[2/7/2024, 11:20] +91 73825 83095: *_🌹HIGH BLOOD PRESSURE.🌹_*
*_"హై బీపీ."_*
*_హై బీపీ కంట్రోల్ చేసుకోకపోతే కిడ్నీలు దెబ్బ తినడం ఖాయం._*
*_పెరుగుతున్న హై బీపీ పరిస్థితి శరీరంలోని అనేక భాగాలకు హానికరం._*
*_సాధారణంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం అని పిలుస్తారు._*
*_అయితే ఇది మీ కళ్ళు, మూత్రపిండాలు నరాలకు సంబంధించిన సమస్యలను కూడా పెంచుతుంది._*
*_హై బీపీ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి._*
*_అయితే ఈ సమస్య తరచుగా కొనసాగితే, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు._*
*_బీపీ (BP) 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే హై బీపీ గా పరిగణిస్తారు._*
*_హై బీపీ వల్ల గుండె, మెదడు, కిడ్నీ, కళ్లు వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు._*
*_శుభవార్త ఏమిటంటే.. చాలా సందర్భాలలో మీ హై బీపీ ను కంట్రోల్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యల ముప్పును తగ్గించవచ్చు._*
*_హై బీపీ సమస్యలో సాధారణ ఇంటి నివారణలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి._*
*_హై బీపీ ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం..?_*
*_" హై బీపీ లక్షణాల గురించి తెలుసుకోండి " :_*
*_అధిక హై బీపీ విషయంలో చాలా సందర్భాలలో ఎటువంటి లక్షణాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు._*
*_అయితే, కొంతమందికి తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం, నెర్వస్‌నెస్, ఛాతీ నొప్పి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు._*
*_అటువంటి సమస్యలను సకాలంలో గుర్తించడం వాటిని నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం అవసరం._*
*_నిరంతర అధిక హై బీపీ ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు._*
*_దీని నివారణకు ఈ మూడు చర్యలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి._*
*_" ఆహారంలో సోడియం తక్కువగా ఉండేలా చూడండి " :_*
*_సోడియం (ఉప్పు) అధికంగా తీసుకోవడం వల్ల హై బీపీ పెరగడానికి కారణం కావచ్చు._*
*_ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునే వ్యక్తులు అధిక హై బీపీ కు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు._*
*_అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ( AMERICAN HEART ASSOCIATION )నుండి నిపుణుల సిఫార్సుల ప్రకారం, ఒక రోజులో 2,300 మిల్లీగ్రాముల (ఒక టేబుల్ స్పూన్) ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు._*
*_ఇది హై బీపీ ప్రమాదానికి దారితీస్తుంది._*
*_" క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి " :_*:
*_శారీరక శ్రమ వ్యాయామాలు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి._*
*_హై బీపీ ని నియంత్రించడంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది._*
*_నరాలు , గుండె ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం అలవాటును సృష్టించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు కనుగొన్నారు._*
*_ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ రోజూ 10 నిమిషాల వ్యాయామం చేయాలి._*
*_" పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం " :_*
*_పొటాషియం గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి హై బీపీ స్థాయిలను నియంత్రించడానికి ఉత్తమమైన ఖనిజాలలో ఒకటి._*
*_ఇది ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది._*
*_రక్తనాళాల గోడలలో ఒత్తిడిని తగ్గించడానికి పొటాషియం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది._*
*_అరటి, టొమాటో, అవకాడ, పాలు, పెరుగు, బీన్స్, నట్స్ మొదలైన వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది._*
*_సిగరెట్స్, ఆల్కహాల్ పూర్తిగా మానివేయాలి._*
*_" -మీ శ్రేయోభిలాషి...🌹🙏_*
*_-మీ..డా,, తుకారం జాదవ్.🙏_*
[2/8/2024, 20:38] +91 73825 83095: *_కంటి క్రింద నల్లటి వలయాలా...?_*
*_కంటి కింద వలయాలు కాలేయపు బలహీనతను కూడా సూచిస్తుంది. మీరు ఎక్కువగా ఈ ఫోను వాడకంలో పడి శారీరక శ్రమని తగ్గించి ఉండవచ్చు దానివల్ల కూడా కాలేయం పనితీరు మందగిస్తుంది నిద్ర లేకపోయినా కాలేయం పనితీరు మందగిస్తుంది కాలేయం పనితీరు_* *_మందగించినప్పుడు నిద్ర కూడా పట్టదు కాలేయానికి నిద్రకి అవినాభావ సంబంధం ఉంది._*
*_కల్లక్రిండ నల్లటి వలయాలు అనేవి కళ్ళ కింద ఏర్పడే నల్లటి మచ్చలు. వీటిని "పిగ్మెంటేషన్" అని కూడా అంటారు. కల్లక్రిండ నల్లటి వలయాలు చాలా మందిలో సాధారణం, అయితే అవి కొన్నిసార్లు ఆందోళనకరమైన సమస్యల సంకేతంగా ఉండవచ్చు._*
*_కల్లక్రిండ నల్లటి వలయాలకు కారణాలు:-_*
*_1.-జన్యుపరమైన కారణాలు:-_*
*_కొంతమంది వ్యక్తులకు కల్లక్రిండ నల్లటి వలయాలు వంశపారంపర్యంగా వస్తాయి._*
*_అలసట: అలసట కల్లక్రిండ నల్లటి వలయాలకు దారితీస్తుంది._*
*_2.-నిద్రలేమి:-_*
*_నిద్రలేమి కూడా కల్లక్రిండ నల్లటి వలయాలకు కారణమవుతుంది._*
*_3.-అధిక రక్తపోటు:-_*
*_అధిక రక్తపోటు కళ్ళ కింద నీటిని నిలుపుకుని, కల్లక్రిండ నల్లటి వలయాలకు దారితీస్తుంది._*
*_4.-హైపోథైరాయిడిజం:-_*
*_హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల కలిగే ఒక పరిస్థితి. ఇది కల్లక్రిండ నల్లటి వలయాలకు దారితీస్తుంది._*
*_అలెర్జీలు: అలెర్జీలు కళ్ళ కింద వాపును కలిగిస్తాయి, ఇది కల్లక్రిండ నల్లటి వలయాలకు దారితీస్తుంది._*
*_కళ్ళ కింద చర్మం యొక్క_*
*_5.-దుర్బలత్వం:-_*
*_కళ్ళ కింద చర్మం చాలా చిన్నది మరియు సన్నగా ఉంటుంది. ఇది చర్మం ద్వారా రక్తం మరియు కొవ్వును చూడటానికి దారితీస్తుంది, ఇది కల్లక్రిండ నల్లటి వలయాలకు దారితీస్తుంది._*
*_కల్లక్రిండ నల్లటి వలయాలను తగ్గించడానికి కొన్ని సలహాలు:-_*
*_1 పర్యాప్తంగా నిద్రపోండి:-_*
*_రోజుకు 7-8 గంటల నిద్ర పడుకోండి._*
*_తగినంత నీరు తాగండి: రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగండి._*
*_ఆరోగ్యకరమైన ఆహారం తినండి: ఆకుకూరలు, పండ్లు మరియు పూర్తి ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినండి._*
*_2సూర్యుడి నుండి రక్షించుకోండి:-_*
*_సూర్యుడి నుండి మీ కళ్ళను రక్షించడానికి సన్‌స్క్రీన్ మరియు సన్‌గ్లాసెస్‌ను ఉపయోగించండి._*
*_3 కళ్ళ కింద చర్మాన్ని పోషించండి:-_*
*_కళ్ళ కింద చర్మానికి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి._*
*_కల్లక్రిండ నల్లటి వలయాలు మీకు ఆందోళన కలిగిస్తే, మీ వైద్యుడిని_*
