🙏 *రమణోదయం* 🙏
*"జ్ఞానులను దర్శించటానికి వెళ్ళేవారు వట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో కానుక తీసుకొని వెళ్ళాలి" అని పెద్దలంటారు. హృదయంలో నిజమైన భక్తి ప్రేమలతో వారి యొద్దకు వెళ్ళాలనేదే దాని భావం. అంటే వారిని పరీక్షించాలనో, లేక సరదాగా చూడటానికో వెళ్ళకూడదని భావం.*
వివరణ : *ఇతర కానుకలు ఎప్పుడూ ఎవ్వరికీ వీలయినా, వీలికాకపోయినా భక్తి ప్రేమలు లేకపోతే అవి నిష్ప్రయోజనాలు. ఇతరములు లేకపోయినా ప్రేమ మాత్రం ఉంటే అదే ఇతర కానుకలు లేమిని తీర్చేస్తుంది.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.653)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment