Sunday, April 13, 2025

*నాలుక, కోపం, కోరిక !!!*

*ఈ మూడింటినీ అదుపులో ఉంచుకోవాలి.*

*భగవంతుణ్ణి, గురువు, తల్లిదండ్రులు,*
*ఈ ముగ్గురిని గౌరవించాలి.*

*పవిత్రత, నిజాయితీ, కఠోరశ్రమ* 
*ఈ మూడింటిని అలవర్చుకోవాలి.*

*సోమరితనం, అబద్ధం, పరనింద,* 
*ఈ మూడింటిని విడిచిపెట్టాలి.*

*దైర్యం, కీర్తి, ప్రశాంతత*
*ఈ మూడింటి కోసం పాటుపడాలి.*

*నమ్మకం, స్నేహం, ప్రేమ* 
*ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి.*

 *మాట, నడవడిక, పని* 
*ఈ మూడింటినీ నిరంతరం నేర్చుకోవాలి.*

*సత్ప్రవర్తన, దానగుణం, సేవ*
*ఈ మూడింటిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి.*

*ఈర్ష్య, అహంకారం, ద్వేషం* 
*ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి.*

*కాబట్టి ప్రతీ ఒక్కరు మూడు అనే మాటను, ఈ మూడింటిని, ఈ మూడు విషయాలను మనసా, వాచా, కర్మేణా... తూ.చా తప్పకుండా, త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, అందమైన, ఆరోగ్యకరమైన, మనశ్శాంతి పూర్వకమైన... జీవితాన్ని గడపాలని మనసారా ఆకాంక్షిస్తూ.*

 *┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🌻🌹 🙏🕉️🙏 🌹🌻🌹

No comments:

Post a Comment