Sunday, April 13, 2025

 *_బంధం బలంగా ఉండాలంటే... నమ్మకంతో, బాధ్యతగా ప్రవర్తించండి._*

*_నమ్మకం లేని బంధాలు... పది కాలాలపాటు నిలబడవు._*

*_జీవితంలో నమ్మకం అనేది అత్యంత విలువైనది. బంధాలైనా, స్నేహ సంబంధాలైన  పదికాలాలపాటు నిలవాలంటే నమ్మకంగా, నిజాయితీగా ఉండండి._*

*_రెండు హృదయల స్పందనే ప్రేమ. ప్రేమ అంటేనే నమ్మకం. నమ్మకం లేని చోట ప్రేమ చిగురించదు, నమ్మకం ప్రేమ ఇద్దరు వ్యక్తులను విడిపోకుండా కడదాక నడిపే అత్యంత విలువైన సాధనాలు._*

*_నమ్మకం అంటే, మనిషి ఉన్నప్పుడు ఒకలా. మనిషి లేనప్పుడు ఒకలా ప్రవర్తించే తీరు కాదు. ఎలాంటి సందర్భంలోనైనా నమ్మకంగా, బాధ్యతయుతంగా  ప్రవర్తించడం. నమ్మకం లేని బంధాలు విచ్ఛిన్నమవుతాయి._*

*_1. ప్రేమగా కడవరకు కలిసి ఉండడం వేరు..._*

*_2. తప్పనిసరిగా గత్యంతరం లేక కలిసి ఉండటం వేరు..._*

*_మొదటి దానిలో తనకు తానుగా ప్రేమతో సృజియించే సమర్పిత భావం ఉంటుంది. రెండవ దాంట్లో అయీష్టత, బాధ్యత రాహిత్యం, కోపం ఉంటుంది._*

*_నమ్మకంలోనే ప్రేమ ఉంటుంది, ప్రేమలోనే మనసు ఉంటుంది. ఇవి లేని చోట రెండు శరీరాల కలయిక, శారీరక సుఖము మాత్రమే ఉంటుంది. ఇలాంటి దాన్ని బంధం అనగలమా.? కేవలం శారీరక అవసరం అని మాత్రమే అనగలము._*

*_జీవితం లో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు... ఎందుకంటే, నమ్మకం ప్రాణంలాంటిది ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదు._* 

*_జీవితం అంటే మనం చనిపోయేంతవరకు బ్రతికి ఉండటం కాదు. పది మంది మనసులలో పది కాలాల పాటు జీవించి ఉండటమే జీవితం._*

*_జీవితంలో డబ్బును  కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు కానీ, నమ్మకం అనేది పోతే జీవితంలో తిరిగి ఎంత ప్రయత్నించినా, ఫలితం శూన్యమే. దీన్నే అంటారేమో.! చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు._* 

*_పరిస్థితి తారు మారైన, పరిస్థితి ఆసాజనకంగా లేకున్నా, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న సరే, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది._*

*_నమ్మకం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ఓ వారధి లాంటిది దానిని నిలబెట్టుకోవడమె గొప్పతనం. నమ్మకం నిలబెట్టుకోవడానికి  జీవితకాలం పట్టిన... పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం చాలు..._*

*_అత్యంత ఖరీదైన అరుదైన గౌరవం, నమ్మకం వలనే కలుగుతుంది. ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ రాదు. క్షణిక సుఖం నీ జీవితాన్ని తారు మారు చేస్తుంది..._*

*_నమ్మకం దారుణంగా గాయపడిన చోట క్షమాపణ అర్ధరహితం. నమ్మకం అనేది బంధానికి బలమైన పునాది లాంటిది. నమ్మకమే లేనప్పుడు ప్రేమ, ఆప్యాయత, బాధ్యతలు అనేవి కూలిపోయిన గూడు వంటివి._*

*_బంధం భారం కాకూడదు, ప్రేమ విరక్తి కలిగించొద్దు... నీ తీరు మారనిదే ఈ తీరు మారదు... గతి తప్పిన మనసును గాడిలో పెట్టు. అబద్దాలతో నిజాన్ని ఎన్నాళ్లు దాస్తావు.? వెలికి తీసిన తరువాత దుఃఖించేది నీవే..._*

*_మనిషి మాట, నడవడి  అంటేనే 'నమ్మకం'... నమ్మకం లేని ప్రేమ, స్నేహం, బంధుత్వం ఎప్పటికైనా ప్రమాదకరమే._*

*_అవి మనశ్శాంతిని దూరం చేసే ఆయుధాలే. అందుకే నమ్మకంగా ఉండండి. బాధ్యతతో ప్రవర్తించండి. రాబోవు తరాలకు ఆదర్శంగా నిలవండి._*

     *- సదా మీ శ్రేయోభిలాషి...👏*
🌺🌺🌺 🦚🙇🦚 🌺🌺🌺

No comments:

Post a Comment