*_సంప్రదించండి. వారు మీకు మీ నల్లటి వలయాలకు కారణాన్ని నిర్ధారించడంలో మరియు మీకు సరైన చికిత్సను సూచించడంలో సహాయపడతారు. మీ డాక్టరుగారు చెప్పిన సూచనలను తప్పక పాటించండి, డాక్టర్లు ప్రత్యేకంగా మన ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికే తర్ఫీదు పొందుతారు కనుక వారి కన్నా మంచి పరిష్కారాలు సూచనలు ఎవరూ ఇవ్వలేరు._*
[2/10/2024, 16:44] +91 73825 83095: *_🩺"మధుమేహం రాకుండా ముందే.... మేల్కొందాం"!🩺_*
*_షుగర్ వ్యాధిని ఆధునిక యుగపు మహమ్మారిగా భావించవచ్చు. అత్యంత వేగంగా పరుగెడుతున్న కాలంతో పాటే అనివార్యంగా జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే షుగర్ వ్యాధికి అసలు కారణం. మౌలికంగా ఇది జీవన శైలి సమస్య. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడం మన చేతుల్లో పనిగానే భావించాలి!_*
*_"ఎందుకొస్తుంది"?_*
*_సాధారణంగా, క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను సక్రమంగా స్రవించకపోవడం, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం తలెత్తుతుంది. ఎవరిలోనైనా, ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.అధిక బరువు, స్థూలకాయం, పొట్టలో చేరిన కొవ్వులే దీనికి ప్రధాన కారణం. కొందరిలో ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అయినా, దాన్ని వినియోగించుకునే సామర్థ్యం (ఇన్సులిన్ సెన్సిటివిటీ) తగ్గిపోతుంది. ఇది కూడా మధుమేహానికి మూలమవుతుంది. అయితే బరువు తగ్గడం, క్రమం తప్పని వ్యాయామాలతో ఇన్పులిన్ సెన్సిటివిటీని పెంచుకోవచ్చు. కానీ, అత్యధికులు ఈ విషయంలో అశ్రద్ధగానే ఉంటున్నారు._*
*_"ప్రీ - డయాబెటిస్ అంటే".._*
*_ఇది మధుమేహానికి పూర్వదశ. రక్తంలో చక్కెర స్థాయి 140 నుంచి 199 మి.గ్రా. లకు చేరడాన్ని ‘ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్’ లేదా‘ ప్రీ డయాబెటీస్’ అంటారు._*
*_రక్తంలో చక్కెర స్థాయి 200 మి. గ్రాములు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ‘టైప్ -2 షుగర్ వ్యాధిగా పేర్కొంటారు. ప్రీ- డయాబెటీస్‌ని బోర్డర్ లైన్ డయాబెటి్‌స్‌గానూ పేర్కొంటారు.. అయితే, ప్రీ- డయాబెటిస్ దశలో ఉన్నవాళ్లందరూ కచ్ఛితంగా టైప్-2 మధుమేహ వ్చాధిగ్రస్థులుగా మారతారని చెప్పలేం. కాకపోతే, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో ఉన్నవారితో పోలిస్తే, ‘ప్రీ- డయాబెటీస్’ తో ఉన్నవాళ్లకు మధుమేహం సంక్రమించే అవకాశాలు 5 నుంచి 15 రెట్లు ఎక్కువ. భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసిఎంఆర్) ప్రకారం మనదేశంలో ‘ప్రీ- డయాబెటిస్’తో ఉన్నవాళ్ల సంఖ్య 7 కోట్ల 72 లక్షలు._*
*_"ఏమిటా కారణాలు"..?_*
*_అధిక బరువు, స్థూలకాయం, శరీర శ్రమలేని జీవన విధానం, అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదల, రక్తసంబంధీకుల్లో టైప్-2 మధుమేహం ఉండడం,_*
*_4 కిలోలు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న బిడ్డలకు జన్మనిచ్చిన మాతృమూర్తులూ ప్రీ-డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ._*
*_బరువు తగ్గడం, వ్యాయామం చేయడం వంటివి చేయకపోతే, ప్రీ-డయాబెటిస్‌తో ఉన్నవాళ్లల్లో 15 నుంచి 30 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్థులుగా మారే ప్రమాదం ఉంది._*
*_"నివారించలేమా"..?_*
*_కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టైప్-2 షుగర్ వ్యాధి రాకుండా నివారించవచ్చని అనేక అధ్యయనాలు నిర్థారించాయి._*
*_అలాంటి జాగ్రత్తల్లో..._*
*_జీవన శైలిని మార్చుకోవడంతో పాటు, మెట్ ఫార్మిన్, ఎకార్బోజ్ లాంటి మాత్రల్ని తీసుకోవడం ముఖ్యమైనవి._*
*_ఇంజెక్షన్లలో... ఇన్సులిన్‌లు, ఇన్సులిన్ ఎనలాగ్‌లు, జి. ఎల్. పి- 1 ఎగోనిస్టులు వాడటం._*
*_"కొత్త రకం ఇన్సులిన్‌లు, ఇంజెక్షన్లు"..._*
*_కొత్త రకం ఇన్సులిన్‌లను, ‘ఇన్సులిన్ ఎనలాగ్స్’ అని కూడా అంటారు. ఇవి జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో తయారైనవి. కాబట్టి వీటిని ‘ డిజైనర్ ఇన్సులిన్స్’ అని కూడా అంటారు. ఇన్సులిన్ ఎనలాగ్‌లతో ఒనగూడే ప్రయోజనాలు అనేకం._*
*_వాటిల్లో"..._*
*_ఎనలాగ్‌లు రక్తంలోని చక్కెర స్జాయిని సమర్థంగా నియంత్రిస్తాయి. అలాగని చక్కెర అత్యల్ప స్థాయికి పడిపోయేలా చేయవు._*
*_భోజనానికి అరగంట ముందు ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో అల్పాహారం తీసుకోవాల్సిన పని లేదు._*
*_ఇన్సులిన్ ఎనలాగ్స్‌తో బరువు పెరగడం గానీ, ఇతర దుష్ప్రభావాలు గానీ ఏమీ ఉండవు. ఇన్సులిన్ ఎనలాగ్‌లతో పాటు మార్కెట్‌లో పలురకాల కొత్త ఇతర ఇంజెక్షన్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి._*
*_సగటున రెండు, మూడు నెలల చక్కెర స్థాయి ఆధారంగా చేసే, హెచ్.బి.ఏ.1 సి పరీక్ష ద్వారా కూడా ప్రీ- డయాబెటిస్ ని గుర్తించవచ్చు. ప్రీ- డయాబెటిస్‌లో హెచ్.బి.ఏ.1.సి స్థాయి 5.7 నుంచి 6.4 దాకా ఉంటుంది._*
*_"పదిశాతం యువతరమే"!_*
*_ప్రపంచ వ్యాప్తంగా షుగర్ పేషంట్ల సంఖ్య, 17 కోట్ల 4 లక్షలకు చేరుకుంది. మన దేశంలో ప్రస్తుతం వీరి సంఖ్య 7 కోట్లుంది. 2030 నాటికి వీరి సంఖ్య 10 కోట్ల 12 లక్షలకు చేరుకుంటుందని అంతర్జాతీయ మధుమేహ వ్యాధి సమాఖ్య (ఐ.డి.ఎఫ్) అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మనదేశం షుగర్ వ్యాధికి రాజధానిగా మారబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, మన దేశీయుల్లో 10 ఏళ్లు ముందుగానే షుగర్ మొదలవుతోంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలోని 10 శాతం యువత ఈ వ్యాధితో బాధపడుతోంది._*
*_'మధుమేహం రాకుండా"..._*
*_క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్‌ను గ్రహించలేని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య తగ్గుతుంది._*
*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*
*_- డా,,తుకారాం జాదవ్.🙏_*
*_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
[2/11/2024, 12:03] +91 73825 83095: *_కొలెస్ట్రాల్ (dyslipidemia) అంటే ఏమిటి..?_*
*_ఎందుకు వస్తుంది...?_*
*_ఏమి చెయ్యాలి..?_*
*_కొలెస్ట్రాల్ అంటే ఏమిటి...?_*
*_రక్తంలో కొంత కొవ్వు పదార్ధాలు (lipids) ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి మూడు: యల్ డి యల్ (LDL), హెచ్ డి యల్ (HDL), ట్రిగ్లీసెరైడ్ (triglyceride). ఇవి శరీరానికి అవసరం, కానీ పరిమితులలో ఉండాలి. పరిమితులు మీరి ఎక్కువలు తక్కువలు ఐతే దాన్ని కొలెస్ట్రాల్ లేదా dyslipidemia అంటారు. కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లకు యల్ డి యల్ (LDL) కానీ ట్రిగ్లీసెరైడ్ (triglyceride) కానీ ఎక్కువగా ఉండవచ్చును. లేదా హెచ్ డి యల్ (HDL) తక్కువగా ఉండవచ్చును._*
*_కొలెస్ట్రాల్ ఉంటే నష్టం ఏమిటి...?_*
