ఒక అంధ బాలుడు గుడి మెట్ల దగ్గర కూర్చున్నాడు .
అతడి ముందు ఒక గుడ్డ పరిచి ఉంది . పక్కన ఒక అట్టమీద ఇలా ఉంది .
" నేను అంధుడిని . దయ చేసి దానం చెయ్యండి "
కొంత సేపటికి కొద్దిగా చిల్లర డబ్బులు పడ్డాయి .
దారిన పోతున్న రామారావు ఆగి వెనక్కి వచ్చి ఒక రూపాయ్ వేశాడు .
చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి .
అక్కడ ఉన్న అట్ట తీశాడు . వెనక్కు తిప్పి ఏదో రాశాడు . అక్కడ పెట్టి వెళ్లి పోయాడు .
తన పని ముగించుకొని తిరిగి వెనక్కి వెడుతూ మళ్ళీ గుడి దగ్గర ఉన్న బాలుడి దగ్గరకి వచ్చాడు . పరచిన గుడ్డ నిండా చిల్లర డబ్బులు .
రామారావు సంతోషించాడు .
అడుగుల చప్పుడు గుర్తుపట్టాడు ఆ అంధ బాలుడు .
" సర్ మీరు పొద్దున్న అట్ట తిప్పి ఏదో రాశారు కదా సర్. మీరే కదా ."
" అవును "
" ఏమి రాశారు సర్ "
రామారావు చెప్పాడు,
" ఈ రోజు అద్భుతమైన రోజు . కానీ నేను చూడలేను " అని రాశాను .
రెండిటికీ అర్ధం ఒకటే కదా . పిల్ల వాడు అంధుడు అనేకదా . మరి తేడా ఎక్కడ ?
తేడా ఎక్కడ అంటే మనం ఎంత అదృష్టవంతులం ? అనేది తెలియచేస్తోంది రెండోది కదూ
==========
ఈ కధలో నీతి : మనకు భగవంతుడు ఇచ్చినవాటికి సంతోషపడాలి .
సృజనాత్మకంగా , పాజిటివ్ గా . , నిర్మాణాత్మకంగా , ప్రత్యేకంగా ఉండాలి .
ఇతరులను మంచివైపుకు నడిపించాలి . జీవితాన్ని క్షమాపణలు లేకుండా జీవించాలి . పశ్చాత్తాపం లేని ప్రేమతో ఉండాలి .
జీవితం నువ్వు ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే నువ్వు నవ్వడానికి వెయ్యి కారణాలు చూపించాలి
నీ గతానికి పశ్చాత్తాప పడకు
నీ వర్తమానాన్ని ఆత్మ విశ్వాసం తో గడుపు
నీ భవిష్యత్తు ను ధైర్యంగా ఎదుర్కొ
విశ్వాసం పెంచుకో - భయాన్ని వీడు
=========
ప్రపంచం లో అతి అందమైనది ఇతరులను చిరునవ్వ్వుతో చూడడం .
అంతకంటే గొప్పది అందుకు కారణం నువ్వు కావడం...
🙏🙂
No comments:
Post a Comment