Friday, April 4, 2025

 "పరిప్రశ్న - గురుబోధ" 
- శాస్త్రి ఆత్రేయ.

ప. పరమాత్మ ఎవరు?
గు. అంతటా, అన్నింటిలో, అన్నికాలాల్లో విరాజిల్లే సద్వస్తువు!

ప. జీవుడు, పరమాత్మ ఒక్కటేనా?
గు. ఇరువురికి ఉపాధిలో తేడావున్నా, చైతన్యాంశ మాత్రం ఒక్కటే!

ప. జీవుని దేహంలో పరమాత్మ నిజంగా వున్నాడా?
గు. దేవాలయమనే జీవుని దేహంలో, “ఆత్మస్వరూపంగా” వుంటాడు పరమాత్మ!

ప. ఆత్మను ఎలా గ్రహించగలం?
గు. నేనున్నాను! అని నీ చేత అనిపిస్తున్నది నీ ఆత్మే!

ప. ఆత్మే భగవంతుడా?
గు. అవును, ఆత్మే భగవంతుడు! ఆత్మ కంటే భిన్నంగా వుంటే అతడు “పరమాత్మ” కాలేడు!

ప. భగవంతునికి ఆకారం లేదా?
గు. పరిమళానికి ఆకారం లేదుగానీ, పువ్వుకి వుందికదా! అవ్యక్తమైన నిరాకారం, సాకారంగా వ్యక్తమౌతోంది! అదే జీవుడు!

ప. భగవంతుణ్ణి చూచేనని చెప్పడం అబద్దమా?
గు. అబద్దం కాదు, అది నిజమే! అయితే వారు చూసింది ఏంటి? అంతటా వ్యాపించివున్న చైతన్యమా! లేకా వారు ఉపాసించే సాకార దైవమా!

ప. అయితే భక్తుడు భగవంతుణ్ణి ఎలా దర్శించాలి?
గు. భక్తుడు భగవంతుణ్ణి ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శించాలని ఆశించకూడదు! అతణ్ణి సర్వత్రా దర్శించే ప్రయత్నం చెయ్యాలి!

ప. ఆత్మజ్ఞానం లేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమా?
గు. అసలు తానెవడో తనకు తెలియకుండా, భగవంతుణ్ణి తెలుసుకోవడం అసాధ్యం! భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ముందు తాను భగవంతుడు కావాలి!
 🙏 *రమణోదయం* 🙏

*ఇతరులు పొగడాలనే కోరికను లక్ష్యంగా పెట్టుకొన్నవాడు తాను ఎంచుకున్న ఆత్మ సాధనకి అవరోధం కల్పించుకుంటున్నాడు.*

వివరణ : *ఆత్మ సాధనంటే అహంకార నాశం. కీర్తిప్రతిష్ఠలు ఈ అహంకారానికే. కీర్తి ప్రతిష్ఠలు కావాలనుకొనేవాడు అహంకారనాశమునకు బదులు అది ఉండాలని భావిస్తున్నట్లే కదా! కనుక సాధనలో పురోగమించాలంటే అజ్ఞాత జీవితాన్నే కోరాలని భావం.*
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.624)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🪷🪷
*స్మరణ మాత్రముననె*
*పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
           
🌹🌹🙏🙏 🌹🌹
 మనిషికి సంకల్పశక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు. అది ఎలాగో తెలుసుకుందాం.

సంకల్పం అంటే.. 'చేయదలచుకున్న పనిని మనసా వాచా కర్మణా నమ్మి పూర్తి చేయ గలగడం' అంటారు దైవజ్ఞులు. ఆ పని ఐహికమైన అభివృద్ధి కావచ్చు.. ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు! 'సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం' అంటారు స్వామి వివేకా నంద. మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే, తనను తాను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధి గమించాలి. 'తలపుల్లోగాని, వాక్కుతోగాని, చేష్టలతోగాని, ఏ ప్రాణికి అపకారం తలపెట్టను' అని మనసులో ప్రమాణం చేయాలి. సర్వశక్తిమంతుడు, సర్వవిదుడు, ప్రేమ సింధువు అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగమనే భావనతో ఈరోజును ప్రారంభిస్తున్నాను' అని సంకల్పం చెప్పుకోవాలి. అలా ప్రతిరోజు చేయడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధ కుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆ భగవంతుడి దయకు పాత్రుడవుతూ ఉంటాడు. 

సంకల్పం వల్ల ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది. మనం సంకల్పిం చిన ధ్యేయం దగ్గరవుతుంది. సాధారణంగా మనమందరం, జీవితంలో ఏ సందర్భంలోనైనా విజయాన్నే కోరుకుంటాం. అయితే కొంతమంది మాత్రమే దాన్ని సాధిస్తారు. కొంతమంది విజయం దిశగా పరుగు పెట్టి మధ్యలోనే ఆగిపోతారు. జీవితంలో జయాపజయాలకు కారణాలెన్ని ఉన్నా, సంకల్పశక్తి బలంగా లేకపోవడమే ఓటమికి ముఖ్య కారణమని చెప్పొచ్చు. 
అలాగే మనిషి నైతికంగా బతకాలి, రుజుమార్గంలో నడవాలి- అనుకున్నప్పుడు సంకల్పబలం స్థిరంగా ఉండాలి. సంకల్పం బలంగా లేకపోతే గమనం పక్కదారి పడుతుంది. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. 
మద్యం తాగడం మంచిది కాదని , మాంసాహారం తీసుకోవడం కూడా మంచిది కాదని, మోసం చేయడం, అబద్ధాలు ఆడకూడదని ప్రతి మనిషికి తెలుసు. అది జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని తెలుసు. అయినా మనిషి సరదాగా ప్రారం భించి క్రమంగా దానికి బానిసైపోతాడు. మానతానని ఎన్ని ప్రమాణాలు చేసినా నిలబెట్టు కోలేడు. సంకల్పబలానికి గొప్ప ఉదాహరణ.. గాంధీజీ! అడుగడుగునా అవాంతరాలు ఎదు రైనా మొక్కవోని దీక్షతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహనీయుడు. ఒక మామూలు వ్యక్తిని స్వాతంత్రోద్యమ సారథిని చేసింది కేవలం ఆయన సంకల్ప బలమే నన్నది జగమెరిగిన సత్యం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా... చరిత్రలో ఇంకా ఎందరో మహానుభావులు కేవలం సంకల్ప బలంతోనే గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తిం చారు. తమ ధ్యేయాన్ని నెరవేర్చుకుని చరితార్థులయ్యారు. మనిషికి ఈ సంకల్పశక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు..
     ఇన్ని సుగుణాలు మనిషికి ఆషామాషీగా రావు... మనసు నిలకడగా ఉండాలి, మనసు చేసే ప్రతి అలోచన పాజిటివ్ గా ఉండాలి... అందుకే కొంత సమయాన్ని సరైన సాధన కోసం కేటాయించాలి.
     (మానస సరోవరం) కళ్లెం రామిరెడ్డి గారి సందేశానికి కొద్ది మార్పులతో వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలతో... పసుపుల పుల్లారావు..
 *ప్రేమ అనేది ఒక బంధం కాదు,  ప్రేమ మనుష్యులను కలిపి ఉంచేది,*
*అంతే కానీ బంధం కాదు..*

*ప్రేమ బంధంలా మారగానే ముగిసిపోతోంది. హనీమూన్ అయిపోయింది, ప్రేమ ముగిసిపోయింది.*

*ప్రేమ మొదలై ఎదుటివారికి దగ్గరవాలని ఆశపడి,*
*దగ్గర కాబోతున్న బంధానికై ఉత్సాహపడి, బంధంలా మారి హనీమూన్ చేసి వచ్చి ఇక తరువాత ఏమిటి అని చూస్తే అప్పటివరకు కొత్తబంధం తాలూకు ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి తో ఉన్నవారికి ప్రేమను బంధం గా మార్చుకున్నాక ఇక ఈ బంధాన్ని సక్రమంగా నడిపించాలి అనే బాధ్యతను  తెలుసుకోవాల్సి ఉంటుంది.*

*ఒకరితో ఒకరికి అన్నీ బావున్నప్పుడు బంధం నడిపించటం సులభమే..*

*బంధంలో ఉన్న అవతలివారు, ఇలా ఉంటేనే బావుంటుంది అని ఒక అంచనాతో మనం ఉన్నప్పుడు, ఒకవేళ అవతలివారు అలానే రోజూ ఉండలేకపోతే..సమస్యలు మొదలయ్యి, ప్రేమ మాయం అవుతోంది..*

*ప్రేమ ఒక ప్రక్రియ, బంధం ఒక పేరు, ఒక రూపం.*

*బంధం ఏర్పడితేనే ఒక నమ్మకం ఉంటుంది, ఒకరినొకరు విడిచిపోలేరని, వదిలిపోలేరని అనుకుని..అందుకే ప్రేమలోకి బంధం పేరుతో ఒక చట్టాన్ని ఆసరాగా తీసుకుంటారు..చట్టం ప్రేమలోకి వచ్చి బంధంగా మారాక, ప్రేమ సంపూర్ణం అయినట్టు, ఒక ఫుల్ స్టాప్ పడినట్టు..*

*ప్రేమ ఒక నిరంతర వాహిని..ఒక నదిలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి*

*ప్రేమ ఒక మౌన అంగీకారం, ఒక కన్ను నుంచి ఒక కంటికి,  ఒక మనసు నుంచి ఒక మనసుకి, ఒక మనిషి నుంచి ఒక మనిషికి..*
*మాటల్లో చెప్పకపోయినా అర్ధమైపోవాలి, అదీ ప్రేమంటే..చెవులకంటే ముందే మనసుకి వినిపించాలి ప్రేమభావం పలుకుతున్న మౌనభాష..*

*ప్రేమ ఆగకుండా ప్రవహిస్తూ ఉండాలి...అలాంటి జీవనది లాంటి ప్రేమ, బంధం ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఉంటుంది..*

*కాకపోతే ముందు రోజు ఉన్నట్టుగానే ఒక మహిళ కానీ, పురుషుడు కానీ..ఒక భార్య కానీ, ఒక భర్త కానీ..మర్రోజు కూడా ఉంటారని..ఎప్పుడూ ఒకేలా ప్రవర్తిస్తారు అని ఒక అంచనాతో ఉండటం సమస్యలకు దారి తీస్తుంది..*

*తన భార్య ఏంటో తనకు తెలుసు అని ఒక భర్త అనుకుంటాడు, తన భర్త ఏంటో తనకు తెలుసని ఒక భార్య అనుకుంటుంది...కానీ అది 100శాతం* *సాధ్యపడదు...ఎదుటిమనిషి* *ఏమిటో పూర్తిగా ఎప్పటికీ తెలీదు, అది ఎంతో కొంత తెలియని రహస్యమే...*

*మనిషిలో చిన్నచిన్న మార్పులు సహజం...అది గుర్తుంచుకోవాలి..*

*ముందున్నట్టు ఇప్పుడు లేరని , మారిపోయారు అనుకుని బాధపడటం , గొడవ పడటం కంటే కూడా...మనం ప్రేమించేవారిలోని మార్పుని అర్ధం చేసుకుంటూ, వారికి తగ్గట్టుగా కొన్ని మంచి మార్పులు, అవసరమైన మార్పులు మనలోనూ చేసుకుంటూ ఉంటే కొత్తపంధాలో జీవితాన్ని కూడా ఆనందించవచ్చు..ప్రేమ అంటే కలిసినడవటమే కదా...పరిస్థితికి తగ్గట్టు , ప్రేమించినవారికి తగ్గట్టు ఉపయోగకరమైన కొన్ని చిన్నచిన్న మార్పులు చేస్తే బంధంలా మారినా కూడా ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది..*

*ప్రేమికులు బంధం తో కంటే కూడా వారి మధ్య ఉండే అవగాహనతో, ఆత్మీయతతో బంధింపబడిఉండాలి..*
*అలాంటివారు  ఎప్పటికీ విడిపోలేరు..ప్రేమికులు ఒకరికొకరు అద్దంలా మారాలి...ఎప్పటికప్పుడు కొత్తగా అర్ధం చేసుకోవాలి, అన్వేషించాలి , ఎదుటివారికి ఏమి అవసరమో గుర్తించాలి, తెలుసుకోవాలి..*
*కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి...ఎంత తెలుసుకున్నా నాకు తానేంటో పూర్తిగా తెలుసు అన్న నిర్ణయానికి మాత్రం వచ్చేస్తే అదే ఒక ముగింపు అయిపోతుంది...ప్రేమ ఒక నవల కాదు ఒక విషయం దగ్గర మొదలయి ఒక విషయం దగ్గర ఆగిపోవటానికి...ప్రేమ ఒక అనంత ప్రయాణం, ఒక అనంతమయిన ప్రయత్నం, ఒక అనంతమైన అన్వేషణ...ఇలా జీవించగలిగితే ప్రేమ ఒక స్థిరమైన సాహసయాత్రగా విజయవంతమవుతుంది...*
 *కలియుగంలో శృంగార సామర్ధ్యం తగ్గిందా లేక పెరిగిందా...?*
*కలియుగంలో శాస్త్రీయ సిద్దాంతం ప్రకారం తగ్గింది.*

*విచ్చలవిడి శృంగారం పెరిగింది, అంటే అసలు సృంగారం అంటే దాని విలువలు తెలియని స్థితికి తీసుకొచ్చారు.*

*ఒక పురుషుడికి 14 సంవత్సరాల నుంచే మరొక జీవిని సృష్టించే శక్తి మొదలవుతుంది.*

*అలాగే స్త్రీ లలో కూడా వీరికి ఒక జీవికి ప్రాణం పోసే శక్తి వస్తుందట..*

*అంటే ఇద్దరిలోనూ ఆ నూతన సృష్టిని భూ ప్రపంచానికి పరిచయం చేసే శక్తి ఉంటుంది.*

*యువత ఈ శక్తిని వారి భవిష్యత్తును మెరుగుపరచుకునే ఆలోచనలు కలిగి.. ఇతర కామ, వ్యామోహాలకు దూరంగా ఉండి... వారి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని... వాటిలో మెరుగైనది ఎంచుకుని కార్య రూపం దాల్చే విధంగా ప్రయత్నిస్తే, వారిలో ఈ యవ్వన శక్తిలో దాగి ఉన్న నూతన శక్తిని, లేదా నూతన సృష్టిని సృష్టించే శక్తి ప్రభావాన్ని వారు ఎంచుకున్న భవిష్యత్ కార్యాచరణల కోసం ఉపయోగిస్తే వారి కార్యాచరణలు విజయవంతంగా మంచి ఫలితాలతో లాభదాయకంగా ఉంటుందట.*

*అందుకు ఈ కలియుగంలో కూడా సాక్ష్యాలు, ఋజువులు ఉన్నాయి.*

*ఇక ఇప్పటి శృంగారం అనేది.. కామాన్ని ముసుగుగా ధరించి చెడు మార్గంలో నడుస్తోంది…చివరికి బహిరంగం అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.*

*ఒక మనిషి తప్ప.. ప్రకృతిలో ఏ జంతు జాలమూ, ఏ ప్రాణీ విచ్చలవిడి సృంగారం చేయదు... మనిషి తప్ప, ప్రతి జీవి ప్రకృతి నియమాలను పాటిస్తూ..అవి ఆ ప్రకృతి నియమించిన కాలాలలో మాత్రమే అవి సృంగారం జరుపుతాయి.*

*వాటి సంతానాన్ని ఆరోగ్య వంతంగా భూ ప్రపంచానికి అందిస్తాయి..*

*మనిషి వెర్రి ఆలోచనలతో ఎంత మంచి స్త్రీ మూర్తితో సృంగారం చేసినా వారు పిచ్చి సంతానాన్ని పొందటం తప్ప ప్రయోజనం ఉండదు.*

*ఇక ప్రస్తుతం సృంగార సామర్థ్యం తగ్గడానికి.. ప్రకృతి ఆహ్లాదం అంతగా లేదు.*

*ఆహారపు అలవాట్లు, ప్రతి దానికీ ఏదో ఒక మందు బిళ్ళను వేసుకోవడం.*

*అలాగే కాలానుగుణంగా బ్రతుకుతెరువు కోసం ఇద్దరూ ఉద్యోగం చేయడం…పల్లే ప్రాంతాల్లో అంతగా లేకపోయినా.. పట్టణాల్లో ఇది సహజం. ఇంటికి రాగానే, పిల్లలు వంట పనులు.. వీటితోనే అలసి పోవడం ఇక ఏకాంత సమయం దొరకని పరిస్థితి కూడా కారణం.*

*ఒకప్పుడు తొడగొడితే సృంగారానికి రెడీ అనేవారట.. మరి ఇప్పుడో రెండు తొడలు ఊపుకుంటూ కూచోవాలి కొంత సేపు. దానికోసం కొన్ని వ్యాయామాలు చేయడం.కారణం సృంగార పద్దతులు తెలియక. మానసికంగా తయారవడం చేతకాక.*

*బలవంతపు,బలాత్కారము చేయడం సృంగారం కాదు. సృంగారం అనేది ఒక అద్భుతమైన చర్య…ఇద్దరి కలయిక నాలుగు గోడల గదిలో అయితే... ఆ గది ఒక దేవాలయం లాంటిది.*

*అలాంటి దాన్ని అపవిత్రం చేసుకుంటూ వచ్చి.. పిచ్చి పిచ్చి సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, మేము కూడా సృంగార సామర్థ్యం కలిగి ఉన్నాం అంటే.?.*
 


*UP లో మరో లవ్ జిహాద్ కేసు..*

*అంజనా తివారీ ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది, అయేషా గా పేరు మార్చుకుని మతం మార్చుకుంది.*

*UP అసెంబ్లీ వెలుపల ఆత్మహత్యకు ప్రయత్నించింది*

*చికిత్స  పోందుతూ ఆసుపత్రిలో మరణించింది.*

*అయేషా  (అంజనా) ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. యూపీ  అసెంబ్లీ సమీపంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనలో  మహిళ తనను తాను దహనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళను కాపాడటానికి యూపీ  పోలీసులు తమ వంతు కృషి చేశారు.  వీడియోలో UP పోలీసులు కాలిపోతున్న మహిళ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి మంటలను ఆర్పుతున్నది చుడవచ్చు.  ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ విధానసభ వెలుపల జరిగింది. ఆ మహిళను ఆసుపత్రికి తరలించగా  అక్కడ ఆమె చికిత్స పోందుతూ మృతి చెందింది.*

*అంజనా మొదట  అఖిలేష్ తివారీని వివాహం చేసుకుంది. కానీ వారి  కాపురం ఎక్కువ కాలం కొనసాగలేదు.  ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకుంది. తర్వాత అంజనా ఆసీఫ్‌ ను ప్రేమించి, మతం మార్చి, ఇస్లాం స్వీకరించి, అయేషా గా మారి ఆసీఫ్‌ ను వివాహం చేసుకుంది. అయేషా  తన అత్తమామలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఫిర్యాదు చేయలేకపోవడంతో ఆమె విధాన సభకు వెళ్లి సీఎం యోగిని కలిసేందుకు వెల్లింది. యోగీ కలిసే పరిస్థితి లేక పోవడం తో అసెంబ్లీ గేటు వద్దే ఆమె తనను తాను నిప్పంటించు కుంది. ఆయేషా ఆసుపత్రిలో మరణించింది.  స్థానిక మీడియా కధనాల  ప్రకారం, విడాకుల తర్వాత, అంజనా తన సోదరి పక్కనే ఉన్న ఒక దుకాణంలో పనిచేయడం ప్రారంభించింది.  అక్కడ  ఆసిఫ్ ఆమెను ప్రేమలో దింపి పెళ్లికి ఒప్పించి ఒక ముస్లీం మత  పెద్ద సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఆసిఫ్ కుటుంబం ఆమెతో వివాహం  ఒప్పుకోక పోవడంతో వారు అద్దె ఇంట్లో నివసిస్తూ  జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం కలిసి జీవించిన తర్వాత ఆసీఫ్  చెప్పా పెట్టకుండా  సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు.*
 .లోకంలో జరుగుతుంది.
నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్న 
నాలుగు గంటలు మనం ప్రశాంతం గా పడుకోవాలి అన్న 
నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్న
మన దగ్గర ఉండాల్సింది #డబ్బు 

పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే

 ఐనా వాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే

కట్నం డబ్బులు తేని భార్యని బానిసగా చూస్తాడు భర్త 

ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది బార్య 

డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రి ని అసమార్థులుగా చూస్తారు బిడ్డలు

సంపాదించడం చేతకాని బిడ్డలని చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి

డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్దపడుతుంది

అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబన్ని, ఐనవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు

ఆస్తి పంపకాలలో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకొని అన్నదమ్ములు

పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కాచెల్లెళ్ళు 

అందుకే డబ్బుని గౌరవించండి
పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన 
మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి 

డబ్బుకి లోకం దాసోహం 
పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు మరి....

