Saturday, May 24, 2025

 మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు కామ్రేడ్స్....

మాకు కొన్ని చేతకావు...

మీరెంత అరిచి గీ పెట్టినా..ఇలా డిజప్పాయింట్ చేస్తూనే ఉంటాం...

వాటిల్లో మీ నాయకుడ్ని ...రాహుల్ గాంధీని లోపలెయ్యడానికి చాలా టైం పడుతుంది...

అతడు సమాజానికి చెయ్యాల్సిన మేలు చాలా బకాయి ఉంది...

అవ్వన్నీ పక్వానికి రావాలి...పండాలి...

అలాగే మీ నాయకురాలు మమతా ను...స్టాలిన్ ను కూడా ఇప్పుడప్పుడే ఏమీ చెయ్యం...

వాళ్ళూ కొన్ని పూర్తి చెయ్యాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి...

కేజ్రీవాల్ కి ఎంత టైం పట్టిందో చూసారుగా... కామ్రేడ్స్...

ఇంక డీ రాజాలు...నారాయణలు అసలు పట్టించుకునే అవసరమే లేదు...

ఈలోగా మీరడుగుతున్నవి అప్పుడే పూర్తి చెయ్యలేం...

మీ తొందర మాకు తెలుసు...

వాటిల్లోంచి కొన్ని ఆణిముత్యాలు మాకూ అర్థం అవుతున్నాయి...

నక్సలైట్లను పట్టుకుని...రాజ్యాంగం ప్రకారం..ప్రజాస్వామ్య యుతంగా శిక్షించడం...

దొంగచాటుగా దేశంలోకి తీవ్రవాదులు ప్రవేశించడానికి మన నిఘా సంస్థల వైఫల్యాలు గుర్తించడం...

ఇంకా ముఖ్యంగా పహల్గాం ఉగ్రవాదులను మట్టు బెట్టడం...

ఇంకా మనవి ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయి లెక్క చెప్పడం...

అసలు మామూలు కోరికలా ఇవి...

వీటిని తీర్చడానికి ముందు మేము తెలివి తక్కువగా చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి...

అవి పూర్తి చేసి వాటి దగ్గరికి వస్తాం...

ఉదాహరణకు...నేరుగా దేశద్రోహ మాటలు మాట్లాడే ..పోస్టులు పెట్టే బోడా బోసులను ఏం చెయ్యం...

మీ పార్టీ ప్రతినిధులను కూడా ఏం చెయ్యం...

వాటికి కామెంట్లు పెట్టీ...ఒక లైకో..లవ్వో వేసుకున్న చంటాండ్ని...వెర్రి వెంగళాయిగాడ్ని ముక్కులో తిర్రి పెట్టి తిప్పుతాం...

అలాగే మీ మావోయిస్టు బసవరాజు కి సంతాపాలు ప్రకటించి...దీర్ఘ రాగాలు తీసే...చవటాయిలను గుర్తించి...వాళ్ళ గుండు మీద టింగు మనిపిస్తాం...

అలాగే... పహల్గాం ముష్కరులు నలుగురినీ తరువాత పట్టుకుందాం...

ముందు వాడికి షెల్టర్ ఇచ్చి... నకరాలు చేసిన లోకల్ గాడికి నరకం చూపిద్దాం....

ముందు పహల్గాం ద్రోహులను చంపెయ్యండి అని ఎందుకు తొందర పడుతున్నారో మాకు తెలుసు...

వాళ్ళని లేపేస్తే..లక్ష్యం పూర్తయ్యింది కదా...ఇంకా సిందూర్ ఎందుకు అని అసలు టార్గెట్ లో ఉన్న మీ వాళ్ళ జోలికి రాకుండా ఆపేద్దామని ఎదవ ఆశ...
అబ్బే అదేం కుదరదు... 

మసీదు అజార్...హఫీజ్ సయీద్ లను ఏసేస్తే.. మునీర్ బ్రతికి పోతాడు కదా అని మీ ఆశ...

అదీ కుదరదు...

మీ అణు పర్వతం కొట్టాలంటే...ముందు రఫీ ఖాన్ ఎయిర్ పోర్టు జంక్షన్లో కదా కొట్టాల్సింది...

రాజుకి చెక్ పెట్టి ఆట ముగిస్తే...మళ్ళా ఆడదాం అంటాడు....ఎదవ గోల...

ముందు భటుడ్ని...శకటాన్ని...గుర్రాన్ని ఏస్తూ పోతే...రాజయ్యే అర్హత ఉన్నవాడ్ని కూడా కొడితే కదా..కొంచెం టైం పట్టినా సరిగ్గా యుద్ధం ముగిసేదీ...

కలికాలం ఇది...రాజుని కొడితే సైన్యం కకావికలు అయ్యే రోజులు కావు...

ప్రజాస్వామ్యం... కథ సామాన్యుడి నుంచే మొదలవ్వాలి...

ఇప్పుడు చూడండి జ్యోతి మల్హోత్రా చిన్న బిందువు...ఆమెను కదిపితే ఎన్ని అలలు ఎగసి పడుతున్నాయో...

ఆమెకు బెయిల్ కూడా వచ్చేస్తుంది....

అలాగే అశోక వర్సిటీ ప్రొఫెసర్ కూడా...అతడికి చిన్న కోర్టు కూడా బెయిల్ ఇవ్వగలదు..

కానీ ఎక్కడికి పోయాడు..సుప్రీం కి...

వాడి నెట్వర్క్ ఎలా బయటకి వచ్చిందో చూడండి...

ఆ కేసు తొప్పాసి కేసు అని మాకు తెల్వదా...

డియర్ కామ్రెడ్s... అండ్ ఖాన్ గీస్...

యుద్ధం మీరు మొదలు పెట్టారు...మేము ముగిస్తాం...అదీ మా టర్మ్స్ ఆధారంగా...అని మోదీ ఊరికే అనలేదు...

పరమాణువుల్లో చివరి కక్ష్యలో లూజుగా తిరుగుతున్న ఎలక్ట్రాన్ ను తొలగిస్తాం ముందు...

దానంతట అదే ఆటమ్ తటస్థం అయిపోతుంది...ఆ సైన్సు మాకు తెలుసు..

ఈలోగా దాస్ క్యాపిటల్ అట్ట చూసుకుంటూ కూర్చోండి...

మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తున్నందుకు బాధగా ఉంది...

జైహింద్!
From Srihari Mangalampalli

No comments:

Post a Comment