Sunday, August 10, 2025

 112a;118e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.190.
నేటి...

              *ఆచార్య సద్బోధన*
                  ➖➖➖✍️
```
భగవంతుని సృష్టిలో ప్రతి మనిషి లోకసేవకుడే.    

ప్రతివాడు దైవముచే ఎన్నుకోబడినవాడే!    

కానీ మనమే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షితులమై భగవంతుడు మనకు అప్పగించిన పనిని మరచిపోతున్నాము.   

భగవంతుడు మనకు అప్పగించిన కర్తవ్యం పట్ల మనం చాలా శ్రద్ధగా ఉంటూ మన కర్తవ్య కర్మలను ఏమాత్రం అశ్రద్ధ లేకుండా నిర్వర్తించాలి. 

లోకమును సేవిస్తూ లోకేశ్వరుని సేవిస్తుండాలి. మనం భగవంతుని ఆశీస్సులను పొందదలచినపుడు ఆయన సూచించిన ప్రతి చిన్నమాట మన హృదయంలో హత్తుకుపోవాలి. 

దానికి అనుగుణంగా మనం వర్తించాలి. ఆయన సంకల్పం పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి.   మన సమస్యల గురించి మనకంటే 
ఆ భగవంతునికే ఎక్కువగా తెలుసు కాబట్టి, మళ్ళీ మళ్ళీ ఆయనకు చెప్పుకోనక్కరలేదు.   వాటి గురించి దిగులు పడనక్కరలేదు. ఆయనపై భారం వేసి, ప్రార్థిస్తూ మన కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మన యోగక్షేమాలను తానే చూసుకుంటాడు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment