Monday, August 18, 2025

 *@ ఓపిక ఉండాలి బాస్ @ 44
         తేది:17/08/2025
"""""""""""""""""""""""""""""""""""""""""

మనకు తొందరగా పండ్లు కావాలని చెట్టు మునిగిపోయేలా
నీరుపోస్తే అది కాయలు కాయదు ఎదగాల్సినంత ఎదిగాక,
సీజన్ వచ్చినప్పుడే కాస్తుంది మనుషులైనా అంతే...
సమయం రావాలి వచ్చేవరకూ ఓపిగ్గా ఎదురు చూడాలి
అందుకు చక్కటి ఉదాహరణ...
టెంబా బవుమా
దక్షిణాఫ్రికాలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన బవుమా
తక్కువ ఎత్తువల్ల తరుచూ హేళనకు గురయ్యేవాడు
క్రికెట్ కి పనికిరాడనేవారు అవేమీ లెక్కచేయని బవుమా
జాతీయ జట్టులోకి చేరాలన్న సంకల్పంతో పట్టువదలని
విక్రమార్కుడిలా సాధన చేశాడు ఆడిన తొలి వన్డే మ్యాచ్
లోనే సెంచరీ సాధించాడు కొన్నాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ లో
దక్షిణాఫ్రికా జట్టుకు మూడు ఫార్మాట్లలో సారథిగా ఎంపిక
య్యాడు జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి నల్లజాతి
క్రికెటర్ గా పేరొందాడు అయినప్పటికీ కోటాలో జట్టులోకి
వచ్చాడని, ఆటగాడిగా అర్హుడు కానివాణ్ని కెప్టెన్ గా ఎలా
కొనసాగిస్తారనే విమర్శలు వచ్చాయి అవేవీ లెక్క చేయకుండా
ఆటపైనే దృష్టి సారించాడు బవుమా ఫామ్ లోకి వచ్చి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రాణించి జట్టును
గెలిపించాడు ఫైనల్లో అతడు జట్టును నడిపించిన తీరు
అద్భుతం రెండో ఇన్నింగ్స్ లో భారీ టార్గెట్ ముందున్నా,
తొడ కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ బ్యాటింగ్
చేశాడు తన నాయకత్వ పటిమతో బలమైన ఆస్ట్రేలియా
జట్టును నిలువరించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు
27 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఐసీసీ ట్రోఫీని అందించాడు
ఏడాది క్రితంవరకు బవుమాను ట్రోల్ చేసినవాళ్లు... ఇప్పుడు
ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇంతకన్నా ఏం కావాలి?
ఏ రంగంలోనైనా లక్ష్యసాధన అనుకున్నంత తేలిక కాదు
బాధలను భరించాలి, త్యాగాలు చేయాలి విమర్శలకు తలొగ్గ
కుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి
అన్నింటికీ మించి ఓపిక, సాధించగలమన్న నమ్మకం ఉండాలి
ఏదైనా అనుకుంటే అది వెంటనే జరగాలని ఆశపడతాం ఆ పని
జరగకపోతే ఇది నాకు చేతకాదేమో అని అంతలోనే నీరుగారి
పోతాం కొంతమంది అయితే అందుకు కారణాలను ఇతరులపై
నెట్టడమూ కద్దు ఇవేవీ సరికాదు
@విజయానికి ఎప్పుడూ షార్ట్ కట్స్ ఉండవు@
అన్నప్రాసన నాడే ఆవకాయ తినలేనట్లే పని
మొదలెట్టగానే ప్రథమ స్థానాన్ని అందుకోలేం క్రమం
తప్పకుండా సాధన చేయాలి సామర్థ్యాలను, నైపుణ్యాలను
పెంచుకోవాలి ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలను భరించాలి
అవాంతరాలను అధిగమించాలి అప్పుడే విజయం వెతుక్కుంటూ
వస్తుంది ఒక విజయం మరో విజయానికి పునాది వేసి కెరీర్ లో
ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది ఎంత ప్రయత్నించినా ఫలితం
దక్కట్లేదని వాపోతుంటారు కొందరు అలాంటివారు
ప్రయత్నంలో లోపం ఎక్కడుందో పరిశీలించుకోవాలి సరిదిద్దుకోవాలి
మనవల్ల కాదు, రాదు అనుకుంటే ఏదీ రాదు
ప్రయాణం కొనసాగించే వారే
@గమ్యాన్ని చేరుకోగలరు@*

No comments:

Post a Comment