Monday, August 25, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

            *ఆచార్య సద్బోధన*
                ➖➖➖✍️

*శ్రీవేంకటేశ్వరా!*
బలముంటే జన్మ ఫలించినట్లే. కామక్రోధాదులు లేక అణగి ఉండడమే తాను వివేకాన్ని పొందే ఉపాయం. అభిమానంతో జీవించడమే ఒక గొప్ప సంపద. సిగ్గుతో బ్రతకడమే మంచి జీవనం. 

వినయం గలిగి మాట్లాడటమే అన్నింటినీ వశం చేసుకోగలగడం. వ్యవహారంలో ఉన్న ఆచారాన్ని  పాటించడమే పెద్దబలం. దానం చేయడం అంటే ధనాన్ని మరో మంచి జన్మ కోసం దాచుకోవడమే. మంచి వాళ్ళ తోడి  స్నేహం సౌఖ్యాన్ని కలిగిస్తుంది. 

కాబట్టి పండితులైన వాళ్ళు ఈ గుణాలను విడిచిపెట్టకుండా, 
స్వామీ! శ్రీవేంకటేశ్వరా! ఎల్లప్పుడూ మనసారా మిమ్మల్ని ధ్యానిస్తూ సేవిస్తారు. 

అందుకని సద్గుణాలతో జీవిస్తూ పరమాత్ముణ్ణి బుధులు సేవించాలి.
*శరణాగత వత్సలా..*
              *గోవిందా....గోవింద*✍️

🙏 **సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment