజికోడ్ ప్రాంతానికి చేరుకుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో ఇంధన నింపుకోవడానికి ఓ స్థానిక పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపింది. అయితే ఆ టైం లో అత్యవసరంగా ఆమె బాత్రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆమె పెట్రోల్ బంక్‌ లోని టాయిలెట్‌ ను ఉపయోగించాలన్న ఉద్దేశంతో సిబ్బందిని కోరింది. కానీ అక్కడి సిబ్బంది టాయిలెట్‌ను మూసివేసి ఉంచినట్టు తెలిపారు. ఇది చూసిన జయకుమారి, నిబంధనల ప్రకారం టాయిలెట్‌ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయినప్పటికి వారు ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే తిరిగి ఆమెతో అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. పెట్రోల్ బంక్ సిబ్బంది ఆమె పట్ల నిర్వహించిన తీరును తెలియజేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తాళం వేసి ఉన్న టాయిలెట్‌ను సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్న విచారణ చేసిన తరువాత తాళం తీశారు. జయకుమారి అంతటితో ఆగలేదు. ఆమె ఈ అంశాన్ని వినియోగదారు ల వివాదాల పరిష్కార కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. పతనం తిట్ట వినియోగదారుల కమిషన్ ఈ కేసును సీరియస్‌గా పరిగణించింది. విచారణలో, జయకుమారి చెప్పిన సంగతులన్నీ, పోలీసుల నివేదికలు, సాక్ష్యాల ఆధారంగా కమిషన్ తీర్పును ఇచ్చింది. పెట్రోల్ బంక్ యజమాని ఫాతిమా హన్నా, జయకుమారికి రూ.1.65 లక్షలు పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జయకుమారి పోరాటానికి న్యాయమూర్తులు న్యాయం చేశారు. మొత్తం రూ.1.65 లక్షలు పరిహారంలో రూ.1.50 లక్షలు ఆమెకు జరిగిన మానసిక ఇబ్బంది, అవమానం కింద పరిహారంగా ఇవ్వాలని, మిగిలిన రూ.15 వేల రూపాయలు చట్టపరమైన ఖర్చులకోసం చెల్లించాలని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రాథమికంగా అందించాల్సిన సేవలను నిరాకరించడం చాలా తప్పు. ఈ తీర్పు కేవలం ఒక సంఘటనకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్‌కు ఒక గుణపాఠంగా నిలిచేలా మారింది. రెస్ట్‌ రూమ్‌ లాంటి అవసరమైన సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచకపోతే, దాని మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఈ తీర్పు తెలుపుతోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జయకుమారి ధైర్యాన్ని, కమిషన్ తీర్పును ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
 సలేశ్వరం జాతర 
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు.
అలాంటి సలేశ్వరం జాతర ఉత్సవాలు శుక్రవారము నుండి ప్రారంభం కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పరమేశ్వరుని మహాదర్శన భాగ్యం రానేవచ్చింది. ఈ నెల11 నుంచి 13 వరకు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి లింగమయ్య స్వామివార్లను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు.

సలేశ్వరం దర్శనం మహాభాగ్యం.. ఎలా వెళ్లాలి…?

భక్తులు శ్రీశైలానికి అనేక సార్లు వెళ్తారు. కాని ప్రక్కన ఉన్న అద్భుతమైన సలేశ్వరం చూశారా..? సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాల మీదుగా దట్టమైన అడవి మధ్య నుంచి రాళ్లు, రప్పలు, లోయలలోదిగి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి వాహనాల సౌకర్యం ఉండదు. ఎందుకు అంటే అది దట్టమైన నల్లమల అడవి. ఈ సలేశ్వరం శ్రీశైలంలోని ఒక యాత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతోఅలరారుతున్న అందమైన ప్రదేశం. చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్ర స్థలము. ఇక్కడ ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే జాతరజరుగుతోంది. ఈ జాతర ఉగాది వెళ్లిత తర్వాత తొలిచైత్రపౌర్ణమికి మొదలౌతుంది. శ్రీశైలనికి 60కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నుంచి ఫరహబాద్ మీదుగా 30 కిలో మీటర్ల వరకువాహన ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 30 కిలో మీటర్లు వాహన ప్రయాణం, అక్కడి నుంచి 5 కిలో మీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు, భక్తులు అందరు ముగ్ధులుఅవుతారు. ఇది నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంది. శ్రీ శైలం – హైదరాబాద్ వెళ్లే రహదారిలో శ్రీశైలం అటవీప్రాంతంలో శ్రీశైలం దారినుండి పక్కదారిలో ఫరహబాద్ పులిబొమ్మ నుండిలోపలికి వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు 130 కి.మీ. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం నుండి వచ్చేవారు 100 కి.మీ, నల్లగొండ జిల్లా నుండి వచ్చే వారు 150 కి.మీ దూరం ప్రయాణం చేసిన తర్వాత మన్ననూర్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుండి శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా మన్ననూర్ నుండి 15 కి.మీ దూరంలో ఉన్నఫరహాబాద్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి పూర్తిగా దట్టమైన అటవీమార్గన సుమారు 30 కిలో మీటర్ల దూరంలో దట్టమైన అడవిప్రాంతంలో రాంపూర్పెంటకు చేరుకోవాలి. అక్కడి నుండి మరో 2 కి.మీ. దూరం ఆటోల ద్వారా వెళ్లే ప్రధాన మార్గం వద్దకు చేరుకోవాలి. అక్కడినుండి మరో 3 కి.మీ దూరం కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహాసయాత్ర చేయాల్సి ఉంటుంది. రెండో మార్గం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలినడకనతో పాటు ట్రాక్టర్ల ద్వారా కొండలు, గుట్టల నుండి సాహసంగా సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. ఫరహాబాద్ నుండి పదికిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం కనబడుతుంది.

ఆలయ చరిత్ర

అక్కడి ప్రకృతి అందాలను ముగ్ధుడైన నిజాం వంద సంవత్సం లకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరహాబాద్ అని పేరు. అనగా అందమైనప్రదేశం అని అర్థం. అంతకు ముందు దాని పేరు పుల్ల చెలమల అని పిలచేవారంట. 1979లో ప్రాజెక్టు టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది మనదేశంలోనే అతిపెద్ద పులులసంరక్షణ కేంద్రంగా పిలువబడుతుంది. నిజాం విడిది నుంచి ఎడమవైపున 28 కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్యాంపు వస్తుంది. అక్కడే రాంపూర్ చెంచుపెంట వస్తుంది అక్కడేవాహనాలు నిలుపాలి. అక్కడి నుంచి సలేశ్వరం లోయలోకి జలపాతం చేరుకోవడానికి 8కిలో మీటర్ల దూరం నడవాలి. అక్కడ గుహమధ్యలో రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదానికొకటిసమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైనకిలో మీటరు దూరము నడవాలి. ఆ గుట్ట రోనను చేరుకొన్నాక మళ్లి ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంతదూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటారు. గుండం నుండి పారెనీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలోనడవాల్సి ఉంటుంది. ఎమరు పాటుగా కాలు జారితే ఇక లోయలోకి పడిపోవాల్సిందే. శవం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం కుండ మూతి లోపల నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా స్వేచ్చగాఉంటుంది. అనేక పనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాల మంచిదని అందరు వాటర్ బాటిళ్లలో నింపుకోని వెళ్తారు. గుండం ఒడ్డు వైపు తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటిఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్యస్వామి లింగం ఉన్నది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. క్రింది గుహాలో కూడ లింగమే ఉన్నది.గుడి ముందు మాత్రం వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలున్నాయి.

అత్యవసరం కోసం ప్రత్యేకరోడ్డు ఏర్పాటు చేశాం : నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్

నల్లమల అటవీప్రాంతం, వన్యప్రాణులను సంరక్షణకు సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు మాత్రమే రాగలరు. ఈ నెల 11, 12, 13 వరకు మూడు రోజులపాటు సలేశ్వరం జాతరకు అనుమతి ఉంటుంది. చెంచుల ఆచార వ్యవహారాల ప్రకారం జాతరలు నిర్వహించుకునేందుకు ఆటవీశాఖ ఆటంకం కల్గించదు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాం. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాలా సహకరించేందుకు 450 మంది వరకు సిబ్బంది, వాలంటీర్లను ట్రాఫిక్ నియంత్రణ, టోల్ గేట్ వద్ద చెత్త సేకరణ కోసం నియమించాం. గతంలో జరిగినప్రమాదాలను దృష్టిలో పెట్టుకోని అనుకోకుండా ప్రమాదాలు జరిగితే వారిని అత్యవసరంగా బయటకు తీసుకోచ్చి అంబులెస్సాద్వారా తరలించేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు నిషేధించాం. ఉదయం 6 గంటల నుంటి సాయంత్రం 6 గంటల వరకు ఫరహాబాద్ నుండి అనుమతి ఇస్తాం. లోపల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే బయటనే ఆపాల్సి ఉంటుంది. పార్కింగ్ అప్పాయపల్లి వద్దనే పోలీసులు ఆపేస్తారు. అక్కడి నుండి రాంపూర్ వరకు ఆటోలు, జీపుల ద్వారా వెళ్లాలి.
 భారత ప్రథమ సామాజికతత్వవేత్త, సమన్యాయ సత్యశోధకుడు, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే గారి జన్మదిన జ్ఞాపకం !

    🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించారు.
.....
భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.
......
బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు (బడి) మానిపించారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించి బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభా
వంతుడయ్యాడు.
......
తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, తోటమాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్ళిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో పుణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా ఫూలే కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోయాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు ఫూలే.
......
ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబరు 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జూన్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.
......
బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి.
......
1869లో "పౌరోహిత్యం యొక్క బండారం" పుస్తక రచన చేశారు. 1877లో సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించారు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో  ‘గులాంగిరి’ 
(బానిసత్వం) పుస్తకం ప్రచురించారు.

• ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తెలంగాణ మున్నూరు కాపు వారి పాత్ర ...

ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న మున్నూరు కాపు బిడ్డ . నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు. ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి.
......
అందులో బొంబాయి నిర్మాణానికి తెలంగాణ నుండి వలస వెళ్ళి ఎదిగిన మున్నూరుకాపులే అధికం.బొంబాయిలో సత్యశోధక్ సమాజ్ శాఖ పుట్టింది సయాజీ నాగు మున్నూరుకాపు ఇంటిలోనే.
......
వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. వారిని గొప్పవిద్యావంతులుగా, సత్యశోధకులుగా చేసిన ఘనత వెంకయ్యదే. ఆయన రచించిన ‘ఈశ్వరునికి ప్రార్థన’ను మరాఠీలోని తొలి వ్యంగ్యరచన గా గుర్తించాలని సాహిత్య చరిత్రకారులు కోరుతున్నారు. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.
.....
వెంకయ్య కుటుంబ సభ్యులు సావిత్రీబాయి జీవిత చరిత్రను కూర్చి, మూడుమార్లు ప్రచురించారు. సాహు మహారాజ్‌కు ఆంతరంగిక సలహాదారుగా పనిచేసిన భాస్కర్‌రావ్ జాదవ్, రామయ్య తీర్చిదిద్దిన ఆణిముత్యాలలో ఒకరు మాత్రమే. జాదవ్ సత్యశోధక ఉద్యమ నాయకునిగా అన్ని వర్గాల గుర్తింపును పొందారు. ఫూలే ఆలోచనల వ్యాప్తికి, కార్మిక సమస్యలను వెలుగులోకి తేవడానికి కృషిచేసిన ‘దీనబంధు’ పత్రికకు ఆయనే వెన్నెముకై నిలిచారు. ఫూలేకు అడుగడుగుడునా అండదండగా నిలిచి, ఆయన తర్వాత కూడా సత్యశోధక సమాజ ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో తెలుగువారి పాత్ర అద్వితీయమైనది. 

మహమ్మద్ గౌస్ 

          🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
 సినిమా రంగంలో నటిగా పేరు తెచ్చుకోవడం, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని రాణించడం అనేది మామూలు విషయం కాదు.

 తను తప్ప ఆ క్యారెక్టర్‌ మరొకరు చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోవాలంటే వారు ఎంతో ప్రతిభగల వారై ఉండాలి. 

సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు కొంత మందే ఉన్నారు. కొన్ని రకాల పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. అలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుక్ను నటి సూర్యకాంతం. ఆ పేరులో ఓ విశిష్టత ఉంది. 

