ప్రేమ ...
సేవ, విధేయత ....
అన్నివేళలా నిజాయతీ...
వీటిని పాటించాలి.
నిత్యజీవితంలో
సత్ప్రవర్తనతో నడుచుకోవాలి.
అప్పుడు మానవులు
తమలోని భగవంతుడిని దర్శించగలుగుతారు.
రోజూ ....
భగవన్నామస్మరణ చేస్తే
ఇది సాధ్యమవుతుంది.
ఆచరణపూర్వకంగా
ఈ సందేశం ఇచ్చిన మహనీయుడు
మెహెర్‌బాబా.
మౌనంలో ఉండగానే
సృష్టి రహస్యాలను వివరించే
‘భగవద్వచనం’ అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంథాలను
భావితరాల వారి కోసం ఆయన అందజేశారు.
దేవుడు అన్నిటా, అంతటా, అందరిలోనూ ఉన్నాడు. గత జన్మసంస్కారాల ప్రభావం వల్ల మీలో ఉన్న దేవుణ్ణి మీరు దర్శించలేకపోతున్నారు’’ అని స్పష్టం చేశారు.
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడేననీ, అన్నిమతాల సారం ఇదేననీ, తనకంటూ ప్రత్యేక మతం లేదనీ, తన మతం ‘ప్రేమ’ అని బాబా పలు సందర్భాలలో ప్రకటించారు
మనుషులు ఇవ్వాలి, తరువాత తీసుకోవాలి. మొదట మీరు ఇస్తే, తరువాత అన్నీ మీకు వస్తాయి. దానికి బదులు, మొదట అన్నీ తమకే కావాలని మనుషులు అనుకుంటారు. ఆ తరువాతే ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. అది సరైన మార్గం కాదు.’’
“నేనెవరు?
నేను ఎక్కడి నుండి వచ్చాను?
నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?
నేను ఎక్కడికి పోతున్నాను?”
ఇలాంటి ప్రశ్నలు మనకు ఏదో ఒక దశలో తప్పక కలుగుతుంటాయి. అయితే, ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎవరు చెప్పగలరు.
సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడే —అంతర్లీనమైన నిజాలను వెలికి తీసి, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు.
సృష్టి మరియు దాని ప్రయోజనముల ఇతివృత్తం
ఈ గ్రంథం(God Speaks Telugu book), పరమాత్మ నుండి భగవదనుభవం వరకు సాగే ఆత్మ యొక్క ప్రయాణాన్ని లోతుగా విశ్లేషిస్తుంది.
సృష్టి తత్వం, దాని అంతర్గత మర్మాలు, ఆత్మ యొక్క పరిణామక్రమం, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణం, చివరికి భగవదనుభూతి వరకు సాగే ఆధ్యాత్మిక చైతన్య పథాన్ని అవతార్ మెహెర్ బాబా ఈ గ్రంథంలో అత్యంత లోతుగా వివరిచారు.
ఈ రచనలో సూఫీ, మార్మిక (mystic), వేదాంత తత్వాల్లో కనిపించే పదాలను, భావనలను సమన్వయపరిచి, సాధారణ పాఠకుడు కూడా గ్రహించగలిగే స్థాయిలో అతి దార్శనికమైన విషయాలను స్పష్టంగా వివరించారు.
No comments:
Post a Comment