🙏 *మహోదయము మహాశయా,*
*"ఆదివారము రోజున మాంసాహారమును భుజించరాదు, మద్యమును సేవించరాదు మరియు మైథునమును (Sex) చేయ్యరాదు." అని పూర్వీకులు ఎందుకు చెప్పారు? దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు యోగిక కారణాలు ఏమిటి?. అవి మన ‘5D’ లయలలో (Sharira, Manas, Bhavana, Prana, Atma) కలిగించే దోషాలు, మానివేస్తే కలిగే లాభాలు మరియు పరిష్కారములను గురించి క్లుప్తంగా తెలుసుకుందాము.*
🌞 *ఆదివారము* – *శ్రీ సూర్య భగవానుల వారికి అంకితమైన రోజు.*
*ఆదివారము అనేది పవిత్రమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజు ఆరోగ్యము, ధ్యానము, కర్తవ్యతా బోధన కోసము ఉద్దేశించబడినది. ఆ రోజున శ్రీ సూర్య భగవానుల వారి తేజస్సుతో మన ‘5D’ శరీరాలన్నీ శుద్ధి చేసుకుందాము. అందుకే తామసిక అలవాట్లు ఆ రోజున వదిలివేయమన్నారు.*
🚫 *1. మాంసాహారము ఎందుకు నిషిద్ధము:*
🌿 *మూల కారణము:*
🌹 హింసాత్మకమైన శరీర పదార్థము.
🌹 జీర్ణవ్యవస్థపై భారము.
🌹 తామసిక గుణాన్ని పెంచుతుంది (క్రూరత, కోపము, అజ్ఞానము).
🌀 🪷 *5D ప్రభావం:* *నష్టములు/మానివేసినచో లాభాలు*
🌹 1D (Sharira) చర్మవ్యాధులు, రక్త దోషాలు/ శరీర శుద్ధి, ఆరోగ్యము
🌹 2D (Manas) జడత్వము, అలసట/ స్పష్టత, జ్ఞాన బలము
🌹 3D (Bhavana) క్రూరభావాలు/ క్షమా, అనురాగము
🌹 4D (Prana) శక్తిలో లోపము/ ప్రాణశక్తి ప్రబలుతుంది
🌹 5D (Atma) ధ్యానము చెడ్డుతుంది/ ఘాడమైన ధ్యానము
🚫 *2. మద్యము (Alcohol) – ఎందుకు నిషిద్ధము?*
🌿 *మూల కారణము:*
స్వీయ ఇంద్రియ నియంత్రణను కోల్పోవడము, చిత్తశుద్ధి లేమి
ప్రాణవాయువుపై దుష్ప్రభావము.
🌀🪷 *5D ప్రభావము:*
🌹 1D కాలేయ వ్యాధులు, నరాలకు హాని /ఆరోగ్యముగా ఉండటము
🌹 2D మానసిక విచలనము/ స్థిరమైన భావనలు
🌹 3D అసాంఘిక ప్రవర్తన/ ఆత్మగౌరవము
🌹 4D ప్రాణశక్తి తగ్గిపోవడము/ ప్రాణశుద్ధి
🌹 5D ఆధ్యాత్మిక మార్గము నుండి దూరము/ దైవ అనుభవము
🚫 *3. మైథునమును (Sex) – ఎందుకు మానాలి?*
🌿 *మూల కారణము:*
శారీరక శక్తి భారీగా వినియోగము అవుతుంది. ప్రాణ శక్తి క్షయానికి దారి తీస్తుంది. శుక్ల/ఓజస్సు నష్టము = చైతన్య లోపము.
🌀🪷 *5D ప్రభావము:*
🌹 1D దేహబలహీనత / శక్తి నిలుపుదల
🌹 2D మానసిక అశాంతి / శాంతియుత స్థితి
🌹 3D అభావ భావనలు/ ప్రేమతో కూడిన మనోభావాలు
🌹 4D ఓజస్సు నష్టము/ ప్రాణశక్తి పరిపుష్టి
🌹 5D ధ్యాన సాధన కష్టము/ బ్రహ్మ చైతన్య అనుభవము
😊 *గమనిక:* గృహస్తులకు శృంగార జీవితము పాపమేమీ కాదు. కానీ, ఆధ్యాత్మిక శక్తి అధికముగా ఉన్న ఆదివారము లాంటి రోజులల్లో నియంత్రణను పాటించడము బ్రహ్మచర్యంగా పరిగణించబడుతుంది.
✅ *విముక్తి మార్గము*- కార్యాచరణ
🪷 *మానవలసినవి / ఆచరించవలసినవి*
🌹 శారీరక ఆరోగ్యము కొరకు: మాంసము, మద్యము, శారీరక శ్రమను మానేద్దాము/ ఉపవాసము, అల్పాహారము
🌹 *మనస్సు ఆరోగ్యము కొరకు*: తామసిక ఆలోచనలను మానేద్దాము/ ధ్యానము, గాయత్రీ జపమును చేద్దాము
🌹 *భావన ఆరోగ్యము కొరకు:* కోపమును, కామమును తగ్గించుకుందాము/ గ్రంధ పఠనము, సత్సంగము మరియు సజ్జన సాంగత్యములల్లో పాల్గొందాము
🌹 *ప్రాణ శక్తిని పెంచుకునేందుకు గాను* ప్రాణాయామమును, దీర్ఘ శ్వాసలను మరియు వాయు నియంత్రణా క్రియలను చేద్దాము
🌹 *ఆత్మ ఆరోగ్యము కొరకు:* తపస్సు, సేవ, కృతజ్ఞత, దైవ ధ్యానము మరియు సూర్యారాధన
🧘♂️ 🪷 *ఆదివారము యొక్క విశిష్టత:*
🌺 ఆ రోజును మనము సద్వినియోగము చేసుకొనగలిగితే –
🌞 శ్రీ సూర్య భగవానుల వారి తేజస్సును మనము గ్రహించగలము
🌿 మన 5D లయలన్నీయు శుద్ధి చేయబడతాయి
🙏 మన పాపాలు క్షమించబడి, శక్తివంతమైన ఆత్మగా అభివృద్ధి చెందగలము.
🌻 *కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు:*
🪷 *మేము, ఆదివారము రోజున చెయ్యవలసిన పనులను హృదయపూర్వకముగానూ మరియు త్రికరణ శుద్ధితో ఆచరించుటకు కావలసిన సమస్త జ్ఞానము మరియు శక్తులను సమృద్ధిగా ప్రసాదించిన శ్రీమతి ఛాయా దేవి సహిత శ్రీ సూర్య భగవానుల వారికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు.*
💐 *జై స్వాస్థ్య భారత మాతాకీ జై*
💐 *జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*
🌟 *ఓం జో శ్రీ అచ్యుతానంద యోగము, ("5D" నేటి తరానికి అనుగుణముగా నవీకరించబడిన యోగ శాస్త్రాలు మరియు సాధనలు), శ్రీ భాగ్య నగరము (Hyd), తెలంగాణా.*
🙏😌 *ధన్యవాదాలు* 💐💐
🌏 *అంతా సరిగానే ఉంది*
🪷🌼🌻🌸🌺🏵️💐🌹
Sekarana
No comments:
Post a Comment