నువ్వు
నువ్వే..
నువ్వు
ఎవ్వరితో
సమానం కాదు...
అట్లని
తక్కువ కాదు
ఎక్కువ కాదు..
నీలా
వుండేది
నువ్వే..
నీ
ఇష్టాలు
నీవే
నీ
కష్టాలు
నీవే
నీ
గెలుపు
నీదే
నీ
ఓటమి
నీదే
నీ
ఆలోచన
నీదే
నీ
అడుగే
నీ
పాదముద్ర
నీకు
నువ్వే
ప్రత్యేకం....
నీ
వేలి ముద్ర
నీకే
స్వంతం...
ఇంకెందుకు
ఈ
పోలికలు....?
పోల్చుకొని
పొంగి పోవటా లు..??
పోల్చుకుని
కుంగి పోవటాలు ..?????
No comments:
Post a Comment