258e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.204.
నేటి…
*ఆచార్య సద్భోదన:*
➖➖➖✍️
```
"భారతదేశంలో జన్మించడం మీరు చేసుకున్న గొప్ప అదృష్టం. మీరు భారతీయులు అని చెప్పుకోవడం నిజంగా మీరు చేసుకున్న గొప్ప పుణ్యం. దైవము అడగకయే మీకు ఇచ్చిన ఈ వరం మీరు సద్వినియోగ పరచుకోవాలి.. ఎవరైననూ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ మాతృభూమిని విమర్శించకూడదు. మీ కలలో కూడా మీరు మీ మాతృభూమిని మరచిపోవడం లేదా తిరస్కరించడం గురించి ఆలోచించకూడదు. అది కృతజ్ఞత లేకపోవడమే అవుతుంది. సూర్య భగవంతుని పూజకు సంబంధించిన శ్లోకాల్లో, సూర్య దేవుడు ఏ పాపమైనా క్షమించగలడు కానీ కృతజ్ఞత లేనివారిని క్షమించడని చెప్తారు. అందుకే కృతజ్ఞతతో ఉండడంలో విఫలం అవ్వకండి. మీరు కృతజ్ఞత లేనివారని మిమ్మల్ని నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వవద్దు. మీరు భారతీయ సంస్కృతి వైభవాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. తల్లి మరియు మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. వీటిని మరచినవాడు, విడచినవాడు నిజముగా ద్రోహము చేసినవాడు అవుతాడు. కన్నతల్లిని, జన్మభూమిని మరచినవాడు దైవమును ఏ విధముగా గుర్తించగలడు! ఇట్టివాడు దైవ కృపకు అనర్హుడు సరికదా కర్మ బద్ధుడై బ్రతుకీడ్చాల్సి వస్తుందని గ్రహించండి!"✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment