🙏 *రమణోదయం* 🙏
*హృదయంలో ఆత్మగా నుండే గురువూ,దైవమూ అయిన ఈశ్వరుడు తన అనుగ్రహంతో మనస్సును లోపలికి ఆకర్షించి తన వద్ద నిలబడితే తప్ప, ఎవరైనా ఈ మాయ మనస్సుతో ప్రయత్నించి, బహిర్ముఖముకాని లోదృష్టితో శాంతస్థితిని పొందగలరా? (పొందలేరని భావం)
నేను ఆత్మను చేరుకోవడానికి
ఎంత దూరమో తెలుసా?
కుండ మట్టిని చేరుకోవడానికి
ఎంత దూరమో అంత దూరం.
అన్వేషణ అనేది 'ఇదంతా నాదే'
అన్న దగ్గర మొదలయి
'ఇదంతా నేనే' అన్నంత వరకూ సాగాలి.
పాపాన్నే కాదు...పుణ్యాన్ని కూడా
దర్శనం చేత మాత్రమే దహించి వేసి
ముక్తినిచ్చే అద్భుతమైన క్షేత్రం
అరుణాచలం!
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.725)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
No comments:
Post a Comment