(337) (23.07.2025)
నాడు పెళ్ళి చూపుల్లో అనవసరంగా నోరు జారినాను
బడాయి కోసం వంట వచ్చు అని గొప్పగా చెప్పినాను
సరదాగా అన్న మాట సీరియస్ గా తీసుకుంది
మూడు ముళ్ళ తర్వాత గరిటె నా చేతికి వచ్చింది //
పెళ్ళైన కొత్తల్లో ఇద్దరమే కదా అని అనుకున్నాను
బంధువులు వచ్చినా నా చేతిలో పెట్టిన గరిటె చూచి ఆశ్చర్యపడినాను
ఇద్దరికి బదులు నలుగురు అంటూ శ్రీమతి అంటే
ఇదేమిటని నేను ఆమెను అడుగుతుంటే //
నాడు పెళ్ళిచూపుల్లో గొప్పగా చెప్పుకున్నావు
అందుకే నేడు ఎందరున్నా గరిటె పట్టుకున్నావు
నాడు మనసులోని మాట బయట పెట్టినావు
అందుకే నేడు వంట ఇంటిలో జీవితం వెళ్ల దీస్తున్నావు//
ఆ మాటకి ఒక్కసారిగా షాక్ తగిలింది
ఆపై బుర్ర గిర్రున తిరిగింది
నాటి సామెత నోరా వీపుకు తీసుకురాకే
నేటి సామెత నోరా చేతిలోకి గరిట తీసుకురాకే //
పెళ్ళి చేసుకుంటే కొలువు ఒకటే అనుకున్నాను
ఇలా రెండు కొలువులు ఉంటాయని అనుకోకున్నాను
అనుకోకుండా జీవితం మద్దెల బ్రతుకు అయింది
ఈనాడు చిరునవ్వు అన్నది మోములో కానరాకుంది //
ఇంటికి రాగానే వంటింట్లోకి అడుగు పెట్టాలి
వంటలోనికి ఏమి చేయాలి అంటూ శ్రీమతిని అడగాలి
చెప్పిన దాన్ని బట్టి కూరలు వెతుక్కోవాలి
ఏ కొంచెం తేడా వచ్చినా ఆమెతో మాటలు పడాలి //
బ్రహ్మచారి బ్రతుకును 3 ముళ్ళతో పాడుచేసుకున్నాను
మందు కొట్టాల్సిన వాడిని వంటింట్లో బ్రతుకుతున్నాను
ముద్దు-ముచ్చట అన్నది నాకు రాసి పెట్టి లేదు
అదే ఉండుంటే ఈ రోజు బ్రతుకు ఇలా అయ్యేది కాదు //
ఆ భగవంతుడు రాత నాకు ఇలా రాసినాడు
ఆమెకు మటుకు రాసిన రాతను మార్చినాడు
ఆడపిల్లగా పుట్టి ఎంతో సుఖ పడుతోంది
మగపిల్లవాడిగా పుట్టినందుకు నను కష్ట పెడుతోంది //
మరో జన్మ ఉంటే మానవ జన్మ వద్దనుకుంటాను
మానవ జన్మ వస్తే బ్రహ్మచారిగా బ్రతుకు వెళ్ళదీస్తాను
ఈ పెళ్ళి – వంటిల్లు ఇక నా వల్ల కాదు
ఆనందకరమైన జీవితానికి దూరమయ్యే ప్రసక్తే లేదు //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment