*_✍️ గుండె - రక్తనాళాల వ్యాధులు - అద్భుతమైన ఆయుర్వేద పరిష్కరాలు - పూర్తి వివరణ:-_*
*_ఈ మధ్య ఈ సమస్యతో చాలామంది సమస్య ముదిరాక ఆసుపత్రిలో చేరి ప్రాణాలను చేజార్చుకున్న సందర్భాలు చాలా చూస్తున్నాము. అందుకే ఈ సమస్య గురించి పూర్తి అవగాహన కలిగించేందుకు అన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయచేసి కొంచెం ఓపిక పెట్టి పోస్టు మొత్తం చదివి అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు పాటించి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోగలని విజ్ఞప్తి._*
*_👉శరీరంలో గుండె అతిముఖ్యమైన భాగం. ఇది మనిషి శరీరంలో ఎడమవైపున ఛాతీ భాగంలో ఉంటుంది. దీనిలో నాలుగు గదులు ఉంటాయి._*
*_👉పైన ఉన్న రెండు గదులను ఆరికల్స్ లేదా ఆట్రియా (auricles or atria) అంటారు. క్రింది భాగంలో ఉన్న గదులను వెంట్రికల్స్ (ventircles) అంటారు._*
*_👉 గుండె లోపల ఎడమ మరియు కుడి ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ ను కండరాలు కలిగిన గోడ విభజిస్తుంది._*
*_👉ఆరికల్స్ యొక్క గోడలు వెంట్రికల్స్ యొక్క గోడల కంటే మందంగా ఉంటాయి. ఈ గోడలలో మూడు పొరలు ఉంటాయి._*
*_👉గుండె వెలుపల వైపున ఉండే పొరను పెరికార్డియం (peri cardium) అంటారు. గుండె లోపలి వైపున ఉండే పొరను ఎండోకార్డియం (endo cardium) అంటారు. ఈ రెంటికి మధ్యలో ఉండే పొరను మయోదార్డియం అంటారు. ఈ పొర కండరాలతో తయారుచేయబడి ఉంటుంది._*
*_👉ఈ కండరాలు ఇతర శరీర కండరాలవలె కాకుండా ఏ విధమైన నాడీ సంబంధమైన ప్రేరేపణ లేకుండా సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి._*
*_👉రక్తం ఎప్పుడూ గుండెలో ఆరికల్స్ నుండి వెంట్రికల్స్ కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా రక్తం ఒకే దిశలో ప్రవహించడానికి వీలుగా ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ మధ్య కవాటాలు ఉంటాయి._*
*_👉 ఒక క్రమపద్దతిలో సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ గుండె కాని రక్తనాళాలు గాని సరిగ్గా పనిచేయనప్పుడు గుండె జబ్బులు వస్తాయి._*
*_👉ఈ వ్యాధులు ఏ వయస్సులో అయినా రావచ్చు. కాని ఇవి ఎక్కువగా మధ్య వయస్సులో వస్తాయి._*
*_👉 గుండె జబ్బుల వల్ల గుండెలో పెరీకార్డియం, మయోకార్డియం లేదా ఎండోకార్డియం దెబ్బతినవచ్చు. అంతేకాక గుండెలోపలి రక్తనాళాలు లేదా గుండె కవాటాలు దెబ్బ తినడం వల్ల కూడా ఈ జబ్బులు రావచ్చు._*
*_👉కానీ హార్టెటాక్ అన్నిసార్లు ప్రాణాంతకం కాదు. కొన్నిసార్లు ఇవి పూర్తిగా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు అవే చాలా తీవ్రస్థాయిని పొందవచ్చు. చాలాసార్లు ఈ జబ్బులు ఆర్టరీల గోడలు గట్టిపడి వాటి ఎలాస్టిసిటీని కోల్పోవడం వల్ల వస్తాయి._*
*_✍️ గుండె జబ్బులలో రకాలు:-_*
*_1).ఎథిరోస్ల్కిరోసిస్:-_*
*_👉ఇది ఆర్టరీస్ లో వచ్చే వ్యాధి._*
*_👉ఈ వ్యాధిలో ఆర్టరీల యొక్క లోపలి పొరలో రక్తం, పైబ్రస్ టిష్యూ, పిండిపదార్ధాలు, క్రొవ్వుపదార్ధాలు మరియు కాల్షియం వంటివి పేరుకుపోతాయి._*
