అక్బర్ గురించి చరిత్ర దాచిన నిజాలు .. అక్బర్ అరాచకాలు Truth of AKBAR|Manikantagolakoti
https://youtu.be/7pwsPvfA8n8?si=KqnFKv2_qtR2Z3j9
1556 అది పానిపట్టు రెండో యుద్ధం జరుగుతున్న సమయం నవంబర్ఐదవ తేదీ యుద్ధభూమి రక్తశిక్తమై ఉంది. అకస్మాత్తుగా వీరోచితంగా పోరాడుతున్న హేమచంద్ర విక్రమాదిత్యుడు తన ఏనుగుపై మూర్చపోయి కుప్పకూలాడు. రాజు కుప్పకూలడం చూసిన శత్రు సైనికులు అతన్ని బంధించి తమ యువరాజు ముందు నిలబెట్టారు. ఆ యువరాజు వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఆ పసివాడు దయా దాక్షిణ్యం లేకుండా కళ్ళు కూడా రెప్ప వేయకుండా తీవ్రంగా గాయపడిన విక్రమాదిత్య తలను నరికి పాడేసాడు. ఆ నరికిన తలను కాబూల్‌కి పంపించారు. అక్కడ ఢిల్లీ గేట్ బయట ఆ తలను వేలాడదీశారు. ప్రజలంతా చూసేలా తలలేని ముండాన్ని ఢిల్లీలోని పాత కోట ద్వారానికి వేలాడదీశారు. ఆ యువరాజు క్రూరత్వం అక్కడితో ఆగలేదు. విక్రమాదిత్య సైనికులను వెంబడించి మరి వారి తలలు నరికి తీసుకురమ్మని ఆదేశించాడు. ప్రతి ఒక్క సైనికుడిని పట్టుకుని వారి తలలు నరికేశారు. వాటన్నిటిని ఒకచోట పోవు చేశారు. ఆపై ఇటుకలు రాళ్లను ఉపయోగించి ఆ నరికిన తలలన్నిటితో ఒక భయంకరమైన టవర్ ను నిర్మించారు. అసలు ఢిల్లీలో అధికారం కోసమే పానిపట్ రెండో యుద్ధం జరిగింది. హేమచంద్ర విక్రమాదిత్య తన కత్తి పట్టుకొని నిలబడినప్పుడు అతని ముందున్న ఆ 13 ఏళ్ల యువరాజు అమాయక సైనికుల తలలు నరికి ఆ తలలతో ఒక వికృతమైన కట్టడాన్ని నిర్మించిన ఆ రాజు మరెవరో కాదు మన చరిత్రలో ఎంతో ప్రజాధరణ పొందిన చక్రవర్తి అక్బర్ ది గ్రేట్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అతని గురించి ఈ రోజు వరకు మీరు బహుశా ఎప్పుడూ చెడుగా విని ఉండకపోవచ్చు. కానీ చరిత్ర పుటంలో దాగి ఉన్న ఈ చీకటి కోణాన్ని అతని నిజ స్వరూపాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి. 1542 అక్టోబర్ 25 రాజ్ పుతానాలోని అమరకోట్ కోటలో ఒక చరిత్ర తిరగరాసే క్షణం అది. తల్లిదండ్రులు నిరాశరులైన స్థితిలో ప్రపంచం వారిని వెలివేసిన వేళ ఆ చీకటి రోజుల్లో అక్బర్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచి పోరాటమే అతని నరనరాల్లో జీర్ణించుకుపోయింది. వేట యుద్ధ వ్యూహాలు వీరోచిత పోరాటాలు ఇవే అతని బాల్యం తొమ్మిదేళ్ల ప్రసిప్రాయంలోనే గజినికి గవర్నర్ గా నియమించబడ్డాడంటే అతని ప్రతిభ ఎలాంటిదో ఊహించుకోండి. కానీ విధి మరో ప్రమాదకరమైన ఆటఆడింది. 1556 లో అక్బర్ తండ్రి మొగల్ చక్రవర్తి హుమాయున్ ఆకస్మిక మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో అక్బర్ వయసు కేవలం 13 ఏళ్ళ మాత్రమే. తండ్రి మరణంతో మొగల్ సామ్రాజ్యం అనే బరువైన బాధ్యత ఆ పసివాడి భుజాలపై పడింది. కానీ అక్బర్ ఎక్కడా వెనుకాడలేదు. తన పదునైన తెలివితేటలతో వ్యూహాత్మకమైన ఆలోచనలతో మొగల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో బలోపేతం చేశాడు. అక్బర్ ను చరిత్రలో మహోన్నతమైన చక్రవర్తిగా కీర్తిస్తారు. ముఖ్యంగా అతని సెక్యులరిజం గురించి బాగా చెబుతారు. అన్ని మతాలను సమానంగా చూసేవాడని హిందూ రాజులతో స్నేహ సంబంధాల కోసం చేయి చాచాడని బాబర్ కాలం నుండి వస్తున్న జిజియా పన్నును రద్దు చేశాడని ప్రపంచ శాంతి కోసం ఎందరో హిందూ యువరాణులను వివాహం చేసుకున్నాడని ప్రచారం బాగా జరిగింది. అతను ఏ నిర్ణయం కూడా ఏ ఒక్క మతానికి అనుకూలంగా ఉండేది కాదని చెప్తారు. ఇవన్నీ వినడానికి ఎంతో బాగున్నాయి కానీ ఈ గొప్ప నిర్ణయాల వెనుక ఒక మంచి మనిషి హృదయం ఉందా లేక ఒక తెలివైన క్రూరమైన చక్రవర్తి మెదడు ఉందా అనేదే మనం గమనించాలి. నిజం చెప్పాలంటే అక్బర్ అన్ని మతాలను కలుపుకొని పోవాలని నమ్మాడు. కానీ మంచితనం అనే ముసుగు వెనుక అక్బర్ అసలు ముఖం తాగి ఉంది. ఆ ముఖం గురించి ఏ సినిమాను టీవీ సీరియల్లో మనకి చెప్పవు. మన చరిత్ర పుస్తకాల్లో కూడా ఎప్పుడూ ఇలా బోధించలేదు. అతని ప్రతి నిర్ణయం ఒక చదరంగపు ఎత్తుగడ లాంటిది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అతను వేసిన అత్యంత చేకచక్యమైన ఎత్తుగడలవి. పానిపట్ రెండో యుద్ధంతో ఢిల్లీ సింహాసనాన్ని దక్కించుకున్న అక్బర్ దృష్టి భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని ప్రతి అంగులం విస్తరించడంపై పడింది. ఉత్తర మధ్య భారతదేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాక అతని కళ్ళు రాజపుతానా వైపు మల్లాయి. ఆ శౌర్యానికి త్యాగాలకు ప్రతీకైన భూమిని తన పాదాల కిందకి తెచ్చుకోవడానికి ఆశించాడు. నెమ్మదిగా అక్బర్ తన విషపు పంజాను రాజ్‌పూత్ సామ్రాజ్యంపై విసరడం ప్రారంభించాడు. 1567 ఆ సంవత్సరమే మేవా రాజధాని అజయమైన కోట నగరం చిత్తూర్ గర్వ్ వంతు వచ్చింది. నాలుగు నెలల పాటు సాగిన భీకర యుద్ధం అది. గోడలు దద్దరిల్లాయి. తద్దులతో దాడి చేయడంతో ఆకాశం ఎరుపెక్కింది. చివరకు మొగల్ సైన్యం విజయం సాధించింది. వారి రక్తం మరకలతో నిండిన బూట్లతో కోటలోకి ప్రవేశించారు. కానీ వారికి ఎదురైంది ఏంటంటే సజీవంగా లేని కోట మాత్రమే. లోపల తమ ఆత్మ గౌరవం కోసం తమ పవిత్రతను కాపాడుకోవడానికి వేలాది మంది రాజపుతాని వీరవనితలు ఆ అగ్ని గుండంలోకి దూకి ప్రాణాలు అర్పించారు. ఆ మంటల్లో వారి త్యాగం వారి సౌర్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ అక్బర్ క్రూరత్వం అక్కడితో ఆగలేదు. కోటను ఆక్రమించుకున్న వెంటనే చిత్తూరులోని సాధారణ ప్రజలను చంపేయండి అని ఆదేశించాడు. ఆ ఊచకోతలో అమాయక రైతులు, సామాన్య పౌరులు, అభంసుభం తెలియని స్త్రీలు, పసిపిల్లలతో సహా సుమారు 30 వేల మంది హిందువులు వధించబడ్డారు. రక్తం ఏరులై పారింది. శవాల కుప్పలు పేరుకుపోయాయి. మిగిలిన వారిని బానిసలుగా మార్చారు. ఆ తర్వాత కోటలోని పవిత్ర దేవాలయాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి. రాతి విగ్రహాలు ముక్కలై భక్తికి ప్రతీకలైన ఆలయాలు సిధిలమయ్యాయి. అక్బర్ ఈ విజయాన్ని ఎలా ప్రకటించుకున్నాడో తెలుసా? తన ఇతర గవర్నర్లకు తెలియజేయడానికి అతను ఫత్నామా ఏ చిత్తూర్ అనే పత్రాన్ని విడుదల చేశాడు. అందులో ఈ విజయాన్ని హిందూ కాఫిర్లపై ఇస్లాం యొక్క విజయంగా పేర్కొన్నాడు. మనలో బలం ఉన్నంతవరకు ఇస్లాం శత్రువులకు వ్యతిరేకంగా పోరాడాలి అని స్పష్టంగా ప్రకటించాడు అక్బర్. చరిత్ర పుస్తకాలు అక్బర్ ను అన్ని మతాలను గౌరవించేవాడని చెబుతాయి. కానీ అతని యాక్షన్స్ చరిత్రలో చెప్పిన సొల్లుకి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. హిందూ విలువలను అవమానించడంలో అక్బర్ ఎప్పుడూ వెనకాడలేదు. చంపబడిన హిందువుల సంఖ్య ఎంత అంటే వారి జంద్యాలతో ఆ సంఖ్యను కొలిచేవాడు. చిత్తూరు యుద్ధంలో చంపబడిన హిందువుల జంద్యాల బరువు మొత్తం 2980 kgీలు అంట. ఈ సంఖ్య అక్బర్ క్రోత్వానికి మత ద్వేషానికి సజీవ సాక్ష్యం. ఇతర మతాలను కించపరచడానికి అక్బర్ ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేశాడు. వాటిలో ఒకటి నగర్ కోర్టులోని ఆలయం. ఆ ఆలయంపై దాడి చేసి దానిని సేవ చేస్తున్న బ్రాహ్మణులందరినీ దారుణంగా చంపేశాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోవుల హత్యను నిలిపి వేసాడని చెప్పబడే అక్బర్ సైన్యమే ఆ ఆలయంలో పెంచుతున్న 200 ఆవులను బాణాలతో కొట్టి చంపేశారు. అంతటితో ఆగక ఆ సైనికులు తమ బూట్లలో రక్తాన్ని నింపుకొని ఆలయం పైకప్పులు గోడలపై విశారు. ఇది కేవలం విద్వంసం కాదు మత విశ్వాసాలపై జరిగిన దారుణమైన దాడి. అంతేకాదు హిమాచల్‌లోని జ్వాలాముఖి ఆలయంలో సంవత్సరాలుగా వెలుగుతున్న అఖండ జ్వాలను ఆర్పి వేయడానికి అక్బర్ చాలా ప్రయత్నించాడు. అతని సైన్యాలు అతని ప్లాన్లు అన్ని విఫలమయ్యాయి. ఈ అద్భుతమైన జ్వాలను ఆర్పి వేయటం వారికి సాధ్యం కాలేదు. అప్పుడు అక్బర్ జ్వాలాదేవి శక్తిని అంగీకరించి ఆ ఆలయంలో ఒక బంగారు చత్రాన్ని సమర్పించాడు. అయితే అమ్మవారు అతని సమర్పణను తిరస్కరించిందని ఆ చత్రం సమర్పించిన వెంటనే ఇతర లోహంగా మారిపోయిందని అంటూ ఉంటారు. చిత్తూరు రక్తపాతం తర్వాత అక్బర్ దృష్టి ప్రయాగరాజు వైపు మల్లింది. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అది. ఆ ప్రదేశంపై తన నియంత్రణను సుస్థిరం చేసుకోవడానికి అక్బర్ అక్కడ ఒక భారి కోటనైతే నిర్మించడానికి ఆదేశించాడు. అంతేకాదు ఆ పవిత్రమైన ప్రయాగ్‌రాజ్ పేరును ఇల్హాబాస్ గా మార్చేశాడు. దాని తర్వాత షాజహాన్ అలహాబాద్ గా మార్చాడు. ఆ తరువాత 1578 లో అక్బర్ తనను తాను గాజీ అనే పేరుతో సత్కరించుకున్నాడు. గాజీ అంటే ఏంటో తెలుసా నాన్ ముస్లిమ్స్ కు వ్యతిరేకంగా పోరాడే ఇస్లాం యోధుడు అని అర్థం. అంటే అక్బర్ తనను తాను ఇస్లాం శత్రువులను నిర్మూలించే వాడిగా ప్రకటించుకున్నాడు. 1578 లోనే అక్బర్ ఇబాదత్ ఖానాలో వివిధ మతాల పండితులను ఆహ్వానించాడు. ప్రతి మతం యొక్క విలువలను చర్చించడానికి ఆహ్వానించాడు. వినడానికి ఎంతో గొప్పగా ఉంది కదూ ఒకవైపు గాజీ అని ప్రకటించుకుంటూనే మరోవైపు మత సామరస్యం గురించి చర్చలు జరిపాడు. ఈ చర్చల ఫలితంగా 1582 లో అక్బర్ అన్ని మతాల విలువలను కలిపి ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాని పేరే దిన్ ఏ ఇలాహి. ఈ మతం 1578 నుండి 1582 మధ్య కాలంలో ఇబాదత్ ఖానాలో జరిగిన చర్చల ఫలితంగా ఏర్పడింది. ఈ ఐదేళ్ల మధ్య 1579 లోనే అక్బర్ జిజియా పన్నును కూడా రద్దు చేశాడు. ఇప్పుడు ఆలోచించండి అక్బర్ నిజంగా ముస్లిం ఇతరులకు వ్యతిరేకి అయితే ఈ సెక్యులరిజం నాటకం ఎందుకు తనను తాను గాజీ అని చెప్పుకున్న ఒక ముస్లిం పాలకుడు అకస్మాత్తుగా సెక్యులర్ గా ఎలా మారాడు? 16వ శతాబ్దంలో అక్బర్ చేసింది ఈరోజు మనం పబ్లిసిటీ స్టంట్ అనే మాత్రమే పిలుస్తాం. తన హోదాను స్థానాన్ని సామ్రాజ్య ప్రజల ముందు పెంచుకోవడానికి దిన్యే ఇలాహి మతాన్ని ప్రచారం చేయడానికి చేసిన ఒక కుట్ర మాత్రమే ఇది. అక్బర్ ఎంతమంది రాజపూత్ యువరాలను వివాహం చేసుకున్నాడో దానికి కారణం అన్ని మతాలను గౌరవించడం అనుకుంటారు కానీ అసలు విషయం అది కాదు కేవలం ఒక రాజకీయ ఒప్పందం మాత్రమే ఓడిపోయిన రాజుల నుండి రాజ్యానికి బదులుగా అక్బర్ ఈ ఒప్పందాలు చేసేవాడు. మనం సినిమాల్లో చూసే జోదా అక్బర్ ప్రేమ కథ కూడా పూర్తి అబద్ధం. వాస్తవానికి అక్బర్ కు జోదా అనే రాణి ఎవ్వరూ లేరు. అక్బర్ వివాహం చేసుకున్న అమీర్ యువరాణి పేరు ఆర్కాబాయి ఆమె తన అన్నలను అక్బర్ సైనికులు బందీలుగా పట్టుకున్నారు. అందుకే వాళ్ళని విడిపించడానికి ఈ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివాహం కూడా ఒక బలవంతపు రాజకీయ ఒప్పందం మాత్రమే ప్రేమకు ఎక్కడ తావు లేదు. అక్బర్ చేసిన యుద్ధాల వెనక కేవలం రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశం మాత్రమే ఉందా లేదు. ఆ యుద్ధాల వెనకే దాగిన మరో క్రూరమైన చీకటి కోరిక ఉంది. ఓడిపోయిన రాజుల భార్యలను తన హరే లోకి తీసుకురావడం. హరేమ్ అంటే అక్బర్ మహల్ లోని ఒక ప్రదేశం. ఇందులో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందరో స్త్రీల జీవితాలకు సమాధిగా మారింది ఈ హరే. విన్సెంట్ స్మిత్ తన అక్బర్ ది గ్రేట్ మొగల్ పుస్తకంలో అక్బర్ స్త్రీల పట్ల అపరితమైన కోరికను కలిగి ఉండేవాడని రాసుకని వచ్చాడు. ఇది కేవలం కోరిక కాదు ఒక వికృతమైన వ్యసనంగా చెప్తారు చరిత్రకారులు. చరిత్ర రికార్డుల ప్రకారం అక్బర్ తన సంరక్షకుడు అయిన భైరాం ఖాన్ మరణించిన తర్వాత అతని భార్య సలీమా సుల్తాన్ బ్యాగంను బలవంతంగా నిట్టా చేసుకున్నాడు. ఇది ఒక రాజరికం పేరుతో జరిగిన దారుణమైన అత్యాచారం. అక్బర్ హరన్ లో ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలుసా 5000 మందికి పైగా వారిలో కేవలం 300 మంది మాత్రమే అక్బర్ భార్యలు. మిగిలిన వారంతా దాసీలు, ఖీజాలు మరియు లైంగిక బానిసలు. ప్రతి