Don’t spoil your life for fake love//#lovefacts #bestmotivationalvideo
ముందుగా మీ అందరికీ ఒక విన్నపం ఈరోజు నేను మీతో ఒక అమ్మ లాగా ఒక అక్క లాగా మీ శ్రేయోభిలాషిగా కొన్ని విషయాలు షేర్ చేయాలి అనుకుంటున్నాను దాదాపు నేను 25 ఇయర్స్ గా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను అది కూడా కాలేజీ స్టూడెంట్స్ కి నేను టీచ్ చేశాను అంటే కాలేజీ విద్యార్థుల్ని చాలా దగ్గరగా చూసే వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దగ్గరగా అబ్సర్వ్ చేసే అవకాశం నాకు దక్కింది అంతే కాకుండా నేను స్టూడెంట్స్ తో చాలా మమేకమై అంటే వాళ్ళతోటి బాగా కలిసిపోయి ఉంటాను కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా నాకు చాలా మంది షేర్ చేస్తారు అంతే కాకుండా నాకు ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి కూడా నాకు కాల్స్ వస్తుంటాయి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కాల్స్ చేస్తుంటారు మేడం మా లైఫ్ అయిపోయింది ఇంకా మేము చచ్చిపోతాం నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు అంటూ ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఫోన్లు చేసి సాధ్యమైనంత వరకు నా శక్తి మేరకు వాళ్ళని డిప్రెషన్ లో నుంచి బయట పడేసే ప్రయత్నం నేను చేస్తున్నాను మనోధైర్యం నింపుతున్నాను అయితే ఈ అన్ని అనుభవాలు నేను చూసింది మీకు షేర్ చేయాలి అని నాకు అనిపించింది ప్రస్తుతం యువతని బాగా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఏకైక అంశం ప్రేమ ఆ తర్వాత రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను బ్యాడ్ హ్యాబిట్స్ గురించి నేను మాట్లాడట్లేను నా దృష్టిలో ప్రేమ కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎప్పుడు మీరు ఎదగనంత వరకు మీకు మెచ్యూరిటీ రానంత వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడనంత వరకు అది బ్యాడ్ హ్యాబిట్ ప్రేమ అనేది గొప్ప విషయమే తల్లి ప్రేమ ఎంత గొప్ప విషయం ప్రతి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక వ్యక్తి మన పట్ల కన్సర్నింగ్ చూపిస్తున్నారు అంటే మన బాగు కోరుకుంటున్నారు మనం ఎదగాలని చూస్తున్నారు అంటే అది అభినందించదగ్గ విషయమే అయితే ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది ఏమీ లేదు అని చాలా సార్లు రుజువైనటువంటి విషయం కూడా ఉంది ఇక్కడ మీరు అనుకుంటున్నటువంటి ప్రేమ విద్యార్థి ప్రెసెంట్ సొసైటీలో యూత్ సిక్స్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఆరవ తరగతి వాడు నెక్కర్ కూడా వేసుకొని ఏజ్ నుంచి మొదలు పెడితే ప్రేమ ప్రేమ ప్రేమ ఎక్కడ చూసినా అది కొంచెం సీరియస్ గా ఉండి కొంతమంది హర్ట్ అయినా కూడా నన్ను తిట్టుకోకండి కొన్ని నగ్న సత్యాలు మాట్లాడుకుందాం ఇక్కడ మనం నిజాలు మీరు అనుకున్నటువంటి ప్రేమ ఎంతవరకు నిజం అసలు ప్రెసెంట్ స్టూడెంట్స్ ని చూస్తే నేను ఎందుకంటే 98 నుంచి నేను టీచింగ్ లో ఉన్నాను అంటే అప్పటి విద్యార్థులను చూశాను ఇప్పటి విద్యార్థులను చూస్తున్నాను ఎంత రాపిడ్ చేంజ్ ఉందంటే విద్యార్థుల్లో అసలు సీరియస్నెస్ లేదు చదువు లేదు కెరీర్ పట్ల సీరియస్నెస్ లేదు జీవితం పట్ల సీరియస్నెస్ లేదు పెద్దల పట్ల గౌరవం లేదు రెస్పెక్ట్ లేదు అసలు ఏ ఏదీ లేదు కానీ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి అసలు ఏంటిది ఎటు పోతున్నారు మీరు ఒక్కసారి ఒక విషయం చెప్తాను నేను మీకు ఈ ఈ కల్చర్ ఉంది చూసారా ఈ ఇంకా నిజంగా మాట్లాడాలి అంటే ఒక్క బాయ్ ఫ్రెండ్ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు అమ్మాయికి ఒక ముగ్గురు నలుగురు అందరూ హర్ట్ కాకండి మంచోళ్ళు ఉన్నారు మంచోళ్ళు లేరని నేను చెప్పట్లేను ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాను మంచి వాళ్ళు ఎట్లాగో ఉంటారు అది వేరే విషయం సో తప్పు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఒక అమ్మాయి ఉంటే ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయికి ముగ్గురు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అది ఒక ఐ కార్డ్ లాగా ఉంది ఐడెంటిటీ కార్డు లాగా మెడలో వేసుకొని తిరిగినట్టుగా అది అరే నీకు ఆధార్ కార్డు లేదా అన్నట్టుగా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా నీకు బాయ్ ఫ్రెండ్ లేదా అంటే ఆధార్ కార్డు కంటే కూడా అత్యవసరం అయిపోయినటువంటి రిలేషన్ ఇప్పుడు అది అయిపోయింది దీనివల్ల మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు యొక్క బాయ్ ఫ్రెండ్ అని మీరు మెయింటైన్ చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు ఎటు ఎదుగుతున్నారా దిగజారుతున్నారా ఒక్కసారి ఆలోచించాలి పేరెంట్స్ విషయానికి వస్తే మీరు కష్టపడి చదువుతారు పిల్లలు నా పిల్లలు వాళ్ళు డిగ్రీలు చేస్తున్నారు ఏదో జీవితం బాగుపడతారు అని నమ్మి ఊర్లల్లో వాళ్ళు కూలీ నాలు చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ లేదా ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయినా కావచ్చు ఏదైనా సరే పేరెంట్ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు తిని తినక మీకు హెల్ప్ చేస్తుంటారు మీరు అడిగిన నెరవేరుస్తుంటారు ఒక అమ్మ ఒక్కరు తినే ఫుడ్ ఉంటే గనుక ఇమ్మీడియట్ గా పిల్లలకు పెడితే తనకు మిగలదని తెలిసినా కూడా పిల్లల కడుపు నింపడానికి నాకు ఆకలి లేదు అంటది ఈవెన్ నేను కూడా అదే చేస్తా నేను కూడా అదే చేస్తాను ఒక్కొక్కసారి వండుకోవడానికి ఓపిక అనిపించక అలసిపోయి ఉన్నప్పుడు సర్లే ఉన్నది పిల్లలు తినేస్తారులే నాకు ఆకలి లేదు అనుకుంటే ఇమ్మీడియట్ గా ఆకలి పోతది తల్లి చచ్చిపోతది ఆకలి అలా మన కడుపును చంపుకొని మీ అమ్మలు కూడా అంతే చేస్తారు వాళ్ళు సద్దికూర ఉంటే వాళ్ళు తింటారు మీకు వేడిది పెడతారు సద్దన్నం ఉంటే వాళ్ళు తింటారు మీకు వేడి అన్నం పెడతారు ఎన్నో సార్లు వాళ్ళు ఆకలి చంపుకొని మీ కడుపు నింపుతారు వాళ్ళ కోరికలు చంపుకొని వాళ్ళ అన్నిటిని మీ మీద పెడతారు ఎందుకో తెలుసా ఒక కన్న తల్లిగా నేను చెప్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుంది అనేది పిల్లలు ఎదగకపోతే ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసా తల్లిదండ్రులకి పిల్లలు తప్పటేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసా పిల్లలు చెడు అలవాట్లకు బానిసలై స్మోకింగ్ చేస్తూ డ్రింకింగ్ చేస్తూ రోడ్ల మీద స్పీడ్ గా బండ్లు నడుపుకుంటూ యాక్సిడెంట్లు అయితే తల్లి ఒక్కసారి చచ్చిపోదు జీవితాంతం బ్రతికున్నంత కాలం క్షణం క్షణం చచ్చిపోతూనే ఉంటారు తల్లిదండ్రులు అంత బాధను వాళ్ళు క్యారీ చేస్తారు ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి పిల్లలు సక్రమ మార్గంలో లేకపోతే తల్లి ఒక్కసారి బిడ్డను కనడానికి మీకు తెలుసు చాలా సందర్భాల్లో ఇప్పుడు వాట్సాప్ లల్లా టీవీ లల్లా చూపిస్తూనే ఉన్నారు శరీరంలో ఉన్న 250 ఎముకలు ఒక్కసారి విరిగితే ఎంత నొప్పి వస్తదో పురిటి నొప్పిలో అంత నొప్పి వస్తది అంత నొప్పిని భరించి పిల్లవాడికి జన్మనిస్తే ఆ పిల్లవాడు జీవితంలో సరిగ్గా సరైన మార్గంలో పోనప్పుడు తల్లికి ప్రతి రోజు పురిటి నొప్పులే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు పుట్టి మీరు సరైన మార్గంలో లేనప్పుడు తల్లికి ప్రతి రోజు పురిటి నొప్పులు తీస్తున్నట్టే ఆమె చచ్చేదాకా పురిటి నొప్పులు అనుభవిస్తున్నట్టే మీరు పేరెంట్స్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా మా అమ్మ కోరికలు ఏంటి మా నాన్న కోరికలు ఏంటి నా లైఫ్ నేను ఎలా సరిదిద్దుకోవాలి మా అమ్మ నాన్న పంపించే డబ్బులు నేను ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాను ఇలా ఎవరైనా ఆలోచిస్తున్నారా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను వేరేలా అనుకోకండి నేను వరంగల్లో ఉన్నప్పుడు ఆ అప్ అండ్ అంటే హనుమకొండలో వరంగల్ లో జాబ్ చేసేటప్పుడు హనుమకొండ టు వరంగల్ ఆ దాన్ని ఏమంటారు అండర్ బ్రిడ్జ్ వరకు ఆటోలో వెళ్ళేదాన్ని నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో మారాలి ఒకసారి నేను ఆటోలో కూర్చున్నాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు అక్కడికి అబ్బాయి అమ్మాయిని ఆటో ఎక్కించడానికి అబ్బాయి వచ్చాడు సో నాకు అక్కడ సీన్ అర్థమవుతూనే ఉంది రాగానే వాళ్ళిద్దరూ ఆటో వాళ్ళు ఫుల్ నిండాలి కదా నిండినాకనే కదులుతారు కదా మీ అమ్మాయి ఉంది నేను ఉన్నా ఇంకొక ఇద్దరు ఇద్దరు ముగ్గురి కోసం వాళ్ళని వెయిట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి చెప్తున్నాడు అన్ని డిలీట్ చేసేసేయ్ అన్ని డిలీట్ చేసేసేయ్ ఫోన్ లో అన్ని కాల్ డేటా డిలీట్ చేసేయ్ మెసేజ్ అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంభాషణ డిలీట్ చేయమని చెప్తున్నాడు ఆ ఓకే ఓకే చేసిన అన్నది ఓకే తర్వాత కాసేపు ఉన్నాడు ఇంకా ఆటో నిండింది నేను వెళ్ళేస్తా అని చెప్తున్నాడు మరి నేను ఎట్లా పోవాలి నాకు ఆటో చార్జీలు లేవు అన్నది ఆ అమ్మాయి అంటే అబ్బాయి అంటున్నాడు అబ్బా నా దగ్గర ఒక వంద రూపాయలే నోటు ఉంది అబ్బా ఈరోజు అంతా మనం అటు ఇటు రెస్టారెంట్ తిరిగాం కదా ఈ వందే మిగిలింది అని చెప్తున్నాడు మరి నేను ఎట్లా పోను అని ఆ 100 లాగేసుకుంది ఎవడు దిగాలో నడుచుకుంటూ పోతున్నాడు ఆ సీన్ కూడా నేను చూశాను కాసేపటికి ఆటో మూవ్ అయింది ఈ అమ్మాయి ఆ వంద రూపాయలని పర్సులో పెట్టుకుంటే అలాంటి వంద రూపాయల నోట్లో ఒక ఇట్లా చిన్న బండిల్ లాగా ఉండి ఆ బండిల్లో ఈ 100 ని కూడా చేర్చి మంచి నీటిగా జరుద్దుకొని పెట్టేసుకుంది రియల్లీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఫస్ట్ వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం నాకు అర్థం అయింది వాడు బాయ్ ఫ్రెండ్ ఈమె గర్ల్ ఫ్రెండ్ వాడు ఇంటి దగ్గర అమ్మ ఎందుకు ఇచ్చి ఉంటది చెప్పండి వాళ్ళకి పైసలు అబ్బాయికి మా వాడు కాలేజీ పోతుండు కష్టపడుతుండు వాడికి చిన్న చితక అవసరాలు ఉంటాయి అని అమ్మ ఇచ్చి ఉండొచ్చు లేదా వీడే నాకు పాకెట్ మనీ ఇవ్వవా నాకు అవసరాలు ఉండవా అని బెదిరిచ్చి తీసుకొని ఉండొచ్చు లేదా ఏదైనా ఫీజు కడతా అని చెప్పి తీసుకొని ఉండొచ్చు మొత్తానికి పాకెట్ మనీ రూపంలో కావచ్చు అవసరాల రూపంలో కావచ్చు ఇంకా కష్టపడి డబ్బు సంపాదిస్తలేడు కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు ఒకవేళ వాళ్ళకి ఆర్థికంగా బాగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు పెద్ద బాధ కాకపోవచ్చు కానీ పని చేసుకునే తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ వంద రూపాయలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టపడితే వాళ్ళు నాకు ఆశ్చర్యం వేసింది ఆ అబ్బాయి ఏమో నేను ఫస్ట్ అన్నాడు నేను ఆటోకి పోవాలి నాకు ఆటో చార్జెస్ లేవు అని లాగేసుకుని అలా పెట్టుకుంటే ఈ అబ్బాయి నడుచుకుంటూ పోతున్నాడు ఈ అమ్మాయి పర్సులో డబ్బులు ఉన్నాయి నిజంగా ప్రేమ అంటారా దీనిని నాకు ఒక ఆన్సర్ చెప్పండి ఆ అబ్బాయిని ఉన్నతిని కోరుకుంటుందా దిగజారడాన్ని కోరుకుంటుందా అసలు అలాంటి అబ్బాయి కావచ్చు వయసు వరుస అమ్మాయిలైనా కావచ్చు అలాంటి లవ్ మీకు అవసరమా ఇక ఆ తర్వాతే మళ్ళా కాసేపటికి ఇంకొక అబ్బాయికి కాల్ కలిపింది అరే నేను అక్కడ దిగుతున్నారా నన్ను పికప్ చేసుకో అని చెప్పింది ఇవన్నీ ఇలాంటి కేసెస్ నేను ఎన్ని చూసి వయసు వరుస అని చెప్తున్నాను కాకపోతే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ మధ్యన కొంచెం అమ్మాయిల చేతిలో మోసపోతున్నటువంటి అబ్బాయిల సంఖ్య పెరిగిపోతుంది అని నేను చెప్పినప్పుడు నా మీద ఇప్పుడు ఎంతమంది లేడీస్ నన్ను తిట్టుకుంటారో నాకు తెలియదు మరి ఇది నిజం మరి అబ్బాయిలు ఒక్కసారి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే రెండు నేను చూసిన ఎక్స్పీరియన్స్ అక్కడ అది బట్ అబ్బాయిల చేత మోసపోయి జీవితాలు నాశనం చేసుకున్న అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు అమ్మాయిలతోటి తిరిగి అమ్మాయిలను ట్రాప్ చేసి ఆ లవ్ పేరు తోటి వాళ్ళని మోసం చేసి వాళ్ళ కెరీర్ ని నాశనం చేసిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు కాకపోతే ఈ మధ్యన వీళ్ళు ఎక్కువ అయ్యారు వాళ్ళు తక్కువ అయ్యారు అని చెప్పొచ్చు ఒక రకంగా సమీక్ష ప్రకారం కూడా సరే ఏది ఏమైనా ఎవరికైనా పెయినే అయితే దాన్ని ప్రేమ అంటారా అలాంటి వాళ్ళ కోసం ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి మీరు అలా డబ్బులు ఇచ్చేటప్పుడు మీ కన్న తల్లిదండ్రి యొక్క ఆకలి గుర్తు రాదు వాళ్ళ ఇంటికాడ తల్లిదండ్రులు డబ్బు కోసం పీడించేటప్పుడు వాళ్ళు పడే కష్టం గుర్తుకు రాదు కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ యొక్క బర్త్ డేలు గుర్తుకు ఉండాలి వాళ్ళకి కేకులకే ఇయ్యాలి వాళ్ళకి కేకులు పూయాలి ఆ వాళ్ళతోటి ఎంజాయ్ చేయాలి వాళ్ళకి రెస్టారెంట్ లకు తీసుకెళ్లాలి ఇంటికాడ అమ్మ నాన్న గొడ్డు కారంతో తింటుంటారు హోటల్లోకి వచ్చి బిర్యానీలు తింటుంటారు ఎన్ని సార్లు చూసామో తెలుసా ఇలాంటి కేసెస్ ని అక్కడ అమ్మ నాన్న చెమటూర్డ్చి వాళ్ళ శరీరం నుంచి చెమట వస్తుంటది చెమట వాసన వస్తుంటది మట్టి వాసన వస్తుంటది వాళ్ళ కన్నీటి వాసన వస్తుంటది ఇంకా నేను చెప్తాను ఇవన్నీ కాదబ్బా అమ్మ నాన్న గుండెల నుంచి కన్నీటి వాసన వస్తుంటది కన్నీటి రోదన ఎంతమంది తల్లులు ఎవరి కంట కనపడకుండా దిండు తడిసేలా ఏడుస్తారో తెలుసా మీకు ఆ విషయం ఎంతమంది తండ్రులు కన్నీటిని కనురెప్పలను దాటి బయటికి రానియకుండా ఏడుస్తారో తెలుసా పిల్లలు పిల్లలు ఏడిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇదే లోకం అనుకుంటున్నారు స్టూడెంట్స్ చదువు లేదు కెరీర్ లేదు ఓ అంబిషన్ లేదు ఓ పిల్లోడిని లేపి అరే నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిరా అంటే లేదు కానీ బయట ఎదురు చూస్తుంటారు కాలేజీ బయట అమ్మాయిలు ఎదురు చూస్తుంటారు అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎదురు చూస్తుంటారు నిజంగా ప్రేమ ఉంటే ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యన అబ్బాయి అయితే అమ్మాయి యొక్క గ్రోత్ ని ఎదుగుదలను ఎంకరేజ్ చేయాలి అమ్మాయి అయితే అబ్బాయి యొక్క గ్రోత్ ని వాళ్ళ యొక్క ఎదుగుదలను ఎంకరేజ్ చేయాలి ఒక అమ్మ నిజంగా ప్రేమలో నేను చెప్తాను చూడండి అమ్మాయిలో అమ్మ ఉండాలి అబ్బాయిలో నాన్న బాధ్యత ఉండాలి అమ్మాయిలో అమ్మ ప్రేమ ఉండాలి అమ్మ ప్రేమ ఏం చేస్తది తాను తినకపోయినా కొడుకుకి పెడతాది అమ్మాయి కూడా అంతే నా కోసం వీడు డబ్బులు వేస్ట్ చేయొద్దు నా కోసం వీడు ఖర్చు పెట్టొద్దు వీళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో అని డబ్బులు ఖర్చు పెట్టని కదా నిజంగా చెప్పాలంటే నిజమైన ప్రేమ గిఫ్ట్స్ ని ఎక్స్పెక్ట్ చెయ్ నిజమైన ప్రేమ బహుమతుల్ని ఆశించదు ఒకవేళ ఆశిస్తే ప్రేమనే ఆశిస్తది ప్రేమ ప్రేమనే కోరుకుంటది కానీ వస్తు రూపేన బహుమతులను కోరుకుని బర్త్ డే గిఫ్ట్లని వాలెంటైన్స్ డే గిఫ్ట్లని రోజువారి గిఫ్ట్లని ఒకరికొకరు ఇచ్చుకోవడాన్ని మీరు కోరుకుంటున్నారు అంటే అది బిజినెస్ అమ్మ ప్రేమ కాదు చెప్తున్నాను కదా అమ్మ బర్త్ డే గుర్తుకుండదు నాన్న బర్త్ డే గుర్తుకు ఉండదు వాళ్ళ పెళ్లి రోజులు గుర్తుకుండవు చెల్లి పెళ్లి రోజు చెల్లి బర్త్ డేలు గుర్తుకుండవు అక్క పెళ్లి రోజు ఇవన్నీ కాదు కాలేజీకి రావాలి కాలేజీ పేరు తోటి ఇంట్లో నుంచి బస్ వాస్ తీసుకొని బయటికి వెళ్ళాలి పేరెంట్స్ ని మోసం చేయాలి బయట అమ్మాయిలతోటి అబ్బాయిలు అబ్బాయిల తోటి అమ్మాయిలు బలా దూర తిరగాలి ఒక లక్ష్యం ఉందా నో ఇదంతా చూస్తుండగానే డిగ్రీలు పీజీలు అయిపోతాయి సమాజంలోకి అడుగు పెడతారు అప్పుడు అసలైన ప్రపంచం కనపడుతుంది మనం ఈ మధ్యన వీడియోలు ఎన్ని చూడట్లేదు చెప్పండి గా మధ్యకాలంలో ఒక అబ్బాయి అబ్బాయి అమ్మాయి లవర్స్ అమ్మాయి ఏం చేసింది అబ్బాయిని తీసుకొని నీతోటి ఫ్రీ ఏకాంతంగా మాట్లాడాలి గుట్టల్లోకి రండి అంటే విడిపోయాడు పోంగానే గొంతు కోసింది అక్కడ కారణం ఏంటి కేవలం వాడికి సరైన సెటిల్మెంట్ లేదు డబ్బు లేదు ఆ అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ మీరు ఇప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏమీ లేదు ఒకరికొకరికి అవసరమే మీరు గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు బాయ్ ఫ్రెండ్ ఉంటే గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళంతా హీరోల ఫీల్ అవుతున్నారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళంతా హీరోయిన్స్ లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీకు బాగానే ఉంటుంది మీ ఎడ్యుకేషన్ అయిపోయి ఆ సమాజంలో అడుగు పెట్టిన తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం యొక్క అసలు రంగులు మీతో తిరిగిన వాళ్ళ మనుషులు ఉన్నారు చూసారా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ అసలు రంగులు అర్థమవుతుంది ప్రపంచం అంతా శూన్యంగా కనబడుతుంది ఎంతమంది ఇప్పుడు లవ్ పేరుతో తిరిగే వాళ్ళు పెళ్లి దాకా వెళ్తున్నారు చెప్పండి నిజమైన లవ్ జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటది ఒకవేళ అలాంటి అవకాశం లేనప్పుడు ఒకరి ఉన్నతిని ఒకరు ఆశించి ఒకరు శ్రేయోభిలాషులుగా ఒకరు మారుతారు లైఫ్ లాంగ్ ఉంటది వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ కానీ వెల్ విషెస్ గా మిగిలిపోతారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి దాన్ని లవ్ అందామా మీరే మీరే డిసైడ్ చేయాలి కన్న తల్లిదండ్రుల యొక్క బాధ గుర్తుకు రాదు వాళ్ళ గురించి అసలు ఆలోచించరే నేను లైఫ్ లో సెటిల్ కాకపోతే మా పేరెంట్స్ ఏమనుకుంటారు అని అమ్మాయిలు ఆలోచిస్తలేరు అబ్బాయిలు ఆలోచిస్తలేరు ఏ కొద్దిమందో లైఫ్ లో సెటిల్ అవుతున్నారు మరి వీళ్ళు పర్మనెంట్ గా మీతో ఉంటారా నో మీరు చెప్పగలుగుతారా ఉంటారు అని నో ఇప్పుడు మీరు తర్వాత ఎవరో మీకు కూడా తెలియదు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా అంతే మరి శాశ్వతంగానే దీని కోసము శాశ్వతమైనటువంటి మీ కెరీర్ ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు ఏది శాశ్వతం మీకు కూడా తెలుసు ఇది శాశ్వతం కాదు అని మరి మీ కెరీర్ మీ ఎడ్యుకేషన్ మీ వ్యక్తిత్వాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు ఎంతమంది స్టూడెంట్స్ నౌ ఏ డేస్ కనీసం మేము చదువుకునే వాళ్ళము అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బూతులు మాట్లాడుతున్నారు ఒక ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లవాడు అలా మాట్లాడొచ్చా ఒకసారి నేను హైదరాబాద్ కి నుంచి హైదరాబాద్ కి వెళ్తున్నాను నల్గొండ దగ్గర నల్గొండ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్నప్పుడు ఒక మధ్యలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్లారు నేను షాక్ అయ్యాను నాకు చెవులు ఉన్నందుకు చెవులు ఉండే అవి పని చేస్తున్నందుకు నేను చాలా దరిద్రంగా ఫీల్ అయ్యాను ఆ రోజు వాళ్ళ బూతు మాటలు అమ్మాయిలు ఏమే రావే పోవే అని పిలిపించుకుంటున్నారు ఒక అదర్ పర్సన్ మనల్ని అంటే క్లోజ్నెస్ తోటి మీరు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత పిలుచుకోవడం వేరు ఎంతమంది మనల్ని ఏమి అని పిలవాలి ఎంతమంది మీ అమ్మాయిలను అబ్బాయిల్ని ఒరేయ్ ఒరేయ్ అని పిలవాలి అంత పిలుచుకున్నంత మాత్రాన అలా మధ్యన బాగా క్లోజ్నెస్ ఉన్నట్టు నిజంగా చెప్పాలి అంటే సమయం వచ్చినప్పుడు ఫ్రెండ్ ఎగిరిపోతాడు షిప్ మునిగిపోతది లవ్ అసలు గాలిలో కలిసిపోతది ఎవరి కోసం ఎవరు ఎంతమంది లైఫ్ లాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు ఎంతమంది నువ్వే నా ప్రాణం నువ్వే బాణం అన్నోళ్ళు జీవితాంతం మీకు తోడుగా ఉంటున్నారా అన్ని సినిమాటిక్ డైలాగ్స్ అవన్నీ కూడా ప్రాణం లేదు బాణం లేదు నీ దగ్గర పైసా లేకపోతే నీ కెరీర్ లో నువ్వు ఎదగకపోతే నువ్వు ఎవడో నాకు తెలియదు అనేవారు వల్లనే మస్తు మందిని ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం సరే పొరపాటున మీరు ఆ మాయలో పడ్డారు ఆ ఊబిలో దిగారు మరి బయట పడే ప్రయత్నం నిజంగా చెప్తున్నాను ఒకసారి నేను హనుమకొండ టు మంచిర్యాలకి ట్రైన్ లో వెళ్తున్నాను కాలేజ్ అక్కడ కాబట్టి నా పక్కన ఒక అబ్బాయి కూర్చొని నన్ను తిట్టుకోకండి అమ్మ అమ్మాయిలు ఎందుకంటే అబ్బాయిల ఎక్స్పీరియన్స్ లు ఎక్కువ చూశాను నేను ఈ మధ్యకాలంలో నా పక్కన నా దగ్గరికి ఫోన్లు చేసే వాళ్ళలో కూడా మేడం నేను ఒక అమ్మాయి నష్టపోయాను అని చెప్తున్న అబ్బాయిలను చూశాను కానీ రివర్స్ లో చాలా తక్కువ చూశాను ఈ ఒక 10 కేసులు ఉంటే అది ఒక కేసు అంతే మంచిరాలకి వెళ్తుంటే పక్కన ఒక అబ్బాయి కూర్చుని ఆ అబ్బాయి ఏడుస్తా ఉన్నాడు నిజంగా నాకు అబ్బాయిలు ఏడిస్తే చాలా బాధ అనిపించింది అసలకి ఏంటి కొద్దిసేపు అయినాక ఏంటి బాబు ఏమైంది అమ్మ ఎందుకంటే భయమేసింది ఎవరైనా చనిపోయారా మా సొంత ఇష్టమైన బాబాయి చచ్చిపోయాడు మేడం నాకు చూడ్డానికి వెళ్తున్నా అంటే చూడ్డానికి కాదు మూడు రోజులు అయింది ఇయ్యాల మూడు రోజులు వెళ్తున్నా అన్నాడు బాధ అనిపించింది అయ్యో ఊరుకో అమ్మ అన్న తర్వాత ఇంకా ఎవరికో ఫోన్ కలిపాడు నేను దాన్నైనా చంపేస్తా బావ నేనైనా చచ్చిపోతా బావ అని చెప్పేసి ఆవేశంగా మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది ఈ అబ్బాయికి ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉందని తర్వాత నెమ్మదిగా మాటలు కలిపితే అబ్బాయి చెప్తున్నాడు ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా ఎదురిచ్చి ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత కథం ఇంకా అమ్మాయి అబ్బాయి అమ్మాయి కంటే అబ్బాయి రిచ్ అన్ని రకాలుగా అబ్బాయి పర్ఫెక్ట్ గా ఉన్నాడు అమ్మాయి కంటే అయినా కూడా అమ్మాయిని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఖతం పెళ్లి అయిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అయింది మీ పేరెంట్స్ వద్దన్నారు మీ పేరెంట్స్ దగ్గరికి నువ్వు పోవద్దు మీ పేరెంట్స్ మీ దగ్గరికి రావద్దు మన ఇంటికి రావద్దు మీ అక్కచెల్లెలు రావద్దు పోనీ ఈమె పేరెంట్స్ రాకుండా ఉంటున్నారా ఈమె పేరెంట్స్ వచ్చినప్పుడల్లా ఫుల్ ఖర్చు బిర్యానీ మందు ఇదే భాగవతం వాళ్ళకి పెట్టొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్లొద్దు ఆ క్రమంలో వీడు నరకం చూస్తున్నాడు రోజు హింస రోజు షాపింగ్ రోజు రోజు వంట చేయకుండా బయట నుంచి బిర్యానీ పార్సెల్సే సో వాళ్ళ బాబాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ బాబాయ్ ఎక్కువ ఎఫెక్షన్ గా పెరిగాడు ఎఫెక్షన్ గా చూపించాడు అలా బాబాయి చచ్చిపోతే కూడా నువ్వు మీ బాబాయ్ చావకపోతే నేను ఇక్కడ ఉరేసుకొని చచ్చిపోతా నువ్వు పోవద్దు అని బెదిరింపు వాడు భయపడి భయపడిపోయి ఆగిపోయిండు ఇంకా అట్లా చచ్చిపోయిన రోజు పోలేకపోయిండు అలా బాబాయిని చూసుకోలేకపోయిండు మొత్తానికి మూడో రోజు ధైర్యం చేసి వచ్చి ట్రైన్ ఎక్కి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అది లవ్వా అది ప్రేమనా ఆ ఆ ప్రేమ కోసమా వాడు తల్లిదండ్రులను ఎదురించింది ఆ ప్రేమ కోసమా వాడి కెరీర్ ని నాశనం చేసుకుంది ఇలాంటి కేసెస్ అమ్మ చాలా ఎదురవుతున్నాయి చాలా చాలా ఇంకొక కేసు అమ్మాయి ఇష్టపడింది అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు వాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత చుక్కలు చూపిస్తున్నాడు ప్రతి దానికి అనుమానమే నువ్వు నన్ను లవ్ చేసినట్టుగా ఎంతమందిని లవ్ చేసావు అంటాడు వాడు సైకో నువ్వు నాకు పడ్డట్టుగా ఇంకెవరికైనా పడి ఉండొచ్చుగా పడే నేచర్ ఉంటే ఎవరికైనా పడతారుగా ఇది వాడి అనాలసిస్ ఇది వాళ్ళ మనస్తత్వం వాళ్ళు అవ్వరా ఇలాంటి అంటే నేను అనేది ఏందంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇద్దరు మెచ్యూర్డ్ మెంటాలిటీస్ ఇద్దరు వెల్ సెటిల్డ్ అయిన తర్వాత ఒక ప్రేమ వివాహం అనేది చేసుకుంటే అది ఆదర్శ వివాహం అంటారు ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీస్ ని చూస్తున్నారు ఇంతమంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు అది ఎవరికీ తప్పు అనిపించట్లేదు అది ఆదర్శ వివాహం మీరు ఏది సెటిల్ కాకముందు ఒకరికొకరు అర్థం కాకముందు ముసుగులు వేసుకుని పెళ్లిలు చేసుకుంటే ఉంటే బలిసి చేసుకున్నారు అంటారు పక్కా భాషలో అయితే అంటే మీ స్టేటస్ మీ ఎదుగుదల దాని అర్ధాన్నే మార్చేసింది చూసారా ఎంతమంది సరే పెళ్లి అన్న విషయం పక్కన పెడితే పెళ్లి దాకా ఎంతమంది పోతున్నారు ఫస్ట్ అఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ దీని పేరుతోటి లైఫ్ నాశనం చేసుకుంటున్నారు నేను చూస్తుంటాను మా కాలేజీ గ్రౌండ్ లో ఒకడు ఉంటాడు వాడికి అటు ఇద్దరు అమ్మాయిలు ఇటు ఇద్దరు అమ్మాయిలు కూర్చుంటారు ఇద్దరు తినిపిస్తా ఉంటారు సరే ఫ్రెండ్షిప్ అనుకోని కళ్ళు మూసుకొని పోతుంటాం గుండెని ఇబ్బనం చేసుకొని ఇగో ఒకడు వస్తుంటాడు బయట నుంచి అన్ని పార్సెల్ తెస్తుంటాడు నూడిల్స్ పార్సెల్స్ బిర్యానీ పార్సెల్స్ ఇంక అంతా కూర్చొని మాస్ గా తింటుంటారు అసలు నాకు ఏం అనాలో అర్థం కావట్లేదు పోనీ చదువులో ఉన్నారా నో అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఉన్నారా నో గేమ్స్ ఆడుతున్నారా నో ఫ్యామిలీకి పనికొచ్చే విధంగా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు నాలుగు డబ్బులు సంపాదించి వాడి ఖర్చులు వాడు పెట్టుకుంటున్నారా నో ఏది లేదు కానీ గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ బాయ్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇక ఇప్పుడు నేను చెప్పింది సెకండ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్స్ అనేది చాలా తక్కువ కావచ్చు అది వేరే విషయం సో నేను చెప్పే విషయం ఏంటి ఇంకా నాది పూర్తిగా మీ దగ్గర నేను ఓపెన్ కాలేకపోతున్నాను బట్ నేను మీకు చెప్పే విషయం ఒక్కటి చెప్తున్నా అమ్మ నిజమైన ప్రేమ అనేది మీ కెరీర్ కి ఆటంకం కాదు అఫ్ కోర్స్ మీలో కొంత కొంతమంది నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఉండొచ్చు నేను దాన్ని కించపరచట్లేను వాళ్ళు ఎలాగో ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకుంటారు ఒకరికొకరికి ఇప్పుడు చాలా మంది చూడండి మంచి లైఫ్ లో సెటిల్ అయ్యి ఇద్దరు ఫ్యామిలీస్ ని ఒప్పించి ఆ మంచి ఘనంగా కులాంతర వివాహాలు లవ్ మ్యారేజెస్ కూడా ఫంక్షన్ హాల్ లో బోత్ ఫ్యామిలీస్ ఘనంగా చేస్తున్నారు వాటి గురించి నేను మాట్లాడట్లేదు చదివే వయసులో ప్రేమ పేరుతోటి ఇది నా లవర్ వీడు నా లవర్ అని చెప్పుకుంటూ ఒక్కొక్కరిని నలుగురు నలుగురు మెయింటైన్ చేసుకుంటూ ఒకరి ఒకరు చదవకుండా శికారులు తిరుగుతూ జీవితం నాశనం చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మీకు కనిపించేదంతా నిజం కాదు నువ్వే నా ప్రాణం అన్నది ప్రతిసారి నిజం కాదు నిజంగా ఆ ఫీలింగ్ ఉన్నోళ్ళు అన్ని సార్లు బయటికి కూడా చెప్పరు గుర్తుపెట్టుకోండి నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టరు నిజంగా మీ ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మీ ఉన్నతిని ఎంకరేజ్ చేస్తారు నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీ నుంచి ఏమి ఆశించరు మీ మంచిని మాత్రమే ఆశిస్తారు మరి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రేమ పేరుతోటి మీరు ఏర్పరచుకున్నటువంటి బంధాలలో ఈ లక్షణాలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి లేదు అంటే నిస్సంకోచంగా వదిలేసేయండి మీరు వదిలేసినంత మాత్రాన ఎవరేం ప్రాణాలు తీసుకోరు ఇంకొక విషయం చాలా మంది