Wednesday, August 20, 2025

 *ఈశ్వరా.!...👏*
 
*నీకు కోట్ల సొమ్ము కానుకలుగా ఇచ్చేవారు ఉండవచ్చు కానీ, ఆర్తితో కన్నీటి చుక్కలు సమర్పించే నన్ను విస్మరించకు...*

*నీకు దేవాలయాలు కట్టి మాన్యాలు ఇచ్చే వారు ఉండవచ్చు కానీ, భక్తి భావనతో గుండెనే గుడిగా చేసి కొలుచుకొనే నన్ను మరువకు...*

*నీకు వజ్రవైడూర్యాలు కట్నకానుకలు ఒసగేవారు ఉండవచ్చును. కానీ నువ్వే సర్వమని సర్వస్య శరణాగతితో మారేడు దళమో గంగా జలమో అర్పించే నన్ను ఆదరించు...*

*మరుభూమిలో ప్రతి దినం గంధపు చెక్కలతో కాల్చబడిన కట్టెలనేకం ఉండవచ్చునేమో భస్మాభిషేకానికి కానీ, నీసేవకై జీవించిన ఈకట్టెను కాల్చినభస్మాన్ని అలంకరించుకొని నాకు ముక్తిని ప్రసాదించవయ్యా శివయ్యా...*

*ఇది మునులు ఋషులు వేదోత్తములు రాసిన స్తోత్రము సేవ కాదని విస్మరించెదవేమో క్షణ క్షణము నిన్నే తలచుచు నిన్నే వేడుచు నిన్నే కొలుచుచు ఆర్తితో చేసిన ప్రార్ధన అని మరువకు.*

*హరహర మహాదేవ ఓం* *శివాయ నమః*

No comments:

Post a Comment