*_👉అందువల్ల రక్తనాళాల గోడలు మందంగా తయారై రక్తప్రసరణను ఆటంక పరుస్తాయి._*
*_2).కరోనరీ హార్ట్ డిసీజ్:-_*
*_👉మయోకార్డియంకు కావలసిన రక్తాన్ని కరోనరీ ఆర్టరీస్ అందించలేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది._*
*_👉 దీనినే ఇస్కమిక్ హార్ట్ డిసీజ్ అనికూడా అంటారు._*
*_👉మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ మరియు ఏంజినాపెక్టోరిస్ ఈ కోవకు చెందిన గుండె రక్తనాళాల జబ్బులే._*
*_3).మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ :-_*
*_👉గుండె కండరాలకు కావలసిన రక్తం అందకపోవడం వల్ల రక్తం అందని భాగం నిర్జీవమైపోతుంది. దీనినే నెక్రోసిస్ అని అంటారు._*
*_👉ఈ విధంగా గుండెలో ఎక్కువ భాగం నిర్జీవం కావడం వల్ల గుండె సరిగా పనిచెయ్యలేదు._*
*_👉 ఎధిరోస్ల్కిరోసిస్ ఉన్న కరోనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టుకుపోయి రక్తప్రసరణకు అడ్డుపడటం వల్ల ఈ ఇన్ ఫెక్షన్ వస్తుంది._*
*_👉దీనివల్ల ఆకస్మిక మరణం సంభవించవచ్చు._*
*_4).ఏంజినాపెక్టోరిస్:-_*
*_👉ఎక్కువగా పనిచేసినప్పుడు లేదా ఆవేశపడినప్పుడు ఛాతీలో నొప్పి రావడాన్ని ఏంజినా పెక్టోరిస్ అంటారు._*
*_👉ఇది రోగి యొక్క పనిచేసేశక్తిని తగ్గిస్తుంది._*
*_👉రోగి తన పనిని అదుపులో ఉంచుకుంటే చాలా సంవత్సరాలు ఈ వ్యాధితో బ్రతికే అవకాశం ఉంది._*
*_✍️ వ్యాధి ఎలా వృద్ధి చెందుతుంది.. ?_*
*_👉రక్తనాళాలలో ఏదైనా రాపిడివల్ల లీకైన రసాయన పదార్ధాలవల్ల లోపలి పొర అప్పుడప్పుడు చిట్లిపోతుంది._*
*_👉ఈ చిట్లిన ప్రదేశాన్ని మార్చే సమయంలో రక్తంలోని పదార్ధాలు చనిపొయిన కణజాలం ఆ ప్రదేశంలో పేరుకుపోతాయి._*
*_👉ఈ విధంగా పేరుకుపోయిన కణజాలంపై రక్తంలొ అధికంగా ఉన్న కొలెస్ట్రాల్,కొలస్ట్రాల్ కారియర్స్ మరియు లిపోప్రొటీన్ వంటి ఇతర క్రొవ్వు పదార్ధాలు కూడ పేరుకుపొతాయి._*
*_👉ఈ విధంగా పేరుకుపోయిన పదార్ధాలు రక్తనాళాల లోపలిపొరలను మందంగాను మరియు యెత్తుపల్లాలు వచ్చేటట్లు చేస్తాయి._*
*_👉పేరుకున్న కొలస్ట్రాల్ క్రిస్టల్స్ గా తయారవుతుంది._*
*_👉 ఇది నెమ్మదిగా గట్టిపడి ఫైబ్రస్ ఫ్లేక్స్ గా మార్పుచెందుతుంది. అందువల్ల రక్తనాళాలలొని ఖాళీ తగ్గిపోతుంది._*
*_👉ఒకొక్కసారి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుకుపోవడంవల్ల రక్తనాళాలు మరింత సన్నబడతాయి._*
*_👉ఈ విధంగా ఒకొక్కసారి ఆయా రక్తనాళాలలో రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి._*
*_👉దానివల్ల ఆ రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేసే కణాలు రక్తం అందకపొవడం వల్ల నిర్జీవం అయి నెక్రోసిస్ వస్తుంది._*
*_👉ఈ విధంగా గుండె పనిచేసే శక్తి తగ్గిపోతుంది._*
*_✍️ లక్షణాలు:-_*
*_👉గుండె రక్తనాళాల జబ్బులు ఉన్నవారిలో పని ఎక్కువయినప్పుడు ఆయాసం రావడం, నీరసం మరియు ఛాతిలో నొప్పి కనిపిస్తాయి._*
*_👉ఒకవేళ గుండె-రక్తనాళాలు బాగా దెబ్బతింటే గుండె పరిమాణం పెరుగుతుంది._*
*_👉మూత్రపిండాలకు రక్తం సరఫరా కూడా బాగా తగ్గిపోవడంవల్ల కణజాలంలోని ఖాళీప్రదేశాలలో నీరు మరియు సోడియం నిలువ ఉండిపొతుంది._*
*_👉ఈ విధంగా నీరు ముందుగా కాళ్ళు మరియు చేతులలో నిలువ ఉంటుంది. క్రమేణా ఇది కడుపు మరియు ఛాతిలోని కేవిటీల్లో నిల్వ ఉంటుంది. దీనినే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్(congestive heart failure) అని అంటారు._*
*_✍️గుండె-రక్తనాళాల జబ్బులు రావడానికి కారణాలు:-_*
*_1). లింగత్వం:-_*
*_👉గుండె రక్తనాళాల జబ్బులు ఎక్కువగా పురుషుల్లోను మరియు మెనోపాజ్ వయసులోని స్త్రీలలోను వస్తాయి._*
*_👉ప్రత్యుత్పత్తి వయసులొ ఉన్న స్త్రీలలో ఈ జబ్బులు తక్కువగా రావడానికి ముఖ్యకారణం వారిలో ఉండే అండాశయాలు ఉత్పత్తి చేసే హార్మోనులు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని కొంతవరకూ తగ్గిస్తాయి._*
*_👉కానీ గర్బనిరోధక మాత్రలు వేసుకొనే స్ర్తీలలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ._*
*_2). వయస్సు:-_*
*_👉ఈ జబ్బులు వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటాయి._*
*_👉ఇవి 50-55 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో అతి ఎక్కువగా కనిపిస్తాయి._*
*_3). జన్యుసంబంధమైన కారణాలు:-_*
*_👉ఈ రోగ చరిత్ర ఉన్న కుటుంబాల వ్యక్తులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది._*
*_👉ఈ వ్యాధిని కలగచేయడంలో 30 జీన్సుల పాత్ర ఉంది._*
*_👉రక్తంలోని కొలస్ట్రాల్ ను తగ్గించే ఇఫోలిపో ప్రోటీన్ తయారుచేయడానికి కారణమైన జన్యువులలో మూడు రకాలున్నాయి._*
*_👉ఈ మూడు రకాలలో ఒక రకం జీను ఉన్న వ్యక్తులలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ._*
*_👉 తల్లిదండ్రులలో గుండె-రక్తనాళాలలో జబ్బులు ఉంటే పిల్లలలో ఈ జబ్బులు తల్లిదండ్రులకు ఈ జబ్బువచ్చిన వయస్సు కంటే చిన్న వయస్సులోనే వచ్చే అవకాశాలున్నాయి._*
*_4). శరీరతత్వం:-_*
*_👉పొట్టిగా, లావుగా మరియు పొట్టిమెడ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది._*
*_👉పొట్టిగా ఉన్నవారిలో ఛాతీ భాగంలో ఎక్కువగా క్రొవ్వు ఉండే అవకాశాలు ఎక్కువ._*
*_👉వ్యక్తిత్వ సంబంధిత కారణాలు:-_*
*_👉ఎక్కువ బాధ్యతలు కలిగిన వ్యక్తులు, తమకు ఇష్టమైనవారిని కోల్పోయిన వ్యక్తులు, ఎక్కువగా సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది._*
*_5). పొగత్రాగడం:-_*
*_👉పొగత్రాగేవారిలో ఈ జబ్బు చాలా ఎక్కువగా వస్తుంది._*
*_👉పొగత్రాగడం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్.డి .యల్ తయారీ తగ్గిపోతుంది._*
*_👉 పొగలో ఉండే నికోటిన్ రక్తనాళాలను సంకోచించేటట్లు చేస్తుంది._*
*_👉ఇవి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టేటట్లు కూడా చేస్తుంది._*
*_👉అంతేకాక ఈ పొగలో ఉండే ఫ్రీరేడికల్స్ రక్తనాళాల లోపలి పొరను దెబ్బతినేటట్లు చేస్తాయి. అందువల్ల ఆ ప్రదేశంలో పైబ్రస్ ప్లేక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ._*
