268e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.205.
నేటి…
*ఆచార్య సద్భోదన:*
➖➖➖✍️
```
సర్వకర్మలూ భగవత్ప్రీతిగా చేయండి.
అపుడు మనము చేసే పనులే భగవంతునికి పూజగా మారతాయి.
ఆధ్యాత్మికం వేరు, మన పనులువేరు అని విడిగా చూడకూడదు.
దైవ కార్యాలు, రోజూ చేసుకునే పనులు అన్నీ ఒకటే!
మనం,పనిచేసేటప్పుడు మన భావాన్ని సరియైన రీతిగా మార్చుకుంటే చాలునన్నమాట.
ఉపాధ్యాయులైనా, డాక్టరులయినా, వ్యాపారస్తులైనాసరే, దైవం దగ్గరనుండి దూరంగా ఎవరూ వెళ్ళలేరు.
ఒకవ్యాపారస్థుడు ...
గురువు గారి సన్నిధికి ఒకసారి వచ్చినప్పుడు... “స్వామీ నేను దైవాన్ని పూజిస్తాను కానీ నా వద్దకు వచ్చే వినియోగదారులందరిలో ఏవిధంగా దైవాన్ని దర్శించగలను? లాభాలు ఆశించకుండా వ్యాపారాలు చేయాలా?” అని అడిగాడు.
“లాభాలు లేకుండా వ్యాపారం చేయమని నేను చెప్పటంలేదు,
అందరిలోనూ దైవాన్ని చూడడమంటే, వారి పాదాలకు మోకరిల్లడంకాదు,
భగవంతుడంటే ఎవరు? సత్యము, ధర్మము, శాంతి ప్రేమలే భగవత్ స్వరూపాలు, కాబట్టి నీవు జరిపే లావాదేవీలన్నిటికి, సత్య ధర్మాలను ఆధారం చేసుకుని, మితిమీరి లాభాలను ఆశించి మోసంచేయకుండా ఉండు. అవినీతి కి తావులేకుండా వ్యాపారం నిర్వహించు, వినియోగదారులలో భగవంతుని దర్శించడమంటే ఇదే!” అని వివరించారు గురువు గారు.
మరొక విద్యార్ధి, “గురువు గారూ! ఎదుటి వాని స్వభావం, వారి దుర్గుణాలూ తెలిసి కూడా వారిలో ఎలా దైవాన్ని చూసి ప్రేమించగలం”? అన్నాడు.
అప్పుడు గురువు గారు నవ్వుతూ, “నేను మిమ్మల్ని ప్రేమించట్లేదూ? అలాగే!” అన్నారు.
అదే అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధన అవుతుంది, అని సెలవిచ్చారు.✍️
```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
No comments:
Post a Comment