Love Jihad

 








 ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు
వస్తె హోమియోలొ వైద్య ముంటె
ముందుగానె వస్తె ముప్పుతిప్పలు నేల
సకురు అప్ప రావు సత్యమిదిర

భావం: అనేక మంది రోగులు వారి బాధలు అర్జెంటుగా తగ్గించేసుకుందామనే పిచ్చి భ్రమతో ఇంగ్లీషు స్పెషలిస్ట్ వైద్యుల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకొని, పరిష్కారం కానంత జటిలం చేసుకుని, జేబులో డబ్బులన్నీ వాళ్ళు పూర్తిగా పిండేసాక, ఇక మీ జబ్బు తగ్గే అవకాశమే లేదని వారు నిరాశకు గురి చేసాక, పూర్తి దీనావస్తకు చేరుకున్న రోగాలను సైతం ఓర్పుగా, నేర్పుగా నయం చేయగలిగే సత్తా కలిగిన హోమియో వైద్యానికి రోగం వచ్చిన వెంటనే వెళ్తే మీకీ తిప్పలూ, తలనొప్పులూ లేకుండా, ఒంట్లో పార్టులు కోయించుకొని, చెడగొట్టు కోకుండా, జేబులో డబ్బులన్నీ గొరిగించుకోకుండా హాయిగా, త్వరగా నయమై, క్షేమంగా మీరు మీ ఇంటిలోనే ఉంటారు కద నాయనా! ఎందుకు, హోమియోను చులకనగా చూసి, మీరు నానా తిప్పలు పడటం? హోమియోను చూసి ఎందుకలా భయపడి దూరంగా ఉంటారు?అదేమైనా మీ శత్రువా? బాగా ముదిరిపోయి, బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళ రోగాలే నయం చేయగలిగే దమ్మున్నది లేతగా అప్పుడప్పుడే  వచ్చిన సమస్యలూ, రోగాలూ  నయం చేయలేని తింగరి, చేతకాని వైద్యమనుకుంటున్నారా? 
హోమియో వైద్యమంటే ఒక అద్భుతం, అమృతం! దీనిని అర్థం చేసుకుని, ప్రతీ సందర్భానికీ వాడుకునే వాళ్ళ జన్మ ధన్యం! 
సకురు అప్పారావు చెప్పే ప్రతీ మాటా అక్షర సత్యం!అయినా సరే దానిలో నిజముందో లేదో మీరు కూడా చూడండి, ఆలోచించండి! 
 
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
 నీవు ఏం చేసినా చేయకున్నా ఏదో ఒక విధంగా నిన్ను విమర్శిస్తూనే ఉంటారు ఈ  సమాజములో ప్రజలు... మంచి చేయడానికి ప్రయత్నిస్తే నీ గురించి పట్టించుకోరు, పైగా చేసే మంచిని కూడా వక్రబుద్దితోనే చూస్తుంటారు..తెలియకుండా ఎప్పుడన్నా చిన్న తప్పు చేస్తే భూతద్దం లోంచి చూస్తూ ఘాటైన విమర్శల బాణాలు నీపై ఎక్కు పెడుతుంటారు... అందుకే లోకం ప్రజల తీరును పట్టించుకోకు... నీ మనస్సాక్షి ననుసరించి నీకు ఏది సరి అనిపిస్తే అది చేస్తూ ఉండు.

Thursday, April 3, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*దుశ్శాసనుడు*
    

కౌరవులు నూరుగురు అన్నదమ్ములు. కాబట్టే “కౌరవసైన్యం” అన్నారు. అందరిలోకి పెద్దవాడు “ధుర్యోధనుడు”.నూరుగురు అన్నదమ్ముల తోడ ఒక సోదరి కూడా ఉంది. పేరు “దుస్సల”. సరే మరి దుశ్శాసునుడెవరు? ధుర్యోధనుని తమ్ముడు. కౌరవుల్లో రెండవవాడు. అంటే ధుర్యోధనుని తరువాత వాడన్న మాట. అయితే ద్రౌపతి వస్త్రాపహరణంలో ద్రౌపతిని వివస్త్రను చేయ ప్రయత్నించినవాడే దుశ్శాసనుడుగా మనందరికీ తెలుసు! దుశ్శాసనుడికి అన్నంటే అభిమానం. అందుకే ధుర్యోధనుడు ఏం చేసినా అందుకు సాయం చెయ్యడమేకాదు, ఆజ్ఞగా భావించి అమలు చేసినవాడు. దుర్యోధనునితో పోల్చుకుంటే దుశ్వాసనుకి అంత బుద్దిబలం కాదు కదా దేహం బలం కూడా లేదు. అన్నను చూసి, అంగబలం చూసి, అర్థ బలం చూసి గర్వపడడమే తెలుసు. విర్రవీగడమే తెలుసు.

పాండవులు జూదంలో ద్రౌపతిని కూడా ఓడిపోయారు. ధుర్యోధనుడు తన సేవకుడైన ప్రాతికామెను పంపి ఆమెను తీసుకు రమ్మన్నాడు. ద్రౌపది వేసిన ప్రశ్నకు పాత్రికామి జవాబు చెప్పలేక సభకు తిరిగొచ్చాడు. అతనికి తెలిసిన జవాబదే. ద్రౌపతి ఒక స్త్రీ అని గాని, తమ సోదరులైన పాండవుల భార్య అనిగాని అతనికి గుర్తే లేదు. చీర విప్పేందుకు కూడా వెనుకాడ లేదు. అయినా దుశ్శాసనుడి ప్రయత్నం నెరవేర లేదు. పట్టుదలకు పోయాడు. జబ్బలు నొప్పెట్టినా ఆగకుండా చీరను లాగుతూనే వున్నాడు. లాగిన చీర గుట్టంత కాదు, కొండత పోగు పడింది. “నీ రక్తంతో తడిపిగాని ఈ జుట్టును ముడవ”నని ద్రౌపది శపథం చేసింది. చూసి ఓర్వలేని భీముడు దుశ్శాసనుని గుండెను చీల్చి రక్తం తాగుతానన్నాడు. అయితే ఆ మాటలను కౌరవులెవరూ లక్ష్య పెట్టలేదు.

అలాగే అజ్ఞాతవాసంలో వున్న పాండవుల్ని గుర్తించి ఎలా వంచించాలా అని ధుర్యోధనుడు ఆలోచిస్తున్నప్పుడు ఆ అవసరం లేదన్నాడు దుశ్శాసనుడు. పాండవులెప్పుడో పరలోకాలకు పోయుంటారని పరిహాసమాడాడు.

కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కన్నూ మిన్నూ కానని దుశ్శాసనుడు అభిమన్యుడి ముందు నిలవలేక పారిపోయాడు. సాత్యకితో యుద్ధం చేసి ఓడిపోయాడు. సహదేవునితో యుద్ధం చేసి మూర్ఛపోయాడు. చివరకు భీముని చేతికి చిక్కి పోయాడు. భీముడి గదా ఘాతానికి దుశ్శాసనుడి గుండె బద్దలై రక్తం చిమ్మింది.

ప్రతిజ్ఞ ప్రకారం ఆ రక్తాన్ని తాగిన భీముడు ఆ చేతుల్ని ద్రౌపతి కురులకు  రాయడంతో కొప్పు ముడి వేసుకుంది ద్రౌపది.

ఆడవాళ్ళని అవమానించి హింసించే వారికేగతి పడుతుందో దుశ్శాసనుడి కథ చెప్తుంది!.
 🌷🙏ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్ర వేత్త,గుండె గుట్టు విప్పి చెప్పిన విలియం హార్వే గారి జయంతి సందర్భంగా.....🙏🌷

#సంపన్నమైన కుటుంబం... విలాసవంతమైన జీవితం... అయినా ఓ యువకుడు... చదువును విస్మరించలేదు... వైద్యుడైనా పరిశోధన ఆపలేదు... అందుకు ఫలితంగా... వైద్యరంగాన్నే మలుపు తిప్పాడు!

#ఇప్పటి వైద్యులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. గుండెలో కృత్రిమ వాల్వులను కూడా అమరుస్తున్నారు. కానీ నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఒక శాస్త్రవేత్త, గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని వివరించకపోయి ఉంటే ఈ అద్భుతాలు సాధ్యమయ్యేవి కావని చెప్పవచ్చు. హృద్రోగుల ఆయుర్దాయం పెరగడానికి దోహదపడే విషయాలు చాటిచెప్పిన ఆ శాస్త్రవేత్త విలియం హార్వే.

#బాల్యం,విద్యాభ్యాసం:

విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. పదిహేనవ యేట కేంబ్రిడ్జిలోని సైన్స్‌ కాలేజీలో చేరాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని పాడువా వైద్య విద్యాలయంలో చేరాడు. హార్వేపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన హైరోనిమస్ ఫాబ్రిసియస్ . అరిస్టాటిల్ యొక్క ప్రముఖ అనుచరుడు. ఇటాలియన్ తత్వవేత్త సిజేర్ క్రెమోనిని హార్వేకి బోధించాడు.

#అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌ రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితుడయ్యాడు. అంతటి హోదాలో ఉన్న సంపన్నుడెవరైనా విలాసంగా జీవితం గడిపేస్తారేమో కానీ, విలియం హార్వే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోడానికి పరిశోధకుడిగా మారాడు.

#పరిశోధనలు:

1615 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో ఈయన లెక్చరర్ గా నియమింప బడ్డారు. చేపలు, కప్పలు,కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్త ప్రసరణ గురించి ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేయసాగాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్త నాళాలకు వెళుతుందని తెలుసుకున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్తుకోవడమే అని రుజువు చేశాడు. 
#మానవ శరీరంపై ఆసక్తి పెంచుకున్న హార్వే అనేక జంతువుల శరీర అంతర్భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి గుండె పనితీరు, రక్త ప్రసరణ విధానాలను గమనించాడు. చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు. రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు. వైద్య రంగానికి ఎనలేని మేలు చేసిన హార్వే పేరు ప్రతి మనిషి గుండె చప్పుడులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

#గ్రంధములు:

క్రీ.శ 1628 లో హార్వే ప్రచురించిన అనటామికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్ అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను మళ్ళీ పరిశోధనల ద్వారానే రూఢి పరచాలనే శాస్త్రవాది హార్వే. ఈ పుస్తకం ప్రచురించిన మూడు సంవత్సరాల తరువాత హార్వే మొదటి చార్లెస్ మహారాజుకు రాజ వైద్యునిగా నియమించబడ్డాడు. కానీ రాజకీయ విపరిణామాల కారణంగా హార్వే లండన్ విడిచి పెట్టవలసి వచ్చింది. అప్పుడే కొంతమంది దుండగులు హార్వే ఇంటిలో లేని సమయం చూచి ఆయన నాలుగు దశాబ్దాలుగా సేకరించిన దాచుకున్న అమూల్యమైన విజ్ఞాన సంపద నంతా నాశనం చేశారు. అయినా హార్వే బాధ పడలేదు. నిరాశతో క్రుంగిపోలేదు. ప్రత్యుత్పత్తి, పిండాభివృద్ధి అంశాల మీద జీవితమంతా పరిశోధించాడు. 1651 లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రతులు అతి త్వరితగతిలో అమ్ముడైపోయి కొత్త చరిత్రను సృష్టించాయి.

#విలియం హార్వే చాల ఖచ్చితమైన వ్యక్తి.అతను తరచూ తన సొంత ఆలోచనలలో ఎలా మునిగిపోతాడో, అతను తరచుగా నిద్రలేమితో బాధపడేవాడు.అతను చీకటిని కూడా;ఇష్టపడ్డాడు, ఎందుకంటే అక్కడే "... అతను ఉత్తమంగా ఆలోచించగలడు" అని చెప్పబడింది.  #అధికంగా కాఫీ తాగేవాడు.
ఖాళీ సమయంలో సాహిత్యం పక్షులపై ప్రేమ చూపేవారు. హార్వే 1657 సంవత్సరం జూన్ 3 న మరణించాడు.
🙏🙏🌹🌺🌷🙏🙏
 వర్ధంతి నివాళి.. -- రచయిత కథకుడు మధురాంతకం రాజారావు -- కథా రచయితగా మంచిపేరు గాంచిన కథకులలో మధురాంతకం రాజారావు గారిది అగ్రస్థానం.  ఈయన కథా శైలి ఓవైపు క్లాస్ గా ఉంటూ మరోవైపు ఆధునిక పోకడలకు దగ్గరగా ఉండటం ఓ విశేషం.  చిత్తూరు జిల్లాకి చెందిన ఈయన 1930 అక్టోబర్ లో జన్మించారు.  ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో వచ్చిన రచనలు వీరిపై మంచి ప్రభావం చూపడమే కాకుండా ఓ మంచి రచయితగా తీర్చిదిద్దాయి.  వీరి తొలి గేయ రచన ఆంధ్రపత్రికలోనే ప్రచురితమైంది.  ఓ పక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరోవైపు విశేషమైన సాహితీ సేవ చేశారు.  కొందరు పెద్ద రచయితల రచనల ద్వారా స్పూర్తి పొందుతూ తనదైన శైలిలో సుమారు 400 వరకు కథలు రాశారు.  ఈయనకి చాలా మంచిపేరు తెచ్చిన కథలు చాలా ఉన్నాయి.  కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులతో మరికొన్ని విశిష్ట పురస్కారాలు ఈయనని వరించాయి.  మధురాంతకం గారి మొట్టమొదటి కథకే (కుంపట్లో కుసుమం) సాహిత్య అకాడమీ అవార్డు లభించడం ఓ అరుదైన గొప్ప విశేషం.  కొన్ని నాటకాలు, గేయాలు, సాహిత్య వ్యాసాలు తో పాటు రెండు నవలలు కూడా రాశారు.  ఈయన మొదటి నవల..  త్రిశంకుడి స్వర్గం లో ఇతివృత్తం చాలా భిన్నంగా ఉంటుంది.  ఈ నవల విశేష పాఠకాదరణ పొందింది.  ఈయన కథల్లో బాగా పేరుతెచ్చినవి ఓ పది కథాసంపుటాలుగా విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రచురించింది.  మధురాంతకం రాజారావు గారి జీవిత విశేషాలతో పాటు ఈయన కథలను పరిచయం చేస్తూ..  రచయిత సింగమనేని నారాయణ రచించిన పుస్తకం రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది.  ఈయన మంచి  అనువాద రచయిత కూడా.  తమిళ కన్నడ హిందీ ఆంగ్ల భాష లలో అనువాదం చేశారు.  ఇతర భాషా రచనలను కొన్ని తెలుగులోకి అనువదించారు.  ఈయన పలు రచనలు రష్యా వరకు వెళ్ళడం ఓ విశేషం.  ఈయన ఇద్దరు కుమారులకి కూడా తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉంది.  పెద్దబ్బాయి నరేంద్ర శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉంటున్నారు.  చిన్నబ్బాయి మహేంద్ర అకాల మరణానికి లోనవడం తండ్రి మధురాంతకం రాజారావు గారు మానసికంగా కృంగిపోయారు.  తన 69వ ఏట 1999లో ఈరోజే.. ఏప్రిల్ 1 ఉదయం మరణించారు.  ఈయన కథా సంకలనాలు కొన్ని నేటికీ విశాలాంధ్ర బుక్ హౌస్ లో లభ్యమవుతున్నాయి..‌  26వ వర్ధంతి సందర్భంగా..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం..
 *_"ఇంద్రాక్షీ త్రిపాఠీ"... ధైర్యం, ప్రేమ, త్యాగానికి మారుపేరు_*
_(ఈమె పెళ్ళికథ గురించి తెలుసుకోవాల్సిందే..!)_
 🙏🙏🙏🙏🙏🙏🙏

*ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌... గతవారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ తాలూకు టేకన్‌పూర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక అక్కడ పెద్ద ఎత్తున విందు, రకరకాల ఏర్పాట్లూ చేశారు. ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడాలనుకున్నారు. ఆమె చేతి వంట రుచి చూడాలని ఆశపడ్డారు. ఇంతకీ ఎవరామె..? ఏమిటామె ప్రత్యేకత? తెలుసుకోవాలంటే చదవాల్సిందే!*

*"ఇంద్రాక్షీ త్రిపాఠి..." ఆమెకు అలా పరిచయం చేసుకోవడం ఇష్టముండదు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ సందీప్‌ మిశ్రా భార్య అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. కారణం సందీప్‌ మిశ్రా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు. భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీ పోరాడి చూపు కోల్పోయారు. అయితేనేం దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టు అనుకుంది ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా.. బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె కళ్లతో భర్తకు లోకాన్ని చూపిస్తూ... ఆనందంగా వైవాహిక జీవితంలో సాగిపోతోంది. ఒక పాపకు తల్లిగా, సందీప్‌ సంరక్షకురాలిగా నిత్యం కాచుకునే ఇంద్రాక్షి గొప్ప మనసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ కొట్టకుండా ఉండరు.* 

