Monday, August 25, 2025

“నేనే లేకపోతే…” అనే* *ఆలోచన ఒక్క క్షణం మనసులో మెదిలినా....

 🕉️🦚🌹🌻💎💜🌈

*🍁“నేనే లేకపోతే…” అనే* *ఆలోచన ఒక్క క్షణం మనసులో మెదిలినా –* 
 *గుర్తు పెట్టుకోండి, మీరు* *లేకున్నా ఈ లోకం తన రీతిలోనే నడుస్తుంది..* 
 *ఎవరూ ఆగిపోరు, సమయం ఆగిపోదు..* 
 *పాత నీరు సముద్రంలో కలిసిపోతూనే ఉంటుంది, కొత్త నీరు వచ్చిపడుతూనే ఉంటుంది..* 
 *మనమో లేకపోతే ప్రపంచం ఇంకా ప్రశాంతంగానే ఉంటుంది..* 

 *ఒక కంపెనీ, సంస్థ, ఇల్లు, సంబంధం – దేనిలోనైనా ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారు..* 
 *“నేను లేకపోతే ఈ ఆఫీస్‌… ఈ ఇల్లు… ఈ దేశం… ఎలా నడుస్తుంది?”* 
 *అని మనం అనుకోవచ్చు. కానీ నిజం ఏంటంటే – ఏదీ ఆగిపోదు..* 
 *జీవితం సాగే రైలు, మనం ఎక్కినా లేకపోయినా అది ముందుకు కదులుతూనే ఉంటుంది..* 

 *మన ప్రత్యేకత వల్ల, మన ఆలోచనల వల్ల, మన పనితనంతో మన స్థానంలో ఒక వెలుగులా నిలుస్తాం..* 
 *అందుకే మన విలువ మరచిపోలేనిది.* 
 *కానీ కాలం ఎప్పటికీ మనకోసమే ఆగిపోదు..* 
 *ఒక రోజు మన సమయం పూర్తయిపోతుంది..* 
 *ఆ క్షణం వచ్చినప్పుడు మన స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారు..* 

 *రిటైర్మెంట్‌ రోజు – మనం కన్నీటి మాటలు చెబుతుంటే,* 
 *మన ఐడీ కార్డు డి-యాక్టివేట్‌ అవుతుంది,* 
 *మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మారిపోతుంది.* 
 *మన డెస్క్‌ ఖాళీ అవుతుంది..*
*సహచరులు చప్పట్లు కొడతారు, “మిస్‌ అవుతాం” అంటారు..* 
 *కానీ అదే సమయానికి, మన తర్వాతి వ్యక్తి పార్టీ ప్లాన్‌ చేస్తుంటాడు..* 
 *వీడ్కోలు ముగిసిన తర్వాత అందరూ తమ తమ దారుల్లోకి వెళ్తారు…* 
 *మనకోసం ఆగిపోరు..* 

 *ఆ తర్వాత జీవితం మన ఇంట్లోనే గడుస్తుంది..* 
 *ఆఫీస్‌ నుంచి సలహా కోసం ఎవరూ రారు..* 
 *సలహా కావాలంటే చాట్‌జీపీటీని అడుగుతారు..* 
 *ప్రపంచం పరుగెడుతూనే ఉంటుంది.* 
 *మన కళ్ల ముందు క్షణాల్లో మారిపోతుంది..* 

 *స్టీవ్‌జాబ్స్‌నే ఆయన సొంత కంపెనీలో రెండుసార్లు మార్చేశారు..* 
 *జీవితమంతా మనకే మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..* 
 *పదవి, విజయాలు, గుర్తింపు – ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ మనకోసం ఉంటారు..* 
 *తర్వాత మాత్రం మనల్ని మరిచిపోతారు..* 

 *“నేనే లేకపోతే…” అని ప్రతి అత్తగారు అనుకుంటుంది..* 
 *కానీ కొత్త కోడలు వస్తే,* 
 *ఆమె ఇల్లు ఇంకా బాగా చూసుకుంటుంది..* 
 *ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం అవమానం కాదు..* 
 *అదే – మీ పని పూర్తయ్యిందని అర్థం..* 

👉 *మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపండి..* 
 *కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి..* 
 *కొత్త సవాళ్లను స్వీకరించండి..* 
 *మీరు మీకే గౌరవం ఇవ్వండి..* 
 *ఆఫీస్‌ భారాన్ని మరచి,* 
 *హాలీడేకు వెళ్ళండి,* 
 *మీ పెంపుడు జంతువులతో ఆడుకోండి..* 

 *పవర్‌, మనీ, సక్సెస్‌ – ఇవి శాశ్వతం కావు.* 
 *అవి ఉన్నప్పటికీ గర్వించకండి, లేనప్పటికీ బతకడం నేర్చుకోండి..* 

👉 *“నేనే లేకపోతే…” అనే ఆలోచన వస్తే ఒక్కటే గుర్తు పెట్టుకోండి –* 
 *మీరు లేకపోయినా ఈ లోకం ప్రశాంతంగానే ఉంటుంది.* 
 *ఏదీ ఆగదు… పాత నీరు పోతూనే ఉంటుంది… కొత్త నీరు వస్తూనే ఉంటుంది…* 
 *జస్ట్‌ – లైఫ్‌. ఇట్‌ హాపెన్స్‌.!!* 

🕉️🦚🌹🌻💎💜🌈

No comments:

Post a Comment