యుద్ధం తర్వాత ఆ హరేం పరిమాణం పెరుగుతూ వచ్చేది. ఇంకా దారుణం ఏంటంటే యుద్ధం ముగిసిన తర్వాత అక్బర్ సైనికులు రాణుల మృతదేహాలతో కూడా లైంగిక దుర్వినియోగానికి పాల్పడేవారు. ఈ కారణం మూలంగా ముస్లిం పాలకులు యుద్ధంలో గెలిచిన తర్వాత రాజపుతాని మహిళలు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి తమ దేహాలు అపవిత్రం కాకుండా చూసుకోవడం కోసం అగ్నిగుండంలో దూకి ప్రాణాలు అర్పించేవారు. ఎందుకంటే అందమైన రాణుల శవాలను కూడా వదిలేవారు కాదు వాళ్ళు. ఆ షాహీం హరేన్ లోపల అక్బర్ తప్ప ఇంకో వ్యక్తికి అనుమతి లేదు. ఎక్కడ హరేన్ లోని స్త్రీలు రహస్యంగా ఎవరినైనా కలుస్తారేమో లేదా ఎవరైనా రహస్యంగా లోపలికి వచ్చేస్తారేమో అనే భయంతో అక్బర్ హరేం పై కఠినమైన కాపలా పెట్టాడు. ఆ కాపలా చేసే సైనికులు కూడా మగాళ్ళు కాదు. హరేం భద్రత కోసం అక్బర్ ట్రాన్స్ జెండర్లను నియమించాడు. వీరికి ప్రత్యేక సైనిక శిక్షను ఇచ్చేవారు. అంతేకాదు ఇతర సైనికుల కంటే బలంగా క్రూరంగా ఉండేవారు వీళ్ళు. హరే లోని స్త్రీలు వీరిని చూసి భయపడేవారు. ఈ ట్రాన్స్జెండర్లు వేరు వేరు నేపథ్యాల నుండి వచ్చారు. మరి కొంతమందిన అయితే కావాలనే నపుంసుకులను చేసి అక్కడ కాపలా పెట్టేవారు. మొగల్ హరే లో పరదా పద్ధతి కూడా ఉండేది. దాని ప్రకారం అన్ని రాణులు హరేలో తమకంటే పెద్ద మహిళల ముందు ముసుకు ధరించాల్సిందే. అంతే కాదు పెళ్లైన కొన్ని సంవత్సరాల వరకు వారు హరేమ్ లో పెద్దవారితో నేరుగా మాట్లాడడానికి కూడా అనుమతి ఉండేది కాదు. అక్బర్ హరేన్ లో ఇలాంటి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అవి హరేన్ లోపలే పూడ్చివేయబడ్డాయి. చారిత్రిక రికార్డుల ప్రకారం సతీ సహగమనాన్ని నిషేధించేవాడు. కానీ వాస్తవానికి ఏం చేసేవాడో తెలుసా? అక్బర్ మనుషులు ఏదైనా అందమైన స్త్రీ సతీ సహగమనం చేసుకోబోతున్నప్పుడు చూసి వారు ఆమెని బలవంతంగా ఆపి హరే లోకి తీసుకొచ్చేవారు. ఇది నిషేధం కాదు బలవంతపు వ్యభిచారం అనే చెప్పాలి. తరువాత అక్బర్ ఆమెను అనుభవించేవాడు. అక్బర్ క్రూరత్వం ఇక్కడితో అయిపోలేదు. ఇలాంటి అనేక ఇతర కోణాలు చాలా ఉన్నాయి. అవి బహుశా ఎప్పుడూ వెలుగులోకి రాకపోవచ్చు. అక్బర్ గురించి రాసిన చాలా మంది చరిత్రకారులు అక్బర్ తన పాలన ప్రారంభంలో అనిచివేతలు చేసినప్పటికీ తన పాలన రెండవ భాగంలో అతను ప్రపంచానికి సహనం మరియు లౌకికవాదానికి ఒక ఉదాహరణ చూపించాడని అంటారు. అక్బర్ తన పూర్వీకులు మరియు వారసులతో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు. అక్బర్ ఇతర మొగల్ పాలకుల కంటే తక్కువ మంది హిందువులని చంపాడు. తప్పు దేవాలయాలని ధ్వంసం చేశాడు. అందువల్లే ఇతన్ని మిగిలిన మొగల్ రాజుల కంటే కొంచెం బెటర్ అని భావిస్తారు. అంతేకానీ అక్బర్ గ్రేట్ మాత్రం కాదు. అక్బర్ ఎప్పటికీ క్రూరుడే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
No comments:
Post a Comment