Wednesday, May 21, 2025

 (274) (21.05.2025)

పట్టుచీర కట్టుకుని
నుదుట బొట్టు పెట్టుకుని
అందంగా కురులను దువ్వుకుని
మూరెడు మల్లెలు తలలో తురుముకుని 
లక్ష్మీదేవిలా నీవు నడిచి వచ్చావు
నా ఎదలో గాయం రేపావు //

ఇన్నాళ్లు నే చూడలేదు ఇంత అందము
ఏనాడు కలగలేదు ఇంత ఆనందము //

తొలిసారి మనసు పారేసుకున్నాను
నిన్ను తప్ప వేరేవారిని మనువాడకూడదని ఒట్టేసుకున్నాను
అంతలా నాకు నీవు నచ్చావు
ని వెంట పడేలా చేశావు //

నా మనసులో ఉన్న అమ్మాయి దొరికింది
మా అమ్మ కోరిక నెరవేరబోతొంది
ఆలస్యమైనా అణుకువ ఉంది
ఎంతో మందిని చూచినా ఈ అమ్మాయే నాకు నచ్చింది //

గుడిలోకి వచ్చినా
బడికి వెళ్లినా
ఆమె మోములో అమాయకత్వం కనిపిస్తుంది
ఆ అమాయకత్వమే నను కట్టిపడేసింది
ఈ రోజుల్లో ఇలాటి ఆమ్మాయి దొరకదు
దొరికినా నాలాటి వాడిని ఇష్టపడదు //

నేను ఏనాడో చేసుకున్న  అదృష్టము
నేను మొక్కిన దేవుళ్ళు ఇఛ్చిన వరము
ఈ అమ్మాయితోనే ఏడు అడుగులు నడుస్తాను
ఈ అమ్మాయి మెడలోనే మూడు ముళ్ళు వేస్తాను //

పెళ్లే కాదని బాధపడ్డాను
అమ్మాయే దొరకదని విచారించాను
ఇప్పుడిక ఆ విచారం లేదు
నా కన్నవారి ఆనందం చెప్ప  నోట మాట రావడం లేదు //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment