*****
ఉత్తీర్ణత
======
(నానో కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
'గత పదవ తరగతి ఫలితాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ మా సత్యారావు ట్యుటోరియల్స్' అన్న ప్రకటన చూసి అందులో తన కొడుకును చేర్పించాడు తికమకరావు.
కొన్నాళ్ల తర్వాత, అక్కడ తన కొడుకు తప్ప, ఎవరూ లేరని తెలిసి ఆ ప్రకటన గురించి నిలదీశాడు. అయితే "ఆ ప్రకటన నిజమనీ, గతంలో కూడా ఒకడే చదివి పాసయ్యాడని" నిజాయితీగా చెప్పాడు సత్యారావు.
***** **శుభం** *****
No comments:
Post a Comment