*_వేకువనే మేలుకోవడం మీకు అలవాటా...?_*
*_ఆలస్యంగా నిద్రపోవడం, పొద్దె క్కాక గానీ లేవకపోవడం చాలా మంది విద్యార్థుల అలవాటు. కానీ త్వరగా నిద్రకు ఉపక్రమించి తెల్ల వారుజామునే మేలుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పనులేవీ కావడంలేదనీ, అసలు సమయమే సరిపోవడంలేదని బాధపడాల్సిన పనే ఉండదు. టైమ్ చాలక ముఖ్యమైన పను లను వాయిదా వేయాల్సిన అవస రమూ ఉండదు. ఇవేకాకుండా మరెన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా..?_*
*_తెల్లవారుజామునే లేవడం వల్ల మనసంతా అ ప్రశాంతంగా ఉంటుంది. కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించొచ్చు. కసరత్తులు విసుగు అనుకుంటే చక్కగా మీ కిష్టమైన అటా ఆడుకోవచ్చు. లేదా ఉదయపు నడకా అలవాటు చేసుకోవచ్చు. దీంతో ఒత్తిడికి దూరంగా ఉండి. సానుకూలంగానూ ఆలోచించగలుగుతారు. రోజును ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభించడం వల్ల చదవాలనే ఉత్సాహమూ కలుగుతుంది. మార్కుల కోసం మాత్రమే కాకుండా ఇష్టంగా చదవగలుగుతారు._*
*_వేకువ వేళ ఎలాంటి అవాంతరాలూ ఉండవు._*
*_చుట్టుపక్కల వాతావరణమూ ప్రశాంతంగా, చదవ దానికి అనుకూలంగా ఉంటుంది. మన ఏకాగ్ర తకూ భంగం కలగదు. ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టడానికి వీలుంటుంది. రోజు మొత్తంలో పూర్తి చేయాల్సిన పనులకు ప్రణాళికను రూపొం దించుకోవచ్చు. ఉదయాన్ని ఉత్సాహంగా మొదలు పెట్టి అదే ఉత్సాహుతో పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. సమయం మిగులుతుంది. కాబట్టి మర్నాడు చదవాల్సిన వాటి గురించీ ఒకసారి ఆలోచించగలుగుతారు._*
*_పూర్తిచేయాల్సిన పనులకు ప్రణాళిక వేసుకో వచ్చు. అంతేకాదు వాటి సాధనకు చక్కని వ్యూహాలనూ రూపొందించుకోవచ్చు. లక్ష్యసాధన దిశగా మరింతగా కష్టపడి పనిచేయడానికి సమయం మిగులుతుంది కూడా._*
*_ఈ అలవాటు వల్ల చక్కని క్రమశిక్షణ ఆల వడుతుంది. క్రమబద్ధమైన జీవితానికి ఇది పునాది వేస్తుంది. సమయ నియంత్రణ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సబ్జెక్టులవారీగా సమ యాన్ని విభజించుకుని చదవగలుగుతారు. టైమ్ లేదనీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయనీ కంగారుపడాల్సిన పనే ఉండదు. మీ సమయం మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే వార్షిక, ప్రవేశ, పోటీ పరీక్షలు ఏవైనా విజయం సాదించవచ్చు._*
*_ప్రముఖుల జీవితాలను పరిశీలిస్తే.. వాళ్ల కున్న మంచి అలవాట్లలో త్వరగా నిద్ర లేవడం అనేది తప్పకుండా ఉంటుంది. మనమూ వాళ్లలా అనుకున్నది సాధించాలంటే.. ఇకనుం చైనా తెల్లవారే మేలుకోవడం అలవాటు చేసుకో వాలి. ఇలాచేస్తే.. పనులు కావడం లేదనీ, చద వాల్సినవి పెరిగిపోతున్నాయనీ బాధపడాల్సిన అవసరం ఎవరికీ, ఎప్పటికీ రాదు._*
*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*
*_- డా,,తుకారాం జాదవ్.🙏_*
*_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
No comments:
Post a Comment