ఆమె మొట్ట మొదట గయ్యాళి అత్తగా నటించిన సినిమా ‘సంసారం’. ఈ సినిమా తర్వాత అన్ని సినిమాల్లోనూ గయ్యాళి అత్తగానే నటించారు. 

సినిమాల్లో గయ్యాళి అత్తగా తన నటనతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని కలిగించేవారు సూర్యకాంతం. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కోడల్ని రాచి రంపాన పెట్టడం, ఇతరులను బాధపెట్టడం వంటి క్యారెక్టర్లే చేసేవారు. 

ఏ పెళ్లికి వెళ్లినా లేదా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా ఆమె దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. కనీసం ఆటోగ్రాఫ్‌ కావాలని కూడా అడిగేవారు కాదు. సూర్యకాంతం చేసిన పాత్రలు వారిపై అంతటి ప్రభావాన్ని చూపాయి. 

ఓసారి ఆమె ఇంటి పనిమనిషి ఏదో కారణం వల్ల కొన్నాళ్ళు రాలేనని చెప్పింది. ఆ సమయంలో తన ఇంట్లో పనిచేసేందుకు ఓ మనిషి కావాలి అని కాకినాడలో ఉన్న స్నేహితురాలికి ఉత్తరం రాశారు సూర్యకాంతం.

 చెప్పినట్టుగానే ఆమె స్నేహితురాలు ఒక పనిమనిషిని వెంటబెట్టుకొని మద్రాస్‌ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. 

ఎవరింటికి పనిమనిషిగా వెళ్తోందో ఆ మహిళకు తెలీదు. మాటల సందర్భంలో విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా భయపడిపోయి ‘బాబోయ్‌.. సూర్యకాంతం ఇంట్లో పనిచెయ్యాలా..’ అంటూ బ్యాగ్‌ తీసుకొని రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు పరుగులు తీసిందట.

 ఇలాంటి సంఘటనలు సూర్యకాంతం జీవితంలో ఎన్నో జరిగాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. 

మరో వైపు సినిమాల్లో కనిపించేదానికి పూర్తి విరుద్ధమైన మనస్తత్వం ఆమెది. 

నిజజీవితంలో ఆమె ఎంతో సౌమ్యురాలు. ఎంతో సున్నితమైన మనసు గలవారు. ఈ విషయం ఆమెను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. 

ఒక సినిమాలో నాగయ్యను ఎంతో కోపంగా తిట్టే సన్నివేశంలో నటించారు సూర్యకాంతం. షాట్‌ అయి పోయిన వెంటనే ఆయన కాళ్ళకు నమస్కారం చేసి కన్నీళ్ళతో క్షమించమని అడిగారు. దానికి నాగయ్య ‘నన్ను తిట్టింది నువ్వు కాదు, నువ్వు పోషిస్తున్న పాత్ర. బాధపడకమ్మా’ అంటూ ఆమెను ఓదార్చారు. 

‘సంసారం’ చిత్రం తర్వాత ఓ హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం సూర్యకాంతంకి వచ్చింది. అయితే అంతకుముందు ఆ సినిమా కోసం ఓ అమ్మాయిని తీసుకొని ఆ తర్వాత ఆమెను తీసేశారట. అది తెలుసుకున్న సూర్యకాంతం ఒకరి బాధ తన సంతోషం కాకూడదు అని ఆ సినిమా చెయ్యనని దర్శకనిర్మాతలతో చెప్పేశారు. ఆమె మనసు ఎంత సున్నితమైందో ఈ సంఘటనలను బట్టి తెలుస్తుంది.

 ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో ప్రతిరోజూ ఆమె ఇంటి నుంచి రకరకాల వంటకాలతో కూడిన క్యారేజ్‌ వచ్చేది. అందరికీ ఎంతో ప్రేమగా ఆమె వడ్డించేవారు. అలాగే ఇంటికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా భోజనం చేసి వెళ్లాల్సిందే. 

ఆరోజుల్లో సావిత్రి, షావుకారు జానకి, కృష్ణకుమారి వంటి నటీమణులు కూడా ఈ తరహా మర్యాదలు చేసేవారు. 

అంతేకాదు, సూర్యకాంతంకి దయాగుణం ఎక్కువ. తన సహాయం కోరి వచ్చేవారిని ఎప్పుడూ నిరాశపరిచేవారు కాదు. తన స్థాయికి తగ్గట్టుగా వారిని ఆదుకునేవారు.
 *గత స్మృతులు (1955_1975 మధ్య పుట్టిన వాళ్ళు పాత తరం కొత్త తరం రెండింటినీ చూస్తున్న.....)*

*నాకు హిమాలయాలు ఎక్కాలని లేదు. స్వర్గానికి దారులు వెతకాలనీ లేదు. అంతరిక్షంలో అడుగు పెట్టాలనీ లేదు.*

*ఒక్కసారి మా ఊరెళ్ళి వద్దామని ఉంది. అప్పటి లాగానే ఉండాలి. ఆ చిన్నతనమే మళ్ళీ గడపాలి.* 

*ఆ చల్లని గాలిలో మత్తు, ఆ ప్రకృతి ముద్దు ముద్దు. ఆ మట్టి వాసన ఎంత హాయిగా ఉండేదో. దారిలో పలకరింపులు ఎంత సరదాగా ఉండేవో. పాడైపోయిన టైర్లు, తిని వదిలేసిన తాటి కాయలు కూడా ఆట వస్తువులే.*

*అమ్మా వాళ్ళు ఇంట్లో ఉపయోగించే వస్తువులు జ్ఞాపకం వస్తూ వుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పొయ్యి వెలిగాంచాలంటే రెండు బండరాళ్లు చాలు. పోపు దంపుడు, పిండి రుబ్బడం, సానపెట్టడం, బియ్యం నూరడం....ఇలా ఏం చేయాలి అన్నా బండలతో చేసిన పరికరాలు చాలు. ఒక పొత్రం కూడా బండరాయే. నాపరాళ్ళ వసారా, పేడతో అలికిన వాకిలి.*

*అన్ని బండల మధ్య, ఆ మంటల వేడిలో కూడా ఎంత ప్రేమగా ఉండేవారో. అలసట తెలిసేది కాదు.*

*ఇది కదా స్వర్గసీమ.*💕🙏
*నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి*

   *నాన్నలందరికి అంకితం..*

  *దయచేసి పూర్తిగా చదవండి*

*నాన్న మనకోసం ఏం చేశాడో..*
*ఏం కోల్పోయాడో  మనకు తెలియదు..*

*జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ..*
*వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి.*
*తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు.*
*ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు..*
 
*ఎందుకంటే..నాన్న ఎవరికీ చెప్పడు.*
*పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు.*
*అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు.*
*బిజీగా ఉన్న నాన్న రాత్రి పూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు..*
 
*"ఎప్పుడూ పనేనా..? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా.." అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం.*
*పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు.*
*నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు.*
*పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*
 
*మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు,* *పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు.*
*ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.*
*వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు.*
*వృద్ధాప్యం ఇంకా రాలేదు..*

*మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు.*
*ఎందుకంటే..ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*
 
*తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు.*
*ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు.*
*మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు.*
*పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.*
 
*ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు.*
*ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందల సార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా..?*
*నాన్న కూడా ఏడుస్తాడు.*
*కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*
 
*పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి..*
*నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు.*
*‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా..?*
*నేను ఎవరి కోసం బతికాను..?’*
*అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి.*
*‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు.*
 
*నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి.*
 *ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు.* 
*నాన్న గుండెల పై తంతాడు.* *అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు.*
*అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*
 
*కొడుకు ఎంత మంచివాడు..* *ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.. అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు.*
*(పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం.*

*మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి.*
*బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. `అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే` మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు..*
 
*మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.*
*మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..*