లవర్ మోసం ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ఫ్లెక్సిబుల్ youtube లో చాలా వీడియోస్ చూశాను అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు ఒకప్పుడు ప్రేమ పేరుతో మోసపోతే అమ్మాయిలు సూసైడ్స్ చేసుకున్నారేమో కానీ ఇప్పుడు అబ్బాయిల సూసైడ్స్ పెరిగినాయి నాకు అది ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది సెన్సిటివ్ అయిపోతున్నారు ఒకవేళ మీరు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ప్రేమ పేరు తోటి మోసపోయారే అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం తీసుకునే ప్రయత్నాలు చేయకండి ఒక్కసారి అమ్మ బాధ గుర్తు చేసుకోండి తొమ్మిది నెలలు మిమ్మల్ని కడుపులో మోసిందమ్మా ఆ తొమ్మిది నెలలు సగం నెలల్లో ఏమి తినాలనిపియదు అమ్మకి నేను ఫేస్ చేశా ఒక్కొక్క రోజు 18 సార్లు 20 సార్లు నాకు వామిటింగ్స్ అయ్యేటివి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఏ కొన్ని వాసనలు పడవు హార్మోనల్ ఇంబాలెన్స్ మానసిక స్థితి గందరగోళంగా ఉంటది ఉత్తగానే ఏడుపు వస్తుంటది ఉత్తగానే ఎమోషనల్ అయిపోతుంటారు నేను చచ్చిపోతానేమో అన్న భయం అవుతుంటది అమ్మకి అర్థమైందా ఆ తొమ్మిది నెలలు లోపల బేబీ పెరుగుతున్న కొద్దీ సరిగ్గా జీర్ణం కాదు లోపల అంతా ఒత్తిడి ఆయాసం అవుతుంటది ఊపిరి మెసలదు ఇన్ని బాధలు అమ్మ మీ కోసం భరించింది ఆ అమ్మ గురించి ఆలోచించండి ఆ నాన్న గురించి ఆలోచించండి డెలివరీకి పోయేటప్పుడు అమ్మకి బయటికి వస్తానా లేదా కూడా తెలవదు పునర్జన్మ ఒకవేళ బ్రతికితే పునర్జన్మ అన్నట్టే చావుకైనా సిద్ధమై మిమ్మల్ని కన్నది ఆ విలువను గ్రహించండి అమ్మ నాన్నల సంతోషాన్ని చూడండి మీరు ఎదగండి లైఫ్ లో ఇప్పటివరకు మీకు ఇలాంటి రిలేషన్స్ చెత్త చెదారం ఏమైనా ఉంటే తీసి పడేసేయండి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తీసి పడేసేయండి అట్లీస్ట్ రియలైజ్ అవ్వండి ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి ప్రపంచంలో మన కోసం ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పేరెంట్స్ పేరెంట్స్ ఏ మన కోసం ఏడ్చే వాళ్ళు నిజమైన ప్రేమ గురించి ఇక్కడ నేను మాట్లాడేట్లేదు దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఇంకా మీరు అర్థమైందా ఎవరి కోసం ఎవరు ఏడవరు ఎవరి కోసం ఎవరు చచ్చిపోరు కానీ మోసం చేసింది ప్రియురాలు మోసం చేసిండు ప్రియుడు మోసం చేసిండు అని ఎందుకు ఆత్మహత్య దిశలో ఆలోచిస్తున్నారు వాళ్ళ నిజ స్వరూపం మోసం చేసిండ్రు అంటే దాని అర్థం ఏంటిది ఒకసారి లాజికల్ గా ఆలోచించండి వాళ్ళ నిజ స్వరూపం రూపం తెలిసింది అన్నట్టే కదా కాస్త పెయిన్ ఫుల్ అయినా మాకు మంచే జరిగింది అనుకోవాలి జీవితాంతం బాధపడే బదులు పెళ్లి కాకముందే ఈ గోల పీడ విరగడైపోయిందని పాజిటివ్ గా తీసుకోవాలి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి మళ్ళీ రియల్ లైఫ్ ఇప్పుడు మోసం చేసింది కరెక్టే లేదా మోసం చేసిండు కరెక్టే వాళ్ళు వద్దనుకొని వదిలించుకున్నారు కదా మిమ్మల్ని వద్దని వదిలించుకున్న వాళ్ళ కోసం మీరెందుకు ఏడవాలి మీరు ఎందుకు మీ కెరీర్ ని నాశనం చేసుకోవాలి ఎందుకు తాగుబోతులు కావాలి ఎందుకు స్మోక్ చేయాలి ఎందుకు అమ్మాయిలైతే ఎందుకు బాధపడాలి అబ్బాయిలైతే ఎందుకు చెడు వ్యసనాలకి బానిసలు కావాలి ఎందుకు మీరు పెళ్లిలు కాకుండా ఓ దేవదాసులాగా పార్వతీ లాగా ఎందుకు మారాలి ఏం నీకు ఫ్యామిలీ లేదా అమ్మ నాన్న లేరా నీ ఇంట్లో రక్త సంబంధాన్ని తోడ పుట్టిన వాళ్ళు లేరా అంతకంటే ఎక్కువ ప్రేమ దొరుకుతుందా బయట నీకు ఇదంతా ఉత్త ట్రాష్ అమ్మ ఇదంతా పై పై మెరుగులు మాత్రం అర్థమైందా అలాంటి ప్రేమల కోసం మీ కెరీర్ ని ఆగం చేసుకోకండి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి వాట్ ఇస్ వాట్ నేను మారాలి నా లైఫ్ ని నేను సిస్టమేటిక్ పెట్టుకోవాలి మీకు ఎవరు జీవిత భాగస్వామిగా వస్తారు అనేది మీకు ఆల్రెడీ రాసి పెట్టి ఉంటది మళ్ళీ రాసి పెట్టి ఉంటది అనుకుంది ఏంటి మేడం అని మీరు అనుకోవచ్చు ఇది నిజం లాస్ట్ కి ఫైనల్ గా మీకు ఏది మీకు ఏది దక్కాలో అదే దక్కుతది అర్థమైందా నిజంగా మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు అయితే గనక వాళ్ళు జీవితాంతం మీ కోసం ఎదురు చూస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు లైఫ్ లో సక్సెస్ అయిపోయారు అనుకోండి మీ బంధం ఒకవేళ అది వివాహానికే దారి తీస్తే బోత్ ఆర్ హ్యాపీ మీరు సక్సెస్ అయినాక పెళ్లిలు చేసుకుంటే ఫ్యామిలీస్ ఆర్ కూడా హ్యాపీనే కానీ ఇప్పుడు చదువుతున్న సమయంలో చదవాల్సిన సమయంలో జీవితంలో