Tuesday, July 1, 2025

 [6/30, 11:56] +91 79819 72004: *💎 నేటి ఆణిముత్యం 💎*


కడు మెల్లన నిడు నుత్తర
మడచును గోపమును దీక్ష్మ మరయగ దాన
ప్పుడు నుడివెడు నుత్తర మది
వడి గోపము బెంచు నరయ వసుధ కుమారా! 

*భావం:*

ఓ కుమారా! ఆలోచించి చూస్తే, ఈ భూమిలో ఎదుటివారి కోపం అణచాలంటే చాలా శాంతంతో సమాధానమివ్వాలి. మనం కూడా కోపగిస్తే, ఎదుటివాని కోపం తీవ్రమౌతుందే కానీ తగ్గదు. 

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[6/30, 11:56] +91 79819 72004: *👬 నేటి చిన్నారిగీతం👭*

*రచన: ’కవి కాకి’ కీ.శే.శ్రీ జై సీతారాం.*

*గువ్వా! గువ్వా!*


గువ్వా! గువ్వా! నీ కేల, రెండు కాళ్ళు?
నేల మీద చక చకా నడవటానికి.

గువ్వా! గువ్వా! నీ కేల, రెండు రెక్కలు?
గగనంలో రెప రెపా ఎగరడానికి.

గువ్వా! గువ్వా! నీ కేల, గట్టి ముక్కు?
గింజ గిట్రా టక టకా పొడవటానికి.

గువ్వా! గువ్వా! నీ కేల, చిన్న గొంతు?
పాటలన్నీ కిల కిలా పాడడానికి.
[6/30, 11:56] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*

*చేతులు కలపడం*

చేయి కలపడం, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒకటి కావడం. ఒకరికొకరు సాయం చేసు కోవడం. (వారందరు చేతులు కలిపితేనె నా గెలుపు సాధ్యమైంది.) (చెడు పనికి కూడా ఈ మాటను వాడతారు: ఉదా: ఆ దొంగలిద్దరు చేతులు కలిపారు.
[6/30, 11:56] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*అంతా మనమంచికే.*


దీనికే మరొక రూపం కూడా ఉంది.. ఏది జరిగినా మన మంచికే! అని. సాధారణంగా, ఏదన్నా చెడు జరిగి ఎవరన్నా బాధపడుతున్నప్పుడు ఇలా సర్ది చెప్పడం జరుగుతుంది. దిని వెనక ఒక కథ కూడా ఉంది.

అనగా అనగా ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక తెలివైన మంత్రి. మంత్రి చక్కని సలహాలతో రాజును సమస్యలనుండి తప్పిస్తూ ఉంటాడు. ఒకనాడు పండ్లు తింటుండగా కత్తివాటుకు పొరపాటున రాజుగారి వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి "అంతా మన మంచికే" అన్నాడు. వేలు తెగి బాధ పడుతుంటే, ఈయనేమిటి అంతా మంచికేనంటాడు అని రాజుకు కోపం వచ్చింది! ఎలాగైనా మంత్రికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.

ఆ తరువాత రోజు అందరూ కలసి వేటకి వెళ్తారు. రాజు, మంత్రి దారి తప్పి పోతారు. రాజు మంత్రిని ఒక బావిలోకి (నూతిలోకి) తోసి "ఏది జరిగినా మన మంచికే, నువ్వు చెప్పిందే గదా" అని వెటకారంగా అని వెళ్ళిపోయాడు. కానీ దురదృష్టవశాత్తూ, రాజును ఒక అటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. ఇంతలో అతని వేలికి ఉన్న గాయాన్ని చూసి బలి ఇవ్వడానికి పనికిరాడు అని వదిలేసారు.

వేలు తెగినపుడు మంత్రి అన్న మాట గుర్తుకు వచ్చి, రాజు అతనిని బావినుండి వెలుపలికి తీసాడు. రాజు "నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?" అని అడిగాడు. అప్పుడు మంత్రి "నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతోపాటు నన్నూ పట్టుకునేవాళ్ళు. అప్పుడు మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవారే కదా ప్రభూ" అని బదులిచ్చాడు.

అందుకే అంటారు - "అంతా మన మంచికే", "ఏది జరిగినా మన మంచికే"
[6/30, 11:56] +91 79819 72004: *☑️ తెలుసుకుందాం ✅*


*🛑బల్బ్ పగిలితే ' డాం' శబ్దమెందుకు వస్తుంది? Why do we get DAM sound when bulb broken?💡*

❇️మన ఇళ్ళలోని వాడే కరంటు బల్బ్ టంగస్టన్‌ ఫిలమెంట్ మండడము ద్వారా వెలుతురు వస్తుంది. ఆ ఫిలమెంట్ ను పలుచటి గ్లాస్ బల్బ్ లో పెట్టి సీల్ చేస్తారు . ఆ సీల్ వేసేటప్పుడు లోపల గాలి లేకుండా శూన్యము చేస్తారు. గాలి ఉంటే ఆనిలోని ఆక్సిజన్‌ బల్బ్ లోపల మంటను పెందే ప్రమాదము ఉంటుంది. బల్బ్ గ్లాసు పల్చగా కనిపించినా బయటి గాలి వత్తిడిని తట్టుకునే సామర్ధ్యము కలిగిఉంటుంది. ఏ కారణముచేతనైనా బల్బ్ పగిలితే లోపల శూన్యములోనికి బటటి గాలి ఒక్కసారిగా అధిక పీడనముతో ప్రవేశించినందున " ఢాం " అనే శబ్దము వస్తుంది. ఇది ఫిజిక్స్ సూత్రాల పై ఆధారపడి పనిచేస్తుంది.

No comments:

Post a Comment