*ఉర్వారుకమివ బంధనం అంటే*
*ఇసుకలో..! పిల్లల్ని..! చూస్తుంటాం..!*
*అద్భుతంగా..!*
*గుడి కడతారు..!*
*తీరికగా అలంకారాలు..!* *అద్దుతారు..! తోచినంతసేపు..! హాయిగా..! ఆడుకుంటారు..!*
*పొద్దు..! వాలేటప్పటికి..!*
*ఆ కట్టడాలన్నింటినీ..!*
*చటుక్కున..! కూలదోస్తారు..!* *కిలకిల నవ్వులతో..!*
*నిశ్చింతగా..!*
*ఇంటిదారి..! పడతారు..!*
*అక్కడి..! ఆ నిర్మాణాలకు..!* *సంబంధించిన..! మమకారాలు..!*
*వియోగ దుఃఖాలు..!*
*ఏవీ..! వారికి ఉండవు..!*
*అంతగా అయితే..!*
*మరునాడు వచ్చి..!*
*మళ్ళీ..! కడతాం..!* *పోయేదేముందీ..!*
*అనే ధీమాతో..! పిల్లలందరూ..!*
*"సొంతిళ్లకు"..! వెళ్లిపోతారు..!*
*"త్య్రంబకం..! యజామహే "* *అనే మృత్యుంజయ మహామంత్ర..!*
*సారాంశమూ అదే..!*
*జీవితాన్ని..!*
*ఎంతైనా..! నిర్మించుకో..!*
*ఆత్మీయ బంధాలెన్నింటినో..!* *పెంచుకో..! ప్రేమానురాగాల్ని..!*
*గాఢంగా పంచుకో..!*
*ఆట ముగిసే సమయానికి..!* *వాటిని..! అదేవిధంగా..!* *సునాయాసంగా..! తెంచుకో..!*
*అని ఆ మంత్రం..! బోధిస్తుంది...!*
*వాటికి..! మనిషికి..!*
*మధ్య..! ముడి..!*
*"ఉర్వారుక మివ బంధనంలాగా"* *ఉండాలంటుంది..!*
*పచ్చి దోసకాయ ముచికకు..!* *దోస తీగకు మధ్య బంధం..!*
*ఎంత గట్టిగా ఉంటుందంటే..!*
*ఆ కాయను పట్టుకు లాగితే..!*
*ఆ తీగ మొత్తం..! వచ్చేస్తుంటుంది..!*
*అవి ఒకదాన్ని మరొకటి..!*
*అంత గట్టిగా పట్టుకొని..!* *ఉంటాయి..!*
*అదే రీతిలో..! మనిషి..!*
*తన చుట్టూ ఉన్న పరివారంతో..!*
*ప్రపంచంతో..! బంధాన్ని..!*
*అంత గట్టిగానూ..!* *పెనవేసుకొని..! ఉంటాడు..!*
*పిల్లలు ఇసుక గూళ్ళు..!*
*కట్టినంత ప్రీతిగా..! తన..!తనవారి జీవితాల్ని..!* *తీర్చిదిద్దుకుంటాడు..!*
*దోసపండు..!* *మిగలముగ్గేనాటికి..!*
*పరిస్థితి మారుతుంది..!* *ఉన్నట్లుండి..! ఆ తీగ నుంచి..!*
*అది చటుక్కున..! విడిపోతుంది..!*
*అప్పడు చూస్తే..! ముచిక గాని..! తీగ గాని..! ఎండి..!* *ముదిరిపోయినట్లు ఉంటాయి..! అంతవరకు..! ఆ రెండూ..! ఒకదానితో మరొకటి..!*
*గాఢంగా..! బలంగా..!*
*అతుక్కునే ఉన్నాయా..!*
*అనే అనుమానం వస్తుంది..!*
*ప్రపంచంతో అన్నింటినీ..!*
*చివరన తెంచుకోగలిగితే..!*
*"ఈ ఆత్మ నిత్యమని"* *నమ్మగలిగితే..!*
*మృత్యుభయాన్ని..!* *అధిగమించడం..!* *సాధ్యమవుతుంది..!*
*సాయంత్రం అయ్యేసరికి..!*
*పిల్లలు నిశ్చింతగా..!*
*సొంతింటికి..!*
*తిరిగి వెళ్లిపోయినట్లు..!*
*ఈ..! అద్దె..! ఇంటితో..!*
*అనుబంధాన్ని..! వీడాలన్నదే..!*
*ఆ మంత్ర..! మహోపదేశం..!*
*" దేహం వీడి వెళుతున్నాను "* *అనేది అసురీ భావం...!*
*"అద్దె గృహాన్ని వీడుతున్నాను"*
*అనేది అమృత భావన..!* *అలా అమృతత్వ స్థితిలోకి..!*
*చేరుకోవడమే..!*
*-"ముక్తి"- అనిపించుకుంటుంది..!*
*మనిషి జీవించి ఉండగానే..!* *సాధించాల్సిన స్థితి అది..!*
*అందుకే..! దాన్ని..!*
*"జీవన్ముక్తి"..! అంటారు..!*
*|| ఓం..! నమః..! శివాయ..! ||*
*అసతోమా..! సద్గమయ..!*
*తమసోమా..! జ్యోతిర్గమయ..!*
*మృత్యోర్మా..! అమృతంగమయ..!*
*ఓం..! శాంతిః..! శాంతిః..! శాంతిః..!*🕉️🚩🕉️
No comments:
Post a Comment