Friday, August 1, 2025

 *_కొన్ని గాయాలు కనపడవు... కొన్ని కన్నీళ్లు కనపడవు... మాటలే వినిపిస్తాయి... ఏ గుండె లోతుల్లో ఏ అగాదాలు ఉన్నాయో. ఎన్ని కన్నీటి జలపాతాలు ఉన్నాయో... ఎన్ని ఎడారి దారులు ఉన్నాయో... ఎవరికి తెలుసు... అనుభవించే వాడికి తప్ప..._*

*_కొంతమందికి శరీరమే కావాలి. మరి కొంతమందికి హృదయం మాత్రమే కావాలి. ఆ హృదయానికి విలువ ఎక్కడుంది... ఈరోజుల్లో... అందుకే ప్రేమ స్నేహం అన్ని ఓడిపోతున్నాయి. డబ్బు ముందు అన్ని అలసిపోతున్నాయి అలిగి వెళ్లిపోతున్నాయి._*

*_నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్నా... నాలుగు గంటలు మనం ప్రశాంతంగా పడుకోవాలి అన్నా... నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్నా... మన దగ్గర ఉండాల్సింది డబ్బు..._*

*_పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే... అయినవాళ్ల ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే..._*

*_కట్నం డబ్బులు తేని భార్యని బానిసగా చూస్తాడు భర్త... ఎక్కువ_* *_డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది భార్య... డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రిని అసమర్థుడిగా చూస్తారు బిడ్డలు... సంపాదించడం చేతకాని బిడ్డలని చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి..._*

*_డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్దపడుతుంది... అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబన్ని, అయినవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు..._*

*_ఆస్తి పంపకాలలో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకోని అన్నదమ్ములు... పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కాచెల్లెళ్ళు... అందుకే డబ్బుని గౌరవించండి... పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి..._*

*_ఎవరో ఆ మహానుభావుడు అన్నట్లు డబ్బుకి లోకం దాసోహం... పైసామే పరమాత్మ అని ఊరికే అనలేదు మరి..._*

*_మనం ఏమి చేయలేనప్పుడే డబ్బుతో అన్ని వస్తాయా... కొన్ని డబ్బుతో రావని వృధా మాటలు గాలిలో చెపుతూ బ్రతికేస్తారు... కాబట్టి డబ్బుని గౌరవించండి... పోతే మళ్ళీ సంపాదించడం చాలా కష్టం.☝️_*

     *_~సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌻💎🌻 🌼🙇‍♂️🌼 🌻💎🌻

Sekarana 

No comments:

Post a Comment