*అందుకే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా టేకన్‌పూర్‌లో పని చేస్తున్న సందీప్‌ మిశ్రా అర్థాంగి గురించి తెలుసుకున్నాక, వెంటనే ఆమెకు అభినందనలు చెప్పాలనుకున్నారు. వారింటికి వెళ్లి కోరి మరీ ఆతిథ్యం అందుకున్నారు.* 

*ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లాలో ఉన్న బన్సీ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిందామె. తండ్రి ఆప్రాంతంలో పేరున్న న్యాయవాది. సంపన్న కుటుంబం, పైగా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. బీఏ ఆ తరవాత పీజీ పూర్తి చేసింది. అంతేకాదు.. తైక్వాండో ఛాంపియన్‌ కూడా.*
-------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
 *🔊Cool drinks: కూల్‌ డ్రింక్స్‌ యమా డేంజర్‌*

*🔶అధిక సుక్రోజ్‌తో అనారోగ్యమే*

*🔷మధుమేహం, ఊబకాయం ముప్పు*

*🔶మెటబాలిజంపై తీవ్ర ప్రభావం*

*🔷శరీర వ్యవస్థ అస్తవ్యస్థం*

*🔶టాటా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనలో వెల్లడి*

*🍥హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి.. హాయిగా.. కూల్‌కూల్‌గా ఓ కూల్‌డ్రింక్‌ తాగేద్దామనుకుంటున్నారా? ఆ చర్య వల్ల తాత్కాలికంగా శరీరానికి చల్లదనం లభించినా.. తీపి శీతల పానీయాల్లో ఉండే అధిక సుక్రోజ్‌తో ఆరోగ్యానికి చేటు అని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌(టి్‌ఫ-హైదరాబాద్‌, ముంబై)లోని అడ్వాన్స్డ్‌ రిసెర్చ్‌ యూనిట్‌ ఆన్‌ మెటబాలిజం, డెవల్‌పమెంట్‌ అండ్‌ ఏజింగ్‌(అరుమ్డా) శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘న్యూట్రిషనల్‌ బయోకెమిస్ట్రీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. టిఫ్‌ శాస్త్రవేత్తలు ఎలుకలపై తమ పరిశోధనలను చేశారు. 10ు మేర సుక్రోజ్‌ ఉండే నీటిని పరగడపున, ఏదైనా తిన్న తర్వాత వేర్వేరుగా ఎలుకలకు ఇచ్చారు. సుక్రోజ్‌ కారణంగా.. మనం తినే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు, కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్‌(హెక్జోస్‌ షుగర్‌) శోషణ జరుగుతుందని, దీంతో చిన్నపేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు.. ఆహారంలోని ప్రొటీన్లను కండరాలను పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ(అనబాలిక్‌), కొవ్వు, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియ(క్యాటబాలిక్‌)పై దుష్ప్రభావాలకు శీతల పానీయాల్లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్‌ కారణమవుతుందని వెల్లడైంది. మెటబాలిజానికి దోహదపడే కాలేయంపై సుక్రోజ్‌ చూపే దుష్ప్రభావం కారణంగా పలు రుగ్మతలు వస్తాయని, క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినా.. మెటబాలిజంపై పడే ప్రభావం కారణంగా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చలేదని, దాంతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. శీతల పానీయాల్లోని అధిక సుక్రోజ్‌ వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.*

మిమ్మల్ని ఎలా #నమ్మాలి? Hari Raghav councelling

 మిమ్మల్ని ఎలా #నమ్మాలి?

```````````````````` 24 సంవత్సరాల కవిత తన జీవితంలో అనేక సార్లు మోసపోయింది. చిన్నపుడు సెక్సువల్ అబ్యూస్ కి గురికావడం వల్ల జీవితం పట్ల తీవ్రమైన ద్వేషం. మనుషులను ఏమాత్రం నమ్మలేని పరిస్థితి. తల్లిదండ్రులు లేట్ వయస్సులో ఆమెను కనడం వల్ల కవితకు, ఆమె తల్లిదండ్రులకు జెనరేషన్ గ్యాప్. అందువల్ల ఆమె బాధ సరిగా వారికి అర్థం అయ్యేది కాదు. కవిత తల్లిదండ్రులిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగులు. తల్లి ఆరోగ్య కారణాల వల్ల త్వరగా పదవీ విరమణ చేసింది. తండ్రి ఇంకా వర్క్ చేస్తున్నాడు. డబ్బుకు కొదవ లేకపోయినా కవిత తీవ్రమైన ఆత్మన్యూనతతో బాధ పడుతుంది. సమాజంలో కలవడానికి విపరీతమైన భయం. ఎవరినీ నమ్మలేదు. ఫలితంగా డిప్రెషన్ తో బాధపడుతూ రెండు మూడుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఒక్కతే సంతానమైన కవిత అలా అయిపోవడం తల్లికి ఇష్టం లేదు. కవిత సమస్యకు ఒక శాశ్విత పరిష్కారం కావాలని తెలిసినా జాబ్ ఒత్తిడి మేరకు తాత్కాలికమైన పరిష్కారాలు మాత్రమే కవితకు ఇప్పించగలిగింది. పదవీ విరమణ చేసిన వెంటనే కవిత జీవితానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలని నిశ్చయించుకుంది. బంధువులను, స్నేహితులను సంప్రదించగా పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయని అన్నారు. భర్త కూడా దాదాపు అదే అభిప్రాయం వ్యక్తపరిచాడు. కానీ కవిత తల్లికి ఆ పరిష్కారం నచ్చలేదు. ఈ స్థితిలో పెళ్లి చెయ్యడం వల్ల సమస్య తగ్గక పోగా కొత్తగా మరిన్ని సమస్యలలో ఇరుక్కునే అవకాశాలే ఎక్కువ అని భావించింది. ఈ క్రమంలో తన కూతురి సమస్యకు పరిష్కారం కోసం యూట్యూబ్ లో వీడియోస్ వెతుకుతుండగా నా వీడియోస్ తనకు కనిపించాయి. వెంటనే ఫోన్ చేసి అప్పోయింట్మెంట్ తీసుకుంది.

మొదట కవిత తల్లి ఒంటరిగా కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యింది. ఆమె గురించి వివరించిన విషయాలలో ముఖ్యమైనది కవిత ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మను అంటుంది. మీరు కౌన్సిలింగ్ ఇస్తాను అంటున్నారు. మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలంటే మిమ్మల్ని నమ్మాలి కదా? ఆమె మిమ్మల్ని మాత్రం ఎలా నమ్ముతుంది? మీరు ఎలా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు? అనడిగింది. దానికి నేను 'మొదట ఆ అమ్మాయిని ఒకసారి నా దగ్గరకు తీసుకురండి. ఒక్కసారి నాతో మాట్లాడించండి. తరువాతది అంతా నేను చూసుకుంటాను.' అన్నాను. 'ఆమె ఎవరినీ నమ్మదు సర్' అంది. 'ఆమె నమ్మదు సరే.. మీరు నమ్ముతున్నారా' అని అడిగాను. 'నేను నమ్ముతున్నాను.' అని సమాధానం ఇచ్చింది. 'అయితే ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యండి.' అని చెప్పాను. మరో నాలుగు రోజుల తరువాత ఆమె కవితను కౌన్సిలింగుకి తీసుకువచ్చింది. మొదట్లో కవిత నాతో అయిష్టంగా మాట్లాడింది. తరువాత క్రమ క్రమంగా విషయం అర్థం చేసుకుని కౌన్సిలింగుకి బాగా సహకరించింది. దాదాపు మూడు నెలల పాటు కౌన్సిలింగ్ నడిచింది. ఈ క్రమంలో కవిత ఒక్కతే కౌన్సిలింగుకి వచ్చేది. సమాజంలో మనుషుల మనస్తత్వాలను విశ్లేషించడం కోసం నాతో పాటు హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలకు వచ్చింది. అనేక సామజిక పరిస్థితులలో మనుషులు వారి ప్రవర్తనను ఆమె అధ్యయనం చేసింది. మర్నాడు వాటి గురించి విశ్లేషిస్తూ చర్చించేది. క్రమంగా ఆమెలో భయం మాయమై, ఎంతో ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంది. రెగ్యులర్ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత ఒక యాడ్ ఏజెన్సీ లో విజువలైజర్ గా జాయినయ్యి చక్కగా జాబ్ చేయగలుగుతుంది. ఆమెలో వచ్చిన మార్పును చూసి తల్లి ఆశ్చర్య పోయింది. తరువాత ఒక సారి నన్ను కలసి ఇది ఎలా సాధ్య పడింది? కవిత ఎలా మిమ్మల్ని నమ్మింది? మీరు ఆమెకు ఎలా నమ్మకం కల్పించారు? అని అడిగింది. నేనొక #ఎగ్జిస్టెన్షల్ సైకాలజిస్టుని. నా అప్రోచ్ విభిన్నంగా ఉంటుంది. నేను ఎక్కడా ఆమెను నమ్మించే ప్రయత్నం చెయ్యలేదు. ఆమెకు కూడా నమ్మొద్దని చెప్పను. ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మొద్దు. నన్ను కూడా నమ్మొద్దు. ఎప్పుడయితే నమ్ముతావో అప్పుడు మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యక్తులను నమ్మొద్దు. కానీ వాళ్ళ స్థితిని అర్థం చేసుకో. వాళ్లకు మోసం చేసే అవకాశం నువ్వు ఇవ్వకు. నువ్వొక చాల మంచి వ్యక్తితో స్నేహం చేస్తూ ఎప్పుడూ ప్రైవసీ ఉండే ప్రాంతాలలో అతనితో మెలుగుతున్నావు అనుకో. అతను ఎంత మంచి వాడయినా ఏదో ఒక సమయంలో నీ మీద చెయ్యి వేసే అవకాశముంటుంది. అదే ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తూ ఎప్పుడూ అతనితో పబ్లిక్ లోనే మెలుగుతున్నావు అనుకో. అతను నీ మీద చెయ్యి వేసే అవకాశమే ఉండదు. ఇక్కడ నువ్వు మోసపోయేది ఒక వ్యక్తి మంచివాడు అని నమ్మడం వలన. అదే నువ్వు ప్రకృతిని, మనిషి సహజంగా ఉన్న ప్రవర్తనను అర్థం చేసుకుని ప్రైవసీలోకి వెళ్లకుండా ఉండడమే నిన్ను కాపాడింది. కాబట్టి నువ్వు నేర్చుకోవలసినది ఎవరిని నమ్మాలి అన్నది కాదు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి అనేది మాత్రమే.

కౌన్సిలింగ్ అంటే నమ్మించడం కాదు. బోధించడం కాదు. మోటివేట్ చెయ్యడం కాదు. నాలుగు మంచి మాటలు చెప్పడం కాదు. నీతి వాక్యాలు చెప్పడం కాదు. అవన్నీ ఎక్కడ బడితే అక్కడ దొరుగుతాయి. అవి ఎవరైనా చెప్పగలుగుతారు. ఫేస్బుక్ ఒక్కసారి తెరిస్తే అనేక మోటివేషనల్ కోట్స్ దర్శనమిస్తాయి. అందరూ నీతిబోధలు చేస్తూనే ఉంటారు. ఏ సినిమా చూసిన చివర్లో నీతులు ఉంటాయి. వాటిని బోధించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. కౌన్సిలింగ్ అంటే ప్రకృతిని అర్థం చేసుకునే విధంగా తయారు చెయ్యడం. సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా తయారుచేయడం. మనుషులలో ఉన్న సహజమైన దుర్మార్గాన్ని తెలియజేసి అప్రమత్తంగా ఎలా ఉండొచ్చో అర్థం చేసుకునే లాగ చెయ్యడం తప్ప నమ్మించడం కాదు.


How Our Childhood Trauma Affects our Love || Attachment Styles

How Our Childhood Trauma Affects our Love || Attachment Styles



మీ లైఫ్ లో ఇలాంటి రిలేషన్షిప్ ఫేస్ చేశారా ఒకరికేమో టూ మచ్ క్లోజ్నెస్ కావాలి ఇంకొకరికేమో క్లోజ్ అయితే సఫకేషన్ లో అనిపించి డిస్టెన్స్ గా ఉండాలని కోరుకుంటారు ఒకరికేమో అస్తమానికి రీ అష్యూరెన్స్ కావాలి లవ్ లో ఇంకొకరికేమో స్పేస్ కావాలని ఫీల్ అవుతారు మీరు మీకు ఇష్టమైన పర్సన్ కి మెసేజ్ చేస్తారు రిప్లై కోసం వెయిట్ చేస్తారు నిమిషాలు గంటలు గడుస్తాయి నో రిప్లై మీ మైండ్ లో ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయితది నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా తనకి నా మీద ఇంట్రెస్ట్ పోయిందా నేను ఇంకొక రెండు మూడు మెసేజ్లు పెట్టాలా ఇలా మైండ్ లో ఓవర్ థింకింగ్ చేస్తూ కూర్చుంటారు కానీ అవతల వాళ్ళు మాత్రం మెసేజ్ చూసేసి ఆ తర్వాత రిప్లై ఇవ్వచ్చు కనబడేస్తారు వెంటనే రిప్లై నేను ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రెజర్ క్రియేట్ అవుతుంది అవతల వాళ్ళకి తర్వాత ఇద్దాం అని చెప్పేసి ఊరుకుంటూ పోతారు ఆ తర్వాత అనేది చాలా గంటల తర్వాత రావచ్చు ఇన్ని గంటల తర్వాత రిప్లై వస్తే ఆల్రెడీ హర్ట్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసి ఉన్న మీ బ్రెయిన్ కి పిచ్చెక్కి ఎందుకు ఇంత లేట్ గా రిప్లై ఇచ్చావ్ అని క్వశ్చన్ అడుగుతారు ఇలా క్వశ్చన్ అడగానే అవతల వాళ్ళకి ప్రెజర్ ఫీల్ అవుతుంది ఏంటి నాకు ఈ కంట్రోల్ నేను ఎందుకు ఫాస్ట్ గా రిప్లై ఇవ్వాలి అని వాళ్ళు ఇంకా వెనక్కి విత్ డ్రా అయిపోతారు ఈ ప్రాబ్లం గాని మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇది కమ్యూనికేషన్ ఇష్యూ కాదు ఇది అటాచ్మెంట్ ఇష్యూ ఇది అర్థం చేసుకోవాలంటే మనం మన చైల్డ్ హుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మనం వేరే పీపుల్ తో రిలేషన్షిప్ ఎలా కనెక్ట్ అవుతాము అనేది మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచారు అనే దాని బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటది ఏవా అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చిన్నప్పుడు ఏడుస్తుంటే వాళ్ళ మదర్ వచ్చి ఒకసారి లవ్ ఇస్తది ఒకసారి డిస్టెంట్ అయిపోతుంటది ఆమె చిన్నప్పుడు ఏడుస్తుంటే తన పేరెంట్స్ రెస్పాన్స్ ఇచ్చేవారు కానీ కన్సిస్టెంట్ గా కాదు కొన్ని రోజులు చాలా లవ్ చూపిస్తారు హగ్ ఇస్తారు కంఫర్ట్ ఇస్తారు కొన్ని రోజులు మాత్రం డిస్టెంట్ గా ఉంటారు బిజీ అయిపోతారు ఎమోషనల్లీ అన్ అవైలబుల్ అయిపోతారు ఇది చూసిన ఏవా చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతది సో తన పేరెంట్స్ అటెన్షన్ కోసం ఇంకా ఇంకా యాడ్ అవ్వడం మొదలు పెడతాది ఇంకా అడిగితేనే గాని నాకు ప్రేమ రాదేమో అని అనుకుంటది లవ్ ని డిమాండ్ చేయకపోతే దొరకదేమో అని అనుకుంటది ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఎవ ఎప్పుడైతే పెద్ద అవుతదో ఆమె లవర్ తో కూడా ఇలాగే బిహేవ్ చేస్తది తన పార్ట్నర్ ని కాన్స్టెంట్ గా రీ అష్యూరెన్స్ కోసం అడుగుతాది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా ఎందుకు నాకు ఇంత లేట్ గా రిప్లై ఇస్తున్నావ్ నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఓవర్ థింకింగ్ చేస్తది ప్రతి దాని మీద తన పార్ట్నర్ కి ఇది ప్రెజర్ లాగా అనిపించి తన పార్ట్నర్ తన నుంచి స్లోగా డిస్టెన్స్ అవ్వడం మొదలు పెడతారు అప్పుడు ఏవాకి తనకున్న వరస్ట్ ఫియర్ ఎదురవుతది అదే ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అంటే తనని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారేమో అనే ఫియర్ ఇదే ఆన్షియస్ అటాచ్మెంట్ స్టైల్ ఆమె పానిక్ అయిపోతది పానిక్ అయిపోయి ఓవర్ థింక్ చేస్తది ఇంకా ఇంకా టెక్స్ట్ చేస్తది తన పార్ట్నర్ ని మళ్ళీ మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తది తనకు తెలియకుండానే తన పార్ట్నర్ ని ఇంకా ఇంకా దూరం చేసుకుంటది చైల్డ్ హుడ్ లో ఇన్ కన్సిస్టెంట్ లవ్ దొరకడం వల్ల పెద్దయిన తర్వాత ఒక ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం దాన్నే మన లవ్ మీద కూడా చూపిస్తాం లియో అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి ఎమోషనల్లీ అన్ అవైలబుల్ పేరు పేరెంట్స్ ఉన్నారు అంటే ఆ అబ్బాయి ఏడుస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా పట్టించుకునే వారు కాదు సరిగ్గా లవ్ అండ్ కంఫర్ట్ ఇచ్చేవారు కాదు అబ్యూసివ్ గా బిహేవ్ చేసేవారు కొట్టేవారు స్లోగా లియో ఒక లెసన్ నేర్చుకుంటాడు లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే తనకి రిజెక్షన్ దొరుకుతది అని ఫీల్ అవుతాడు సో కంఫర్ట్ సీక్ చేయడం కరెక్ట్ కాదు అనుకుంటాడు తనకు తనే ఇండిపెండెంట్ గా ఉండాలి నేను సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి అని తనకు తనే ఒక షీల్డ్ ని క్రియేట్ చేసుకుంటాడు తన ఎమోషన్స్ ని సప్రెస్ చేసుకోవడం నేర్చుకుంటాడు వల్నరబుల్ గా ఉండడం అనేది వీక్నెస్ అని అతను ఫీల్ అవుతాడు కాబట్టి అడల్ట్ అయ్యాక మన లియో రిలేషన్షిప్స్ లో అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ లోకి వెళ్ళిపోతాడు ఎవరైనా టూ క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తే అతనికి సఫకేషన్ లా అనిపిస్తది తన పార్ట్నర్ ఎక్కువగా మెసేజ్లు చేస్తే రిప్లై చేయడం డిలే చేస్తాడు డీప్ ఫీలింగ్స్ గురించి మాట్లాడదాం అంటే టాపిక్ చేంజ్ చేస్తాడు మన ఏవా ఎమోషనల్ డిస్టెన్స్ వల్ల హర్ట్ అవుతది కానీ లియో కి మాత్రం దూరంగా ఉంటే హాయిగా ఉన్నట్టు అనిపిస్తది ఇది చైల్డ్ హుడ్ లో అతను నేర్చుకున్న సర్వైవల్ దీన్నే అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారు ఎమోషనల్లీ అన్ అవైలబుల్ పేరెంట్స్ వల్ల షేప్ అయిన పాటర్న్ ఇండిపెండెన్స్ ని ఎక్కువ వాల్యూ చేయడం వల్ల ఫియర్ డెవలప్ చేసుకుంటారు ఇప్పుడు మాయ అనే ఒక అమ్మాయిని తీసుకుందాం ఆ అమ్మాయి చిన్నప్పుడు పార్క్ లో ఆడుకుంటుంది సో తను జారుపల్లి జారుతుంటే వాళ్ళ అమ్మ వెనక నుంచి చూస్తుంది ఆ అమ్మాయి ఒకసారి జారబలు జారి ఇలా వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ అమ్మ స్మైల్ ఇస్తూ అమ్మ వైపు చూస్తుంది సో మా అమ్మ నా వైపు చూస్తుంది అని చెప్పి ఒక కంఫర్ట్ ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్లి హాయిగా ధైర్యంగా జారబలు జారుతుంది మా అమ్మ ఇక్కడే ఉంది కదా అనుకోని అయితే ఆమె జారబాలు జారుతూ కింద పడిపోతుంది మోకాలికి దెబ్బ తగులుతుంది అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ చూసి వచ్చి అయ్యో పడిపోయావా దెబ్బ తగిలిందా నొప్పి పెడుతుందా నీకేం కాదులే తగ్గిపోతుందిలే అమ్మ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ ఒక కంఫర్ట్ ని ఇస్తుంది ఆ అమ్మాయికి అది చూడగానే అమ్మాయి ఏడుపు ఆపేసి కామ్ అవుతుంది పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాల్సిన టైం లో కరెక్ట్ గా లవ్ ని అందజేస్తే పిల్లలు ఒక ట్రస్ట్ ఫీల్ అవుతారు లవ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని బిలీవ్ చేస్తారు మనుషుల్ని ప్రపంచాన్ని నమ్మడం తెలుసుకుంటారు సో వాళ్ళ అమ్మ అక్కడే ఉంది కదా అని ధైర్యంతో ఆమె ధైర్యంగా ప్రపంచాన్ని నేను ఎక్స్ప్లోర్ చేయగలను అని చెప్పి వెళ్లి హాయిగా ఆడుకుంటుంది ఎవరితో మాట్లాడడానికైనా కాన్ఫిడెంట్ ఫీల్ అవుతుంది ఇలా పెరిగిన అమ్మాయి పెద్దైన తర్వాత రిలేషన్షిప్ లో సెక్యూర్డ్ అటాచ్మెంట్ స్టైల్ కి వెళ్తుంది అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులన్నీ కరెక్ట్ గా ఇస్తే వాళ్ళలో పెద్దయ్యాక ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి ఎవరితో ఎంతవరకు బిహేవ్ చేయాలో అంతవరకే బిహేవ్ చేస్తారు రిలేషన్షిప్స్ లో రిప్లై లేట్ గా వస్తే పానిక్ అయిపోరు ప్రేమ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్లరు తన మైండ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని తన నీడ్స్ ని తను కంఫర్ట్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది ఎవరితోనైనా ఎందుకంటే హెల్దీ లవ్ ని చిన్నప్పటి నుంచే ఆమె ఎక్స్పీరియన్స్ అవుతూ పెరిగింది కాబట్టి ఇది సెక్యూర్డ్ అటాచ్మెంట్ స్టైల్ అంటాం యాన్షియస్ అటాచ్మెంట్ అవాయిడెంట్ అటాచ్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి అంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది యాన్షియస్ పార్ట్నర్ కి ఏమో క్లోజ్నెస్ కావాలి రీ అస్సూరెన్స్ కావాలి డీప్ ఎమోషనల్ కనెక్షన్ కావాలి అవాయిడెంట్ పార్ట్నర్ కేమో ఇండిపెండెన్స్ కావాలి క్లోజ్నెస్ అంటే సఫకేషన్ వస్తది యాన్షియస్ పార్ట్నర్ ఏమో చేస్ చేస్తుంటే అవాయిడెడ్ పార్ట్నర్ ఏమో పారిపోతూ ఉంటాడు యాన్షియస్ పార్ట్నర్ రిజెక్షన్ కి ఫీల్ అయ్యి పానిక్ అవుతారు ఇంకా ఇంకా చేస్ చేస్తారు లవ్ కోసం ఇంకా ఇంకా క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తారు అవాయిడెడ్ పార్ట్నర్ సఫికేషన్ ఫీల్ అయ్యి ఇంకా డిస్టెంట్ అయిపోతారు రిజల్ట్ ఏమవుతుందంటే యాన్షియస్ పార్ట్నర్ లవ్ లేనట్టు ఫీల్ అవుతారు అబాండెన్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు అవాయిడెంట్ పార్ట్నర్ సఫకేషన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతారు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు ఈ అటాచ్మెంట్ నుంచి హీల్ అవ్వకపోతే ఇదే సైకిల్ లో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటారు సైకాలజీ ఏం చేస్తుందంటే ఈ ఆన్షియస్ అటాచ్మెంట్ పార్ట్నర్ ఎప్పుడు వెళ్లి అవార్డెడ్ అటాచ్మెంట్ పర్సన్ వెతుక్కుంటారు ఇద్దరు ఉన్న ఆపోజిట్ బిహేవియర్స్ వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కానీ ఎక్కువ కలిసి ఉండలేరు మళ్ళీ విడిపోతారు రిజల్ట్ ఇస్ బ్రేక్ అప్ ఇప్పుడు ఇద్దరు యాಂన్స్ పర్సన్స్ రిలేషన్షిప్ లోకి వస్తే ఏమవుతుంది ఇది సూపర్ ఇంటెన్స్ గా ఉంటది వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువే వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువే సో వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా ప్యాషనేట్ గా ఎమోషనల్ గా ఉంటది కానీ అంతే అన్స్టేబుల్ గా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు ఇద్దరికి కాన్స్టెంట్ రీ అస్సూరెన్స్ కావాలి ఇద్దరు ఓవర్ థింక్ చేస్తారు ఇద్దరు ఓవర్ మెసేజింగ్ చేస్తారు ఇద్దరికి ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ ఉంటది చిన్న గొడవ వస్తే ఇద్దరు టూ మచ్ గా సారీలు చెప్పేసుకుంటారు ఫైట్లు కూడా ఓవర్ గా జరుగుతది రిజల్ట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ చాలా ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తాయి అలసిపోతారు డ్రైన్ అయిపోతారు ఇద్దరు కూడా సెక్యూర్డ్ ఫీల్ అవ్వకపోతే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు అనిపిస్తది దీనిలో నుంచి హీల్ అవ్వకపోతే ఇది కూడా ఒక సైకిల్ లో రొటేట్ అవుతూనే ఉంటారు ఇప్పుడు ఇద్దరు అవాయిడెంట్ పర్సన్స్ కలిస్తే ఏమవుతది ఆ రిలేషన్షిప్ ఎప్పుడు సరిగ్గా స్టార్ట్ అవ్వదు ఎందుకంటే ఇద్దరికీ డీప్ కనెక్షన్స్ అంటే భయం ఇద్దరు గొడవల నుంచి పారిపోతారు ఇద్దరు దూరంగా ఉండి ఫ్రెండ్స్ తోనో వర్క్ లోనో హాబీస్ లోనో పడి బిజీ అయిపోతారు డీప్ గా మాట్లాడాలంటే ఇద్దరికీ ఇష్టం ఉండదు రిజల్ట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో డ్రామా ఉండదు అండ్ ఇందులో లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వలేదు ఎందుకంటే డీప్ ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు ఫామ్ అవ్వదు కాబట్టి ఓ టైం ఇద్దరు లోన్లీ గా ఫీల్ అవుతారు వన్ ఫైవ్ డేస్ లోగా లవ్ ఫెయిడ్ అయిపోతది సడన్ గా ఇద్దరు బ్రేకప్ చెప్పుకుంటారు ఇప్పుడు హెల్దీ రిలేషన్షిప్స్ ఎవరెవరికి బాగుంటది ఎప్పుడు కూడా ఒక సెక్యూర్డ్ అటాచ్మెంట్ పర్సన్ ఒక యాంగన్యస్ అటాచ్మెంట్ పర్సన్ లేదా ఒక సెక్యూర్ అటాచ్మెంట్ పర్సన్ లేదా ఒక అవాయిడెంట్ అటాచ్మెంట్ పర్సన్ లేదా ఇద్దరు సెక్యూర్డ్ అటాచ్మెంట్ పర్సన్స్ ఈ కాంబినేషన్ లో అయితే రిలేషన్షిప్స్ హెల్దీ గా ఉంటాయి ఒక అన్ ప్రాబ్లమాటిక్ పర్సన్ ఉంటే ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్ ఉంటే రిలేషన్ స్టేబుల్ గా ఉంటది ఎందుకంటే సెక్యూర్ పర్సన్ కి థింగ్స్ ఎలా డీల్ చేయాలో తెలుసు అంటే ఇప్పుడు సెక్యూర్ పర్సన్ యాంగన్షియస్ పర్సన్ ఉన్నారనుకోండి సో యాన్షియస్ పర్సన్ ఓవర్ థింక్ చేసినప్పుడు సెక్యూర్ పర్సన్ కి ఎలాగ దాన్ని కంట్రోల్ చేయాలో తెలుసు సో దాని వల్ల యాన్షియస్ పర్సన్ సేఫ్ ఫీల్ అవుతారు అన్నమాట ఇప్పుడు సెక్యూర్ ప్లస్ అవాయిడెంట్ కలిసి ఉన్నారు అనుకోండి సో సెక్యూర్ వాళ్ళు వాళ్ళ స్పేస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి యాన్షియస్ వాళ్ళ మీద పడిపోరు కాబట్టి సో అవాయిడెంట్ పర్సన్ కి అది ఒక స్పేస్ క్రియేట్ అవుతది సో స్లోగా వాళ్ళు ఒక ట్రస్ట్ ని అనేది బిల్డ్ చేసుకోగలరు స్లోగా ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ అవుతారు టూ సెక్యూర్ పర్సన్స్ అయితే ఇంకా చెప్పే అక్కర్లేదు వాళ్ళ లవ్ డీప్ ఎమోషనల్ బాండింగ్ లాంగ్ టర్మ్ కనెక్ట్ అయి ఉంటారు ఇది హెల్దీ బాండ్ బట్ ఎలాగా ఆల్రెడీ ట్రబుల్ సం పార్ట్నర్స్ తో ఉంటే కనెక్ట్ అయిపోయి మనం వదిలేయలేము కదా మధ్యలో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనల్ని మనం హీల్ చేసుకోవాలి బోత్ పార్ట్నర్స్ టుగెదర్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ అటాచ్మెంట్ స్టైల్ ఏంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను నేను ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నాను థెరపీ తీసుకొని సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకొని సెల్ఫ్ లవ్ క్రియేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయట పడొచ్చు యాన్షియస్ అటాచ్మెంట్ స్టైల్ వాళ్ళు ఎలా హీల్ అవ్వాలి వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ ఎలా పెరుగుతది మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్ వాలిడేషన్ కోసం ట్రై చేస్తుంటే అది నిజంగా జెన్యూన్ కనెక్షన్ కోసం ట్రై చేస్తున్నారా లేదంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని భయంతో ట్రై చేస్తున్నారా మీరు అసెస్ చేసుకోవాలి మీ పార్ట్నర్ కి నువ్వు డు యు స్టిల్ లవ్ మీ అనే టెక్స్ట్ మెసేజ్ చేసే ముందు డీప్ బ్రీతింగ్ తీసుకొని జర్నల్ రాసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి మన నెర్వస్ సిస్టం ని కామ్ డౌన్ చేయడం నేర్చుకోవాలి మనం పూర్తిగా మన పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోవడానికి ట్రై చేయకూడదు మన సెల్ఫ్ డిపెండెన్స్ సెల్ఫ్ రిలయన్స్ అనేది నేర్చుకోవాలి అవుట్ సైడ్ ఆఫ్ రిలేషన్షిప్స్ కొన్ని ఫ్రెండ్షిప్స్ పెట్టుకోవాలి ఎమోషనల్ సపోర్ట్ కోసం లవ్ మీదే కాకుండా బయట ఫ్రెండ్ సపోర్ట్ పెట్టుకోవాలి హాబీస్ పర్సనల్ గోల్స్ పెట్టుకోవాలి మన ఓన్ లైఫ్ ఫుల్ ఫిల్లింగ్ లో ఉంటే మన పార్ట్నర్ మీద మనం డెస్పరేట్ గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు రోలర్ కాస్ట్ ఎమోషన్స్ కంటే స్టెబిలిటీ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి స్టెబిలిటీ అనేది బోరింగ్ కాదు అది హెల్దీ అబాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ నుంచి ఎలా హీల్ అవ్వాలి క్లోజ్ గా ఉన్న ఫ్రీడమ్ లూస్ అవ్వడం కాదు అనే విషయం తెలుసుకోవాలి హెల్దీ రిలేషన్షిప్ అనేది ట్రాప్ చేయదు అది మనకి స్పేస్ ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి సడన్ గా మాయమైపోకుండా క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి పార్ట్నర్ తో అప్పుడప్పుడు ఐ లవ్ యు బట్ నాకు కొంచెం టైం కావాలి నీ కోసం కాదు ఇది అని చెప్పి అవతల పార్ట్నర్ కి మెసేజ్ చేయడం అలవాటు చేసుకోవాలి వల్నరబిలిటీ అనేది వీక్నెస్ కాదు అనేది తెలుసుకోవాలి స్మాల్ స్టెప్స్ ఆఫ్ వల్నరబిలిటీ ప్రాక్టీస్ చేయాలి వల్నరబిలిటీ అంటే నా ప్రాబ్లమ్స్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వీక్నెస్ అని అనుకుంటారు వీళ్ళు షేర్ చేసుకోవచ్చు తప్పులేదు అనే విషయం తెలుసుకోవాలి ఒకేసారి ఓవర్ షేరింగ్ చేసేయక్కర్లేదు స్మాల్ స్మాల్ స్టెప్స్ తో చిన్న చిన్నవి షేర్ చేసుకోవచ్చు అంటే ఈ రోజు నీ డే ఎలా ఉంది అని అడిగినప్పుడు జెన్యూన్ గా ఏం జరిగిందో షేర్ చేసుకోవచ్చు ఎమోషనల్ గా డిపెండ్ అవ్వడం అంటే వీక్నెస్ కాదు అనే విషయం తెలుసుకోవాలి ఎమోషనల్ సపోర్ట్ అనేది ప్రతి మనిషికి కావాలి హ్యూమన్స్ నీడ్ ఎమోషనల్ కనెక్షన్ ఫ్రమ్ అదర్స్ లేకపోతే మనం బ్రతకలేము సో ఈ నిజాన్ని తెలుసుకొని స్లోగా వేరే వాళ్ళ మీద ఎమోషన్స్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకోవాలి బట్ అట్ ద సేమ్ టైం మనల్ని మనం వదులుకోకూడదు మన సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ పర్సన్ అంటే ఇండిపెండెంట్ గా ఉంటూ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాడే ఇద్దరు పార్ట్ ఒక టీం లాగా ఉండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని దాన్ని హీలింగ్ చేసుకుందాం అని చెప్పి ముందుకు వస్తే దెన్ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఐ నో మన ఇండియాలో థెరపీ అంటే థెరపీ కి వెళ్ళమంటే నాకు ఏమైనా మెంటల్ వచ్చిందా అన్నట్టు చూస్తారు చాలా మంది థెరపీ కి వెళ్లరు థెరపీ అంటే పిచ్చి వచ్చినట్టు కాదు థెరపీ కి పిచ్చోళ్ళు వెళ్లరు దానికి మెంటల్ హాస్పిటల్ ఉంటది వేరేగా మన లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మనం ఎలా హీల్ చేసుకోవాలి మన కమ్యూనికేషన్ మన అటాచ్మెంట్ స్టైల్ ని దీనికి థెరపీ ఇస్తారు థెరపీ అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ ఒక ప్రొఫెషనల్ ఎమోషనల్ సపోర్ట్ ఇది తీసుకోవడం వల్ల తప్పులేదు ఇది తీసుకోకే చాలా మంది రిలేషన్షిప్స్ లో స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఫైనల్ వర్డ్స్ యాన్షియస్ అటాచ్మెంట్ స్టైల్ వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండడం నేర్చుకోండి రీ అస్సూరెన్స్ కోసం ఎక్కువగా మీ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోవద్దు మీ వర్త్ మీరు తెలుసుకోండి అవాయిడెడ్ పీపుల్ క్లోజ్నెస్ అనేది సఫికేషన్ కాదు వల్నరబిలిటీ అనేది వీక్నెస్ కాదు అనే విషయం తెలుసుకోవాలి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా క్లియర్ కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవాలి లవ్ అనేది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ హోమ్ లాగా ఫీల్ అవ్వాలి కానీ ఒక యుద్ధ రంగంలో ఉండకూడదు సో ఇద్దరు పార్ట్నర్స్ టుగెదర్ హీల్ అయితే రిలేషన్ షిప్స్ కి ఒక ట్రస్ట్ పీస్ ఒక డీప్ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది 
