*_నేటి బంధాలు, బంధుత్వాలు, స్నేహ సంబంధాలు ఇవన్నీ నిలబడాలంటే నీవు ఆర్థికంగానైనా ఉండాలి. లేదా ఏదైనా ఒక ఉన్నతమైన స్థానంలోనైనా ఉండాలి. అప్పుడే ఆ బంధాలు బలపడుతున్నాయి. నేటి సమాజంలో..._*
*_అంతెందుకు ఒక్కసారి మనం గమనిద్దాం! ఒక ఉన్నతమైనటువంటి పై అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరే... అతను మనవాడే... మావోడే అని సంబోధిస్తూ ఉంటారు..._*
*_అదే... ఒక పేదవాడు, చిన్న జీతంపై ఒకరికి పనివాడిగా కష్టిస్తూ ఉంటాడు... అతను నీకు సొంత దగ్గర వాడైనా... వాడు నా వాడు అనడానికి కాస్త... నీ స్టేటస్ అడ్డుపడుతుంది._*
*_ఇతడు మావోడు అంటే... నా గౌరవం తగ్గుతుందేమోనని... మరియు నన్ను సహాయం అడుగుతాడేమోననే... భయం ఆవరిస్తుంది... అందుకే చూసి చూడనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు... ప్రేమగా మందలించినా పై... పైన మాట్లాడుతారు..._*
*_నిజం చెప్పాలంటే నేటి బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే... ధనమును చూసి బంధాలను కలుపుకున్న వారు ఒకరైతే... ప్రస్తుతం తను ఉన్న ఉన్నత స్థానాన్ని చూసి వారితో సంబంధాలు కలుపుకున్న వాళ్లు మరొకరు..._*
*_ఇంతకూ ... ధనాన్ని ప్రేమిస్తున్నారా.? లేక ఉన్నతమైన ఉద్యోగ స్థానాన్ని ప్రేమిస్తున్నారా.? ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా నేడు డబ్బు, అధికారం, హోదాతో ముడిపడి ఉన్నాయి. ఇదే కదా నేటి సమాజంలో జరుగుతున్నది._*
*_ప్రేమ, ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ ఒకప్పటి మాట. కానీ ఇప్పటి మాట ఏంటో తెలుసా.?_*
*_నీ క్యారెక్టర్ ఎలా ఉంటే ఏంటి.? నీవు ధనాన్ని ఎలా సంపాదిస్తా ఉన్నావు అనేది ముఖ్యం కాదు..._*
*_నీ వద్ద ఎంత ధనం ఉంది, నీకు సమాజంలో ఎంత పలుకుబడి ఉంది, నీవు ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానంలో ఉన్నావు... వీటిని బట్టే నీతో సంబంధాలను, బంధాలను కొనసాగిస్తారు..._*
*_మిత్రమా. నాతో చిన్న మాట..._*
*_నేడు సమాజంలో... క్యారెక్టర్ కంటే... కరెన్సీ ముఖ్యం... ఇదే నేటి లోకం పోకడ... ఇదే కదా లోకం తీరు... ఇది కాదంటారా.?☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🏵️🏵️🏵️ 🌷🙇🌷 🏵️🏵️🏵️
No comments:
Post a Comment