*_6). జీవనవిధానం:-_*
*_👉ఎక్కువ శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ._*
*_7). ఊబకాయం:-_*
*_👉అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ._*
*_8). త్రాగేనీరు:-_*
*_👉నీటిలో ఎక్కువ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉన్నప్పుడు అది కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి._*
*_9). అధిక కాఫీ మరియు మత్తు పానీయాలు:-_*
*_👉 ఎక్కువగా కాఫీ మరియు ఆల్కహాలు తీసుకొన్నప్పుడు గుండె పనిచేసే విధానం దెబ్బతినడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి._*
*_10). మధుమేహం:-_*
*_👉మధుమేహవ్యాధి గుండె మరియు రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా అధికం._*
*_11). ఆహారపు అలవాట్లు:-_*
*_👉అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి._*
*_👉 క్రొవ్వు పదార్ధాలలో ముఖ్యంగా కొబ్బరినూనె, డాల్డా, నెయ్యి, మార్జరిన్ ఎక్కువగా ఈ వ్యాధులను కలిగిస్తాయి._*
*_👉పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఫాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ వుండటం వల్ల (Poly unsaturated fatty acids) వీటిని వాడినప్పుడు మిగిలిన క్రొవ్వుపదార్ధాలలో పోల్చినప్పుడు రక్తంలో కొలస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది._*
*_👉కానీ వీటిని కూడా తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి._*
*_✍️ క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకొన్నప్పుడు ఏం జరుగుతుంది..?_*
*_👉ఆహారంలో క్రొవ్వుపదార్దాలు జీర్ణం కావడానికి కాలేయాన్ని చేరతాయి._*
*_👉కాలేయం ఈ క్రొవ్వు పదార్ధాలను ప్రోటీన్లతో కలిసేటట్లు చేసి వి.ఎల్.డి.ఎల్. (క్రొవ్వును కలిగిన ప్యాకెట్లు) ను తయారుచేస్తుంది._*
*_👉ఇది రక్తంలో కలిసి ఎపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైము వాటిపై పనిచేయడం వల్ల చిన్న చిన్న వి.ఎల్.డి.ఎల్ రెమినెంట్స్ గా తయారవుతుంది._*
*_👉ఇది ఎపోప్రోటీన్ సి మరియు బి లతో కలిసి ఎల్.డి.ఎల్ గా మార్పు చెందుతుంది._*
*_👉ఈ ఎల్.డి.ఎల్, కణాలలోకి ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ద్వారా చేరుతుంది._*
*_👉ప్రతీకణంలో కొన్ని పరిమితమైన ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ఉంటాయి._*
*_👉ఈ ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ అన్నీ ఎల్.డి.ఎల్ తో నిండిపోయినప్పుడు మిగిలిన ఎల్.డి.ఎల్ రక్తనాళాల గోడలకు అతుక్కొనిపోయి వాటిని సన్నగా చేస్తాయి._*
*_👉నెయ్యి, డాల్డావంటి సాచ్యురేటెడ్ నూనెలను తీసుకొనేటప్పుడు ఇవి కణాలలోని ఎల్.డి.ఎల్ రిసెప్టార్స్ ను తగ్గించి తద్వారా ఎధిరోస్ల్కిరోసిస్ ను అధికం చేస్తుంది._*
*_👉అంతేకాక రక్తనాళాలలో లోపలి పొర తయారుచేసే రక్తనాళాలకు సంకోచింపచేసే పదార్ధాన్ని(Endothelium derived relaxing factor) కూడా తక్కువగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది._*
