Sunday, April 13, 2025

 *శంభో శివ శంభో స్వయంభో ఓం నమః శివాయ*

*కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అని అనుకుంటాం. కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు...  ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తుంటాం. కర్మ ప్రకారం ఫలితం. కనుక ముందు ఆలోచనలను మంచివిగా ఉండేలా చూసుకోవాలి.* 

*మనం ఇతరుల మంచిని కోరుకున్నపుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధముగా మనకు మేలే జరుగుతుంది. అలాకాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్పలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్పదు.*
 
*మనం అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే కనుక మనసులో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి...*

*ప్రతిరోజు పది నిమిషాలు శుభ సంకల్పంతో, శుభ భావనతో, శివ పరమాత్ముని మీద ప్రేమతో ఓంకారం చేద్దాం.! ఆరోగ్యంగా ఆనందంగా, శక్తివంతంగా ఉందాం.!*

*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🏵️🦚 🙏🕉️🙏 🦚🏵️🦚

No comments:

Post a Comment