ఎదగాల్సిన సమయంలో ప్రేమ అన్న పేరుతోటి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి గిఫ్ట్లు కొనించుకుంటే అంటూ అప్పులు చేసి వ్యసనాలకు బానిసలై తిరుగుబోతుల్లాగా మారి నిజంగా చెప్పాలంటే అనాగరికంగా మారి నాగరికతను మర్చిపోయి ఇంకా చెప్పాలి అంటే ఇక వద్దు ఇంతకంటే ఎక్కువ నేను వాడలేని పదాలను కూడా అలా మారిపోయి ఒకేసారి పరిస్థితులన్నీ ఎదురు తిరిగేసరికి కళ్ళు బైర్లు కమ్మిపోయి ప్రపంచం నిజ ప్రపంచం బయటపడి ఆ టైం కి వచ్చేసరికి మీకు జరగాల్సిన నష్టం అంతా జరిగి ఇదంతా ఎందుకు ఎందుకు మరి ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి లవర్ మోసం చేసిందని ఒకడు సూసైడ్ చేసుకుంటాడు మరి అమ్మ నాన్న వాళ్ళు కూడా చచ్చిపోవాలా మీతో పాటుగా లేదా అబ్బాయి మోసం చేసిండని అమ్మాయి ఇంకేదో చేసుకుంటది వాళ్ళ పరిస్థితి ఏంటి దయచేసి నేను అబ్బాయిలకు చెప్తున్నాను అమ్మాయిల జీవితాలతోటి ఆడుకోకండి వాళ్ళు ఎమ్మటి మిమ్మల్ని ఇష్టపడకపోయినంత మాత్రాన ప్రేమ గీమని వెంటపడకండి హాని చేయకండి అదేవిధంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మీరు ఇష్టపడండి అమ్మాయిలకు చెప్తున్నాను ప్రధానంగా దయచేసి అబ్బాయిల ఎమోషన్స్ తోటి ఆడుకోకండి అబ్బాయిలు వాళ్ళ యొక్క ఎమోషన్స్ తోటి ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు అబ్బాయిలతో ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్న అమ్మాయిలను ఎక్కువ చూస్తున్నాను ఇది దురదృష్టకర విషయం దయచేసి వాళ్ళ ఎమోషన్స్ తోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకోకండి ఇది కొనియమని అది కొనియమని వాళ్ళని అప్పుల పాలు చేయకండి పిల్లలు తప్పు దారి పట్టిపోతున్నారు క్రిమినల్స్ తయారవుతున్నారు చెడు దారిలోకి వెళ్ళిపోతున్నారు డబ్బు కోసం కొంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు మందు మందుని కూల్ డ్రింక్ తాగినంత ఈజీగా తాగేస్తున్నారు గంజాయి అంటున్నారు అసలు చదువుకున్న లక్షణాలు ఏ మాత్రం కనపడవే ఒకప్పుడు చూడండి బిఏ చేశారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ లో ఉన్నారు అంటేనే ఒక హీరో మెటీరియల్ లాగా కనిపించే వాళ్ళు వాళ్ళ వేషధారణ అయితే ఏంది వాళ్ళ ఎంత లేకపోయినా కూడా లేనోళ్ళు అయినా సరే ఒకప్పుడు లేనోళ్ళు కూడా ఎంత లేనోళ్ళు లేని కుటుంబాల నుంచి వచ్చి కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లే ఉన్నారు ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా కానీ నీట్ గా డ్రెస్ అప్ కావడం నీట్ గా తల దువ్వుకోవడం మాట బూతులు మాట్లాడటం ఏంటి చదువుకున్న పిల్లలు నాకు అర్థం కాదు ఆ మాట మాట విధానం ఆ పాలిష్నెస్ ఆ బిహేవియర్ ఎక్కడ పోయింది ఇదంతా ఎవరిని చూసినా తొడేలు చింపాంజీలు గొరిల్లాలు గుర్తుకొస్తున్నాయి వాళ్లే కనపడుతున్నారు బిహేవియర్ అమ్మాయిల డ్రెస్సింగ్ అబ్బాయిల డ్రెస్సింగ్ ఎటు పోతుంది సొసైటీ ఒక్కసారి ఆలోచించండి సో ప్రేమ అనే దాని జోలికి వెళ్ళకండి అమ్మ చాలా చాలా బ్యాడ్ అండ్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు ఫలితంగా పేరెంట్స్ బాధపడుతున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియో ఎవరైనా హర్ట్ చేసి చేస్తే ఏమీ అనుకోకండి ఒక ముందు చెప్పాను ఒక మదర్ గా ఒక అక్కగా మీకు చెప్తున్నాను అని ఇప్పటివరకు జీవితంలో మీరు మోసపోయి ఉన్నా కూడా వదిలేయండి దాని నుంచి బయట పడండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి కొత్త జీవితాన్ని ఆహ్వానించండి మీ కోసం మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ కోసం మీరు కన్నీరు కార్చకండి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు జీవితాన్ని నాశనం చేసుకోకండి మనిషి తలుచుకుంటే ఎప్పటికప్పుడు కొత్తగా కొత్త లైఫ్ ని మొదలు పెట్టొచ్చు నీ కోసం ఏడ్చే అమ్మా నాన్న ఉన్నారు నీ కోసం ఎదురు చూసే నీ తోబుట్టులు ఉన్నారు నీకంటూ ఒక కొత్త జీవితం కొత్త లైఫ్ ఉంది దాని కోసం మళ్ళీ మీరు జీవితం మళ్ళీ మొదలు పెట్టండి ఒకవేళ మీరు వెళ్తున్న మార్గంలో మీకు మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంటర్ అయితే అయ్యో మళ్ళీ నేను కావాలని వచ్చాను కదా అని చెప్పేసి కరుణ హృదయం తోటి మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయకండి వద్దనే వెళ్ళిపోయిన వాళ్ళని వద్దనే వదిలేసేయండి మీకంటూ మీరు ఇచ్చుకునే గిఫ్ట్ అది ఒక్కటే ఓకే ఈ వీడియో యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటారు నా ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే
No comments:
Post a Comment