*_👉సాచ్యురేటెడ్ ల్యూకో ట్రైఈన్స్(Leuco trienes) వంటి రక్తం చిక్కబడేటట్లు చేసే పదార్ధాలను కూడా తయారుచేస్తాయి._*
*_👉ఈ విధంగా చిక్కబడిన రక్తం త్వరగా గడ్డకట్టే అవకాశాలు ఎక్కువ._*
*_👉ఇతర రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపించే పదార్ధాలు కూడా క్రొవ్వు పదార్ధాలు వాడినప్పుడు ఎక్కువవుతాయి._*
*_👉రక్తంలోని వి.ఎల్.డి.ఎల్ రెమినెంట్స్ ఎపోప్రోటిన్ ఇ తో కలిసి హెచ్.డి.ఎల్ గా (మంచి కొలెస్ట్రాల్) తయారవుతుంది._*
*_👉హెచ్.డి.ఎల్ రక్తంలో అధికంగా ఉన్న ఎల్.డి.ఎల్ ను మరలా కాలేయానికి తీసుకువచ్చి అక్కడి నుండి విసర్జింపబడేటట్లు చేస్తుంది._*
*_👉ఎక్కువగా వ్యాయమం చేయడం వల్ల మరియు పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తీసుకొన్నప్పుడు ఈ హెచ్.డి.ఎల్ శరీరంలో పెరుగుతుంది._*
*_✍️ గుండెజబ్బులను అరికట్టే చేపనూనెలు:-_*
*_👉చేపనూనెలలో ఉండే ఎన్-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి._*
*_👉అంతేకాక ఇవి శరీరంలోని రక్తం గడ్డకట్టేటట్లు చేసే పదార్ధాలను కూడా తగ్గిస్తాయి._*
*_✍️ యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా గల పదార్ధాలు:-_*
*_👉నిమ్మ,నారింజ,బత్తాయి వంటి విటమిన్ సి ఎక్కువగా కల పదార్ధాలు, టమోటా, క్యారెట్, బొప్పాయి, మామిడి వంటి పసుపు రంగు మరియు ఎరుపురంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విటమిన్ ఎ ని కలిగి ఉండి గుండె జబ్బులను తగ్గిస్తాయి._*
*_👉ఫ్రీరాడికల్స్ రక్త నాళాల లోపలి పొర దెబ్బతినేటట్లు చేస్తాయి._*
*_👉వీటిని యాంటి ఆక్సిడెంట్లు తగ్గించడం వల్ల ఇవి గుండె జబ్బులను తగ్గిస్తాయి._*
*_✍️ పైబర్ ఎక్కువగా ఉన్న పదార్ధాలు:-_*
*_👉 పీచు పదార్ధం ఎక్కువగా గల పచ్చి కూరగాయలు, మామిడి, ఆపిల్స్, జామకాయ వంటి పండ్లు,ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తక్కువగా వస్తాయి._*
*_✍️ ఇతర పదార్ధాలు:-_*
*_👉ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు శనగపప్పులో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు ఉండటం వల్ల ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి._*
*_👉అంతేకాక పాలు,ఆకుకూరలు,రాగులు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే పదార్ధాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి._*
*_👉వీటిని దృష్టిలో ఉంచుకొని ఆహారపు అలవాట్లులో మార్పు తెచ్చుకోవడం అనగా యాంటి ఆక్సిడెంట్సు ఎక్కువగా గల పదార్ధాలు, పీచు పదార్ధం ఎక్కువగా గల పదార్ధాలు తీసుకోవడం,నూనె పదార్ధాలను తగ్గించడం,సిగరెట్లు మానేయడం,తగినంత వ్యాయామం చేయడం మరియు మానసిక వత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండె-రక్తనాళాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు._*
No comments:
Post a Comment