Saturday, April 12, 2025

 సలేశ్వరం జాతర 
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు.
అలాంటి సలేశ్వరం జాతర ఉత్సవాలు శుక్రవారము నుండి ప్రారంభం కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పరమేశ్వరుని మహాదర్శన భాగ్యం రానేవచ్చింది. ఈ నెల11 నుంచి 13 వరకు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి లింగమయ్య స్వామివార్లను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు.

సలేశ్వరం దర్శనం మహాభాగ్యం.. ఎలా వెళ్లాలి…?

భక్తులు శ్రీశైలానికి అనేక సార్లు వెళ్తారు. కాని ప్రక్కన ఉన్న అద్భుతమైన సలేశ్వరం చూశారా..? సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాల మీదుగా దట్టమైన అడవి మధ్య నుంచి రాళ్లు, రప్పలు, లోయలలోదిగి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి వాహనాల సౌకర్యం ఉండదు. ఎందుకు అంటే అది దట్టమైన నల్లమల అడవి. ఈ సలేశ్వరం శ్రీశైలంలోని ఒక యాత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతోఅలరారుతున్న అందమైన ప్రదేశం. చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్ర స్థలము. ఇక్కడ ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే జాతరజరుగుతోంది. ఈ జాతర ఉగాది వెళ్లిత తర్వాత తొలిచైత్రపౌర్ణమికి మొదలౌతుంది. శ్రీశైలనికి 60కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నుంచి ఫరహబాద్ మీదుగా 30 కిలో మీటర్ల వరకువాహన ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 30 కిలో మీటర్లు వాహన ప్రయాణం, అక్కడి నుంచి 5 కిలో మీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు, భక్తులు అందరు ముగ్ధులుఅవుతారు. ఇది నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంది. శ్రీ శైలం – హైదరాబాద్ వెళ్లే రహదారిలో శ్రీశైలం అటవీప్రాంతంలో శ్రీశైలం దారినుండి పక్కదారిలో ఫరహబాద్ పులిబొమ్మ నుండిలోపలికి వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు 130 కి.మీ. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం నుండి వచ్చేవారు 100 కి.మీ, నల్లగొండ జిల్లా నుండి వచ్చే వారు 150 కి.మీ దూరం ప్రయాణం చేసిన తర్వాత మన్ననూర్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుండి శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా మన్ననూర్ నుండి 15 కి.మీ దూరంలో ఉన్నఫరహాబాద్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి పూర్తిగా దట్టమైన అటవీమార్గన సుమారు 30 కిలో మీటర్ల దూరంలో దట్టమైన అడవిప్రాంతంలో రాంపూర్పెంటకు చేరుకోవాలి. అక్కడి నుండి మరో 2 కి.మీ. దూరం ఆటోల ద్వారా వెళ్లే ప్రధాన మార్గం వద్దకు చేరుకోవాలి. అక్కడినుండి మరో 3 కి.మీ దూరం కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహాసయాత్ర చేయాల్సి ఉంటుంది. రెండో మార్గం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలినడకనతో పాటు ట్రాక్టర్ల ద్వారా కొండలు, గుట్టల నుండి సాహసంగా సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. ఫరహాబాద్ నుండి పదికిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం కనబడుతుంది.

ఆలయ చరిత్ర

అక్కడి ప్రకృతి అందాలను ముగ్ధుడైన నిజాం వంద సంవత్సం లకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరహాబాద్ అని పేరు. అనగా అందమైనప్రదేశం అని అర్థం. అంతకు ముందు దాని పేరు పుల్ల చెలమల అని పిలచేవారంట. 1979లో ప్రాజెక్టు టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది మనదేశంలోనే అతిపెద్ద పులులసంరక్షణ కేంద్రంగా పిలువబడుతుంది. నిజాం విడిది నుంచి ఎడమవైపున 28 కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్యాంపు వస్తుంది. అక్కడే రాంపూర్ చెంచుపెంట వస్తుంది అక్కడేవాహనాలు నిలుపాలి. అక్కడి నుంచి సలేశ్వరం లోయలోకి జలపాతం చేరుకోవడానికి 8కిలో మీటర్ల దూరం నడవాలి. అక్కడ గుహమధ్యలో రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదానికొకటిసమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైనకిలో మీటరు దూరము నడవాలి. ఆ గుట్ట రోనను చేరుకొన్నాక మళ్లి ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంతదూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటారు. గుండం నుండి పారెనీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలోనడవాల్సి ఉంటుంది. ఎమరు పాటుగా కాలు జారితే ఇక లోయలోకి పడిపోవాల్సిందే. శవం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం కుండ మూతి లోపల నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా స్వేచ్చగాఉంటుంది. అనేక పనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాల మంచిదని అందరు వాటర్ బాటిళ్లలో నింపుకోని వెళ్తారు. గుండం ఒడ్డు వైపు తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటిఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్యస్వామి లింగం ఉన్నది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. క్రింది గుహాలో కూడ లింగమే ఉన్నది.గుడి ముందు మాత్రం వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలున్నాయి.

అత్యవసరం కోసం ప్రత్యేకరోడ్డు ఏర్పాటు చేశాం : నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్

నల్లమల అటవీప్రాంతం, వన్యప్రాణులను సంరక్షణకు సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు మాత్రమే రాగలరు. ఈ నెల 11, 12, 13 వరకు మూడు రోజులపాటు సలేశ్వరం జాతరకు అనుమతి ఉంటుంది. చెంచుల ఆచార వ్యవహారాల ప్రకారం జాతరలు నిర్వహించుకునేందుకు ఆటవీశాఖ ఆటంకం కల్గించదు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాం. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాలా సహకరించేందుకు 450 మంది వరకు సిబ్బంది, వాలంటీర్లను ట్రాఫిక్ నియంత్రణ, టోల్ గేట్ వద్ద చెత్త సేకరణ కోసం నియమించాం. గతంలో జరిగినప్రమాదాలను దృష్టిలో పెట్టుకోని అనుకోకుండా ప్రమాదాలు జరిగితే వారిని అత్యవసరంగా బయటకు తీసుకోచ్చి అంబులెస్సాద్వారా తరలించేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు నిషేధించాం. ఉదయం 6 గంటల నుంటి సాయంత్రం 6 గంటల వరకు ఫరహాబాద్ నుండి అనుమతి ఇస్తాం. లోపల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే బయటనే ఆపాల్సి ఉంటుంది. పార్కింగ్ అప్పాయపల్లి వద్దనే పోలీసులు ఆపేస్తారు. అక్కడి నుండి రాంపూర్ వరకు ఆటోలు, జీపుల ద్వారా వెళ్లాలి.

No comments:

Post a Comment