*అవతార్ మెహర్ బాబా - 60*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*ద్వితీయాంధ్ర దేశ పర్యటన*
“నేనెప్పుడూ జన్మించలేదు. ఎప్పుడూ మరణించను. ఐనా ప్రతిక్షణం అనేకమైన జనన మరణాలను పొందుతుంటాను. మానవ చైతన్యము పరిపూర్ణంగా వికపించడానికి అవసరమైన ప్రగతి క్రమం లోని అసంఖ్యాకమైన ఘటాలే మాయా న్వితమైన ఈ జనన మరణాలు. ఇవి అసలైన మరణము జననము పొందుటకు ముందు అవసరమైన ఘట్టాలు. నిజమైన మరణము అహాన్ని పోగొట్టుకున్నప్పుడు, నిజమైన జననము అహంకార నాశన ఫలితంగా ఎరుకతో భగవంతుని శాశ్వత జీవనాన్ని అనుభూతి పొందడంలో కలుగు తుంది. నేను ఎల్లప్పుడు నా అనంత స్థితి లో నిరాకారుడనై సర్వోపగతుడనైయున్న ను, సాకారుడనై మీ మధ్య జన్మించుట జనన మనియు, ఈ భౌతిక రూపాన్ని విసర్జించుట మరణమనియు చెప్పబడు తున్నది. ఈ విధంగా నేను అరవై సంవత్సరాల క్రితం జన్మించాను. నా విశ్వ కార్యం పూర్తి కాగానే మరణిస్తాను. ఈనాడు మీరు నా షష్ఠ్యబ్ది పూర్తి మహోత్సవం ప్రేమతోను, ఉత్సాహంతోను, శ్రద్ధతోను జరపడం నన్ను గాఢంగా చలింప జేసాయి. మరియు మనమందరం ఒక్కటే యని, భగవంతుడే సత్యమని తదితర మంతా అసత్యమని తుదకవగాహన చేసుకొనుటకు మీకు నా ఆశీస్సుల నిచ్చు నట్లు చేసింది".
బాబా షష్ఠిపూర్తి ఉత్సవాలు దేశవిదేశాల లో కూడా చేసుకున్నారు. అందరికీ తన సందేశాన్ని, ప్రేమాశీస్సులను కేబుల్స్ ద్వారా పంపించారు. మంచెం బుచ్చి లింగప్ప శాస్త్రి రచించిన పద్యములను చదివాడు. ఇతడు బాబా ప్రార్థనను గేయ రూపంగా వ్రాసాడు. హారతి చేసే సమయం లో హారతి పళ్ళెము బాబా స్వయంగా తన చేతులతో పట్టుకొని తిప్పారు. మళ్ళీ మధ్యాహ్నం గం.3.30ని.లకు పందిట్లో దర్శనమిచ్చారు. బాబా తాడేపల్లిగూడెం లో పలుప్రేమికుల ఇళ్ళకు వెళ్ళారు. బాల గోపాల భాస్కర రాజు ఇంటికి వెళ్ళినప్పు డు అతడు ఇంట్లో లేడు. బాబా తిరిగి వస్తుండగా ఎదురయ్యాడు. బాబా అతనిని కరుణించి రెండవ మారు అతనింటికి వెళ్ళి అడిగి ఒక పాట పాడించుకున్నారు. ఆ సందర్భం కోసం ప్రత్యేకంగా వ్రాసిన 'మరచితి నా మందిరంబు' అనే పాటను భాస్కరరాజు గారు పాడి బాబాకు వినిపించారు. బాబా షష్ఠిపూర్తి ఉత్సవం జరుగుతున్న సమయంలో ధనపతిరావు ఇంటిలో పని చేసే రావలక్ష్మమ్మ అనే ఆమె బాబా పాదాలను స్పృశించి ఆయన దర్శనం చేసుకోవాలని ఎంతో ఉబలాటపడింది కాని ఆ రోజు బంధుమిత్రుల సందోహంలో డాక్టర్ గారు ఆమెను విస్మరించారు. ఈయన కూడా ధనవంతుల దేవుడేనేమో తనలాంటి నిరుపేదలకు ఆయన దర్శన భాగ్యం కలుగదేమోననే బాధతో తీరని ఆశతో కలిగిన దుఃఖాన్ని దాచుకుంటూ వెళ్ళి తన గుడిసెలో పడుకుంది. ఏమీ తోచని స్థితిలో భారంగా లేచి ఏదో పని కోసం లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ధనపతిరావు ఇంటి నుండి రహదారి బంగళాకు కారులో వెళ్ళవలసిన బాబా కారు ఎక్కకుండా కాలినడకన బయలు దేరారు. వెళ్ళి అనతి దూరంలో గల రావలక్ష్మమ్మ గుడిసెలో ప్రవేశించి మంచం పై కూర్చున్నారు. ఆ దృశ్యము చూసి రావలక్ష్మమ్మ బాబా మోకాళ్ళపై తన తల నానించి వెక్కివెక్కి ఏడ్వసాగింది. తను నిశ్చేష్టురాలైంది. మనస్సులోని కోరికను తెలుసుకొని తానే స్వయంగా తన నిరుపేద గుడిసెలోనికి వచ్చిదర్శనమిచ్చిన బాబా సర్వజ్ఞత్వానికి, కరుణకు ఆనందాతి శయంతో పొంగిపోయింది. సర్వ హృదయజ్ఞుడైన బాబాకు తెలియని దేముంది? ఆయనకు కావలిసినది నిర్మలమైన ప్రేమయే గాని పేద, ధనిక ఆడంబరాలు గావని ఆమెకు, అందరికీ తెలియజేసారు బాబా.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
బాబా 26.02.54 రోజు మధ్యాహ్నం తాడేపల్లిగూడెం నుండి బయలుదేరి రామచంద్రాపురం వెళ్ళి అక్కడ రామ భద్రరాజు గారింట్లో దర్శనమిచ్చి అక్కడి నుండి గోపాలపురం వెళ్ళారు. అక్కడ ప్రత్యేకంగా వేసిన పందిట్లో కూర్చుని దర్శనమిచ్చారు. ప్రారంభంలో బాబాకు హారతి ఇవ్వగానే వర్షం కురిసింది. బాబా వేదికపై నిలబడి అందరినీ కూర్చోమని చెప్పారు. వేల జనం చుట్టు ప్రక్కలగ్రామాల నుండి వచ్చారు. సాయంత్రం గం.4.30లకు గోపాలపురం నుండి నిడదవోలు వెళ్ళారు. నిడదవోలులో దాదాపు 5000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. బాబా కొంత మంది ప్రేమికుల ఇళ్ళకు కూడా వెళ్ళారు. కె.డి.ఆర్. ఎమ్ లో సభ్యులైన మల్లికార్జున రావు మరియు కుటుంబ శాస్త్రి ఇళ్ళకు వెళ్ళారు. నిడదవోలు కార్యక్రమం వాళ్ళే ఏర్పాటు చేసారు. బాబా ఏర్పరచిన ట్రస్ట్ కి బాబా నియమించిన మొదటి ఛైర్మన్ కుటుంబ శాస్త్రి గారే.
నిడదవోలు నుండి బాబా కొవ్వూరుకు వెళ్ళారు. రాత్రి 8 గంటలకి కొవ్వూరు చేరుకున్నారు. కొవ్వూరులో రామలింగేశ్వర రావు అనే న్యాయవాది ఇంటిలో ప్రత్యేకంగా వేసిన పందిట్లో అక్కడికి చేరిన వారికి బాబా దర్శనమిచ్చారు. ఆంధ్ర పర్యటనలో రామలింగేశ్వరరావు బాబాను అడిగి ఆయన అనుమతితో ప్రైవేట్ సెక్రటరీగా వ్యవహరించారు. తరువాత గోదావరి దగ్గర మెహెర్ స్థాన్ నిర్మించిన స్థలం దగ్గర వేసిన పందిట్లో బాబా రాత్రి గం.9.30లకు దర్శనమిచ్చారు. ప్రకాశంతో వెలిగిపోతున్న సుందర వదనాన్ని చూచి చాలామంది ఆకర్షితులైనారు. బయట బాణాసంచా పేల్చుతున్నా పందిరివదిలి ఎవరూ వెళ్ళలేదు. బాబావైపు చూస్తూ కూర్చున్నారు. ఆ తర్వాత మండలి వారికి, బాబాకు మూడు ప్రత్యేకమైన లాంచీలలో రాత్రి బస ఏర్పాటు చేసారు. అందరూ ఎక్కిన తర్వాత లాంచీలను గోదావరిలో రాజమండ్రి వైపుకు తీసుకొని వెళ్ళారు. కొవ్వూరు రేవులో ఉంటే కొత్త దర్శనార్థు
లందరూ బాబాకు విశ్రాంతి లేకుండా చేస్తారనే ఉద్దేశంతో అలా చేసారు. మండలి వారు చాలా సంతోషపడి గోదావరిలో లాంచీలలో నిద్రపోయే ఏర్పాటుకు ఆనందించారు. మెహెర్ స్థాన్ నిర్మించిన శ్రీ కోడూరు కృష్ణారావుగారే ఈ ఏర్పాటు చేసారు.
27.02.54 తేదీన ఉదయం గం. 8.30లకు బాబా లాంచీ నుండి దిగి పందిట్లోకి వెళ్ళి అక్కడ చేరిన దాదాపు 2000 మందికి దర్శనం ఇచ్చి ప్రసాదం పంచిపెట్టారు. కొవ్వూరులో బాబా కొంతమంది ప్రేమికుల ఇళ్ళకు వెళ్ళారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
27.02.54 బాబా కొవ్వూరు నుండి రాజమండ్రికి వెళ్ళారు. అక్కడ బాబా బస గురుకుల విద్యాలయాశ్రమంలో ఏర్పాటు చేసారు. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమానికి వెళ్ళారు. పురజనులు, ప్రముఖులు, సబ్ కలెక్టర్ మొదలగు ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరూ దాదాపు 6000 మంది దర్శనం చేసుకున్నారు. 'ఆలయాలు చర్చీలు, మసీదులు నిర్మించుకునే బదులు హృదయంలో ప్రియతముడైన దైవానికి ఆలయ మేర్పరచుకుంటే, యాంత్రికంగా చేసే కర్మకాండలకు బదులు తోటి మానవులకు ప్రేమతో నిస్వార్థంగా అందరిలో ఉన్న ఆ భగవంతునికి చేస్తున్నామనే భావనతో సేవజేస్తే నా పని పూర్తి అయినట్లే' నని చెప్పారు బాబా.
మరునాడు అనగా 28.02.54 రోజు గురుకుల విద్యార్థులతో కొంత సమయాన్ని గడిపి వారికి తన దర్శనం ఇచ్చి కొన్ని సందేశాలను ఇచ్చారు. ఆ తర్వాత గం 8.55 ని.లకు బయలుదేరి అమలాపురం వెళ్ళారు. దారిలో ధవళేశ్వరంలో కెనాల్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరంబు నాథన్ పిళ్ళై ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్నవారికి దర్శనమిచ్చి అమలాపురం బయలుదేరారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment