సమాజ శ్రేయస్సు కోరి...
ప్రజలు అక్రమముగా దుర్మార్గము ప్రవర్తించడానికి...
నేరాలు ఘోరాలు అఘాయిత్యాలు...
అధికమవ్వడానికి కారణాలు ఏమైయుండొచ్చు???
శ్రమలు ఎదుర్కొనే ధైర్యము లేకనా?
పనికిమాలిన తెగింపా?
సర్దుకుపోయే మనస్సు లేకనా?
నచ్చజెప్పుకోవడం చేతగాకనా?
క్షమించే మనస్సు లేకనా?
ప్రాణం విలువ తెలియకా?
బంగారం లాంటి భవిషత్తు పాడవుద్ధి అని తెలియకా?
క్షణికావేశమా? లేక నిగ్రహ లోపమా?
నైతిక విద్య లేకనా?
కర్మ ఫలము వస్తుందని తెలియకా?
చట్టము గురించి తెలియకా?
న్యాయ వ్యవస్థ మీద నమ్మకము లేకా?
లంచాలు ఇచ్చి బయట పడొచ్చు అన్న భరోసానా?
మీడియా + సినిమా ప్రభావమా?
సెల్ ఫోన్ & ఇంటర్నెట్ దుర్వినియోగమా?
బుద్ధి, జ్ఞానము లేకనా?
విచక్షణ కోల్పోయా?
బీదిరికమా లేక దరిద్రమా?
ధన గర్వము ఎక్కువయ్యా?
స్వార్థమా?
ధనాశ దురాశ ఎక్కువయ్యా?
కుల బలుపు ఎక్కువయ్యా?
కామ పిచాచి పట్టా?
మద బలము ఎక్కువయ్యా?
మందు మత్తు ఎక్కువయ్యా?
దుష్టులకు కాపు కాచే దేశద్రోహుల అండ చూచుకొనా?
అవతలి వారి నొప్పి బాధ తెలియకనా?
తల్లిదండ్రుల పెంపక లోపమా?
చెడు స్నేహలా?
కుటుంబ వ్యవస్థ విఛిన్నమయ్యా?
నాయకుల అసమర్థ పాలనా?
ఆధ్యాత్మిక బోధనా లోపమా?
మత పిచ్చి ఎక్కువయ్యా?
దురాత్మల (దయ్యముల) ప్రభావమా?
మితిమీరిన వేగమా?
పర్యవసానాల ఏ స్థాయిలో ఉంటాయో తెలియకా?
ఒక్క మాటలో చెప్పాలంటే...
దేవుని మీద విశ్వాసము, దైవభయము, దైవభక్తి లేకానా?
ఏమైయుండొచ్చో ఎవరు చెప్పగలరు?
బుద్ధున్నోళ్లకు జ్ఞానము వుండుటలేదు-
జ్ఞానము ఉన్నవాళ్లకు బుద్ధి బొత్తిగా వుండుటలేదు-
బుద్ధి జ్ఞానము లేని మానవ మృగాలకన్నా-
అడవిలో వుండే క్రూరమృగాలే నయమనిపిస్తుంది...
దయచేసి ఎవరు హత్యలు చెయ్యక్కండి...
ఆత్మహత్యలు చేసికోకండి...
వారు విడిచివెళ్లిన వాళ్ళ పరిస్థితి స్థితి
కుక్కలు చింపిన విస్తరిలా అవుతుందని
మనందరికీ తెలుసుగా!!!
నాశనమే వీరి అంతము...
వీరి నాశనము కునికి నిద్రించదు...
వీరు త్వరగా నాశనమైపోతే బాగుండు... గాని
నిష్కారణముగా చిన్న కారణాలకే
అమాయకులకు, సంబంధము లేని
వారికి కూడా తీరని శోకము కలిగిస్తున్నారు...0
తోడేళ్లకు కనికరము చూపే వారు దేశద్రోహులు.
దేశ ద్రోహులు ఉన్నంత కాలం
దుర్మార్గులు రెచ్చిపోతానే ఉంటాయి
దేశభక్తులుగా...
దేశ ప్రజల క్షేమాన్ని మనసారా కోరి...
మొదట దేశద్రోహులు తరువాత దుర్మార్గులు కూడా
నిజముగా మారాలని ఆశపడదాము లేదా త్వరగా నాశనమై పోవాలని అందరమూ దేవుణ్ణి కోరుకుందాము...
మన దేశాన్ని రాబోయే తరానికి
పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదికాదా?
ఈ విషయాలు (Content) మీకు అంగీకారమైతే
తప్పక లైక్ చెయ్యండి... నా కోసం కాదు...
అంగీకరించిన ప్రతిఒక్కరు లైక్ చెయ్యడము ద్వారా అనేకమంది సత్యాన్ని తెలుసుకుని, మేలు పొంది,
దేశము బాగుపడే అవకాశము ఉంటుంది కాబట్టి
No comments:
Post a Comment