Saturday, May 24, 2025

 [5/24, 15:37] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


ఆపదలు కల్గినపుడె యందరకును
భక్తి భావంబు హెచ్చుగ వ్యాప్తి చెందు;
అట్టి యాపద దాటిన యాక్షణంచె
దైవమును మర్చిపోవు కృతఘ్నుడెపుడు

*తాత్పర్యం:*

కష్టాలు కల్గినపుడే అందరికి దైవభక్తి ఏర్పడుతుంది. ఆ కష్టాలు తొలగగానే దేవుని మర్చిపోతుండటం వల్ల కృతఘ్నుడౌతాడు.
[5/24, 15:37] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*తనకు లేని వాటి కోసం విచారించక, తనకు ఉన్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైనవాడు.*
[5/24, 15:37] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*చిలుకల్లు*


చిలుకల్లు    -   చిలుకల్లు చిలుకల్లు అందురేకాని
చిలుకలకు రూపేమి పలుకులేగాని
 హంసల్లు హంసల్లు అందురేకాని
హంసలకు రూపేమి ఆటలేగాని
పార్వాలు పార్వాలు అందురేకాని
పార్వాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని
కోయిల్లకు రూపేమి గోషలేగాని
చిలకల్లు మా ఇంటి చిన్న కోడళ్ళు
హంసలు మా ఇంటి ఆడపడుచుల్లు
పార్వాలు మా ఇంటి బాలపాపల్లు
కోయిల్లు మా ఇంటి కొత్తకోడళ్ళు
[5/24, 15:37] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*



*ఉడుము వచ్చినట్లు*

ఉడుము, గుడ్లగూబ ఇంట్లోకి వస్తే అశుభం అని మూఢనమ్మకం. ఆసూయపరులు, దుర్మార్గులు ఇళ్ళలోకి రావటం అసలు అశుభం
[5/24, 15:37] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*విగ్రహపుష్టి నైవేద్యనష్టి*


గంభీరంగా విగ్రహం వలే ఉండి పని తనం లేకుండా ఉండేవారికి ఉపయోగించే సామెత. విగ్రహం ఉంది కాని ఆ విగ్రహాన్ని రోజు నైవేద్యం పెట్టి సేవించడం వల్ల ఉపయోగం లేదు. నైవేద్యం మాత్రం నష్టం.
[5/24, 15:37] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*ఏ పిల్లి తెలివైనది?*


శ్రీకృష్ణదేవరాయల సభలో ఒకరోజు జంతువుల తెలివితేటల గురించి చర్చ మొదలైంది. అప్పుడు పిల్లులు చాలా తెలివైనవి అని ఒక మంత్రి అన్నారు. సభలో ఉన్నవారంతా ఆ మంత్రితో ఏకీభవించారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ పిల్లి బాగా తెలివైనదని చెప్పసాగారు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఎవరి పిల్లి తెలివైనదో తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక పోటీ పెట్టాలనుకున్నారు. ఏ పిల్లి అయితే మిగతా పిల్లుల కన్నా భిన్నమైన పని చేస్తుందో, ఆ పిల్లి విజేత అని ప్రకంటించారు. ఆ మరుసటి వారం అందరూ తమ పిల్లులను వెంట తీసుకొని సభకు వచ్చారు. తెనాలి రామకృష్ణుడు కూడా తన పిల్లితో వచ్చాడు.

రాజుగారు పోటీకి ముందు పిల్లులకు చిన్న విందు ఇవ్వాలనుకున్నారు. పిల్లులకు బంగారు పల్లెంలో పాలు పోశారు. పాలను చూడగానే అన్ని పిల్లులు పరుగున బంగారు పల్లెం దగ్గరకు వెళ్లాయి. కానీ ఒక్క పిల్లి మాత్రం పాలకు దూరంగా జరిగింది. ఆ పిల్లి వింత ప్రవర్తన చూసి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రామకృష్ణుడు నవ్వుతూ మహారాజా! అన్ని పిల్లులు పాల వైపు పరుగెత్తాయి. కానీ నా పిల్లి మాత్రం ఏ పిల్లి చేయని పని చేసింది అన్నాడు. కృష్ణదేవరాయలు రామకృష్ణుడి పిల్లిని విజేతగా ప్రకటించాడు. రామకృష్ణుడు తన పిల్లికి ఎలా శిక్షణ ఇచ్చాడో తెలుసుకోవాలన్న ఆసక్తి సభికులలో కలిగింది. నేను నా పిల్లికి మంచి పాలు తాగించాలని పాలను బాగా మరిగించాను. తరువాత వాటిని ఒక పల్లెంలో పోసి చల్లారబెట్టాను. అయితే పాలను చూడగానే నా పిల్లి పరుగున వచ్చి పల్లెంలో మూతి పెట్టింది. నేను ఆపుదామని చూసే లోపే అది మూతి కాల్చుకుంది. ఆ రోజు నుంచి పాలను చూడగానే దూరంగా వెళ్లడం మొదలెట్టింది అని రామకృష్ణుడు చెప్పగానే మహారాజుతో సహా అందరూ నవ్వుకున్నారు.
[5/24, 15:37] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*🟥చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు-ఎందుకని? Battery cell work is not in winter Why?*

🟩బ్యాటరీలో ఉండే రెండు లోహపు పలకల మధ్య రసాయనిక చర్యల ద్వారా ఎలక్ట్రాన్లు ప్రవహించే తీరును బట్టి అది ఉత్పత్తి చేసే విద్యుత్‌ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలలో జింకు, రాగి లోహపు పలకలను వాడతారు. వీటిని ఎలక్ట్రాన్లు సులువుగా ప్రవహించే ద్రవంలో ఉంచుతారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలై ఎక్కువ మోతాదులో రాగి పలకపైకి చేరుకుంటాయి. ఇవే బ్యాటరీని అనుసంధానం చేసిన విద్యత్‌ వలయంలో కూడా ప్రవహిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో వాతావరణంలో ఉండే చల్లదనం వల్ల ఉష్ణోగ్రత తగ్గి రసాయనిక చర్య వేగం మందగించడంతో బ్యాటరీలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వాటిని కొంచెం వేడి చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. చలికాలంలో మోటారు వాహనాలు వెంటనే స్టార్ట్‌ కాకపోవడానికి కూడా ఇదే కారణం.

No comments:

Post a Comment