జ్ఞానము యొక్క అవతారమే శ్రీ రమణ మహర్షి
నేను" అను తలంపు పుట్టినచోటు చూసినవాడు మాత్రమే జ్ఞాని అవుతాడు. జ్ఞానము మాత్రమే శాంతిని ప్రసాదిస్తుంది. మనిషి ఏ వృత్తిలో ఉన్నప్పటికి అహం వృత్తిలో ఉండకూడదు. "అహంకారము" లో ఉన్న "కారము" నుండి విడుదల అయిన మనిషికి వివేకం కలుగుతుంది. ఈ లోకములో ఉన్న మాయ అంతా అహంకార రూపములో ఉన్నది. అహంకారికి సుఖము కనపడదు. నిరహంకారికి దుఃఖము కనపడదు. సూర్యుడికి చీకటి కనపడదు. అజ్ఞానికి దైవము ఉన్నచోటు కనపడదు.
జ్ఞాని దేహము దేవాలయముతో సమానము. జ్ఞాని ద్వారా కర్మ జరుగుతుంది. జ్ఞానికి కర్తృత్వము ఉండదు. కర్తృత్వమే దుఃఖమునకు కారణం.
మన అన్నీ దుఃఖాలకు కారణం అజ్ఞానము మాత్రమే! జ్ఞానాగ్ని చేత అజ్ఞానమును దహించవచ్చును. జ్ఞానమే సహజమైనది. సహజమైనదే శాశ్వతమైనది. పక్షి ఎగురుటకు రెండు రెక్కలు ఎంత అవసరమో, మానవుడు జ్ఞానమును పొందుటకు పవిత్రత, ఏకాగ్రత అను రెండు రెక్కలు అంతే అవసరము.
No comments:
Post a Comment