 *ప్రపంచంలో ఎక్కువగా తినే అల్పాహారాల్లో ఇడ్లీ ఒకటి...* *ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటి. భారత దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందరికీ ఇష్టమైన, తేలికగా జీర్ణమయ్యే పౌష్టికాహారం ఇడ్లీయే. ఇతర ఆహార పదార్థాలతో అతి తక్కువ ధరకు లభించే ఆహారం ఇడ్లీయే..*
*కావేరీ జలాల కోసం తగవు పడే తమిళనాడు, కర్నాటకలు ఇడ్లీ మాదంటే మాదని చెప్పుకుంటారు. అయితే భారతీయులకు మిండుగు పడని చేదువార్త ఏమిటంటే.. ఇడ్లీ పుట్టింది భారత దేశంలో కాదు.  ఈ రెండు ప్రాంతాల్లోకూ ఇది పుట్టలేదు.*
*దక్షణ భారతీయ (తమిళ) రాజులు తూర్పు ఆసియాలోని అనేక దేశాలను పాలించారు. ఆ కాలంలో క్రీ.శ 800-1200 మధ్య ఇండోనేషియా నుంచి మన దేశానికి వచ్చింది. ఆహార చరిత్రకారుడు కె.టి. అచ్చయ దీన్ని నిర్దారించాడు. అయినా ఇక్కడ పూర్తిగా దేశీయ వంటకంగా మారింది. ఇండోనేషియాలో కెడ్లీలు అంటారు. తెలుగులో ఇడ్డెనలు అంటారు.*
*ఒక ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.*
*ఇడ్లీ ఎవరిదైతే మనకేం. ఇంత చక్కని శాకాహారాన్ని ఎలా వదులుకోగలం?*
*ఏ వారం అయినా, ఓరోజు అయినా మనకేం.. రోజూ తినండి ఇడ్లీ..*
*"నాలుగో కోతి!"*
"సత్యం మందపాటి"

నేను ఆఫీసులోకి ప్రవేశించేసరికి బ్రేక్ ఇన్స్పెక్టర్ భూపతి సిగరెట్ త్రాగుతూ ఏదో ఫైల్ చూసుకుంటున్నాడు. నన్ను గమనించలేదో గమనించీ చూడనట్లు ఊరుకున్నాడో అర్ధంకాలేదు. కానీ తలెత్తకుండా ఏదో వ్రాసుకుంటున్నాడు.

రెండు నిమిషాలు అలాగే నుంచుని చిన్నగా దగ్గాను.

ఆయన తల ఎత్తాడు.

“గుడ్ మార్నింగ్ సార్” అన్నాను.

“గుడ్ మార్నింగ్. కూర్చోండి” అంటూనే తను చూస్తున్న ఫైలులో ముణిగిపోయాడు.

కాసేపాగి “మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. క్షమించాలి!” అన్నాను.

ఆయన మళ్ళీ తలెత్తాడు.

“నేను క్రొత్తగా ఒక లారీ కొన్నాను. రిజిస్ట్రేషన్ చేయించి, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుందామని వచ్చాను. కాగితాలు ఇచ్చి నాలుగు రోజులయింది. మీరు కొంచెం దయవుంచి త్వరగా పని పూర్తి చేస్తే… “

ఆయన కొంచెం విసుగ్గా చూశాడు. “కాగితాలు ఇచ్చారుగదా. తొందరపడతారేం. ఆఫీసు ప్రొసీజర్ ప్రకారం కొంచెం ఆలస్యం అవుతుంది మరి. రెండు రోజులు ఆగి రండి” అన్నాడు.

“అదికాదు సార్. అంత డబ్బు ఖర్చుపెట్టి కొన్న లారీ నడవకపోవటం వల్ల రోజూ ఎంతో డబ్బు నష్టపోతున్నాను. మొన్నే లారీని చూసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారనుకున్నాను. ఆరోజు చూడలేదు. నిన్న చూస్తానన్నారు. చూడలేదు. కనీసం ఇవాళయినా…”

ఇంతలో స్వింగ్ డోర్స్ తెరుచుకుని పొడుగ్గా, బలంగా, చామనచాయగా వున్నాయన హుందాగా లోపలకు అడుగుపెట్టాడు. వస్తూనే నవ్వుతూ, “నమస్తే భూపతిగారూ” అన్నాడు. అంటూనే కుర్చీ ముందుకు లాక్కుని కూర్చున్నాడు.

ఆయనెవరో నాకు బాగా తెలుసు. దాదాపు పది బస్సులకు, నాలుగైదు లారీలకు అధిపతి. పట్టణంలో వున్న గొప్పవాళ్ళల్లో ఒకడు. పేరు అంకినీడు.

“ఊరకరారు మహానుభావులు. ఏదో పెద్ద పని మీదే వచ్చినట్టున్నారే అంకినీడుగారు” అన్నాడు భూపతి నవ్వుతూ.

“మీతో మాకు వేరే పనేముంటుంది సార్!” అంటూ ఆయనా నవ్వాడు.

భూపతి బల్ల మీద మూడు కోతుల బొమ్మ వుంది. దాని ‘మీద చెడు వినకు, చెడు చూడకు, చెడు చెప్పకు’ అని వ్రాసి వుంది.

అది చూస్తూ అన్నాడు అంకినీడు. “కొత్తగా గాంధీగారి బొమ్మ పెట్టారే. ఐనా అవేం నీతుల్లెండి ఈ కాలంలో” అదోరకంగా నవ్వాడు.

భూపతి అన్నాడు, “ప్రజలదేం తప్పు లేదంటాను. చెడు వినవద్దు, చూడవద్దు, చెప్పవద్దు అనే మూడు కోతులు చెబుతున్నాయిగానీ, చెడు చేయవద్దు అని చెప్పే నాలుగో కోతి ఏది? అందుకే అందరూ చెడ్డ పనులు చేస్తున్నారు. బాగుపడుతున్నారు”

అంకినీడు ఆయన హాస్యానికి పెద్దగా నవ్వాడు.

భూపతి తన ముందున్న సిగరెట్ పెట్టెను అంకినీడుకి అందించాడు.

అంకినీడు సిగరెట్ వెలిగించి, నిర్లక్ష్యంగా పొగ వదులుతూ అన్నాడు. “ఒక చిన్న పని తగిలింది సార్. మన నైంటీన్ ట్వంటీటూ లేదూ, దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి!”

భూపతి పెద్దగా నవ్వాడు.

“ఫిట్నెస్సా… ఆ డొక్కు సిటీ బస్సుకా! ఏమన్నా బాగుచేయించారా, ఇంకా అలాగే నడుస్తున్నదా?”

అంకినీడు కూడా చిన్నగా నవ్వాడు.

“రిపేరా? భలేవాళ్ళు సార్ మీరు. దానికి రిపేర్ మొదలుపెడితే మంగళగిరి పానకాలస్వామిలా తాగేస్తుంది. ఆఁ ఏదో రోడ్డు మీద నడుస్తున్నదిగదా. నడవనీయండి. ఇప్పుడు నేనంత డబ్బు ఎక్కడ తేగలను?”

“మరయితే నేను ఫిట్నెస్ ఎలా ఇస్తాననుకున్నారు?” అన్నాడు భూపతి.

అంకినీడు మళ్ళీ నవ్వాడు.

ఈలోగా భూపతి నాకేసి తిరిగి, “మీ లారీ బయట వున్నదా?” అడిగాడు.

లేచి నిలబడి “ఉంది సార్. చూస్తారా?” అడిగాను.

“బయట ఉండండి. కాసేపట్లో వస్తాను” అన్నాడు భూపతి.

ఒక నమస్కారం పారేసి బయటకు వచ్చాను.

అక్కడంతా హడావిడిగా వుంది. ఎంతోమంది చేతుల్లో రిజిస్ట్రేషన్ పుస్తకాలతోనూ, టోకెన్సుతోనూ హడావిడిగా తిరుగుతున్నారు. ఒక గంట గడిచింది. నా ఎదురుగానే అంకినీడు కారెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత అరగంటకి భూపతి బయటకు వచ్చాడు. బయట వున్న కొన్ని వెహికిల్స్ అసలు చూడనే లేదు. ప్రక్కనే వున్న డ్రైవర్లతో “ఫిట్నెస్ అయిపోయింది. బండి తీసుకుపోవచ్చు” అన్నాడు. అంటే బండి చూడకుండానే ఫిట్నెస్ సర్టిఫికేట్ తయారైంది అన్నమాట. కొన్ని బళ్ళకు ఏవో వంకలు పెట్టాడు.

“మీ లారీ ఏది?” అడిగాడు బ్రేక్ ఇన్స్పెక్టర్.

చూపించాను. ఎక్కి స్టార్టు చేశాడు. కొంచెం ముందుకీ వెనక్కీ రెండు మూడుసార్లు నడిపాడు. సడన్గా బ్రేక్ కొట్టాడు. ఠక్కున ఆగింది. క్రిందకు దిగి నెంబర్ ప్లేట్లు రెండూ చెక్ చేశాడు. నన్ను పిలిచి, స్టాప్ సైన్ బోర్డు సరిగ్గా వ్రాయించలేదన్నాడు. బ్రేకు గట్టిగా పట్టుకుంటున్నదిట. అది బాగుచేయించాలన్నాడు. రియర్ వ్యూ అద్దం మరీ చిన్నదయింది, సరిగ్గా కనపడటం లేదన్నాడు. పెద్దది వేయించమన్నాడు.

అన్నిటికీ సరేనన్నాను.

“అన్నీ బాగుచేయించి, రేపూ ఎల్లుండి శెలవు కనుక సోమవారం తీసుకురండి. అప్పుడు చూద్దాం. ఇటువంటి బళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని ప్రాణం తీస్తారు!” సణుగుతూ లోపలికి వెళ్ళిపోయాడాయన.

అది సరికొత్త బండి. అయినా ఈయన వంకలు పెడుతున్నాడు. నాకేం చేయాలో తెలియలేదు.

చుట్ట కాలుస్తూ అక్కడే నుంచున్న ప్యూన్ నన్ను చూసి అదోలా నవ్వాడు. చుట్ట పారేసి నా దగ్గరకు వచ్చాడు.

“ఏం సార్, పనయిందా? అయ్యగారు ఏమన్నారు? మీ ముఖం చూడగానే తెలుస్తున్నది సార్ పనవలేదని. మీరు నేను చెబితే వినరు సార్. మీరు ఊఁ అనండి. ఐదు నిమిషాల్లో మీ పని పూర్తవకపోతే నన్నడగండి. ఇప్పుడే వెళ్ళిన అంకినీడుగారిని చూడండి. ఆయన ఆ డొక్కు బస్సుని ఇక్కడకు తేకుండనే, అయ్యగారు బండి చూడకుండానే సర్టిఫికేటుతో ఇంటికి వెళ్ళిపోయారు. చూశారా. ఆయన వచ్చారంటే వెంటనే పని చేయించుకుని వెళ్ళిపోతారు. మాకూ, ఆయనకూ, అందరికీ హాయి. మీరు ఇన్నాళ్ళనించీ తిరుగుతూ…”

అతని మాటలు వినకుండా ముందుకు నడిచాను. అక్కడ వెంటనే పని అవాలంటే ఏం చేయాలో కూడా తెలుసు. అంత అమాయకుడినేమీ కాదు. కానీ నా ఆశయాలకు అది విరుధ్ధం.

ఇన్ని రోజులనుండీ నా లారీ రోడ్డు మీద నడవకపోవటం వల్ల నష్టం నా మదిలో మెదిలింది. ‘ఏం, కొంత డబ్బు పారేస్తే త్వరగా అవుతుంది కదా’ అని అడుగుతున్నాడు నాలోని సామాన్యుడు. మళ్ళీ ప్రిన్సిపల్ అడ్డం వచ్చింది.

అందుకే ప్యూనుతో ఏమీ అనకుండా బయటికి వచ్చాను. అతను వెనకనించే సణగటం వినిపిస్తూనే వుంది.

మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిన ‘రిపేర్లు’ అన్నీ చేయించి మళ్ళీ వచ్చాను.

అదేం ఖర్మమో, నేను భూపతి దగ్గరకు వెళ్ళిన మరుక్షణంలోనే లోపలకు హడావిడిగా వచ్చాడు అంకినీడు.

కుర్చీ లాక్కుని కూర్చుని, దీక్షగా చూశాడు భూపతిని.

భూపతి అతన్ని వింతగా చూశాడు.

“కొంపలంటుకున్నాయి సార్. మా బస్సుకి పెద్ద ప్రమాదం జరిగింది” నుదుటికి పట్టిన చెమటను చేతి రుమాలుతో తుడుచుకుంటున్నాడు.

భూపతి ఆసక్తిగా చూశాడు, “ఏ బస్సుకి?” అడిగాడు.

“మొన్న మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిందే. నైన్టీన్ ట్వంటీటూ”

భూపతి కూడా కొంచెం కలవరపడ్డట్టు కనిపించాడు. మెల్లగా అడిగాడు, ఏక్సిడెంట్ ఎలా అయిందని.

అంకినీడు ఎండిన పెదవులు నాలికతో ఒకసారి తడి చేసుకుని అన్నాడు. “ఏం లేదు సార్. మైన్ రోడ్డులో మా బస్ వెడుతున్నదిట. రూల్స్ ప్రకారం ఎడమ పక్కనే వెడుతున్నాడుట. హఠాత్తుగా ఒక గేదె అడ్డం వచ్చిందిట. బ్రేక్ వేస్తే పడలేదు. గేదె మీదకు బస్సు ఎక్కుతుందేమోనని, చటుక్కున పక్కకి తిప్పాడుట బస్సుని. ఆ స్పీడుకి అలా తిప్పటంతో కంట్రోల్ తప్పి, పక్కన వున్న స్సిటీ బస్ స్టాపులోకి దూసుకుపోయిందట. అక్కడా మళ్ళీ బ్రేక్ కొట్టినా పడలేదు. బస్టాపులో బస్సు కోసం నుంచున్న నలుగురు స్కూలుకి వెళ్ళే అమ్మాయిల మీద ఎక్కి, తర్వాత గోడకి గుద్దుకుని ఆగిందిట” అంకినీడు ఆగాడు.

“ఆ నలుగురు చిన్న పిల్లలకూ దెబ్బలు తగల్లేదు కదా” భూపతి అడిగాడు కంగారుగా.

అంకినీడు ఒక్క క్షణం మాట్లాడలేదు. కాసేపటికి అన్నాడు, “అంత వేగంగా వెడుతున్న అంత పెద్ద బస్సు పసి పిల్లల మీద ఎక్కితే, దెబ్బలు తగిలాయా అని అడుగుతారేమిటి సార్. ఆ నలుగురు అమ్మాయిలూ బస్సు క్రిందపడి నలిగిపోయారు. వెంటనే ప్రాణాలు పోయాయి”

నాకు నోట మాట రాలేదు. హృదయంలో కలుక్కుమంది.

“మరి పోలీసులు కేస్ బుక్ చేయలేదా?” అడిగాడు భూపతి.

“చేశారు. కాని మా బావమరిది ఈపాటికి ట్రాఫిక్ ఇన్స్పెక్టరుని కలుసుకునే వుంటాడు. ఎంత అడిగినా ఇచ్చేయమని చెప్పాను. అతను మేనేజ్ చేయగలడు సార్. అక్కడేం ఫరవాలేదు”

భూపతి ఏం మాట్లాడలేదు.

“వాళ్ళ రిపోర్టుతో పాటు బ్రేకులు పని చేస్తున్నాయనీ, బస్సు కండిషన్లోనే ఉందనీ, మీరు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలిట. మొన్న నాకు ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కాపీ మీరు వాళ్ళకి ఇస్తే, మొత్తం కేసుని డ్రైవర్ మీదకి నెట్టేసి ఈ కేసుని పక్కదారికి మళ్ళించవచ్చు. దయచేసి మీరు…”

వాళ్ళ మాటలు వినపడుతున్నా నాకు మనసులో ఏదో భారంగా ఉంది. మా అమ్మాయి స్కూలుకి వెళ్ళే సమయం అదే. కొంపదీసి ఈ బస్సు పొట్టన పెట్టుకున్న నలుగురు పాపలలో మా అమ్మాయి వుందా? ఏదో వణుకు ప్రారంభమైంది. ఠక్కున లేచి, చకచకా మైన్ రోడ్డు సెంటర్ వేపు బయల్దేరాను.

నడుస్తున్నానేగాని, నా ఆలోచనలు చాల వెర్రిగా, పిచ్చి పిచ్చిగా వున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి.

సెంటర్లో చాలమంది జనం గుంపుగా వున్నారు. పోలీసులు కూడా చాలమంది వున్నారు. నా కంగారును అణుచుకుంటూ, జనాన్ని పక్కకు త్రోసి లోపలికి వెళ్ళాను. గుండె వేగంగా కొట్టుకుంటున్నది.

ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను. కళ్ళు మూసుకున్నాను. ఒక పక్క ఆ చనిపోయిన వారిలో మా అమ్మాయి లేదన్న ఆనందం ఉన్నా, ఆ హృదయ విదారక దృశ్యం చూసి మనసంతా వికలమైపోయింది. కళ్ళల్లోనించీ నీళ్ళు ధారగా కారుతున్నాయి. ఒక్క క్షణం ఆగి కళ్ళు తెరిచాను.

బస్సు ముందు చక్రాల క్రింద నలుగురు పసిపాపలూ నలిగిపోయారు. ముఖాలు కొంచెం గుర్తు తెలుస్తున్నా ఆ లేత శరీరాలు పచ్చడై పోయాయి. నెత్తురు మడుగులో నిశ్చలంగా పడివున్నారు. ఆ నలుగురూ పది సంవత్సరాల లోపు వారే. పదేళ్ళ లోపునే వాళ్ళకి నూరేళ్ళు నిండిపోయాయి. మృత్యువు వాళ్ళని కబళించింది. అంతకన్నా అమాయకులు దొరకలేదేమో!

ఇంతలో హఠాత్తుగా గుర్తుకొచ్చింది, ఆ అమాయకపు పసిపిల్లల చావుకి కారణమెవరో.

ఈ లోపల అంకినీడు భూపతికి ఎన్నో పచ్చ కాగితాలు ఇచ్చే ఉంటాడు. ఆయన బస్సు బహుబాగుందని సర్టిఫికేట్ ఇచ్చే ఉంటాడు. అతని బావమరిది అక్కడ ‘మేనేజ్’ చేసేవుంటాడు. అందరూ కలిసి తనదేమీ తప్పు లేని ఆ అమాయకుడు బస్సు డ్రైవరుని జైల్లో తోసేస్తారు. అంతటితో అంకినీడు చేతికి ఏమీ అంటదు. ఒకసారి జేబు తడుముకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. భూపతి ఆదాయం మరికొంత పెరుగుతుంది. అతను ఆ డబ్బుని ఆనందంగా ఖర్చు పెట్టుకుంటాడు. కానీ అతను ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ నాలుగు పసి ప్రాణాలను జమ కట్టుకుంటాడు. ఇంతమంది అమాయకపు ప్రాణాలను బలి చేస్తున్నారంతా కలిసి. దేని కోసం?

మనిషిని మనిషిగా బ్రతకనీయని ఆ డబ్బు కోసం. కేవలం ఈ మనిషే కనిపెట్టిన ఆ పాపిష్టి డబ్బు కోసం!

నా ఆలోచనలకు అంతరాయం కలిగింది, కారు హారన్ వినగానే.

అంకినీడూ, భూపతీ గబగబా వచ్చారు.

అంకినేడు భూపతికి చూపించాడు ఆ ప్రమాదం జరిగిన దృశ్యాన్ని.

భూపతి బస్సు పక్కకి వాలిపోయి నుంచున్న తీరునీ, ఆ పసిపాపల్నీ చూశాడు. ఉలిక్కిపడి మళ్ళీ చూశాడా పాపల్ని. కొయ్యబారిపోయాడు.

అంకినీడు ఏదో అంటున్నా అతనికి వినపడటం లేదు. ఒక్క క్షణం తేరుకుని గబగబా ముందుకు వెళ్ళాడు. ఆ నలుగురు పాపల్లోనూ మధ్యన, బస్సు క్రింద పడి ప్రాణాలను పోగొట్టుకుని, రక్తంతో ఎర్రగా తడిసిపోయిన ఆ అందమైన చిన్నారి తల మీద చేయి వేశాడు. ప్రేమగా చూశాడు. ఒక్కసారిగా, ‘సుజాతా’ అని పెద్దగా అరచి, ఆ పాప మీద పడి విలపించాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ భూపతి.

నాకేమీ అర్ధం కాలేదు.

అక్కడే ఎవరో అంటున్నారు, “ఆ పాప బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి అమ్మాయా? అరే… పాపం. ఆయనకు ఒక్కత్తే కూతురుట. కాన్పు కష్టమై, ఏదో పెద్ద ఆపరేషనే చేసి ఆ అమ్మాయిని బయటకు తీశారుట. ఆయన భార్యకి ఇక మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేనందున, పాపం ఈ పిల్లని చాల అపురూపంగా, ఎంతో గారాబంగా, కంటికి రెప్పలా….”

నాకు తర్వాత మాటలు వినపడలేదు. బయటకు వచ్చేశాను.

అక్కడ వున్న వేపచెట్టు మీద నాలుగు కోతులు గంతులు వేస్తున్నాయి!

***************
 3️⃣

_మహాకవి బమ్మెర పోతనామాత్య_
*☀️శ్రీమద్భాగవత కథలు☀️*
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)
_________________________

*మందారమకరందం*

భాగవతం భావగతం. తెలుగువారి పుణ్యపేటి బమ్మెరపోతన్న తెలుగుదనానికీ, తెలుగు భాషా ధనానికీ వేనవెలుగులు తొడిగిన మహాకవి. సంస్కృత, తెలుగు పదబంధాలకు అన్యోన్యమైన, అనితర సాధ్యమైన, మదురాయమానమైన భవ్యదాంపత్యాన్ని ‘పౌరోహిత్యం’ చేసి తెలుగువారు గర్వించే మహాభాగవతాన్ని తెలుగు భాషాభిమానులకు అందించిన సుహృత్తు! మనశ్శాంతి కోసం వ్యాసులవారు భాగవతాన్ని సంసృతంలో రచించారు. భాగవతంలోని మొదటి ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం, భారతంలో చివరి ఘట్టమూ శ్రీకృష్ణ నిర్యాణమే కద. ఇది ఒక వైచిత్రి!

అయితే భారతీయ భాషలలో వచ్చిన భాగవతాలన్నీ మన పోతన్నగారి భాగవతం తర్వాత వచ్చినవే! తెలుగు భాగవతం పోతన్నగారి చేతులో ఎన్నెన్నో చక్కదనాలను సంతరించుకుంది. వ్యాస భాగవతం కంటే విశేషమైన ప్రాచుర్యాన్ని, అభిమానాన్ని తెలుగునాట పొందింది. ఒక్క పోతన్న గారు, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య, వేమన, ఈ నాటికాలంలో ‘మందర రామాయణ’ కావ్యనిర్మాత వాసుదాసు, విశ్వనాథ, కాళోజీ, సినారె ప్రభృతులు చాలు మన తెలుగు వైభవ వైజయంతిని చాటడానికి! ఈ మహానుభావుల ప్రభావమే తదితర కవి పండితులకు ప్రేరణ కల్గించిందనిపిస్తోంది. భాగవతం చదవకపోయినా పరవాలేదు. కనీసం రోజూ ‘భాగవతం’ ‘భాగవతం’ అనుకుంటూంటే చాలు ఎప్పటికైనా ‘బాగు అవుతాం’ అంటారు! ఇది నిజం.

 భాగవత పురాణానికి ‘పురాణరత్నం’ అనే ప్రశస్తి ఉంది. ‘‘పురాణం’’ అంటే ఎంత పాతదైనా ఎప్పటికప్పుడు నవీకృతం అయ్యే లక్షణం కలదన్నమాట! ఇందులో కథలన్నీ నవనవోన్మేషాలే కథల ద్వారా ధర్మబోధ చేయడం తెలుగు గృహాలలో కన్పించే చక్కని పద్ధతి. తాతగారో, బామ్మగారో, అమ్మో , నాన్నో కథలు చెప్పి పిల్లల్ని రంజింపచేయడం ఒక సంస్కారం. ఆ క్రమంలో భాగవతంలోని ఎన్నో పద్యాలు మనకు చిన్నప్పుడే కంఠస్థం అయినాయి. భక్తితత్వప్రధానమైన భాగవతం భగవంతుని పొందడానికి తొమ్మిది మార్గాలను చెప్పింది. అవి శ్రవణం, కీర్తనం, విష్ణోఃస్మరణం, పాదసేవనం!, 
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, అత్మనివేదనమ్. ఈ తొమ్మిది భక్తి మార్గాలను కథల రూపంలో అందించే చక్కని ప్రయత్నమే ఈ జ్వాలా నరసింహారావుగారి భాగవత కథోపనిషత్తు!
 
పోతన్న గారి భాగవతమే ఈ రమ్యరచనకు మూలం. బ్రహ్మ రుద్రాదులు కూడా నాకు భాగవతం తెలుసు అనజాలరట! అంతటి నిగూఢమైన శాస్త్రం భాగవతం. ఎందరెందరో మహానుభావులు పోతన భాగవతాన్ని తమదైన శైలిలో వివరించారు. డాక్టరేట్లుదీనిపై సాధించారు. కానీ పదిమందికీ-ముఖ్యంగా ఇంటికీ, వంటకీ, బడికీ, గుడికీ పరిమితమయ్యే పెక్కుమందికీ-పసిబాలురకు, విద్యార్థులకు, గృహిణులకు, పామరులకు అనుభూతమయ్యే శైలిలో ప్రచురితమైన ‘భాగవతం’ చాలా స్వల్పం.

మన జ్వాలా నరసింహారావుగారు ఈ కొఱతను గుర్తించారు. పోతన్న గారిని శ్రద్ధాభక్తులతో ఉపాసించారు. భాగవతాన్ని ఆద్యంతాలు అవలోడనం చేశారు. కథలు, కథలుగా చెబితే సామాన్యులకు చెవికెక్కుతుందని ఆలోచించారు. భాగవతాన్ని కథల మాద్యమంలో, చక్కని వాడుక భాషలో చెక్కారు. ఆ విధంగా కథల రూపంలో మనకు ఇలా లభ్యమౌతున్న భాగవత మహాపురాణమే అయినా, ఇందులో కధాసూత్రం తెగలేదు. ద్వాదశ స్కంధాలుగా వున్న భాగవతంలో ఏ స్కంధంలో ఏ ఏ విశేషాలున్నాయో సూచ్యా సూచ్యంగా ప్రస్తావిస్తూనే తన రచనను సాగించారు. తెలుగులో ఇంకొక విలక్షణమైన గ్రంథం.

జ్వాలాగారు సాహసి. రచనమో, వచనమో, యోగమో, ప్రయోగమో. వాదమో, ‘గోష్ఠీరంజకమో’ వారికి అచ్చివచ్చిన ఇచ్చకాలు! ఇంతకుమునుపే 24వేల శ్లోకాలతో అజరామరమైన, వాల్మీకి మహర్షి ప్రణీతమైన శ్రీ రామాయణాన్ని, మహానుభావులు, శ్రీరామానుగ్రహ సంపన్నులు, ఆంధ్రవాల్మీకి బిరుదవిరాజితులైన శ్రీ వాసుదాస స్వామివారు తెలుగులో యధామూలంగా శ్లోకానువాదం చేసి, తామే ‘‘మందరం’’ అనే పేరుతో ప్రతి పద్యానికి తాత్పర్యాలను అనుగ్రహించి ప్రచురించిన విషయం తెలుగు వారికి తెలిసిదే కదా! అదే ‘మందరరామాయణాన్ని’ ‘మందరమకరందం’ పేరుతో వనం జ్వాలా నరసింహారావుగారు షట్కాండ యుక్తంగా రచించి ‘అనువక్త’ ‘వాచవి’ అయినారు. ప్రతిఫలాపేక్ష రహితంగా తన మందరమకరంద రామాయణ గ్రంథాలను చదువరులకు ఉచితంగా వితరణ 
చేస్తున్నారు. ఇది వారి తండ్రిగారు శ్రీనివాసరావు గారు శ్రీ వైకుంఠం నుండి పుత్రునికిచ్చిన ప్రేరణ, 
మంగళాశాసనమే అన్పిస్తోంది. అస్తు!

జ్వాలా నాకు ఆత్మీయులు, స్నేహితులు, సహవాసులు, సహోధ్యుగులు, విశేషించి శ్రీ సీతారామ శ్రీచరణ సంబంద బంధువులు. ఆంధ్రాంగ్ల భాషలను సవ్యసాచిత్వంతో సాహిత్య వ్యవసాయమో, సాపేక్ష పౌరోహిత్యమో చేయగల సమర్థులు.ఇప్పటికే శ్రీ రామాయణాన్ని రచించి, రుచి చూపించిన ‘వాచవి’ గనుక ఇలాగే శ్రీ మహాభారతాన్ని సంక్షిప్త సుందరంగా అనువక్తవ్యం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. 
చివరగా-

‘‘నిగమములు వేయి చదివిన సుగమంబులు గావు...సుగమంబు భాగవతమను నిగమంబు’’ 
-పోతన్న

*శ్రీరామ - రామానుజ దాసుడు*
*చిలకపాటి విజయరాఘవాచార్యులు*
పూర్వ కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ పరచార పరిషత్ 
విజయవాడ.

(సశేషం)

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*
(రచన: శ్రీ వనం జ్వాలా నరసింహారావు)

****కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడ ఆడ మగ అని తేడా లేదు ఎవరు ఎప్పుడు ఎలా అయినా మారవచ్చు...*

 *కొంతమంది చాటింగ్ లో చాలా బాగా మాట్లాడుతారు వ్యక్తులు కనపడరు మాటల వినపడవు వినిపించినా ఆ మాటల్లో ఎంతో మర్మము దాగుంటుంది..*

*డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఆస్తులు పోతే మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు జీవితం పోకుండా చూసుకో..*

*కనిపించే ఇవన్నీ భ్రమలే ఎంత కాలం ఉన్నా ఎంత దగ్గరైనా ఒక వ్యక్తి గురించి పూర్తిగా నీకు అర్థం కాదు తెలుసుకోవడానికి నీ జీవితకాలం సరిపోదు..*

*ప్రతి మనిషిలో ఎన్నో చీకటి గదిలు ఉంటాయి అందులో నీకు తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయి..*

*కల్లాకపడం లేకుండా మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డు చేస్తూ అవసరం తీరాక ఆ మాటల్ని ఆయుధంగా వాడుకుని నీను బజారుపాలు చేస్తారు జాగ్రత్త..*

*అందరికీ తెలిసిన జీవితం డబ్బు ఉందా సుఖంగా బ్రతుకుతున్నామా మన అవసరాలన్నీ తీరుతున్నాయి ఇంతవరకే ఆలోచిస్తారు..*

*ఎందుకoటే జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం అందరికీ ఉండదు. తనను తానే మోసం చేసుకుంటూ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడే కేరింతలు కొడుతూ ఉంటారు అదే జీవితం అనుకుంటూ..*

*మాయాలోకి అందరినీ లాగుతూ ప్రేమ అనే పేరుతో వాళ్ళ జీవితాలను నిర్వీర్యం చేసి జీవించవాలుగా మార్చి వదులేస్తు ఉంటారు..*

*ఇది మరణశిక్ష కన్నా దారుణమైన శిక్ష ఏ పాపము చేయకుండానే ఏ నేరము అంటకుండానే ఒక మనిషిని నమ్మినందుకు వారితో స్నేహం చేసినందుకు స్నేహం పేరుతో ప్రేమ పేరుతో వేసే శిక్ష అటు చావలేక ఇటు బ్రతకలేక ప్రతిక్షణం జీవన్మరణ శిక్ష అనుభవిస్తూ ఉంటారు..*

*తప్ప ఎవరిది అంటే నమ్మిన వారిదే కావచ్చు నమ్మించిన వాడిది కావచ్చు ఏది ఏమైనా ఇందులో ఒకరు మాత్రమే నిర్వీర్యం అవుతారు ఒక మనసు మాత్రమే శూన్యమై మిగులుతుంది..*

*ఓ మనసు మరో మనసుని ఇలా అడిగిందంట ఇంతగా నమ్మాను కదా ఎంతగానో ప్రేమించాను కదా నన్నెందుకు ఇలా మోసం చేసావు నీకు నన్ను ఇలా బాధ పెట్టడానికి మనసు ఎలా ఒప్పింది అని..*

*అప్పుడు ఇంకో మనసు ఇలా చెప్పిందంట నువ్వు నమ్మావు కాబట్టి కదా నిన్ను మోసం చేయగలిగాను నమ్మకపోతే నేను నిన్ను మోసం చేసేదాన్ని కాదు కదా అర్థమైంది కదా నమ్మితేనే మోసపోతారు నమ్మకపోతే మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడ ఆడ మగ అని తేడా లేదు ఎవరు ఎప్పుడు ఎలా అయినా మారవచ్చు...*
 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…


*కాలిన పాదాలు - కరక్కాయ లేపనం*
              ➖➖➖✍️

