*భవిష్యత్తులో రాబోయే రాజకీయ పార్టీల ఉచిత హామీ పథకాలు...🤦♂️*
01. *'గొంతులోకే గోరుముద్ద పథకం' తో... ప్రతి ఇంటికీ వండిన వంటకాలు.*
02. *'చేతిలో చత్వారం' పేరుతో అందరికీ స్మార్టు ఫోన్లు ఇచ్చి ఫ్రీ ఇంటర్నెట్టు, ఫ్రీ ఓటీటీ ఛానెల్సు.*
03. *'లివరులోకే లిక్కరు' పథకంతో ఇంటింటికీ బ్రాందీ పైపులు.*
04. *'మస్తిష్కానికే మత్తు' పేరుతో ప్రజలందరికీ మత్తు పదార్ధాల సప్లై.*
05. *'ఇంటికీ ఒంటికీ పథకం' పేరుతో ఉచిత ఇల్లు, ఉచిత ఫర్నీచరు, ఉచిత పవరు సప్లై.*
06. *'బద్దకస్తులకి బట్టలు' పేరుతో ఆర్నెల్లెకో రెండు జతల ఉచిత బట్టలు.*
07. *'నీడ బతుకులకి ఎండ తోడు' పథకంతో ఇంట్లో ఉండి బోరుకొట్టేసిన బతుకులకి ఉచిత విదేశీ పర్యటన.*
08. *'పాదాల వద్దకే పుణ్యం' పేరుతో భగవంతుడ్నే గుమ్మం దగ్గరకి తెచ్చే పథకం.*
09. *'చదువెందుకు చంకనాకను' పథకం పేరుతో చదవకపోయినా 99% మార్కులతో మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు.*
10. *'చెప్పినవి చేయం అసలేం చెప్పం' పథకం క్రింద మీ నమ్మశక్యానికి వీలులేని భయానక పథకాల్ని అమలు పరచడం*
11. *'వృద్ధ యువతకి బద్దకరత్న' బిరుదులు ప్రధానం చేయబడును.*
12. *'పిడకలపై పడకలు' పేరుతో వైభవోపేతంగా ఉచిత అంతిమ యాత్ర వేడుకలు.*
*కాబట్టి మీ ఖరీధైన ఓటుని మా పార్టీకే అమ్ముకోవాలని ప్రార్ధన.*
*ఇట్లు... మిమ్మల్ని అక్కున చేర్చుకొని, ఆదరించే పార్టీ నాయకుడు.😁🫣*
No comments:
Post a Comment