*ఒక స్త్రి ఇంటి పని అంతా ముగించుకుని తన భర్త చేస్తున్న కొలిమి వద్దకు ఒక పెద్ద ఇనుపను రోజు మోసుకెళ్ళేది.*
*దారిలో ఎదురొచ్చిన ముగ్గురు ఆడవాళ్ళు ఆ అమ్మాయిని ఆపి,*
*నీ భర్త చాలా సోమరి నీదగ్గర పని చేయించుకుంటున్నాడు అంది..*
*మరొక ఆమె నీ భర్త చాలా కఠినాత్ముడు నీతో ఇంత బరువును మోయిస్తున్నాడు అంది.*
*నువ్వు ఏమీ ఎదురుచెప్పని అమాయకురాలివి. ఇల్లు పిల్లలు అని పని అయ్యాక ఈ పని చేస్తున్నావు. ఇలా కష్టపడి కష్టపడి నువ్వొకరోజు చనిపోతే, నీ భర్త మరొక అమ్మాయిని పెళ్లిచేసుకుని ఉంటాడు.*
*కుటుంభం కోసం నువ్వింత చేసావని గుర్తుంచుకుంటాడా అని హేళనగ చెబుతూనే నూరిపోసారు.*
*వారి మాటలకు ఆ అమ్మాయి అవునా నా భర్త సోమరి కాదు నేను ఇప్పుడే అతడిని ఈ ఇనుపను మోయడానికి పంపిస్తాను కాస్త వేచి చూడండి ఇక్కడే అని చెప్పి ఇంటి ముఖం పట్టింది.*
*వాళ్లు ముగ్గురు ఆ అమ్మాయి భర్త వస్తాడని ఎదురుచూస్తుండగా ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది.*
*వాళ్లు పగలబడి నవ్వి ఏంటి నీ భర్త రాలేదా, చేయనని చెప్పాడా అని అడిగారు.*
*అలా ఏం లేదు, నేను వచ్చే హడావిడిలో ఇంటి కిటికీలు వేయడం మరిచాను, ఇక్కడ ఇనుపకు మిమ్మల్ని కాపలాగా పెట్టి ఇంటి కిటికీలు మూసి భద్ర పరచడానికి వెళ్ళాను.*
*మీరు చెప్పారని నేను ఆయన గొడవ పడలేము.*
*మా బాధ్యతలు ఏమో మాకు తెలుసు*
*నా భర్త ఏంటో నాకు తెలుసు.*
*ఎవరో ఏదో అన్నారని ఆ విషయాలను పట్టించుకోను అంటూ తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయింది.*
*ఇతరుల విషయాలలో తల దూర్చడం మానేస్తే బాగుంటుంది. లేదంటే ఇలాగే అవమాన పడాల్సి వస్తుంది...*
No comments:
Post a Comment