```
పరమాచార్య స్వామివద్దకు మౌళి మామ పరిగెత్తుకుంటూ వచ్చారు. మామ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎలా భరించడం? అసలు ఎలా భరించడం?

దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ఇప్పుడు తలచుకున్నా మామ కళ్ళల్లో కన్నీటి ధార. అసలు ఎందుకు అలా జరిగింది? అలా జరుగుతుందని ఎలా అనుకోగలం?

అందుకోసం, 1900 దశాబ్దం మొదట్లో తిండివనంలో జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ స్వామినాథన్ అనే చిన్న పిల్లవాని జాతకం పరిశీలించి, ప్రపంచాన్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకు వచ్చిన అవతారం అని అర్థం చేసుకున్నారు. ఆ పిల్లవాని పాదములను తాకి, నీళ్ళతో కడిగి, శుభ్రంగా తుడిచి, బాగా పరిశీలించి “అతి త్వరలోనే రాజులు, రారాజులు కూడా ఈ పాదాలను తాకలేరు” అని చెప్పారు. ఆ పిల్లవాని పాదాలలో ఎన్నో చక్రాల గుర్తులను చూశారు. ఈ బాలుడు జగద్గురువు అవుతాడు అని చెప్పారు.

పరమాచార్య స్వామి వారు ఉదయార్ పాల్యంలో మకాం చేస్తున్న సమయం. మహాస్వామి అప్పుడు వారు బాల సన్యాసి. వారు అనుష్టానం చేసుకుంటూ ఉండగా ఉదయార్ పాల్యం రాజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మంచి పండితుడు. స్వామివారు చేస్తున్నది నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆశ్చర్యంతో “మీరు సాక్షాత్ దైవ స్వరూపులు. మీ పాదాలలో చక్రాలు ఉన్నాయి” అన్నారు.

అప్పటినుండి పరమాచార్య స్వామివారి పల్లకిని మోసే బోయీలు ఉదయార్ పాల్యం జమిందారి వాళ్ళే. వారిని పోషిస్తున్నది ఆ జమిందారిలే. శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ గారు చెప్పినట్లు ఆ రాజు గారు కూడా పాదాలలోని చక్రాలను దర్శించుకొన్నారు కాని తాకలేకపోయారు.

అది 1978 ఏప్రియల్ 14 లేదా 15. పరమాచార్య స్వామివారు తేనంబాక్కం నుండి యాత్ర మొదలుపెట్టారు. కాని ఆ యాత్ర ఎక్కడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు. అది యాత్ర అని కూడా ఎవరికీ తెలియదు. ఎనభై ఏళ్ల ప్రాయంలో కేవలం శ్రీ చంద్రమౌళి మామ (కుళ్ళ), శ్రీ వేదపురి మామ, శ్రీ శ్రీకంఠన్ మామ ముగ్గురు సేవకులతో నడుతున్న యాత్ర అది.

తెల్లవారుఝామున 3:45 అప్పుడు చిత్తూరు శివార్లలో గల థియోసాఫికల్ సొసైటి ప్రాంగణంలోకి వచ్చారు. మహాస్వామి వారు పూజకోసం ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నారు.

సేవకుల భిక్షకై మౌళి మామ శ్రీకంఠన్ మామ మూడు కిమీ దూరంలో గల ఆగ్రహారానికి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత అంటే సుమారు పదకొండు గంటల సమయంలో వారు తిరిగి రాగా అసలు ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి కూడా కుదరలేదు. చాలా మంది గుమిగూడి ఉన్నారు. అందరూ పరమాచార్య స్వామివారి చుట్టూ చేరి వారి పాదాలు తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎవరో ఎవరికీ తెలిసినట్టు లేదు. కాని వారికి పట్టదు కదా!

అక్కడే ఉన్న ఇద్దరు సేవకులకి వారిని నిలువరించడం చాలా కష్టంగా ఉంది. పరమాచార్య స్వామివారు కనీసం పాదుకలు కూడా వేసుకోకుండా, అంతటి ఎండలో ఆ ప్రాంగణాన్ని వదిలి హైవే మీదకు పయనమయ్యారు. అంతే! ఇద్దరు సేవకులు మహాస్వామి వారితో బయలుదేరిపోయారు. చివరి క్షణంలో అక్కడకు వచ్చిన మౌళి మామ, శ్రీకంఠన్ మామ భిక్షగా తెచ్చినదంతా అక్కడ వేసి, రిక్షా తీసుకుని మొత్తం సామాను అంతా పెట్టుకుని స్వామి దగ్గరకు పరిగెత్తారు.

అది చైత్రమాసం అందులో చిత్తూరు జిల్లా కావడంతో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతటి ఎండలో మిట్టమధ్యాహ్నం పాదుకలు కూడా లేకుండా నడుస్తున్నారు స్వామివారు. న్యాయవాది జ్యోతిష్కులు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ ఏ పాదాలనైతే ఎవ్వరూ తాకలేరు అన్నారో, రాజులు - రాణులు కూడా కేవలం దర్శనం మాత్రమే చేసుకోగలరో, యోగులు సిద్ధులు కూడా తాకే అర్హత లేకపోవడంతో కేవలం ధ్యానం మాత్రమే చేయగల ఆ పాదాలు ఆ తారు రోడ్డుపై నడవడంతో కాలిపోయి బొబ్బలు లేచాయి.

మకాం చిత్తూరు చేరుకుంది. మహాస్వామివారు ఒక కర్మాగారంలోకి నడిచారు. అక్కడ కొద్దిరోజులు బస చేశారు. రాత్రికి స్వామివారు “వేదపురి, కుళ్ళా మౌళిని పిలువు” అన్నారు. మౌళి మామ కరక్కాయని చక్కగా చూర్ణం చేసి లేపనంగా తయారుచేశాడు. పరుగు పరుగున వచ్చి ఎవరికి దొరకని ఆ పాదాల దగ్గర కూర్చున్నాడు. పరమాచార్య స్వామివారు కాళ్ళను బాగా చాపి “ఆ కరక్కాయ ముద్దని కాళ్ళకు రాయి” అని ఆదేశించారు. ఈ విషయం చెబుతూ ఇప్పుడు కూడా మామ మాటలు రాక గొంతు పూడుకుపోయి కళ్ళ నీరు పెట్టుకుంటాడు.

ఏమి ఈ సేవకుల భాగ్యం. ఒక్క పుష్పం స్వామివారికి సమర్పించి చాంతాడంత కోరికలు కోరుకుంటాము. కాని వీళ్ళు కేవలం స్వామివారి సేవ చేసుకోవడమే మహాద్భాగ్యంగా తలుస్తున్నారు.

ఆ పరమాచార్య సేవకులకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు.

ఆ పరమాచార్య సేవకులకు అంగప్రదక్షిణ నమస్కారాలు.✍️```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥
 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*జీవన కాలమ్*

                 *ఆఖరి మజిలీ!*
                   ➖➖➖✍️```
       -గొల్లపూడి మారుతీరావు.

గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి…  ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.


ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ఏం కావాలని. ‘ఓ పెగ్గు స్కాచ్ కావాలన్నార’ట ఆమె.


ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.  చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.

మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం. _మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత._ భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - ‘ఏదో ఒకనాడు వెళ్లిపోక తప్పద’ని. కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు. _కొందరు బెంబేలు పడతారు. కొందరు బేల అవుతారు.

ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆర్దర్ ఆష్‌కి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. 1983లో గుండెకి శస్త్రచికిత్స జరిగినప్పుడు, శరీరంలోకి ఎక్కించిన రక్తం ద్వారా, ఈవ్యాధి సంక్రమించింది. చావు తప్పదని అర్థమవుతోంది. అభిమానులు దుఃఖంతో గుండె పట్టుకున్నారు. ఎందరో ఉత్తరాలు రాశారు. ఒక అభిమాని అన్నాడు: “ఇంత దారుణమైన రోగానికి దేవుడు మిమ్మల్నే ఎందుకు గురిచేయాలి?” అని.
దీనికి ఆర్దర్ ఆష్ ఇలా సమాధానం రాశాడు: “ఈ ప్రపంచంలో, 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడుతున్నారు. 50 లక్షల మందికి టెన్నిస్ వంటబట్టింది. 5 లక్షల మంది ప్రొఫెషనల్‌గా టెన్నిస్‌ని ఆడగలుగుతున్నారు. 50 వేల మంది టెన్నిస్ పోటీ టోర్నమెంట్‌లలో ఆడుతున్నారు. 50 మంది మాత్రమే వింబుల్డన్ స్థాయికి వచ్చారు. నలుగురే సెమీ ఫైనల్స్‌కి వచ్చారు. ఇద్దరే ఫైనల్స్‌కి వచ్చారు. నేను చాంపియన్‌షిప్‌ని సాధించి, వింబుల్డన్ కప్పుని గెలిచి,చేత్తో పట్టుకున్నప్పుడు.. నేను దేవుడిని అడగలేదు… ‘ఎందుకయ్యా నన్నొక్కడినీ ఎంపిక చేశావు?’ అని!   ఇప్పుడు కష్టంలో ఉండి ‘నాకే ఎందుకు ఈ అనర్థాన్ని ఇచ్చావు? అని దేవుడిని అడిగే హక్కు నాకేముంది?”

ఆకెళ్ల అచ్యుతరామమ్ గారు రైల్వేలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రామాయణాన్ని ‘రగడ’ వృత్తంలో రాశారు. ఆదిశంకరుల రచనల్ని, త్యాగరాజ భక్తి తత్వాన్ని రచనల ద్వారా నిరూపించారు.  ‘1984 ఫిబ్రవరి 12 ఉదయం సికింద్రాబాద్‌లో వారి అమ్మాయి కొత్త ఇంటికి శంకుస్థాపన. శుభకార్యానికి, తెల్లవారుఝామున ఒక బాచ్‌ని దింపి ఇంటికి వస్తున్నారు. దారిలో గుండెపోటు వచ్చింది. సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న, పురాతన ఆంజనేయస్వామి గుడి ముందు కారుని పక్కకి ఆపి, పార్కింగు దీపాలు వెలిగించి, కారు తాళం చెవులు జేబులో వేసుకుని, స్టీరింగు మీద తల ఆనించి వెళ్లిపోయారు. రామభక్తుడికి మృత్యువు ఆంజనేయుడి సమక్షంలో ఒక యాత్ర!

ఒక విచిత్రమైన సంఘటన….                      మా వియ్యపురాలి తండ్రిగారు దాదాపు 69 ఏళ్ల కిందట - విజయవాడలో పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. విజయవాడ రేడియో స్టేషన్ పాత బంగళాలో ఉండేవారు. చల్లా వెంకటరత్నంగారు వారి తండ్రిగారు. రామభక్తుడు. శ్రీరామనవమి నవరాత్రులలో ఆయన పూజలు చేసి, ప్రవచనాలు చెప్పించేవారు.                                 ఆ సంవత్సరం మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు(అప్పట్లో వారు ఇరవయ్యవ పడిలో ఉండి ఉంటారు) రామాయణం చెప్తున్నారు. ఉదయం కల్యాణం జరిగింది. సాయంకాలం ప్రవచనం. జటాయువు నిర్యాణం గురించి, చెప్తున్నారు శాస్త్రిగారు.                              వెంకటరత్నం గారు స్తంభానికి చేరబడి కూర్చుని వింటున్నారు. “జటాయువు ‘రామా! రామా!’ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు!” అన్నారు శాస్త్రిగారు. 

“జటాయువు వెళ్లిపోయాడా?”అన్నారు వెంకటరత్నంగారు. అవునన్నారు శాస్త్రిగారు. అంతే స్తంభానికి ఆనుకున్న వెంకటరత్నంగారి తల వాలిపోయింది. వెళ్లిపోయారు.

_దాదాపు 21 ఏళ్ల కిందట మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మహాభారత ప్రవచనం చెప్తూ ఈ ఉదంతాన్ని చెప్పారు. వెంకటరత్నం గారికి, మృత్యువు ఒక ముహూర్తం!

చాలా మందికి మృత్యువు ఒక మజిలీ’ కొందరికి ఆటవిడుపు.
మహాయోగులకి నిర్యాణం. 
కొందరికి ఐహికమైన ‘మోజు’లకు విడాకులు ఇచ్చే ఆఖరి క్షణం.
కొందరు అదృష్టవంతులకు, మరో గమ్యానికి దాటే వంతెన.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 *ఎర్ర రంగు చేప పిల్ల* ... సంయుక్త అక్షరాలు లేని బాలల కథ-డా.ఎం.హరికిషన్ -9441032212-కర్నూల్
*****************************
ఒక వూరిలో మిన్ను అని ఒక చిన్న పిల్లోడు వుండేవాడు. ఒకసారి వాని పుట్టినరోజుకు బహుమతిగా వాళ్ళతాత ''నీకు నచ్చినది ఏదయినా కొనుక్కో'' అంటూ చేతిలో ఐదువందల రూపాయలు పెట్టాడు. మిన్ను ఆ డబ్బులను అనవసరంగా వాడుకోకుండా దాచి పెట్టుకున్నాడు.
      ఒకసారి ఆ పిల్లోడు బజారులో పోతా వుంటే ఒకచోట ఒకడు, పెద్ద బకెట్టులో, రకరకాల రంగురంగుల చేపలు చిన్నచిన్నవి అమ్ముతా కనబడ్డాడు. వాటి అమాయకమైన కళ్ళలోంచి నీళ్ళు కారిపోతా వున్నాయి. అవి బెదిరిపోతూ అటూ యిటూ తిరుగుతా గిలగిలా కొట్టుకుంటా వున్నాయి.
       మిన్నుకు వాటిని చూడగానే చానా జాలి వేసింది. తన దగ్గరున్న ఐదువందలు వానికిచ్చి ఆ చిన్ని చేపలను కొనుక్కున్నాడు. ఇంటికి పోయి ఒక పెద్ద గాజుతొట్టెలో వాటిని వేశాడు. కావలసినంత ఆహారం అందించాడు. ఆ చిన్ని చేపలు అది చూసి చానా సంబరపడ్డాయి.
      మిన్ను రోజూ బడికి పోయేముందు, బడి నుండి వచ్చాక వాటిని బాగా పలకరించే వాడు. వాన్ని చూడగానే అవన్నీ సంబరంగా దగ్గరకొచ్చి కిలకిలా నవ్వేవి. ఎగిరేవి. దుంకేవి. గంతులేసేవి. అలా కొద్దిరోజులు గడిచాయి. నెమ్మదిగా కొద్దిరోజులకు ఆ చేపపిల్లల్లో చురుకుదనం తగ్గిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక మూల దిగులుగా కూచునేవి. మిన్ను కనబడినపుడు, పలకరించినపుడు దగ్గరికి వచ్చేవి. కానీ అంతకు ముందులా వాటిలో చురుకుదనం లేదు. నవ్వుతున్నాయి కానీ నవ్వులో జీవం లేదు. ఎగురుతున్నాయి గానీ కళ్ళల్లో మిలమిలలు లేవు. ఎప్పుడూ ఏవో పోగొట్టుకున్న వాటిలా వుండేవి.
       మిన్ను ఒకరోజు చేప పిల్లలతో ''మీరు ఇక్కడ హాయిగా వున్నారా... నిజం చెప్పండి లేకపోతే నా మీద ఒట్టే'' అన్నాడు.
        చేపపిల్లలు ఒకదాని మొగం మరొకటి చూసుకున్నాయి. మిన్ను బాధపడతాడేమో అని ఏవీ నోరు తెరవలేదు. చివరకు ఒక ఎర్రరంగు చేపపిల్ల దగ్గరకు వచ్చి ''మిన్నూ... పిట్టలకు గాలిలో ఝుమ్మని అటూ యిటూ ఎగరాలని వుంటుంది. జింకపిల్లకు అడవంతా చెంగుచెంగున ఎగిరి గంతులు వేయాలని వుంటుంది. అలాగే మాకు నదుల్లో, చెరువుల్లో సర్రున అటూయిటూ సరదాగా ఈదాలని వుంటుంది. మా చేపలనంతా ఈ చిన్న గాజుపెట్టెలో బంధించి హాయిగా వున్నారా అని అడిగితే ఎలా. నీవు మా అందరినీ కాపాడావు. కడుపు నిండా అన్నం పెట్టావు. అందుకే నిన్ను బాధపెట్టడం బాగుండదని మా బాధ కడుపులోనే దాచుకున్నాం'' అంది. ఆ మాటలకు మిన్ను కళ్ళలోంచి జలజలజల నీళ్ళు కారాయి.
      అయ్యయ్యో... ముందే చెప్పొచ్చు గదా... ఆ నదుల్లో, చెరువుల్లో చానామంది వలలు వేసి, గాలాలు వేసి చేపలు పట్టి అమ్ముతా వుంటారు. అక్కడ వదులుతే మీకేమన్నా అవుతాదేమో అని ఈ గాజుపెట్టెలో పెట్టాను గానీ మీరు హాయిగా ఎగురుతా... దుంకుతా వుంటే నాకంతకన్నా సంబరం ఏముంటుంది. ఇక్కడికి కొంచం దూరంలో ఒక పెద్దనది వుంది. అక్కడ ఎవరూ చేపలు పట్టరు. మీ అందరినీ అక్కడ వదులుతాలే. హాయిగా వుండండి'' అంటూ వాటిని ఒక బిందెలో వేసుకొని నది దగ్గరికి తీసుకొని పోయి వదిలేసి వచ్చాడు.
      అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకసారి వానలు బాగా వచ్చాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు అన్నీ వుప్పొంగాయి. కందనవోలుకు దగ్గరలోనే సుంకేశుల ఆనకట్ట వుంది. అక్కడనుంచి కిందకు నీళ్ళు వదులుతా వుంటే చూడ్డానికి చానా మనోహరంగా వుంటుంది. దాంతో అనేక మంది అక్కడికి పోతుంటారు. సుంకేశుల ఆనకట్ట నిండడంతో ఒక్కొక్క గేటు ఎత్తుతున్నారు. మిన్ను కొంతమంది బడిపిల్లలతో కలిసి చూడ్డానికి పోయాడు. అక్కడ ఆనకట్టకు కొంచం దూరంలో చానామంది పిల్లలు ఈత కొడుతా వున్నారు.
      మిన్ను బడిపిల్లలతో కలసి సరదాగా నదిలోకి దిగాడు. మిన్నుకు ఈత రాదు. దాంతో లోపలికి పోకుండా  ఒడ్డుకు దగ్గరలో నడుము లోతు నీళ్ళలో ఆడుకోసాగాడు. అలా ఆడుకుంటా... ఆడుకుంటా... నవ్వుతా తుళ్ళుతా... కొంచెం లోపలికి పోయాడు. అక్కడ ఒక చిన్న గుంత వుంది. నీళ్ళలో అది కనబడదుగదా... దాంతో మిన్ను కాలుజారి దభీమని లోపల పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోతా గిలగిలా కొట్టుకోసాగాడు. అందరూ చిన్నపిల్లలే కావడంతో ఎవరూ లోపలికి పోకుండా భయంతో గట్టిగా అరవసాగారు.
       అంతలో అక్కడికి ఎర్రరంగు చేపపిల్ల వచ్చింది. మిన్నును చూసింది. వెంటనే 'కాపాడండి... కాపాడండి.. మా మిన్నును కాపాడండి' అంటూ గట్టిగా చుట్టుపక్కల చేపలన్నింటినీ పిలిచింది. నిమిషాల్లో వందల చేపలు అక్కడికి గుంపులు గుంపులుగా చేరుకున్నాయి. అన్నీ కలసి మునిగిపోతా వున్న మిన్నును ఒక్కసారిగా పైకెత్తాయి. అలా నీళ్ళలో మోసుకుంటా వచ్చి ఒడ్డున వదిలాయి.
       ఎర్రరంగు చేపపిల్ల చిరునవ్వుతో మిన్ను ముందుకు వచ్చి ''మిన్నూ... ఎలా వున్నావు. బాగున్నావా. మొన్న బాగా వానలు వచ్చాయి గదా. ఆ వరద నీళ్ళలో కొట్టుకొని ఇక్కడికి వచ్చి చేరా. కానీ అది మన మంచికే జరిగింది, నిన్ను కాపాడుకోగలిగా.
       నీళ్ళంటే పిల్లలకైనా, పెద్దలకైనా చానా సరదా. కానీ ఈత రాకుండా ఎవరూ నీళ్ళలో దిగకూడదు. ఎంతమంది చనిపోతావుంటారో తెలుసా ఇక్కడ. వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతా వుంటాయి. మనకు తెలియని కొత్తచోట పెద్దవాళ్ళ తోడు లేకుండా అస్సలు అడుగు పెట్టగూడదు. ఎక్కడ లోతుంటాదో, ఎక్కడ బురద వుంటాదో మనకు తెలీదు గదా. నీవు ఇంటికి పోయి మీ నాన్నకు చెప్పి తొందరగా ఈత ఎలా కొట్టాలో తెలుసుకో. అంతవరకూ ఇలా నీళ్ళ దగ్గరికి ఇంకెప్పుడూ రాకు. ఏం సరేనా'' అంది.
మిన్ను అలాగేనంటూ ఆ ఎర్రరంగు చేపపిల్లను ముద్దు పెట్టుకున్నాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212.*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

****ఆమె.!* *(ఇప్పటికే భర్తలయిన నాలాంటివాళ్లకోసం,* *ఇంకా భర్తలు కావాల్సిన మీలాంటివాళ్లకోసం ఇది.)

 *ఆమె.!*
*(ఇప్పటికే భర్తలయిన నాలాంటివాళ్లకోసం,*
*ఇంకా భర్తలు కావాల్సిన మీలాంటివాళ్లకోసం ఇది.)*

*ఖుషీ పాటలో ఆమె అడిగింది, పసిఫిక్ సాగరం ఈదుతావా ఎవరెస్టు ఎక్కిస్తావా ?అని, అందుకోసం నువ్వు స్వర్గాన్ని సృష్టిచేసి, కైలాసాన్ని దించక్కర్లేదు. ఎందుకంటే ఆమెఅవి అడగదు, నువ్వివి ఇవ్వలేవు.*

*ఆమె వండితే, నువ్వు తోము, ఆమె ఉతికితే, నువ్వు మడతెట్టు,*
*ఆమె తుడిస్తే, నువ్వు తడిగుడ్డపెట్టు, ఆమె పెడితే, నువ్వు తిని బాగుందని ఒక మాటను, నువ్వు తినేముందు, ఆమెని తిన్నావా అని అడుగు.*

*రొక్కం పది ఉంటే రోజాకొను, అదే పదిలక్షలుంటే పసిడి కొను, ఆమెకి రెండూ ఇష్టమే,*

*ఆమె అలసిపోతే కాళ్లు పట్టు, అలక వస్తే కన్నీళ్లు తుడు, ఆమెకివింకా ఇష్టం.*

*ఆమెకోసం ఏదైనా నేర్చుకో, దాన్నొక సర్ప్రైజ్గా ఇచ్చుకో. ఆమె కోపం వెనక కారణం తెల్సుకో, చెప్పలేదని మిన్నకుండటం మానుకో.*

*కండఉందని ఆమెని కొట్టేవు, ఆ కండలవెనక నీ గుండె ఒక బండయ్యేను,*

*నాలుకుందని ఆమెని తిట్టేవు, నరకానికది ద్వారం తెరిచేను. నీకోరిక తీర్చేందుకు ఆమె లేదు, అదే కోరిక తీరినాక ఆమెని పక్కకి తొయ్యకు,*

*అడిగి ముందడుగువెయ్యు, మురిపెం పంచి ముద్దించు. మంచం ఇద్దరిదీ అని మదిలో ఉంచు.*

*ఆమెకున్న, ఆమెకి నువ్విచ్చిన గౌరవం నీకు నువ్విచ్చుకునేది, నీకున్నది, నువ్వెప్పుడూ పిలవనిది ఆమె తగిలించుకోవాల్సిన*

*అవసరం లేనిది నీ ఇంటిపేరు, ఆమె అస్తిత్వమే, నీ పేరు ప్రతిష్ట, ఆమె స్వేచ్ఛే, నీ స్వాతంత్ర్యం.* 

*ఆమె తెచ్చుకున్న రూపాయి నీదనుకోకు, ఇస్తే కాదనకు, కాదంటే ఇంకెవ్వరికీ ఇవ్వకు, అడిగి తీసుకుంటే మళ్లీ ఇచ్చెయ్యి,*

*అర్థం, అర్ధం రెండూ ఆమే అని గుర్తించు.కుచ్చిళ్లు సర్దు, కుర్చీలు సర్దు, చెవి దిద్దులు మెచ్చు, చేతిసాయం పంచు...*
 కిడ్ని జబ్బనొకడు కేన్సరంచు నొకడు
కడుపు గుండె తేడ గలద నొకడు
తేల్చ కాంగ్ల ఘనులు తిప్పలే బెట్టేరు
సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: ఆంగ్ల వైద్యం అత్యంత అభివృద్ధి చెందినదనీ, మిగిలిన వైద్య విధానాలు అన్నింటికంటే అత్యంత తెలివైనదనీ కొంతమంది మేధావులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు! కానీ ఇప్పటికీ అనేకమంది పేషెంట్లకు వచ్చిన రోగమేమిటో చెప్పలేక, అడ్డదిడ్డమైన టెస్టులన్నీ చేయిస్తూ, కాస్సేపు ఇది కిడ్నీ రోగమేమో అని ఆ స్పెషలిస్ట్ దగ్గరకు పంపి, కిడ్నీ  సంబంధిత పరీక్షలన్నీ చేయించి, కాదు కాదు, ఇదేదో కేన్సర్ లాగా ఉందని అక్కడకు పంపి, ఆ విభాగంలో పిండేసి, ఆ తర్వాత నాలుక కరుచుకుని, పొరపాటైపోయిందని, న్యూరో దగ్గరికీ, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరకీ తిప్పి తిప్పి, లేనిపోని టెస్టులతో, మందులతో నలిపి నలిపి, సైడ్ ఎఫెక్ట్స్ తెప్పించి, చివరకు సక్సెస్ ఫుల్ గా ఒక క్రొత్త వెరైటీ పేషెంట్ ను తయారు చేసి చేతిలో పెడతారు! అప్పటికి పూర్తిగా జేబులు ఖాళీ అయిపోయి, ఆరోగ్యం చంకనాకిపోయి, చివరకు ఎవరో మహానుభావుడు పీకిన క్లాసుకి బుద్దొచ్చి, హోమియోకో, యోగాకో వెళ్ళి, అనేకమంది తేరుకుంటూ ఉంటారు! బాగుపడే రాత లేనివాళ్ళు ఆ ఇంగ్లీషు మేధావుల చేతికి ఆస్తులన్నీ సమర్పించుకుని, ఆ ఏ.సీ గదుల్లోనే ఆవిరైపోతారు! 
స్పెషలిస్ట్ లను, టెస్ట్ లనూ నమ్ముకుని నాశనమైపోకుండా, మంచి హోమియో డాక్టర్ ను వెతుక్కుని, సకల సమస్యల నుంచీ సత్వరమే బయటపడండి! సరైన హోమియో డాక్టర్ అంటే కంటితో పేషెంటును చూడకుండానే, ఏ టెస్టులూ అడగకుండానే, కనీసం పేషెంటును టచ్ చేసి, నాడి కూడా చూడకుండానే, కేవలం పేషెంట్ బంధువులతో మాత్రమే ఫోన్ లో మాట్లాడినా కూడా పేషెంటుకున్న సకల రోగాలనూ గుర్తించి, నయం చేయగలిగే సత్తా కలిగి, వందల మంది ఇంగ్లీషు స్పెషలిస్ట్ డాక్టర్ల కంటే కూడా అత్యధిక శక్తి వంతుడై ఉంటాడని తెలుసుకోండి! అలాగే ఈ భూమి మీద ఏ జబ్బునైనా నయం చేయగలిగే నిజమైన మందులు గానీ, సత్తా గానీ హోమియో, యోగా, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం లాంటి వాటిలో మాత్రమే ఉంటుందని, ఇంగ్లీషులో టెంపరరీగా మాయ చేసే సప్రెసివ్ మేజిక్ మందులు మాత్రమే ఉండి, ప్రజలను మరింతగా సమస్యల్లో కూరుకుపోయేలా చేస్తాయని అర్థం చేసుకోండి! 

సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
 ఓం నమః శివాయ మంత్రం, ఇది ఆరు శబ్దాలు, అధిక శక్తి, దైవశక్తి మరియు సానుకూలత.

ఇది కేవలం 6 అక్షరాలను మాత్రమే కలిగి ఉంది కానీ చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ప్రతి పాత్రలు శివుడికి మహిమను అందిస్తాయి. శివ పంచాక్షర్ స్తోత్రం మరియు శదక్కులు స్తోత్రం లో, మంత్రం యొక్క లోతైన అర్ధం వివరించబడింది, దీనిని తెలుసుకోవడం ద్వారా మేము శివ భగవానుడి తత్వం లోనికి ప్రవేశిస్తాము.

శివ పురాణం ప్రకారం, ఓం నమః శివాయ, శివ మూలా మంత్రం విశ్వం యొక్క సృష్టి సమయంలో ఉంది. విశ్వం ప్రారంభమైనప్పుడు, దైవిక స్థానంలో మాత్రమే శివుడు మాత్రమే ఉంటాడు మరియు వారు ఈ మహామంత్రాన్ని సృష్టిస్తారు. ఈ మంత్రం అన్ని రకములైన విజ్ఞానాన్ని కలిగి ఉంటుంది, అన్ని వేదాలు మరియు పురాణాలు కూడా ఈ మంత్రం నుండి పుట్టాయి.  

మంత్రంలో, ఓం సుప్రీం శక్తిని ప్రతిబింబిస్తుంది, ప్రతి మంత్రాన్ని ప్రారంభించడంలో చిహ్నం ఉంటుంది, ఏ మంత్రం అసంపూర్ణంగా పరిగణించబడదు.

ఓం ను ప్రణవ్ మంత్రం అని పిలుస్తారు, ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం యొక్క మహాసముద్రం నుండి కాపాడుతుంది. ఓం లోతైన అర్థం ఉంది. ఇది A, U, M, నడ మరియు "bindu" నుండి తయారైంది. ఓం యొక్క ఈ ఐదు భాగాలు శివుడు యొక్క ఐదు తలలను సూచిస్తాయి.

నమః గౌరవం ఇవ్వడం అంటే. సంస్కృతంలో, నమః దేవునికి ప్రార్థన చేయటానికి ఉపయోగిస్తారు.

శివయ అంటే శివుడు. శివుడు అంటే శివుడు మరియు "య" సంస్కృతంలో నమః అనే పదాన్ని ఉపయోగిస్తారు.

వివరణాత్మక వివరణతో మంత్రం యొక్క పాత్ర యొక్క అర్ధం శివ శాదక్షార స్టోట్రం లో ఇవ్వబడింది.

ఇది "ఓం" యోగి ద్వారా క్రమంగా ధ్యానం చేసిన గుర్తు. ఇది మోక్షాన్ని ఇస్తుంది, మరియు వస్తువులని అందిస్తుంది. "నా", సాగేoద్రుడు, అప్సార, దేవతలచే వంగి ఉంది. 

"మా" మహాదేవ్ రూపంలో ఉంది, అతను లోతైన ధ్యానంలో ఉంటాడు; ఇది మహా పాపాలను తొలగిస్తుంది. 

ప్రజలకు సంక్షేమము కల్పించే విశ్వం దేవునికి శాంతి, శాంతి, "షి" కలిగిస్తుంది. 

వాహానా (వాహనం), వృషభ, వేదాలు, వాసుకి మెడలో ఉన్నది, ఎడమ వైపు శక్తి ఉన్నవాడు. 

మంత్రంలో "యా" చివరి అక్షరం. "యా" కు, దేవతలు నివసించే ప్రదేశం, విశ్వం యొక్క దేవుడు, మహేశ్వరుడు . శివుడు అన్ని దేవతల ఆధ్యాత్మిక గురువుగా గౌరవింపబడ్డారు..

శివ పంచాక్షర్ స్టోట్రం లో, ఐదు అక్షరాల అర్ధం ఇవ్వబడింది. ఓం లేకుండా నమః శివాయ గురించి ఇది చెప్తుంది...

పంచాక్షార్ స్తోత్రం "నా", "నాగేంద్రరయ ట్రిలోచనయ భాస్మంగారాగె ..", మెడలో పాముని కలిగి ఉన్న శివను చూపే, మూడు కళ్ళు, శరీరంపై బూడిద రంగులో ఉన్నవాడు, ఎవరు శాశ్వతమైనది, ఎవరు ఆశాశ్వత అయిన నాలుగు దిశలు మరియు ఆకాశంలో అంతా తానై ఉన్నారు..

మర్రి చెట్టు దాని విత్తనంలో ఉన్నట్లు, ఓం నమః శివాయ పాత్రల సంఖ్యతో చిన్నదిగా ఉంటుంది, కానీ మర్రి వృక్షం వంటి గొప్ప అర్ధాన్ని కలిగి ఉంటుంది.

శివ తత్వం తెలుఆకున్నట్టే అర్తం అవుతున్నట్లు ఉన్న అది ఒక మహాసముద్రం సులువుగానే ఉంటుంది. కానీ సూక్ష్మం దాగి ఉంటుంది... తెలుసుకునే కొద్దీ ఈ జన్మ సరిపోతుందా అనిపిస్తుంది..

మంత్రం యొక్క కొన్ని లక్షణాలు

దైవ సంబంధమైన
శక్తివంతమైన
ఆధ్యాత్మికం
శక్తినిచ్చే
పవిత్ర
పాపాల తొలగింపు
శాంతియుత
విశ్వాసం ఇవ్వడం
సానుకూలత పూర్తి
ఆనందం ఇవ్వడం
శివతో అనుసంధానించటానికి 
అకాల మరణం రాకుండా రక్ష
భక్తిరసం
మానవాతీతమైన
అద్భుతమైన
ఫండమెంటల్
పవిత్రమైన 

ఉపయోగాలు శివ మంత్రం జపం వల్ల పొందవచ్చు, ఎన్ని పూజలు హోమాలు, వ్రతాలు, నియమాలు ,యాత్రలు, అన్ని ఒకవైపు అయితే శివ పంచాక్షరీ మంత్రం జపము తో సాటి రాదు..

గురువు ఉండాలి ఉపదేశంకి అన్న నియమం లేదు మంత్రం జపించవచ్చు, కానీ సిద్ధిపొందిన గురువు ద్వారా ఉపదేశం తెలుకొని జపించడం వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది..
 ఆంగ్ల మాత్రలేసి యదుపులో బెట్టినా
బీపి షుగరు బోక పెరిగి ముదురు
నయము జేయు హోమ్యొ నయమౌర  యోగాతొ
సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: బీపీ గానీ, షుగర్ గానీ రాగానే వెంటనే ఆలస్యం చేయకుండా యోగా క్లాసులో జాయిన్ అయ్యి, సరైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలో హోమియో మందులు వాడుకుంటే, మొదటి నెల నుంచీ రెండు మూడు నెలలలో బీపీ, షుగర్ సంపూర్ణంగా నయమైపోతాయి! అలా కాదని అర్జంటుగా  ఇంగ్లీషు స్పెషలిస్ట్ డాక్టర్ లను కలుసుకొని, వాళ్ళు సూచించిన టెంపరరీ బీపీ, షుగర్ మాత్రలో, ఇన్సులిన్ లో వాడుకుంటే  ఆ జబ్బులు ఎప్పటికీ నయం కాని దీర్ఘకాలిక రోగాలుగా మారిపోతాయి!ఆ జబ్బులను సంపూర్ణంగా నయం చేసుకునే అవకాశం యోగా, హోమియోలో ఉన్నా కూడా, ఇంగ్లీషోళ్ళ తప్పుడు మాటలు నమ్మి, వాళ్ళ టెంపరరీ వైద్యంతో జీవిత కాలం పాటు నయం చేసుకోకుండా ప్రతీ జబ్బునూ తమ దగ్గరే దాచుకుని వాటిని ముదరబెట్టుకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసల్లా బ్రతకాలని  నిర్ణయించుకునే వాళ్ళ జాతకాన్ని ఎవ్వరూ మార్చలేరు! మీకు వచ్చినది ఎప్పటికీ సంపూర్ణ నివారణ కాని రోగమని ఇంగ్లీషోళ్ళు చెప్పే మాయ మాటల నుంచి బయటపడండి! వాళ్ళ వైద్యంలో నూటికి 99 రోగాలకు సంపూర్ణ నివారణ లేదని తెలుసుకోండి! ఏ రోగాన్నైనా సంపూర్ణ నివారణ చేసుకోవాలంటే యోగా, హోమియో లకు వెళ్ళండి! ఒక్క రోగాన్ని కూడా నయం చేసుకోకుండా వాటిని సప్రెస్ చేసే టెంపరరీ మందులు  వాడుకుంటూ, వాటిని వాడటం వలన వచ్చే సైడ్ ఎఫెక్టులతో మరి కొన్ని క్రొత్త రోగాలు కూడా తెచ్చుకుని, శారీరకంగా, ఆర్ధికంగా నశించి, కుళ్ళి కుళ్ళి చావాలనుకుంటే తప్పకుండా ఇంగ్లీషుకే వెళ్ళండి! 

సకురు అప్పారావూ ఇదిరా నికార్సైన నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
 పెయిను కిల్లరేసి పిట్టలా తిరిగేస్తె
ముడుకు లరిగి మీరు మూలకెళ్ళు
నమ్ము హోమియోను నయమౌను నిజముగా
సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: కీళ్ళనొప్పులు, స్పాండిలైటిస్ (మెడ నొప్పి), సయాటికా, నడుం నొప్పి, అలాగే ఇతర నొప్పులకూ పెయిన్ కిల్లర్లూ, పై పూతలు(పెయిన్ బామ్, ఆయింట్ మెంటూ), స్టెరాయిడ్ ఇంజక్షన్లూ వాడేసి, సమస్య తగ్గిపోయిందనుకుని ఆనందంగా తిరిగేస్తే, అది మీ పిచ్చితనమే! ఏడుస్తున్న పిల్లాడి మూతికి స్టిక్కర్ అంటించి, ఏడుపు సౌండు లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉన్నాడనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పెయిన్ కిల్లర్ తో సమస్య తగ్గిందనుకోవడం కూడా భ్రమే! క్రమంగా ముడుకులు,కీళ్ళు అరిగిపోయి, పూర్తిగా కదలలేని పరిస్థితికి చేరుకుంటారు! అంతేగాక తప్పుడు ఇంగ్లీషు మందుల వాడకంతో అల్సర్, కిడ్నీ ట్రబుల్, బి.పి, షుగర్, లివర్ ప్రోబ్లమ్, కేన్సర్ మొదలైన జబ్బులు అదనపు బోనస్ గా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది! కాబట్టి హోమియో మందులు వాడుకుంటే నాలుగు రోజులు సమయం పట్టినా, చక్కగా కీలు సందులో కార్టిలేజ్ తయారై, కీలు సక్రమంగా రిపేరై, సహజంగా తిరగ గలుగుతారు! ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు! 
సకురు అప్పారావూ ఇది నిజంగా నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
 ఒక తండ్రి కొడుకుతో చెప్పాడు..
"నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండు కన్నా" అని..
అప్పుడు కొడుకు తండ్రికి జవాబు ఇచ్చాడు..
" మీరు జాగ్రత్తగా నడవండి నాన్నా, 
నేను మీ అడుగుజాడల్లో నడుస్తాను" అని..

ఇదే జీవితసత్యం..
పిల్లలెప్పుడూ తల్లితండ్రి చెప్పే సలహాలు, సూచనలను పట్టించుకోరు, 
వారికి అర్ధం కూడా కాదు,..

వారు ఎక్కువగా చేసేది తల్లితండ్రి చేసే పనులను అనుసరించడం, 
వారు చేసే పనులకు తల్లితండ్రిని ఉదాహరణగా తీసుకోవటం..

అంటే ఫోన్ ఎక్కువగా చూడకు అని పిల్లలను మందలించిన, తల్లితండ్రి, తామే ఫోన్ చూస్తూ ఎక్కువ సమయం గడిపితే, 
పిల్లలు వారి మాట వినరు..
అదే ఒకవేళ తల్లితండ్రి, 
ఫోన్ పక్కనపెట్టేసి, 
పిల్లలతో కబుర్లు చెబితే, 
పిల్లలు కూడా, వారి మనసులో మాటలు, 
తల్లితండ్రితో పంచుకుంటారు..

ఇలా తల్లితండ్రి చేసే పనులే, 
పిల్లలూ సహజంగా నేర్చేసుకుంటూ ఉంటారు..
కాబట్టి తల్లితండ్రి అడుగులు తడబడకుండా ఉంటే పిల్లల నడక, నడత కూడా తడబడకుండా బావుంటుంది🙏

అన్నమనేని శ్రీనివాసరావు
మనిషి తాను స్వేచ్ఛా జీవిననుకుంటాడు కానీ నిజానికి సంఘజీవి- కాబట్టి అతడు ఆ సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి. అందుకని చాలా సందర్భాల్లో మనసును నియంత్రించుకోక తప్పదు. ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నపుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి. ఇంటి విషయాల్లో ఇతర కుటుంబసభ్యుల సలహాలకు విలువనివ్వాలి. మిత్రులతో కలసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి. తనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు కానీ వాదనలకు దిగితే వేదన మిగిలి మిత్రులు శత్రువులవుతారు. మనసును నియంత్రించుకోవడం మనిషికి అవసరం. అలా కాకుండా దాని నియంత్రణలోకి వెళ్లిన వ్యక్తి కష్టాలపాలవుతాడు.
అందుకని ఏయే గుణాలను విడిచిపెట్టాలో భారత చెప్పింది. క్రోధం దుర్జయుడైన 
శత్రువు. లోభం అంతులేని వ్యాధి. మిత్రులను దూరం చేస్తుంది. ధర్మ మూఢత్వమే మోహం. హృదయ తాపమే మత్సరం అని ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబు చెప్పాడు. కాబట్టి అరిషడ్వర్గాలను విడిచి పెట్టాలి. శాంతియుత జీవనానికి అలవాటు పడితే ఈ దోషాలు మనసును పట్టి పీడించవు. సత్పురుషుల సాంగత్యం మానసిక వికాసానికి దోహదపడుతుంది.🕉️🚩