*అమ్మానాన్నలు బ్రతికున్నంత వరకు బాగా చూసుకోండి*
 🙏 *ప్రతీ నాన్నకు నా సెల్యూట్* 🙏
 ధర్మరాజు తన సోదరులను వెతుక్కుంటూ ఒక సరస్సు దగ్గరకు వెళ్లగా, అక్కడ యమధర్మరాజు యక్ష రూపంలో ప్రత్యక్షమై 72 ప్రశ్నలు అడుగుతాడు. ధర్మరాజు వాటన్నింటికీ సమాధానాలు సమర్ధంగా ఇస్తాడు. ఈ ప్రశ్నలు ధర్మం, జీవితం, మానవ సంబంధాలు, నైతిక విలువలు, తత్వశాస్త్రం, జీవన పరమైన నైతిక ప్రశ్నల గురించి ఉంటాయి. ఉదాహరణకి – ధైర్యం అంటే ఏమిటి? సంతోషంగా జీవించేందుకు ఏం అవసరం? బ్రాహ్మణత్వం ఎలా పొందుతారు? అని వివిధ దశల్లో ప్రశ్నలు ఉన్నాయి.

ధర్మరాజు ఇచ్చిన సమాధానాల వల్ల యక్షుడు సంతోషించి అతని సోదరులందరినీ పునర్జీవింపజేస్తాడు. చివర్లో ధర్మరాజు నకులుడిని పునర్జీవింపజేయమని కోరడం ద్వారా తన తత్వవేత్త ధోరణిని, సమానత్వాన్ని చూపిస్తాడు.

ఈ కథ ద్వారా ధర్మబద్ధమైన జీవితం, జ్ఞానం, నైతికతపై ప్రజలకు సందేశం ఇవ్వడమే లక్ష్యం.


1. ధర్మం ఎక్కడ నివసిస్తుంది?
సత్యంలో

2. విజయానికి మూలం ఏమిటి?
ధర్మం

3. ఆనందానికి మూలం ఏమిటి?
ధర్మమే ఆనందానికి మూలం

4. ధర్మం ఎక్కడ ఉన్నది?
శ్రుతిలో

5. శ్రుతి ఎక్కడ ఉన్నది?
యజ్ఞంలో

6. యజ్ఞం ఎక్కడ ఉన్నది?
ధన దానంలో

7. భూమిని ధరిస్తున్నది ఎవరు?
సత్యవంతుడు

8. అకాశాన్ని ధరిస్తున్నది ఎవరు?
సత్యమే అకాశాన్ని ధరించగలదు

9. సూర్యుడు ఉదయించకపోతే ఎవరు ప్రకాశిస్తారు?
ధర్మజ్ఞులు ప్రకాశిస్తారు

10. చంద్రుడు వెలుగులేదంటే ఎవరు ప్రకాశిస్తారు?
సత్యవంతుడు

11. అగ్ని వెలిగకపోతే?
జ్ఞానం ప్రకాశిస్తుంది

12. ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు?
ఎవ్వరూ

13. ధర్మాన్ని ఎవరు నాశనం చేస్తారు?
ఆచరణలో మానేసినవారే ధర్మాన్ని నాశనం చేస్తారు

14. మానవులు ఎవరు?
ధర్మం చేపట్టినవారే మానవులు

15. మృతుడెవరు?
ధర్మాన్ని లేని వాడు

16. బంధువు ఎవరు?
ధర్మం అనుసరించేవాడు

17. సంపదగా నిలిచేది ఏమిటి?
దానం

18. స్నేహితుడు ఎవరు?
ధర్మబద్ధుడు

19. శత్రువు ఎవరు?
అధర్మవంతుడు

20. మిత్రుడెవరు?
సత్యవంతుడు

21. జీవితానికి ప్రాణం ఏమిటి?
ఆహారం

22. శరీరానికి ప్రధాన భాగం ఏది?
శిరస్సు

23. ధర్మానికి కీలకం ఏది?
సత్యం

24. బ్రహ్మతత్త్వం ఏమిటి?
అహింస

25. నీతి ఎవరి చేతుల్లో ఉంది?
వేదాంశాల్లో

26. జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది?
శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా

27. శాంతికి మూలం ఏమిటి?
సంతృప్తి

28. జీవితం ఎందుకు కష్టమైపోతుంది?
అసంతృప్తి వలన

29. శత్రువులను ఎలా జయించాలి?
ధైర్యం, సహనం ద్వారా

30. దైవం ఎక్కడ ఉంటుంది?
శ్రద్ధ కలగిన హృదయంలో

31. మోక్షం పొందడానికి మార్గం ఏది?
జ్ఞానం, ధర్మాచరణ

32. దానాన్ని ఎవరు స్వీకరిస్తారు?
దాతకంటే అర్హత కలవాడు

33. మంచి పని ఫలితం ఎవరికీ?
చేయునివారికే

34. ఆపదలో ఎవరు తోడుంటారు?
సజ్జనులు

35. పాపం ఎప్పుడు నాశనం అవుతుంది?
పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తంతో

36. జీవితంలో గొప్ప సంపద ఏది?
సంతృప్తి

37. శ్రేష్ఠుడెవరు?
జ్ఞానవంతుడు

38. మహానుభావుడు ఎవరు?
అహంకారంలేని వాడు

39. ధైర్యవంతుడు ఎవరు?
ఆత్మనిగ్రహం కలవాడు

40. ఆస్తి ఏమిటి?
జ్ఞానం

41. నిష్కామకర్మ అంటే ఏమిటి?
ఫలాపేక్ష లేకుండా పనిచేయడం

42. నిజమైన మిత్రుడు ఎవరు?
శ్రమించేటప్పుడు తోడ్పడేవాడు

43. దైవం కనిపించదు, మరి ఎక్కడ ఉన్నది?
మన మనస్సులో

44. సమయం విలువ ఏమిటి?
ప్రతి క్షణం ముక్తికి దారి తీసే సాధనం

45. శ్రద్ధలేని విద్య ఫలిస్తుందా?
లేదు

46. ధనసంపద ఎందుకు నశించిపోతుంది?
అన్యాయ వ్యయంతో

47. నీతి పాటించని సమాజం ఎలా ఉంటుంది?
వినాశాన్ని చేరుతుంది

48. వృద్ధులు ఎందుకు గౌరవించబడాలి?
జ్ఞానం, అనుభవం కోసం

49. శత్రువుని ఎలా చిత్తుచేయాలి?
మేధస్సుతో

50. అవివేకం దారితీసే మార్గం ఏది?
వికారాలకు లోనవడం

51. మహత్త్వాన్ని కలిగించేది ఏమిటి?
స్వార్థరహిత సేవ

52. రాజు ధర్మం ఏమిటి?
ప్రజా రక్షణ, న్యాయం

53. విజ్ఞానం ఎలా పొందాలి?
గురువు ద్వారా

54. త్యాగానికి ప్రతిఫలం ఏంటి?
అమరత్వం

55. కోపం నియంత్రణలో పెట్టే మార్గం?
సహనం, ధ్యానం

56. నాస్తికుడు ఎవరు?
ధర్మం నమ్మని వాడు

57. శ్రేష్ఠ జీవితం అంటే ఏమిటి?
ధర్మమార్గంలో జీవించడం

58. పుణ్యం సంపాదించే మార్గం?
సేవ, దానం

59. నమ్మకమైన వ్యక్తి లక్షణం?
సత్యనిష్ఠత

60. మోసం చేయనివాడు ఎవరు?
ధర్మపరుడు

61. జ్ఞానానికి శత్రువు ఎవరు?
అహంకారం

62. ధర్మాన్ని నేర్చుకునే మార్గం?
వేదశ్రవణం, ఆచరణ

63. అవినీతి ఎందుకు విస్తరిస్తుంది?
లోభం వల్ల

64. చెడ్డ అలవాట్లకు పరిష్కారం ఏది?
ఆత్మవిశ్లేషణ, సంకల్పం

65. పరనింద వల్ల నష్టమేమిటి?
పుణ్యనష్టం, పరులు నమ్మక పోవడం

66. ధర్మమార్గాన్ని ఎందుకు అనుసరించాలి?
మోక్షానికి దారి చూపుతుంది

67. ఆత్మజ్ఞానం ఫలితం ఏమిటి?
బంధ విమోచనం

68. జీవితం ఎందుకు మాయ?
అనిత్యత వల్ల

69. ఆత్మ నశించదనే ఆధారం ఏది?
భగవద్గీత, ఉపనిషత్తులు

70. మానవ జన్మకు లక్ష్యం ఏమిటి?
మోక్షం

71. లోకంలో మనిషి ఎలాంటి పనులు చేయాలి?
ధర్మానుసారంగా

72. యక్షప్రశ్నలకు సమాధానం చెప్పినవాడు ఎవరు?
ధర్మరాజు – యుధిష్ఠిరుడు


---