*_కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు పాడవవచ్చును. దీనిని అథెరోస్క్లేరోసిస్ atherosclerosis అంటారు. ఐతే అథెరోస్క్లేరోసిస్ atherosclerosis రావటానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చును. ఇందులో ముఖ్యమైనవి బీపీ, డయాబెటిస్, ఊబకాయం, వ్యాయామలోపం, పొగాకు అలవాటు. అథెరోస్క్లేరోసిస్ Atherosclerosis వలన రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, రక్తనాళాలు పూడుకుపోవచ్చును. రక్త ప్రసరణ లోపించడం వలన హార్ట్ ఎటాక్ heart attack, స్ట్రోక్ stroke, గాంగ్రీన్ gangrene లాంటి ప్రమాదకరమైన జబ్బులు రావచ్చును._*
*_కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది...?_*
*_ప్రధానంగా జీవనశైలిని బట్టి వస్తుంది. శరీరావసరాలకు మించి తినడం, వ్యాయామం లోపించడం ప్రధాన కారణాలు. డయాబెటిస్ కూడా ఒక ప్రధాన కారణం. జంతుసంబంధమైన కొవ్వు పదార్ధాలు అంటే వెన్న, నెయ్యి లాంటివి ఎక్కువగా వాడటం కూడా ఒక కారణం కావచ్చును. కొద్ది మందికి వారసత్వ ప్రభావం వలన కొలెస్ట్రాల్ వస్తుంది. వీరు జీవనశైలి ఎంతబాగున్నా కొలెస్ట్రాల్ నుండి తప్పించుకోలేరు._*
*_నూనె ఎక్కువ వాడితే కొలెస్ట్రాల్ వస్తుందా..?_*
*_కేవలం నూనె వలన కొలెస్ట్రాల్ రాదు. మితిమీరి తింటే, ఎంత మంచి తిండి పదార్ధానికైనా కొలెస్ట్రాల్ వస్తుంది. ఐతే జంతు సంబంధమైన నూనెలు అంటే వెన్న, నెయ్యి, లాంటివి మాత్రం చెడ్డవి. డాల్డా లాంటివి కూడా చెడ్డవి. గడ్డకట్టే నూనెలు అంటే కొబ్బరి నూనె, పామాయిల్ లాంటి నూనెల్ని కాస్త తక్కువ వాడితే మంచిది. వ్యాయామం ఎక్కువగా చేసే వారు, మితంగా తినే వారూ, మంచి శరీర తత్త్వం ఉన్నవారూ, కాస్త వెన్న, నెయ్యి వాడినా ఇబ్బంది ఉండకపోవచ్చును._*
*_కొలెస్ట్రాల్ మందులు ఎవరు వాడాలి...?_*
*_1.-ఒకసారి హార్ట్ ఎటాక్ heart attack గాని, స్ట్రోక్ stroke గాని వస్తే, జీవితాంతం కొలెస్ట్రాల్ మందులు వాడాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉన్నాసరే._*
*_2.-హార్ట్ ఎటాక్ గానీ, స్ట్రోక్ గానీ వచ్చే రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా వాడాలి. రిస్కు ఉజ్జాయింపుగా తెలుసుకోవటానికి గూగుల్ లో కాలిక్యులేటర్లు ఉంటాయి. పది సంవత్సరాలలో రిస్కు 10 కన్నా ఎక్కువగా ఉంటె కొలెస్ట్రాల్ మందు వాడాలి. రిస్కును పెంచే అంశాలలో ప్రధానమైనవి: వయసు, డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, బరువు, వ్యాయామలోపం, పొగాకు._*
*_3.-డయాబెటిస్ ఉన్న వారు దాదాపు అందరూ వాడాలి._*
*_4.-యల్ డి యల్ కొలెస్ట్రాల్ LDL cholesterol గానీ ట్రిగ్లీసెరైడ్ triglyceride గానీ మరీ ఎక్కువగా ఉంటే, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ heart attack, స్ట్రోక్ stroke లాంటి ఇతర ఇబ్బందులు లేనప్పటికీ, కొలెస్ట్రాల్ మందులు వాడాలి._*
*_5.-కొలెస్ట్రాల్ కొంచెం ఉండి వేరే ఇబ్బందులు లేని వారు మందులు వాడనక్కరలేదు. దానర్ధం కొంచెం కొలెస్ట్రాల్ ఉండవచ్చునని కాదు. మందులు సాధ్యమైనంత తక్కువ వాడాలని. తిండిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం పెంచుకోవాలి._*
*_హెచ్ డి యల్ (HDL) తక్కువగా ఉంటే ఏం చెయ్యాలి:-_*
*_దీనికి మందులు పెద్దగా పనిచేయవు. తిండిని అదుపులో పెట్టుకోవాలి. వ్యాయామం చెయ్యాలి. ఊబకాయాన్ని తగ్గించుకోవాలి._*
*_-మీ శ్రేయోభిలాషి.. 💐_*
*_-మీ తుకారాం జాదవ్. 🙏_*
No comments:
Post a Comment