ఒక రైలు ప్రయాణం: భయం నుండి భరోసా వరకు❗
1990వ దశకం...
అసోం నుండి ఇద్దరు స్నేహితురాళ్లు రైల్వేలో ఉద్యోగాల కోసం గుజరాత్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక స్టేషన్లో రైలు మారాలి. అయితే, మొదటి రైలు ప్రయాణంలో కొందరు యువకులు వారిని వేధించారు. దాంతో, కనీసం తర్వాతి ప్రయాణమైనా ప్రశాంతంగా సాగాలని మనసులో కోరుకుంటూ, భగవంతుడికి ప్రార్థిస్తూ ఆ స్టేషన్లో దిగారు.
వేగంగా రిజర్వేషన్ చార్ట్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. చార్ట్ చూడగానే వారి గుండెలు ఒక్కసారిగా పీచుమయాయి. భయంతో వణికిపోయారు. వారి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు!
నిరాశతో, అయిష్టంగానే పక్కనే ఉన్న టీసీ (ట్రైన్ కంట్రోలర్)ని బతిమాలారు, రైలులో చోటు కల్పించమని. రైలు రాగానే ప్రయత్నిస్తానని టీసీ హామీ ఇచ్చాడు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ రైలు కోసం ఎదురుచూడసాగారు. ఎట్టకేలకు రైలు వచ్చింది. ఇద్దరూ ఎలాగోలా రైలులో ఒక చోట సర్దుకుని కూర్చున్నారు.
ఎదురుగా చూస్తే...
ఇద్దరు పురుషులు కూర్చుని ఉన్నారు. గత ప్రయాణంలో జరిగిన చేదు అనుభవం వారిని వెంటాడుతోంది. అయితే, ఆ బోగీలో ఇంకెక్కడా ఖాళీ లేకపోవడంతో అక్కడ కూర్చోవడం తప్ప వారికి మరో మార్గం లేదు. రైలు కదిలింది. ఇద్దరి కళ్ళూ టీసీ కోసం వెతుకుతున్నాయి. ఏమైనా మరో చోటు దొరుకుతుందేమోనని ఆశ.
కొద్దిసేపటి తర్వాత,
రద్దీని చీల్చుకుంటూ టీసీ అక్కడికి వచ్చాడు. "ఎక్కడా చోటు లేదు, ఈ సీటు కూడా తర్వాతి స్టేషన్ నుండి రిజర్వ్ అయింది. దయచేసి మీరు తర్వాతి స్టేషన్లో మరో చోటు చూసుకోండి" అని చెప్పాడు. ఆ మాట వినగానే వారి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. రాత్రి ప్రయాణం కదా!
రైలు వేగంగా ముందుకు సాగుతోంది. తర్వాతి స్టేషన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరూ కలవరపడసాగారు. అయితే, ఎదురుగా కూర్చున్న పురుషులు వారి ఆందోళన, భయాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నారు.
తర్వాతి స్టేషన్ రాగానే ఆ ఇద్దరు పురుషులు లేచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు వారి సీట్లలో కూర్చున్నారు. రైలు కదిలింది. కొద్ది క్షణాల తర్వాత ఆ యువకులు తిరిగి వచ్చారు. ఏమీ మాట్లాడకుండా కింద పడుకున్నారు.
ఇది చూసిన ఇద్దరు స్నేహితురాళ్లు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. పొద్దున జరిగిన సంఘటన గుర్తు చేసుకుని భయపడుతూ, వణుకుతూనే నిద్రలోకి జారుకున్నారు.
ఉదయం టీ అమ్ముకునేవాడి పిలుపుతో నిద్రలేచారు. ఇద్దరూ ఆ పురుషులకు ధన్యవాదాలు చెప్పారు. అప్పుడు వారిలో ఒక పురుషుడు, "చెల్లెమ్మా, గుజరాత్లో ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా చెప్పండి" అన్నాడు.
ఇక ఆ ఇద్దరు స్నేహితురాళ్ల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. తమను ఆపుకోలేక ఒక అమ్మాయి తన బుక్ తీసి, వారి పేర్లు, సంప్రదింపు వివరాలు రాయమని కోరింది. ఇద్దరూ తమ పేర్లు, చిరునామా బుక్‌లో రాసి "మా స్టేషన్ వచ్చేసింది" అని చెప్పి దిగి, జనసందోహంలో కలిసిపోయారు!
ఆ ఇద్దరు స్నేహితురాళ్లు ఆ బుక్‌లో రాసిన పేర్లను చదివారు. ఆ పేర్లు సంఘ్ స్వయంసేవకులు
🕉️నరేంద్ర మోదీ గారు మరియు శంకర్‌సింగ్ జీ వాఘేలా!
ఈ సంఘటన గురించి రాసిన రచయిత్రి
ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఈ వ్యాసం "ది హిందూ" ఆంగ్ల దినపత్రికలో 2014 జూన్ 1న "ఎ ట్రైన్ జర్నీ అండ్ టూ నేమ్స్ టు రిమెంబర్" అనే శీర్షికతో మొదటి పేజీలో ప్రచురితమైంది.
మరి,
ఇదంతా విన్న తర్వాత కూడా మనం తప్పు ప్రధానిని ఎంచుకున్నామని మీరు ఇంకా అనుకుంటున్నారా?
లింక్:👇
A train journey and two names to remember
https://www.thehindu.com/opinion/open-page/a-train-journey-and-two-names-to-remember/article6070562.ece
No comments:
Post a Comment